ఇది మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేసిన సంస్కరణ. ప్రస్తుత సంస్కరణని లేదా అన్ని పాత సంస్కరణలని వీక్షించండి.

గోప్యతా విధానం

మేము సేకరించే సమాచారం

మేము సేకరించిన సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము

పారదర్శకత మరియు ఎంపిక

మీరు భాగస్వామ్యం చేసే సమాచారం

మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాప్యత చేయడం మరియు నవీకరించడం

మేము భాగస్వామ్యం చేసే సమాచారం

సమాచార భద్రత

ఈ గోప్యతా విధానం ఎప్పుడు వర్తిస్తుంది

నియంత్రిత నిబంధనలకు అనుకూలత మరియు సహకారం

మార్పులు

నిర్దిష్ట ఉత్పత్తి ఆచరణలు

ఇతర ఉపయోగకర గోప్యత మరియు భద్రతా సంబంధిత విషయాలు

చివరిగా సవరించబడింది: 25 ఫిబ్రవరి 2015 (ఆర్కైవ్ చేసిన సంస్కరణలను వీక్షించండి)

మా సేవలను ఉపయోగించడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి – సమాచారాన్ని శోధించడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి, ఇతర వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి లేదా క్రొత్త కంటెంట్‌ను సృష్టించడానికి. మాతో మీరు సమాచారాన్ని భాగస్వామ్యం చేసినప్పుడు, ఉదాహరణకు Google ఖాతాను సృష్టించడం ద్వారా, మీకు మరింత సందర్భోచిత శోధన ఫలితాలు మరియు ప్రకటనలను చూపించడానికి, వ్యక్తులతో కనెక్ట్ కావడంలో మీకు సహాయం చేయడానికి లేదా ఇతరులతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని సులభం మరియు త్వరితం చేయడానికి – మేము ఆ సేవలను మరింత మెరుగుపరుస్తాము. మీరు మా సేవలను ఉపయోగిస్తున్నప్పుడు, మేము సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నామనే దాని గురించి మరియు మీరు మీ గోప్యతను రక్షించుకోవడానికి ఉన్న విధానాలను గురించి మీరు స్పష్టంగా ఉండాలని మేము కోరుతున్నాము.

మా గోప్యతా విధానం వీటిని వివరిస్తుంది:

  • ఏ సమాచారాన్ని మేము సేకరిస్తాము మరియు ఎందుకు మేము దీన్ని సేకరిస్తాము.
  • మేము ఆ సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము.
  • సమాచారాన్ని ఎలా ప్రాప్యత చేయాలి మరియు నవీకరించాలి అనే వాటితో సహా, మేము అందించే ఎంపికలు.

మేము దీన్ని వీలైనంత సులభంగా ఉంచడానికి ప్రయత్నించాము, కానీ కుక్కీలు, IP చిరునామాలు, పిక్సెల్ ట్యాగ్‌లు మరియు బ్రౌజర్‌లు వంటి పదాలు మీకు తెలియకపోతే, మొదట ఈ కీలక పదాల గురించి చదవండి. Googleకు మీ గోప్యత ముఖ్యం కాబట్టి మీరు Googleకు క్రొత్త అయినా లేదా చాలా కాలం నుండి ఉన్న వినియోగదారు అయినా, దయచేసి మా ఆచరణల గురించి తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించండి – మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి.

మేము సేకరించే సమాచారం

మీరు మాట్లాడే భాష వంటి ప్రాథమిక అంశాల నుండి మీరు ఉపయోగకరంగా భావించే ప్రకటనలు, మీరు ఆన్‌లైన్‌లో సన్నిహితంగా ఉండే వ్యక్తులు లేదా మీకు నచ్చే YouTube వీడియోల వంటి క్లిష్టమైన అంశాల వరకు గుర్తించడం ద్వారా మా మొత్తం వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి సమాచారాన్ని మేము సేకరిస్తాము.

మేము రెండు విధానాల్లో సమాచారాన్ని సేకరిస్తాము:

  • మీరు మాకు అందించే సమాచారం. ఉదాహరణకు, మా అనేక సేవలకు మీరు ఒక Google ఖాతాకు సైన్ అప్ చేయడం అవసరం. మీరు సైన్ అప్ చేసేటప్పుడు, మేము మిమ్మల్ని మీ పేరు, ఇమెయిల్ చిరునామా, టెలిఫోన్ నంబర్ మరియు క్రెడిట్ కార్డ్ వంటి వ్యక్తిగత సమాచారం కోసం అడుగుతాము. మేము అందించే భాగస్వామ్య లక్షణాల యొక్క పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందాలనుకుంటే, మేము మీ పేరు మరియు ఫోటో ఉన్న అందరికి తెలిసిన విధంగా కనిపించే Google ప్రొఫైల్‌ను సృష్టించమని కూడా మిమ్మల్ని అడగవచ్చు.

  • మా సేవల యొక్క మీ ఉపయోగం నుండి మేము పొందే సమాచారం. మీరు YouTubeలో వీడియోను ఎప్పుడు చూస్తారు, మా ప్రకటన సేవలను ఉపయోగించే వెబ్‌సైట్‌ను మీరు ఎప్పుడు సందర్శించారు లేదా మా ప్రకటనలు మరియు కంటెంట్‌ను మీరు ఎప్పుడు వీక్షించారు మరియు ఎప్పుడు పరస్పరం సంభాషించారు వంటి మీరు ఉపయోగిస్తున్న సేవల గురించి మరియు మీరు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు అనేదాని గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. ఈ సమాచారంలో ఇవి ఉంటాయి:

    • పరికర సమాచారం

      మేము పరికర-నిర్దిష్ట సమాచారాన్ని సేకరిస్తాము (మీ హార్డ్‌వేర్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ సంస్కరణ, ప్రత్యేక పరికర నిర్దేశకాలు మరియు ఫోన్ నంబర్‌తో సహా మొబైల్ నెట్‌వర్క్ సమాచారం వంటివి). Google మీ పరికర నిర్దేశకాలను లేదా ఫోన్ నంబర్‌ను మీ Google ఖాతాతో అనుబంధించవచ్చు.

