Google ఏ విధంగా నా గోప్యతను రక్షిస్తుంది మరియు నా సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది?

మీకు భద్రత మరియు గోప్యత ముఖ్యమైనవని మాకు తెలుసు – మరియు అవి మాకు కూడా ముఖ్యమైనవి. మేము దృఢమైన భద్రతను అందించడానికి మరియు మీకు మీ సమాచారం సురక్షితంగా మరియు మీరు కావాలనుకున్నప్పుడు ప్రాప్యత చేయగలిగేలా ఉందని మీకు విశ్వాసాన్ని కలిగించడానికి ప్రాధాన్యతను ఇస్తాము.

మేము దృఢమైన సెక్యూరిటీను అందించడానికి, మీ గోప్యతను రక్షించడానికి, అలాగే మీ కోసం Googleను ఇంకా మరింత ప్రభావవంతంగా, సమర్థవంతంగా చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం సెక్యూరిటీ కోసం కోట్ల డాలర్‌లను ఖర్చు చేస్తున్నాము, డేటా సెక్యూరిటీలో ప్రపంచ-ప్రఖ్యాత నిపుణులను నియమించి మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతున్నాము. మేము Google Dashboard, 2-దశల వెరిఫికేషన్, అలాగే My Ad Centerలో కనుగొనబడిన వ్యక్తిగతీకరించబడిన యాడ్ సెట్టింగ్‌ల వంటి సులభంగా ఉపయోగించగల గోప్యత, అలాగే సెక్యూరిటీ టూల్స్‌ను కూడా రూపొందించాము. అందువల్ల మీరు Googleతో షేర్ చేసే సమాచారం మీ కంట్రోల్‌లోనే ఉంటుంది.

మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను ఆన్‌లైన్‌లో ఏ విధంగా కాపాడుకోవాలనే దానితో సహా ఆన్‌లైన్ సురక్షత మరియు భద్రత గురించి, మీరు Google భద్రాత కేంద్రంలో మరింత తెలుసుకోవచ్చు.

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ప్రైవేట్‌గా మరియు సురక్షితంగా ఉంచుతాము మరియు మీకు నియంత్రణను అందిస్తాము అనేవాటి గురించి మరింత తెలుసుకోండి.

నా ఖాతా ఒక దేశంతో ఎందుకు అనుబంధించబడుతుంది?

ఈ కింద పేర్కొన్న రెండు విషయాలను గుర్తించడానికి, సర్వీస్ నియమాలలోని ఒక దేశంతో (లేదా ప్రాంతంతో) మీ ఖాతా అనుబంధించబడుతుంది:

  1. మీకు సర్వీస్‌లను అందించే, మీ సమాచారాన్ని ప్రాసెస్ చేసే, ఇంకా వర్తించే గోప్యతా చట్టాలకు కట్టుబడి ఉండటానికి బాధ్యత వహించే Google అనుబంధ సంస్థను గుర్తించడానికి. సాధారణంగా, Google, ఈ కింద పేర్కొన్న కంపెనీలలో ఒక దాని ద్వారా దాని కన్జ్యూమర్‌లకు సర్వీస్‌లను అందిస్తుంది:
    1. మీరు ఐరోపా ఆర్థిక మండలి (EU దేశాలు, ఇంకా ఐస్‌లాండ్, లిచెన్‌స్టెయిన్, నార్వే) లేదా స్విట్జర్లాండ్‌లో నివసిస్తుంటే, Google Ireland Limited
    2. ప్రపంచంలోని మిగతా దేశాలకు, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న Google LLC
  2. మన సంబంధాన్ని నియంత్రించే నియమాల వెర్షన్‌ను (ఇది స్థానిక చట్టాలను బట్టి మారవచ్చు) గుర్తించడానికి

మీకు సర్వీస్‌లను అందించే అనుబంధ సంస్థతో గానీ లేదా మీరు అనుబంధించబడిన దేశంతో గానీ సంబంధం లేకుండా, Google సర్వీస్‌లు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయని గుర్తుంచుకోండి.

మీ ఖాతాతో అనుబంధించబడిన దేశాన్ని నిర్ణయించడం

మీరు ఒక కొత్త ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, ఏ దేశంలో అయితే మీరు మీ Google ఖాతాను క్రియేట్ చేశారో, ఆ దేశంతో మీ ఖాతాను అనుబంధిస్తాము. క్రియేట్ చేసి కనీసం ఒక సంవత్సరం పూర్తి అయిన ఖాతాల విషయంలో, సాధారణంగా మీరు Google సర్వీస్‌లను ఏ దేశం నుండి అయితే యాక్సెస్ చేస్తుంటారో, ఆ దేశాన్ని (సాధారణంగా, గత సంవత్సరం మీరు ఎక్కువ సమయం గడిపిన దేశం) ఉపయోగిస్తాము.

