గోప్యత & నిబంధనలు
గోప్యత & నిబంధనలు

కుకీలను Google ఎలా ఉపయోగిస్తుంది

ఈ పేజీ Google కుక్కీలను, అలాగే అదే విధమైన టెక్నాలజీలను ఉపయోగించే ప్రయోజనాలను వివరిస్తుంది. Google, ఇంకా మా పార్టనర్‌లు ఏవిధంగా, అడ్వర్టయిజింగ్‌లో కుక్కీలను ఉపయోగిస్తారో కూడా ఇది వివరిస్తుంది.

కుక్కీలు అనేవి మీరు ఏ వెబ్‌సైట్‌కు అయితే వెళ్తారో, ఆ వెబ్‌సైట్ ద్వారా మీ బ్రౌజర్‌కు పంపబడే చిన్న టెక్స్ట్ భాగాలు. ఇవి మీ సందర్శనకు సంబంధించిన సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో వెబ్‌సైట్‌కు సహాయపడతాయి, తద్వారా మీరు మళ్లీ సైట్‌కు వెళ్లడం మరింత సులభతరం అవుతుంది, అలాగే సైట్ మీకు మరింత ఉపయోగకరంగా అవుతుంది. ఒక యాప్ లేదా పరికరాన్ని, పిక్సెల్ ట్యాగ్‌లను, అలాగే లోకల్ స్టోరేజ్‌ను గుర్తించడానికి ఉపయోగించే ప్రత్యేక ఐడెంటిఫయర్‌లతో సహా అదే విధమైన టెక్నాలజీలు, అదే పనిని అమలు చేయగలవు. ఈ పేజీ అంతటా వివరించబడిన కుక్కీలను, అలాగే అదే విధమైన టెక్నాలజీలను కింద వివరించబడిన ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

కుక్కీలను, అలాగే ఇతర సమాచారాన్ని ఉపయోగించడంలో, మీ గోప్యతను మేము ఏ విధంగా సురక్షితంగా ఉంచుతామో తెలుసుకోవడానికి గోప్యతా పాలసీని చూడండి.

Google ఉపయోగించే కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీల ప్రయోజనాలు

కింద వివరించిన ప్రయోజనాల కోసం Google మీ బ్రౌజర్, యాప్ లేదా పరికరంలో కొన్ని లేదా అన్ని కుక్కీలు లేదా అదే విధమైన టెక్నాలజీలను స్టోర్ చేయవచ్చు లేదా ఉపయోగించవచ్చు. నిర్దిష్ట ప్రయోజనాల కోసం కుక్కీల వినియోగాన్ని తిరస్కరించడంతో పాటు కుక్కీలను ఎలా ఉపయోగించాలో మేనేజ్ చేయడానికి, మీరు g.co/privacytools లింక్‌కు వెళ్లవచ్చు. అలాగే, మీరు మీ బ్రౌజర్‌లో కుక్కీలను మేనేజ్ చేయవచ్చు (మొబైల్ పరికరాల్లోని బ్రౌజర్‌లు ఈ విజిబిలిటీని అందించకపోవచ్చు). ఈ టెక్నాలజీలలో కొన్నింటిని మీ పరికర సెట్టింగ్‌లలో లేదా యాప్ సెట్టింగ్‌లలో మేనేజ్ చేయవచ్చు.

ఫంక్షనాలిటీ

కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు సర్వీస్‌కు ప్రాథమికంగా ఉండే ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫంక్షనాలిటీ ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి. Google సర్వీస్‌లను అందించడానికి, అలాగే మేనేజ్ చేయడానికి ఈ కుక్కీలు ఉపయోగించబడతాయి. సర్వీస్‌కు ప్రాథమికంగా పరిగణించబడే అంశాలలో, మీరు ఎంచుకున్న భాష వంటి ఎంపికలు ఇంకా ప్రాధాన్యతలను గుర్తుంచుకోవడం; మీ సెషన్‌కు సంబంధించిన సమాచారాన్ని స్టోర్ చేయడం, అంటే షాపింగ్ కార్ట్‌లోని కంటెంట్ లాంటివి; మీరు రిక్వెస్ట్ చేసిన ఫీచర్‌లను ఎనేబుల్ చేయడం లేదా టాస్క్‌లను అమలు చేయడం; అలాగే సర్వీస్‌ను నిర్వహించడంలోనూ, మెరుగుపరచడంలోనూ సహాయపడే ప్రోడక్ట్ ఆప్టిమైజేషన్‌లు వంటివి ఉంటాయి.