    • లాగ్ సమాచారం

      మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు లేదా Google అందించిన కంటెంట్‌ను వీక్షించినప్పుడు, మేము స్వయంచాలకంగా నిర్దిష్ట సమాచారాన్ని సేకరించి, సర్వర్ లాగ్‌లలో నిల్వ చేస్తాము. దీనిలో ఇవి ఉంటాయి:

      • మా సేవను మీరు ఏ విధంగా ఉపయోగించారు అనే దాని వివరాలు, మీ శోధన ప్రశ్నలు లాంటివి.
      • మీ ఫోన్ నంబర్, కాల్ చేసే వారి నంబర్, ఫార్వర్డ్ చేసే నంబర్‌లు, కాల్‌ల సమయం మరియు తేదీ, కాల్‌ల వ్యవధి, ఎస్ఏంఎస్ (SMS) రూటింగ్ సమాచారం మరియు కాల్‌ల రకాలు వంటి టెలిఫోనీ లాగ్ సమాచారం.
      • ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామా.
      • క్రాష్‌లు, సిస్టమ్ కార్యాచరణ, హార్డ్‌వేర్ సెట్టింగ్‌లు, బ్రౌజర్ రకం, బ్రౌజర్ భాష, మీ అభ్యర్థన యొక్క తేదీ మరియు సమయం మరియు సూచించిన యుఆర్ఎల్ (URL) వంటి పరికర ఈవెంట్ సమాచారం.
      • మీ బ్రౌజర్‌ను లేదా మీ Google ఖాతాను ప్రత్యేకంగా గుర్తించే కుకీలు (Cookies).
    • స్థానం సమాచారం

      మీరు Google సేవలను ఉపయోగించినప్పుడు, మేము మీ వాస్తవ స్థానం గురించి సమాచారాన్ని సేకరించవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు. మేము స్థానాన్ని కనుగొనడానికి సమీప పరికరాల్లో సమాచారాన్ని Googleకి అందించే IP చిరునామా, GPS, వై-ఫై(Wi-Fi) ప్రాప్యత పాయింట్‌లు మరియు సెల్ టవర్‌లు వంటి ఇతర సెన్సార్‌లతో సహా అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తాము.

    • ప్రత్యేక అనువర్తన సంఖ్యలు

      నిర్దిష్ట సేవలు ప్రత్యేక అనువర్తన సంఖ్యను కలిగి ఉంటాయి. ఈ సంఖ్య మరియు మీ ఇన్‌స్టాలేషన్ గురించి సమాచారం (ఉదాహరణకు, ఆపరేటింగ్ సిస్టమ్ రకం మరియు అనువర్తన సంస్కరణ సంఖ్య) మీరు సేవను ఇన్‌స్టాల్ లేదా అన్‌ఇన్‌స్టాల్ చేసినప్పుడు లేదా స్వయంచాలక నవీకరణలు వంటి వాటి కోసం సేవ నియమానుసారంగా మా సర్వర్‌లను సంప్రదించినప్పుడు Googleకు పంపబడవచ్చు.

    • స్థానిక నిల్వ

      మేము బ్రౌజర్ వెబ్ నిల్వ (HTML 5తో సహా) మరియు అనువర్తన డేటా కాష్‌లు వంటి యాంత్రిక విధానాలు ఉపయోగించి మీ పరికరంలో స్థానికంగా సమాచారాన్ని (వ్యక్తిగత సమాచారంతో సహా) సేకరించవచ్చు మరియు నిల్వ చేయవచ్చు.

    • కుకీలు మరియు అనామక నిర్దేశకాలు

      మీరు Google సేవను సందర్శించినప్పుడు సమాచారాన్ని సేకరించడానికి మరియు నిల్వ చేయడానికి మేము మరియు మా భాగస్వాములు అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తాము మరియు దీనిలో భాగంగా మీ పరికరానికి ఒకటి లేదా మరిన్ని కుకీలు లేదా అనామక నిర్దేశకాలను పంపవచ్చు. ఇతర సైట్‌ల్లో కనిపించే ప్రచార సేవలు లేదా Google లక్షణాలు వంటి మేము మా భాగస్వాములకు అందించే సేవలతో మీరు పరస్పర చర్య చేసినప్పుడు మేము కుకీలు మరియు అనామక నిర్దేశకాలను కూడా ఉపయోగిస్తాము. మా Google Analytics ఉత్పత్తి వారి వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనాలకు ట్రాఫిక్‌ను విశ్లేషించడంలో వ్యాపార సంస్థలకు మరియు సైట్ యజమానులకు సహాయపడుతుంది. DoubleClick కుకీని వినియోగిస్తున్న వాటి వంటి మా వాణిజ్య ప్రకటన సేవలతో కలిపి ఉపయోగించినప్పుడు, Google Analytics సమాచారం Google సాంకేతికతను ఉపయోగించి బహుళ సైట్‌లకు చేసిన సందర్శనలకి సంబంధించిన సమాచారంతో లింక్ చేయబడుతుంది.

మేము సేకరించిన సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము

మేము మా అన్ని సేవల నుండి సేకరించిన సమాచారాన్ని వాటిని అందించడానికి, నిర్వహించడానికి, రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి, క్రొత్త వాటిని అభివృద్ధి చేయడానికి మరియు Googleను మరియు మా వినియోగదారులను రక్షించడానికి ఉపయోగిస్తాము. మేము ఈ సమాచారాన్ని మరింత సందర్భోచిత ఫలితాలను మరియు ప్రకటనలను ఇవ్వడం వంటి వ్యక్తీకరించిన కంటెంట్‌ను మీకు అందించడానికి కూడా ఉపయోగిస్తాము.