తరచుగా ప్రయాణాలు చేయడం వలన, సాధారణంగా మీ ఖాతాతో అనుబంధించబడిన దేశం ప్రభావితం కాదు. మీరు మీ నివాసాన్ని ఒక కొత్త దేశానికి మార్చినట్లయితే, మీ ఖాతాతో అనుబంధించబడిన దేశాన్ని అప్‌డేట్ చేయడానికి ఒక సంవత్సరం వరకు పట్టవచ్చు.

మీ ఖాతాతో అనుబంధించబడిన దేశం, మీ నివాస దేశంతో మ్యాచ్ కాకపోతే, మీరు పని చేసే దేశం, మీ నివాస దేశం వేర్వేరు కావడం, మీ IP అడ్రస్‌ను మాస్క్ చేయడానికి మీరు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN)ను ఇన్‌స్టాల్ చేసి ఉండటం, లేదా మీరు ప్రాంతీయ సరిహద్దుకు సమీపంలో నివసించడం దీనికి కారణం కావచ్చు. మీ ఖాతాతో అనుబంధించబడిన దేశం తప్పు అని మీరు అనుకుంటే, మమ్మల్ని సంప్రదించండి.

నేను Google శోధన ఫలితాల నుండి నాకు సంబంధించిన సమాచారాన్ని ఎలా తీసివేయగలను?

Google శోధన ఫలితాలు అనేవి వెబ్‌లో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న కంటెంట్ యొక్క ప్రతిబింబం. శోధన ఇంజిన్‌లు నేరుగా వెబ్‌సైట్‌ల నుండి కంటెంట్‌ని తీసివేయలేవు, కాబట్టి Google నుండి శోధన ఫలితాలను తీసివేయడం వల్ల వెబ్ నుండి కంటెంట్ తీసివేయబడదు. మీరు వెబ్ నుండి దేనినైనా తీసివేయాలనుకుంటే, మీరు కంటెంట్ పోస్ట్ చేయబడిన సైట్ యొక్క వెబ్‌మాస్టర్‌ని సంప్రదించాలి మరియు అతడిని లేదా ఆమెని మార్చమని అడగాలి. కంటెంట్ తీసివేయబడిన తర్వాత మరియు Google ఆ నవీకరణని గమనించిన తర్వాత, సమాచారం Google యొక్క శోధన ఫలితాల్లో కనిపించదు. మీరు అత్యవసరంగా తీసివేతను అభ్యర్థించాలనుకుంటే, మరింత సమాచారం కోసం మా సహాయ పేజీని కూడా సందర్శించవచ్చు.

నేను Google శోధన ఫలితాలపై క్లిక్ చేసినప్పుడు నా శోధన ప్రశ్నలు వెబ్‍‌సైట్‌లకు పంపబడతాయా?

సాధారణంగా, పంపబడవు. మీరు Google Searchలో సెర్చ్ ఫలితాన్ని క్లిక్ చేసినప్పుడు, మీ వెబ్ బ్రౌజర్ గమ్యస్థాన వెబ్‌పేజీకి నిర్దిష్ట సమాచారాన్ని పంపిస్తుంది. మీ సెర్చ్ క్వెరీలు సెర్చ్ ఫలితాల పేజీలోని ఇంటర్నెట్ అడ్రస్‌లో, లేదా URLలో కనిపించవచ్చు, అయితే Google Search అనేది బ్రౌజర్‌లు సంబంధిత URLను రెఫర్ చేసిన URLగా గమ్యస్థాన పేజీకి పంపకుండా నిరోధించడానికి ఉద్దేశించబడింది. మేము Google Trends, Google Search Console ద్వారా సెర్చ్ క్వెరీల గురించి డేటాను అందిస్తాము, అయితే మేము అలా చేసినప్పుడు, మేము ప్రశ్నలను ఒకదానికొకటి అగ్రిగేట్ చేస్తాము, తద్వారా మేము పలు యూజర్‌లు జారీ చేసిన ప్రశ్నలను మాత్రమే షేర్ చేస్తాము.

Google యాప్‌లు
ప్రధాన మెనూ