డేటా యాక్సెస్, అలాగే తొలగింపు పారదర్శకత రిపోర్ట్

Google గోప్యతా పాలసీ, అలాగే గోప్యతా సహాయ కేంద్రంలో వివరించినట్లుగా, యూజర్‌లు Google సర్వీస్‌లలో వారి సమాచారాన్ని అప్‌డేట్ చేయడం, మేనేజ్ చేయడం, యాక్సెస్ చేయడం, సరి చేయడం, ఎగుమతి చేయడం, అలాగే తొలగించడం కోసం, వారి గోప్యతను కంట్రోల్ చేయడం కోసం, మేము వివిధ రకాల టూల్స్‌ను అందుబాటులో ఉంచుతాము. ప్రత్యేకించి, ప్రతి సంవత్సరం U.S.లోని మిలియన్‌ల మంది యూజర్‌లు Googleకు చెందిన మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు లేదా Googleకు చెందిన నా యాక్టివిటీ ఫీచర్‌ను ఉపయోగించి వారి డేటాలో కొంత భాగాన్ని తొలగిస్తారు. ఈ టూల్స్ యూజర్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడిన రిక్వెస్ట్‌లతో, వారు రివ్యూ చేసేందుకు, డౌన్‌లోడ్ చేసేందుకు లేదా తొలగించేందుకు Google సర్వీస్‌లలో నిర్దిష్ట రకాల డేటాను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తాయి. అదనంగా, యూజర్‌లు Googleను సంప్రదించడం ద్వారా కాలిఫోర్నియా వినియోగదారు గోప్యతా చట్టం (“CCPA”) వంటి నిర్దిష్ట గోప్యతా చట్టాల ప్రకారం వారి హక్కులను వినియోగించుకోవచ్చు.

దిగువ టేబుల్ 2023లో ఈ టూల్స్, ఇంకా సంప్రదింపు పద్ధతుల ఉపయోగం గురించి మరింత సమాచారాన్ని అందిస్తుంది:

రిక్వెస్ట్ రకంరిక్వెస్ట్‌ల సంఖ్యమొత్తం లేదా సగం పూర్తయిన రిక్వెస్ట్‌లుతిరస్కరించబడిన రిక్వెస్ట్‌లు***గణనీయంగా స్పందించడానికి సగటు సమయం
మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి వినియోగం*సుమారుగా 8.8 మిలియన్‌లుసుమారుగా 8.8 మిలియన్‌లుN/A (రిక్వెస్ట్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతాయి)1 రోజు కంటే తక్కువ (రిక్వెస్ట్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతాయి)
నా యాక్టివిటీ తొలగింపు వినియోగం*సుమారుగా 60.6 మిలియన్‌లుసుమారుగా 60.6 మిలియన్‌లుN/A (రిక్వెస్ట్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతాయి)1 రోజు కంటే తక్కువ (రిక్వెస్ట్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతాయి)
తెలుసుకోవాల్సిన రిక్వెస్ట్‌లు (Googleను సంప్రదించడం ద్వారా)**42442226 రోజులు
తొలగించాల్సిన రిక్వెస్ట్‌లు (Googleను సంప్రదించడం ద్వారా)**323207 రోజులు
సరి చేయాల్సిన రిక్వెస్ట్‌లు (Googleను సంప్రదించడం ద్వారా)**000N/A

మా గోప్యతా పాలసీలో వివరించినట్లుగా, Google మా యూజర్‌ల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించదు; CCPA అనుమతించిన ప్రయోజనాల కోసం మాత్రమే, CCPA గోప్యమైనదిగా పరిగణించే వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగిస్తుంది. తదనుగుణంగా, యూజర్‌లు వ్యక్తిగత సమాచార విక్రయాన్ని నిలిపివేయాలని లేదా వారి గోప్యమైన వ్యక్తిగత సమాచార వినియోగాన్ని పరిమితం చేయాలని రిక్వెస్ట్‌లను సమర్పించినప్పుడు, మేము మా ప్రాక్టీస్‌లు, నిబద్ధతలను వివరించడం ద్వారా ఈ రిక్వెస్ట్‌లకు సమాధానం ఇస్తాము. యూజర్‌లకు మేము వారి వ్యక్తిగత సమాచారాన్ని Google వెలుపల షేర్ చేయగల పరిమిత పరిస్థితుల గురించి; అటువంటి షేరింగ్‌పై వారికున్న కంట్రోల్స్ గురించి సమాచారాన్ని అందిస్తాము. అదే విధంగా ఏ Google సర్వీస్‌ను ఉపయోగిస్తున్నారు అనే దాని ఆధారంగా వారికి అందుబాటులోకి రాగల గోప్యమైన సమాచారాన్ని సేకరించడం, ఉపయోగించడంపై వారికి ఉన్న అదనపు కంట్రోల్స్ గురించి కూడా తెలియజేస్తాము.

* U.S ఆధారిత యూజర్‌ల కోసం డేటా

** కాలిఫోర్నియా నివాసితులుగా తమను తాము గుర్తించుకునే యూజర్‌ల కోసం డేటా

*** 2023లో తిరస్కరించిన ప్రతి రిక్వెస్ట్‌ను, సదరు రిక్వెస్ట్‌ను వెరిఫై చేయడానికి వీలు కాని కారణంగా, లేదా యూజర్ రిక్వెస్ట్‌ను ఉపసంహరించుకోవడం వల్ల తిరస్కరించడం జరిగింది.

Google యాప్‌లు
ప్రధాన మెనూ