మీ Google ప్రొఫైల్ కోసం మీరు అందించిన పేరును మేము అందించే Google ఖాతా అవసరమయ్యే అన్ని సేవల్లో ఉపయోగించవచ్చు. అదనంగా, మేము మీ Google ఖాతాతో అనుబంధితమైన గత పేర్లను భర్తీ చేయవచ్చు, అందువల్ల మీరు మా అన్ని సేవల్లో ఒకే విధంగా సూచించబడతారు. ఇతర వినియోగదారులు మీ ఇమెయిల్‌ను లేదా మిమ్మల్ని గుర్తించే ఇతర సమాచారాన్ని ఇప్పటికే కలిగి ఉంటే, మేము మీ పేరు మరియు ఫోటో వంటి, అందరికి తెలిసే విధంగా కనిపించే Google ప్రొఫైల్ సమాచారాన్ని వారికి చూపుతాము.

మీరు Google ఖాతా కలిగి ఉంటే, మేము Googleలో లేదా మా సేవల్లో మీ Google ఖాతాకు కనెక్ట్ చేయబడిన మూడవ-పక్ష అనువర్తనాల్లో మీ ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ ఫోటో మరియు మీరు తీసుకునే చర్యలను (+1లు, మీరు వ్రాసే సమీక్షలు మరియు మీరు పోస్ట్ చేసే వ్యాఖ్యల వంటివి) ప్రదర్శించవచ్చు, దీనితో పాటు ప్రకటనల్లో మరియు ఇతర వాణిజ్య సందర్భాల్లో ప్రదర్శించవచ్చు. మీ Google ఖాతాలో భాగస్వామ్య లేదా దృశ్యమాన సెట్టింగ్‌లను పరిమితం చేయడం కోసం మీరు ఎంచుకునే ఎంపికలకు మేము విలువ ఇస్తాము.

మీరు Googleను సంప్రదించినప్పుడు, మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయడానికి మేము మీ కమ్యూనికేషన్ యొక్క రికార్డ్‌ను ఉంచుతాము. మేము మీ ఇమెయిల్ చిరునామాను మా సేవల రాబోయే మార్పులు లేదా అభివృద్ధుల గురించి మీకు తెలియజేయడానికి ఉపయోగిస్తాము.

మీ వినియోగదారు అనుభవాన్నిమరియు మా సేవల యొక్క మొత్తం నాణ్యతను మెరుగుపరచడానికి కుకీలు మరియు పిక్సెల్ ట్యాగ్‌లు వంటి ఇతర సాంకేతిక పరిజ్ఞానాల నుండి సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. మా స్వంత సేవల్లో దీన్ని చేయడానికి మేము ఉపయోగించే ఉత్పత్తుల్లో Google Analytics ఒకటి. ఉదాహరణకు, మీ భాషా ప్రాధాన్యతలను సేవ్ చేయడం ద్వారా, మీరు ఎంచుకున్న భాషలో మా సేవలు కనిపించేలా మేము చేయగలుగుతాము. మీకు వ్యక్తీకరించిన ప్రకటనలను చూపిస్తున్నప్పుడు, మేము జాతి, మతం, లైంగిక సంబంధం లేదా ఆరోగ్యంపై ఆధారపడినటువంటి సున్నితమైన వర్గాలతో కుకీని లేదా అనామక నిర్దేశకాన్ని అనుబంధించము.

అనుకూలీకరించిన శోధన ఫలితాలు, వ్యక్తీకరించిన వ్యాపార ప్రకటనలు మరియు స్పామ్ మరియు మాల్వేర్ గుర్తింపు వంటి సంబంధిత ఉత్పత్తి లక్షణాలను మీకు వ్యక్తిగతంగా అందించడానికి మా స్వయంచాలక సిస్టమ్‌లు మీ కంటెంట్‌ను (ఇమెయిల్‌లతో సహా) విశ్లేషిస్తాయి.

ఒక సేవ నుండి వ్యక్తిగత సమాచారంతో సహా సమాచారాన్ని , ఇతర Google సేవల నుండి సమాచారానికి కలపవచ్చు – ఉదాహరణకు, మీకు తెలిసిన వ్యక్తులతో విషయాలను భాగస్వామ్యం చేయడాన్ని సులభం చేయడానికి. మీ సమ్మతి మాకు లేనంత వరకు DoubleClick కుకీ సమాచారాన్ని వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారంతో మేము చేర్చము.

మేము ఈ గోప్యతా విధానంలో పేర్కొన్నవి మినహా మరో ప్రయోజనం కోసం సమాచారాన్ని ఉపయోగించడానికి ముందు మీ సమ్మతి కోసం అడుగుతాము.

ప్రపంచం అంతటా అనేక దేశాల్లోని మా సర్వర్‌లలో వ్యక్తిగత సమాచారాన్ని Google ప్రాసెస్ చేస్తుంది. మేము మీరు నివసిస్తున్న దేశం వెలుపల ఉన్న సర్వర్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయవచ్చు.

పారదర్శకత మరియు ఎంపిక

వ్యక్తులకు వివిధ గోప్యతా సమస్యలు ఉన్నాయి. మేము ఏ రకమైన సమాచారాన్ని సేకరిస్తామో దాని గురించి స్పష్టంగా ఉండటం మా లక్ష్యం, అందువల్ల మీరు ఇది ఏ విధంగా ఉపయోగించబడుతుంది అనేదాని గురించి అర్థవంతమైన ఎంపికలను చేయవచ్చు. ఉదాహరణకు, మీరు వీటిని చేయవచ్చు:

మా సేవలతో అనుబంధించిన కుకీలతో సహా అన్ని కుకీలను బ్లాక్ చేయడానికి లేదా మా ద్వారా కుకీ సెట్ చేయబడుతున్నప్పుడు సూచించడానికి కూడా మీరు మీ బ్రౌజర్‌ను సెట్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ, మీ కుక్కీలు నిలిపివేయబడితే మా అనేక సేవలు సరిగ్గా పని చేయవని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఉదాహరణకు, మేము మీ భాషా ప్రాధాన్యతలను గుర్తుంచుకోలేము.

మీరు భాగస్వామ్యం చేసే సమాచారం

మా అనేక సేవలు మీరు ఇతరులతో సమాచారాన్ని భాగస్వామ్యం చేసుకునేందుకు అనుమతిస్తాయి. మీరు అందరికి తెలిసే విధంగా సమాచారాన్ని భాగస్వామ్యం చేసినప్పుడు, Googleతో సహా, శోధన ఇంజిన్‌ల ద్వారా ఇది సూచించబడుతుందని గుర్తుంచుకోండి. మా సేవలు మీ కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడంలో మరియు తీసివేయడంలో వివిధ ఎంపికలను మీకు అందిస్తాయి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాప్యత చేయడం మరియు నవీకరించడం

మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యతను మీకు అందించడం మా ఉద్దేశం. ఆ సమాచారం సరైనది కాకపోతే , మేము దాన్ని శీఘ్రంగా నవీకరించడానికి లేదా తొలగించడానికి మీకు మార్గాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తాము – చట్టబద్ధమైన వ్యాపారం లేదా చట్టబద్ధ ప్రయోజనాల కోసం సమాచారాన్ని మేము ఉంచే అవసరం లేకపోతే. మీ వ్యక్తిగత సమాచారాన్ని నవీకరిస్తున్నప్పుడు, మీ అభ్యర్థనపై మేము చర్యను తీసుకోవడానికి ముందు మేము మీ గుర్తింపుని ధృవీకరించమని మిమ్మల్ని అడగవచ్చు.

మేము అసంబద్ధ పునరావృత, అవసరమైన సముచితంకాని టెక్నికల్ ప్రభావం (ఉదాహరణకు, క్రొత్త సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం లేదా ఇప్పటికే ఉన్న ఆచరణను ప్రాథమికంగా మార్చడం), ఇతరుల యొక్క గోప్యతకు నష్టం లేదా ఖచ్చితంగా అసాధ్యమైన అంశం (ఉదాహరణకు, బ్యాకప్ టేప్‌లలో ఉన్న సంబంధిత సమాచారాన్ని అభ్యర్థించడం) లాంటి అభ్యర్థనలను తిరస్కరిస్తాము.

మేము అసాధ్యమైన ప్రయత్నం అవసరమయ్యే సందర్భంలో మినహా, మేము సమాచార ప్రాప్యత మరియు దిద్దుబాటును ఉచితంగా అందిస్తాము. ప్రమాదాలు లేదా ఇతరులకు హాని కలిగించే విధ్వంసం నుండి సమాచారాన్ని రక్షించే విధానంలో మా సేవలను నిర్వహించడం మా ఉద్దేశం. దీని కారణంగా, మీరు మా సేవల నుండి సమాచారాన్ని తొలగించిన తర్వాత, మేము మా సక్రియాత్మక సర్వర్‌ల నుండి మిగిలిన కాపీలను వెంటనే తొలగించము మరియు మా బ్యాకప్ సిస్టమ్‌ల నుండి సమాచారాన్ని తీసివేయము.

మేము భాగస్వామ్యం చేసే సమాచారం

క్రింద సందర్భాల్లోని ఒక సందర్భం కాకపోతే, మేము Google వెలుపల ఉన్న కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేయము:

  • మీ సమ్మతితో

    మాకు భాగస్వామ్యం చేయడానికి మీ సమ్మతి ఉన్నప్పుడు మేము Google వెలుపల ఉన్న కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తాము. ఏదైనా సున్నితమైన వ్యక్తిగత సమాచారం యొక్క భాగస్వామ్యం కోసం మాకు అనుమతించే సమ్మతి (opt-in consent) అవసరం.

  • డొమైన్ నిర్వాహకులతో

    మీ కోసం మీ Google ఖాతా డొమైన్ నిర్వాహకుడు ద్వారా నిర్వహించబడితే (ఉదాహరణకు, Google Apps వినియోగదారుల కోసం), అప్పుడు మీ సంస్థకు వినియోగదారు మద్దతుని అందించే మీ డొమైన్ నిర్వాహకుడు మరియు పునఃవిక్రేత మీ Google ఖాతా సమాచారానికి (మీ ఇమెయిల్ మరియు ఇతర డేటాతో సహా) ప్రాప్యతను కలిగి ఉంటారు. మీ డొమైన్ నిర్వాహకుడు వీటిని చేయగలరు:

    • మీరు ఇన్‌స్టాల్ చేసిన అనువర్తనాలకు సంబంధించిన గణాంకాలు, మీ ఖాతాకు సంబంధించిన గణాంకాలను వీక్షించడం.
    • మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం.
    • మీ ఖాతా ప్రాప్యతను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రద్దు చేయడం.
    • మీ ఖాతాలో భాగంగా నిల్వ చేసిన సమాచారాన్ని ప్రాప్యత చేయడం లేదా ఉంచడం.
    • వర్తించబడే చట్టం, నియంత్రణ, చట్టబద్ధ విధానం లేదా అమలు చేయగలిగే ప్రభుత్వ అభ్యర్థనను సంతృప్తి పర్చడానికి మీ ఖాతా సమాచారాన్ని స్వీకరించడం.
    • సమాచారాన్ని లేదా గోప్యతా సెట్టింగ్‌లను తొలగించడానికి లేదా సవరించడానికి మీ సామర్థ్యాన్ని పరిమితం చేయడం.

    దయచేసి మరింత సమాచారం కోసం మీ డొమైన్ నిర్వాహకుడి యొక్క గోప్యతా విధానాన్ని చూడండి.

  • బాహ్య ప్రాసెసింగ్ కోసం

    మా సూచనలు ఆధారంగా మరియు మా గోప్యతా విధానం మరియు ఏదైనా ఇతర సముచిత గోప్యనీయత మరియు భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా, మా తరపున ప్రాసెస్ చేయడానికి మా అనుబంధాలు లేదా ఇతర విశ్వసనీయ వ్యాపారాలు లేదా వ్యక్తులకు మేము వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తాము.

  • చట్టబద్ధ కారణాల కోసం

    సమాచారం యొక్క ప్రాప్యత, ఉపయోగం, ప్రదర్శన లేదా వెల్లడి వీరికి అవసరమైన సహేతుకమైనదని మాకు ఉత్తమమైన నమ్మకం ఉంటే, మేము Google వెలుపల ఉన్న కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తాము:

    • వర్తించబడే ఏదైనా చట్టం, నియంత్రణ, చట్టబద్ధమైన విధానం లేదా అమలు చేయగలిగే ప్రభుత్వ అభ్యర్థన మేరకు.
    • సమర్థవంతమైన ఉల్లంఘనల పరిశీలనతో సహా, వర్తించబడే సేవా నిబంధనలను అమలు చేయడానికి.
    • చిరునామా మోసం, భద్రతా లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడానికి, నివారించడానికి లేదా మరొక దాని కోసం.
    • చట్టానికి అవసరమైనట్లుగా లేదా ఆమోదించినట్లుగా Google, వినియోగదారులు లేదా పబ్లిక్‌ యొక్క హక్కులకు, ఆస్తికి లేదా భద్రతకు హాని కలిగించే వాటికి వ్యతిరేకంగా రక్షించడానికి.

మేము సమగ్ర, వ్యక్తిగతంగా గుర్తించలేని సమాచారంను అందరికి తెలిసే విధంగా మరియు పాత్రికేయులు, ప్రకటనదారులు లేదా కనెక్ట్ చేసిన సైట్‌లు వంటి మా భాగస్వాములతో భాగస్వామ్యం చేస్తాము. ఉదాహరణకు, మేము మా సేవల యొక్క సాధారణ ఉపయోగం గురించి ధోరణులను చూపించడానికి సమాచారాన్ని అందరికి తెలిసే విధంగా భాగస్వామ్యం చేస్తాము.

విలీనం, సేకరణ లేదా ఆస్తి అమ్మకం వంటి వాటిలో Google పాల్గొంటే, మేము ఏదైనా వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యనీయత నిర్ధారణను కొనసాగిస్తాము మరియు వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయడానికి లేదా వేరొక గోప్యతా విధానానికి సంబంధించినదిగా చేయడానికి ముందు ప్రభావితమైన వినియోగదారులకు సమాచారం ఇస్తాము.

సమాచార భద్రత

మేము మా వద్ద ఉన్న సమాచారానికి అనధికార ప్రాప్యతను లేదా అనధికార మార్పు, వెల్లడి లేదా విధ్వంసం నుండి Google మరియు మా వినియోగదారులను రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా:

  • మేము మా అనేక సేవలను ఎస్ఎస్ఎల్ (SSL)ను ఉపయోగించి గుప్తీకరిస్తాము.
  • మీరు మీ Google ఖాతాను ప్రాప్యత చేసినప్పుడు, మీకు రెండు దశల ధృవీకరణను మరియు Google Chromeలో సురక్షిత బ్రౌజింగ్ లక్షణాన్ని అందిస్తాము.
  • మేము సిస్టమ్‌లను అనధికార ప్రాప్యత నుండి రక్షించడానికి, శారీరక భద్రత ప్రమాణాలతోసహా, మా సమాచార సేకరణ, నిల్వ మరియు ప్రాసెసింగ్ ఆచరణలను సమీక్షిస్తాము.
  • మేము మా కోసం దీన్ని ప్రాసెస్ చేయడానికి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్న లేదా ఖచ్చితమైన ఒప్పంద గోప్యనీయత బాధ్యతలకు సంబంధించిన Google ఉద్యోగులు, ఒప్పందం చేసుకొనినవారు (Contractors) మరియు ఏజెంట్‌లకు వ్యక్తిగత సమాచారాన్ని ప్రాప్యత చేయడాన్ని పరిమితం చేస్తాము మరియు ఈ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమైతే క్రమశిక్షణగా ఉంచబడతారు లేదా తొలగించబడతారు.

ఈ గోప్యతా విధానం ఎప్పుడు వర్తిస్తుంది

మా గోప్యతా విధానం Google Inc. మరియు దాని అనుబంధాలు, YouTube మరియు ఇతర సైట్‌‌ల ద్వారా అందించిన సేవలకు వర్తించబడుతుంది (మా ప్రకటన సేవలు వంటివి), కానీ ఈ గోప్యతా విధానంతో సముచితంగాలేని ప్రత్యేక గోప్యతా విధానాలను కలిగి ఉన్న సేవలను మినహాయిస్తుంది.

శోధన ఫలితాల్లో మీకు కనిపించే ఉత్పత్తులు లేదా సేవలు, Google సేవల్లో ఉండే సైట్‌లు లేదా మా సేవల నుండి లింక్ చేయబడిన ఇతర సైట్‌లతో సహా, ఇతర కంపెనీలు లేదా వ్యక్తుల ద్వారా అందించిన సేవలకు మా గోప్యతా విధానం వర్తించదు. మా సేవలను ప్రచారం చేసే మరియు సందర్భోచిత ప్రకటనలను అందించడానికి కుకీలు, పిక్సెల్ ట్యాగ్‌లు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించే ఇతర కంపెనీలు మరియు సంస్థల సమాచార ఆచరణలకు మా గోప్యతా విధానం వర్తించదు.

నియంత్రిత నిబంధనలకు అనుకూలత మరియు సహకారం

మేము మా గోప్యతా విధానంతో మా అనుకూలతను నిరంతరంగా సమీక్షిస్తాము. మేము అనేక స్వంత నియంత్రణా ఫ్రేమ్‌వర్క్‌లకు కూడా కట్టుబడి ఉంటాము. మేము లాంఛనప్రాయ వ్రాతపూర్వక ఫిర్యాదులను స్వీకరించినప్పుడు, వాటిని విచారించడానికి ఫిర్యాదు చేసిన వ్యక్తిని మేము సంప్రదిస్తాము. స్థానిక డేటా రక్షణ అధికారులతో సహా, మేము నేరుగా మా వినియోగదారులతో పరిష్కరించలేని వ్యక్తిగత డేటా యొక్క బదిలీకి సంబంధించిన ఏవైనా ఫిర్యాదులను పరిష్కరించడానికి మేము సముచితమైన నియంత్రణా అధికారులతో పని చేస్తాము.

మార్పులు

మా గోప్యతా విధానం సమయానుసారంగా మారవచ్చు. మేము మీ స్పష్టమైన సమ్మతిలేకుండా ఈ గోప్యతా విధానంలో మీ హక్కులను తగ్గించము. మేము ఏవైనా గోప్యతా విధాన మార్పులను ఈ పేజీలో పోస్ట్ చేస్తాము మరియు మార్పులు ముఖ్యమైనవి అయితే, మేము అత్యంత ముఖ్యమైన నోటీసును అందిస్తాము (నిర్దిష్ట సేవలు కోసం, గోప్యతా విధాన మార్పుల యొక్క ఇమెయిల్ నోటిఫికేషన్‌తో సహా). మేము మీ సమీక్ష కోసం ఆర్కైవ్‌లో ఈ గోప్యతా విధానం యొక్క మునుపటి సంస్కరణలను కూడా ఉంచుతాము.

నిర్దిష్ట ఉత్పత్తి ఆచరణలు

మీరు ఉపయోగిస్తున్న నిర్దిష్ట Google ఉత్పత్తులకు మరియు సేవలకు సంబంధించిన నిర్దిష్ట గోప్యతా ఆచరణలను క్రింద ఉన్న నోటీసులు వివరిస్తాయి:

మా అత్యంత జనాదరణ పొందిన సేవల్లో కొన్నింటి గురించి మరింత సమాచారం పొందడానికి, మీరు Google ఉత్పత్తి గోప్యత గైడ్ను చూడండి.

తదుపరి ఉపయోగకర గోప్యత మరియు భద్రతా సంబంధిత విషయాలను Google యొక్క విధానాలు మరియు నియమాలు పేజీల ద్వారా తెలుసుకోవచ్చు, వీటిని కూడా తెలుసుకోవచ్చు:

"మీ వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యత"

ఉదాహరణకు, మీరు Google డాష్‌బోర్డ్‌ను ఉపయోగించి మీ Google ఖాతాతో అనుబంధించబడిన డేటాలో కొంత భాగాన్ని శీఘ్రంగా మరియు సులభంగా చూడవచ్చు. మరింత తెలుసుకోండి.

"మీరు అత్యంత ఉపయోగకరంగా గుర్తించే ప్రకటనలు"

ఉదాహరణకు, మీరు తరచుగా తోటపని గురించి వెబ్‌సైట్‌లను మరియు బ్లాగ్‌లను సందర్శిస్తే, వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీకు తోటపనికి సంబంధించిన ప్రకటనలు కనిపించవచ్చు. మరింత తెలుసుకోండి.

"వ్యాపార ప్రకటన సేవలు"

ఉదాహరణకు, మీరు తరచుగా మా ప్రకటనలను చూపే తోటపనికి సంబంధించిన వెబ్‌సైట్‌లు మరియు బ్లాగ్‌లను సందర్శిస్తే, మీరు వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీకు ఈ ఆసక్తికి సంబంధించిన ప్రకటనలు కనిపించడం మొదలు కావచ్చు. మరింత తెలుసుకోండి.

"మరియు ఇతర సెన్సార్‌లు"

మీ పరికరం మీ స్థానాన్ని మెరుగ్గా గుర్తించడంలో సహాయపడటానికి సమాచారాన్ని అందించే సెన్సార్‌లను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, వేగం వంటి విషయాలను కనుగొనడానికి యాక్సిలెరోమీటర్ లేదా ప్రయాణ దిశను గుర్తించడానికి గైరోస్కోప్ ఉపయోగించబడుతుంది. మరింత తెలుసుకోండి.

"సమాచారాన్ని సేకరించడం"

ఇది మీ వినియోగ డేటా మరియు ప్రాధాన్యతల వంటి సమాచారాన్ని, Gmail సందేశాలను, G+ ప్రొఫైల్‌ను, ఫోటోలను, వీడియోలను, బ్రౌజింగ్ చరిత్రను, మ్యాప్ శోధనలను, పత్రాలను లేదా Google హోస్ట్ చేసిన ఇతర కంటెంట్‌ను కలిగి ఉంటుంది. మరింత తెలుసుకోండి.

"ఒక సేవలోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతర Google సేవల్లోని సమాచారంతో అలాగే వ్యక్తిగత సమాచారంతో మిళితం చేయడం"

ఉదాహరణకు, మీరు మీ Google ఖాతాకి సైన్ ఇన్ చేసి, Googleలో శోధించేటప్పుడు, మీరు మీ స్నేహితులకు సంబంధించిన పేజీలు, ఫోటోలు మరియు Google+ పోస్ట్‌లతో పాటుగా పబ్లిక్ వెబ్ నుండి శోధన ఫలితాలను చూడగలరు మరియు Google+లో మీరు తెలిసిన లేదా మిమ్మల్ని అనుసరించే వ్యక్తులు వారి ఫలితాల్లో మీ పోస్ట్‌లను మరియు ప్రొఫైల్‌లను చూడగలరు. మరింత తెలుసుకోండి.

"వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి"

ఉదాహరణకు, మీరు Gmail వంటి ఇతర Google ఉత్పత్తుల్లో వ్యక్తులతో కలిగి ఉన్న కనెక్షన్‌ల ఆధారంగా, Google+లో మీకు తెలిసిన లేదా కనెక్ట్ కావాలనుకుంటున్న వ్యక్తుల యొక్క సూచనలను పొందగలరు మరియు మీతో కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మీ ప్రొఫైల్‌ను సూచన రూపంలో చూడగలరు. మరింత తెలుసుకోండి.

"క్రెడిట్ కార్డ్"

మేము ప్రస్తుతం సైన్ అప్ సమయంలో క్రెడిట్ కార్డ్ కోసం అడగకపోయినప్పటికీ, మీకు Google ఖాతాను కలిగి ఉండటానికి తగినంత వయస్సు లేదని సూచించేలా పుట్టినరోజు నమోదు చేయడం వలన మీ ఖాతా నిలిపివేయబడిన సందర్భాల్లో మీరు మా వయోపరిమితులకు లోబడి ఉన్నారని నిర్ధారించడానికి చిన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీ ద్వారా మీ వయస్సును ధృవీకరించడం ఒక పద్ధతి. మరింత తెలుసుకోండి.

"కొత్తవాటిని అభివృద్ధి చేయడం"

ఉదాహరణకు, Google అక్షరక్రమ తనిఖీ సాఫ్ట్‌వేర్ వినియోగదారులు వారికి వారుగా వారి స్వంత అక్షరక్రమాన్ని సరిదిద్దిన మునుపటి శోధనలను విశ్లేషించడం ద్వారా అభివృద్ధి చేయబడింది. మరింత తెలుసుకోండి.

"పరికర ఐడెంటిఫైయర్‌లు"

పరికర ఐడెంటిఫైయర్‌లు మీరు మా సేవలను ప్రాప్యత చేయడానికి ఏ ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తున్నారో Googleకి తెలియజేస్తాయి, వీటిని మీ పరికరానికి మా సేవను అనుకూలీకరించడానికి లేదా మా సేవలకు సంబంధించిన ఏవైనా పరికర సమస్యలను విశ్లేషించడానికి ఉపయోగించవచ్చు. మరింత తెలుసుకోండి.

"పరికర-నిర్దిష్ట సమాచారం"

ఉదాహరణకు, మీరు మీ డెస్క్‌టాప్ నుండి Google Playని సందర్శించినప్పుడు, మీరు ఏయే పరికరాల్లో మీ కొనుగోళ్లు ఉపయోగించడం కోసం అందుబాటులో ఉండాలో నిర్ణయించుకోవడంలో మీకు సహాయపడటానికి Google ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. మరింత తెలుసుకోండి.

"మీ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచండి"

ఉదాహరణకు, వినియోగదారులు మా సేవలతో ఎలా పరస్పర చర్య చేస్తున్నారో విశ్లేషించడానికి కుక్కీలు మమ్మల్ని అనుమతిస్తాయి. మరింత తెలుసుకోండి.

ఇతర సాంకేతిక మరియు కమ్యూనికేషన్‌ల కంపెనీల మాదిరిగానే Google కూడా నిరంతరం వినియోగదారు డేటాను అందజేయాలని ప్రపంచ నలుమూలల ఉన్న ప్రభుత్వాలు మరియు న్యాయస్థానాల నుండి అభ్యర్థనలను స్వీకరిస్తుంది. మరింత తెలుసుకోండి.

"భాగస్వామ్య మరియు దృశ్యమానత సెట్టింగ్‌లను పరిమితం చేయడం"

ఉదాహరణకు, మీరు ప్రకటనలో మీ పేరు మరియు ఫోటో కనిపించని విధంగా మీ సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు. మరింత తెలుసుకోండి.

"బహుళ సైట్‌లకు చేసిన సందర్శనలకి సంబంధించిన సమాచారంతో లింక్ చేయబడుతుంది"

Google Analytics మొదటి-పక్షం కుకీల ఆధారితమైనది. ప్రకటనదారు మరింత సందర్భోచిత ప్రకటనలను రూపొందించడానికి లేదా తదనంతర ట్రాఫిక్‌ను విశ్లేషించడానికి Google Analytics డేటాను ఉపయోగించాలనుకునే లాంటి సందర్భాల్లో Google Analytics ద్వారా ఉత్పన్నమైన ఇతర వెబ్‌సైట్‌లకు చేసిన సందర్శనలకు సంబంధించిన డేటా Google సాంకేతికతను ఉపయోగించి మూడవ-పక్షం కుకీలకు లింక్ చేయబడుతుంది. మరింత తెలుసుకోండి.

"మీ అసలు స్థానం గురించి సమాచారాన్ని సేకరించవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు"

ఉదాహరణకు, Google మ్యాప్స్ మీ ప్రస్తుత స్థానంలో మ్యాప్‌ల వీక్షణను కేంద్రీకరించవచ్చు. మరింత తెలుసుకోండి.

"సరిగ్గా పని చేయకపోవచ్చు"

ఉదాహరణకు, మేము ‘lbcs’ అని పిలువబడే కుక్కీని ఉపయోగిస్తాము, దీని వలన ఒకే బ్రౌజర్‌లో అనేక Google పత్రాలను తెరవడం మీకు సాధ్యమవుతుంది. మరింత తెలుసుకోండి.

"మరియు మా భాగస్వాములు"

మా సేవల్లో వ్యాపార ప్రకటనలు మరియు పరిశోధన ప్రయోజనాల కోసం కుకీలు లేదా సారూప్య సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడానికి మేము విశ్వసనీయ వ్యాపార సంస్థలను అనుమతిస్తాము. మరింత తెలుసుకోండి.

"ఫోన్ నంబర్"

ఉదాహరణకు, మీరు పునరుద్ధరణ ఎంపికగా ఫోన్ నంబర్‌ను జోడిస్తే, మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినప్పుడు దాన్ని రీసెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే కోడ్‌ గల వచన సందేశాన్ని Google మీకు పంపవచ్చు. మరింత తెలుసుకోండి.

"Google మరియు మా వినియోగదారులను సంరక్షించడం"

ఉదాహరణకు, మీరు మీ ఇమెయిల్‌కి అనధికార ప్రాప్యత గురించి ఆందోళన చెందుతుంటే, Gmailలోని "గత ఖాతా కార్యాచరణ" మీ ఇమెయిల్‌లో ఇటీవలి కార్యాచరణ గురించి, మీ మెయిల్‌ను ప్రాప్యత చేసిన IP చిరునామాలు, అనుబంధిత స్థానం అలాగే సమయం మరియు తేదీ వంటి వాటి గురించి మీకు సమాచారాన్ని చూపుతుంది. మరింత తెలుసుకోండి.

"భాగస్వామ్యం చేయడం"

ఉదాహరణకు, Google+తో మీకు పలు విభిన్న భాగస్వామ్య ఎంపికలను ఉంటాయి. మరింత తెలుసుకోండి.

"ఇతరులతో శీఘ్రంగా మరియు సులభంగా భాగస్వామ్యం చేయడం"

ఉదాహరణకు, ఒకరు ఇప్పటికే పరిచయంగా ఉంటే, మీరు వారిని Gmailలో ఒక సందేశానికి జోడించాలనుకున్నప్పుడు వారి పేరుని Google స్వీయపూర్తి చేస్తుంది. మరింత తెలుసుకోండి.

"ఆన్‌లైన్‌లో మీరు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే వ్యక్తులు"

ఉదాహరణకు, మీరు కంపోజ్ చేస్తున్న సందేశం యొక్క స్వీకర్త, Cc లేదా Bcc ఫీల్డ్‌లో చిరునామాను టైప్ చేస్తున్నప్పుడు, Gmail మీ పరిచయాల జాబితాలోని చిరునామాలను సూచిస్తుంది. మరింత తెలుసుకోండి.

"మీకు తెలిసిన వ్యక్తులతో విషయాలను భాగస్వామ్యం చేయడాన్ని సులభతరం చేయడానికి"

ఉదాహరణకు, మీరు Gmail ద్వారా ఒకరితో కమ్యూనికేట్ చేసి, వారిని Google పత్రానికి లేదా Google క్యాలెండర్‌లో ఈవెంట్‌కి జోడించాలనుకుంటే, మీరు వారి పేరును టైప్ చేయడం ప్రారంభించినప్పుడు వారి ఇమెయిల్ చిరునామాను స్వీయపూర్తి చేయడం ద్వారా Google దీన్ని సులభం చేస్తుంది. మరింత తెలుసుకోండి.

"మా ప్రకటనలను వీక్షించడం మరియు వాటితో పరస్పర చర్య చేయడం"

ఉదాహరణకు, మేము ప్రకటనదారుల ప్రకటనను పేజీకి అందించామా లేదా అనే విషయాన్ని మరియు వినియోగదారులు ఆ ప్రకటనను చూసే అవకాశం ఎక్కువ ఉన్నదా లేదా (మరో రకంగా చెప్పాలంటే, ఉదాహరణకు, వినియోగదారులు స్క్రోల్ చేయలేని పేజీలో ఉండటం) అనే విషయాన్ని వారికి క్రమం తప్పకుండా నివేదిస్తాము. మరింత తెలుసుకోండి.

"మేము సమగ్ర, వ్యక్తిగతంగా గుర్తించదగని సమాచారాన్ని పబ్లిక్‌గా భాగస్వామ్యం చేయవచ్చు"

అనేక మంది వ్యక్తులు దేనికోసమైనా శోధించడం ప్రారంభించినప్పుడు, ఇది ఆ సమయంలో ప్రత్యేక ట్రెండ్‌ల గురించి చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలదు. మరింత తెలుసుకోండి.

"వై-ఫై(Wi-Fi) ప్రాప్యత పాయింట్‌లు మరియు సెల్ టవర్‌లు"

ఉదాహరణకు, Google సమీప సెల్ టవర్‌లు ఉండే స్థానాన్ని బట్టి మీ పరికరం స్థానాన్ని అంచనా వేయగలుగుతుంది. మరింత తెలుసుకోండి.

"మరిన్ని సందర్భోచిత శోధన ఫలితాలు"

ఉదాహరణకు, మీకు మరియు మీ స్నేహితులకు సంబంధించిన ఫోటోలు, పోస్ట్‌లు మరియు మరిన్నింటిని చేర్చడం ద్వారా మేము మీ కోసం శోధనను మరింత సందర్భోచితంగా మరియు ఆసక్తికరంగా చేయగలము.

మరింత తెలుసుకోండి

"మీ కంటెంట్‌ను తీసివేయడం"

ఉదాహరణకు, మీరు మీ వెబ్ చరిత్ర, మీ బ్లాగ్, మీ స్వంత Google సైట్, మీ YouTube ఛానెల్, మీ Google+ ప్రొఫైల్ లేదా మీ పూర్తి Google ఖాతాను తొలగించవచ్చు.

మీరు వీటిలో కొన్నింటిని Google ట్రెండ్‌లు మరియు YouTube ట్రెండ్‌ల్లో చూడవచ్చు.

Google యాప్‌లు
ప్రధాన మెనూ