కొన్ని కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు మీ ప్రాధాన్యతలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, Google సర్వీస్‌లను ఉపయోగించే వ్యక్తులలో అత్యధిక శాతం మందికి, వారి కుక్కీల ఎంపికలను బట్టి, వారి బ్రౌజర్‌లలో ‘NID’ లేదా ‘_Secure-ENID’ అనే కుక్కీ ఉంటుంది. మీ ప్రాధాన్యతలతో పాటు మీ ప్రాధాన్య భాష, సెర్చ్ ఫలితాల పేజీలో ఎన్ని ఫలితాలు చూపించాలని కోరుకుంటున్నారు (ఉదాహరణకు, 10 లేదా 20), అలాగే Google SafeSearch ఫిల్టర్ ఆన్‌లో ఉండాలనుకుంటున్నారా లేదా అనేటటువంటి ఇతర సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి ఈ కుక్కీలు ఉపయోగించబడతాయి. యూజర్ చివరిసారి ఉపయోగించిన 6 నెలలకు ప్రతి 'NID' కుక్కీకి గడువు ముగుస్తుంది, అదే ‘_Secure-ENID’ కుక్కీ అయితే 13 నెలల పాటు ఉంటుంది. YouTubeకు సంబంధించి ఇదే ప్రయోజనాన్ని ‘__Secure-YNID’ (ఇది ‘VISITOR_INFO1_LIVE’ కుక్కీని రీప్లేస్ చేస్తుంది), ఇంకా ‘__Secure-YENID’ (ఇది ‘__Secure-YEC’ని రీప్లేస్ చేస్తుంది) అనే కుక్కీలు అందిస్తాయి, అలాగే ఇవి సర్వీస్‌తో ఉండే సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి కూడా ఉపయోగించబడతాయి. ‘VISITOR_INFO1_LIVE’ కుక్కీ 6 నెలల పాటు ఉంటుంది, ‘__Secure-YEC’ కుక్కీ 13 నెలల పాటు ఉంటుంది.

ఇతర కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు నిర్దిష్ట సెషన్‌లో మీ అనుభవాన్ని నిర్వహించి, మెరుగుపరచడానికి ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, మీ ప్రాధాన్య పేజీ కాన్ఫిగరేషన్ సమాచారంతో పాటు ప్రత్యేకమైన ఆటోప్లే ఎంపికలు, కంటెంట్‌ను షఫుల్ చేయడం, అలాగే ప్లేయర్ సైజ్ వంటి ప్లేబ్యాక్ ప్రాధాన్యతల సమాచారాన్ని స్టోర్ చేయడానికి YouTube, ‘PREF’ అనే కుక్కీని ఉపయోగిస్తుంది. YouTube Music విషయానికి వస్తే, ఈ ప్రాధాన్యతలలో వాల్యూమ్, రిపీట్ మోడ్, ఆటోప్లే ఉంటాయి. యూజర్ చివరిసారి ఉపయోగించిన 8 నెలలకు ఈ కుక్కీ గడువు ముగుస్తుంది. ‘pm_sess’ అనే కుక్కీ కూడా మీ బ్రౌజర్ సెషన్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది, ఇది 30 నిమిషాల పాటు ఉంటుంది.

Google సర్వీస్‌ల పనితీరును మెరుగుపరచడానికి కూడా కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు ఉపయోగించబడవచ్చు. ఉదాహరణకు, ‘CGIC’ కుక్కీ సెర్చ్ ఫలితాలను అందించడాన్ని, యూజర్ ప్రారంభ ఇన్‌పుట్ ఆధారంగా సెర్చ్ క్వెరీలను ఆటో-కంప్లీట్ చేయడం ద్వారా మెరుగుపరుస్తుంది. ఈ కుక్కీ 6 నెలల పాటు ఉంటుంది.

Google యూజర్‌ల కుక్కీల ఎంపికలకు సంబంధించి యూజర్ స్థితిని స్టోర్ చేయడానికి 13 నెలల పాటు ఉండే ‘SOCS’ కుక్కీని ఉపయోగిస్తుంది.

భద్రత

మీరు యూజర్‌లను ప్రామాణీకరించడం, స్పామ్, మోసం, అలాగే దుర్వినియోగం నుండి రక్షించడం, ఇంకా అంతరాయాలను ట్రాక్ చేయడం ద్వారా మీరు సర్వీస్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు మిమ్మల్ని రక్షించడానికి సెక్యూరిటీ ప్రయోజనాల కోసం Google కుక్కీలను, ఇంకా అదే విధమైన టెక్నాలజీలను ఉపయోగిస్తుంది.

కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు యూజర్‌లను ప్రామాణీకరించడానికి ఉపయోగించబడతాయి, తద్వారా ఖాతాను దాని అసలు యజమాని మాత్రమే యాక్సెస్ చేయడానికి వీలు కలుగుతుంది. ఉదాహరణకు, ‘SID’ అలాగే ‘HSID’ అనే కుక్కీలలో, యూజర్ Google ఖాతా IDకి చెందిన, డిజిటల్‌గా సంతకం చేసిన, ఎన్‌క్రిప్ట్ చేసిన రికార్డ్‌లు, అలాగే అత్యంత ఇటీవలి సైన్ ఇన్ సమయం ఉంటాయి. ఈ కుక్కీల కలయిక, Google సర్వీస్‌లలో సమర్పించిన ఫారమ్‌లలోని కంటెంట్‌ను దొంగిలించడానికి చేసే ప్రయత్నాల వంటి అనేక రకాల దాడులను బ్లాక్ చేసేందుకు Googleకు వీలు కల్పిస్తుంది. ఈ కుక్కీలు 2 సంవత్సరాల పాటు ఉంటాయి.

కొన్ని కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు స్పామ్, మోసం, ఇంకా దుర్వినియోగాన్ని గుర్తించడానికి ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, ‘pm_sess’ అలాగే ‘YSC’ కుక్కీలు, బ్రౌజింగ్ సెషన్‌లోని రిక్వెస్ట్‌లు ఇతర సైట్‌ల ద్వారా కాకుండా యూజర్ ద్వారా వచ్చేలా చూసుకుంటాయి. యూజర్‌కు తెలియకుండా, వారి తరఫున వ్యవహరించాలని చూసే హానికరమైన సైట్‌లను ఈ కుక్కీలు నిరోధిస్తాయి. ‘pm_sess’ కుక్కీ 30 నిమిషాల పాటు ఉంటుంది, అయితే ‘YSC’ కుక్కీ యూజర్ బ్రౌజింగ్ సెషన్ వ్యవధి పాటు ఉంటుంది. ‘__Secure-YENID,’ అలాగే ‘AEC’ కుక్కీలు స్పామ్, మోసం, ఇంకా దుర్వినియోగాన్ని గుర్తించడానికి ఉపయోగించబడతాయి, తద్వారా యాడ్‌ల విషయంలో మోసపూరిత, లేదంటే చెల్లని ఇంప్రెషన్‌లు లేదా ఇంటరాక్షన్‌లకు సంబంధించి అడ్వర్టయిజర్‌లకు తప్పుగా ఛార్జీ విధించబడకుండా, అలాగే YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లోని YouTube క్రియేటర్‌లకు న్యాయమైన విధంగా రెమ్యూనరేషన్ అందించబడేలా చూసుకోవడంలో సహాయపడతాయి. ‘AEC’ కుక్కీ 6 నెలల పాటు ఉంటుంది, అలాగే ‘__Secure-YENID’, ‘__Secure-YEC’ కుక్కీలు 13 నెలల పాటు ఉంటాయి.

ఎనలిటిక్స్

మీరు నిర్దిష్ట సర్వీస్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతారో అర్థం చేసుకోవడానికి విశ్లేషణాత్మక ప్రయోజనాల కోసం Google కుక్కీలను, ఇంకా అదే విధమైన టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. ఈ కుక్కీలు, ఇంకా అదే విధమైన టెక్నాలజీలు ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్‌ను, సైట్ గణాంకాలను కొలవడానికి మమ్మల్ని అనుమతించే డేటాను సేకరించడంలో సహాయపడతాయి. సర్వీస్‌లను ఎలా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవడానికి, కొత్త సర్వీస్‌లను డెవలప్ చేయడానికి, మెరుగుపరచడానికి మమ్మల్ని అనుమతిస్తూనే, సర్వీస్‌లకు సంబంధించిన కంటెంట్, క్వాలిటీ, ఇంకా ఫీచర్‌లను మెరుగుపరచడానికి ఇది మాకు సహాయపడుతుంది.

సైట్‌లు, అలాగే యాప్‌ల సర్వీస్‌లతో సందర్శకులు ఎలా ఎంగేజ్ అవుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో కొన్ని కుక్కీలు, ఇంకా అదే విధమైన టెక్నాలజీలు ఆ సైట్‌లకు అలాగే యాప్‌లకు సహాయపడతాయి. ఉదాహరణకు, Google Analytics ఒక్కొక్క సందర్శకులను వ్యక్తిగతంగా గుర్తించకుండా Google Analytics సర్వీస్‌ను ఉపయోగించే బిజినెస్‌ల తరఫున సమాచారాన్ని సేకరించడానికి, అలాగే సైట్ వినియోగ గణాంకాలను వారికి రిపోర్ట్ చేయడానికి కొన్ని కుక్కీలను ఉపయోగిస్తుంది. Google Analytics ఉపయోగించే ప్రధాన కుక్కీ అయిన ‘_ga’, ఒక సందర్శకునికి, మరొక సందర్శకునికి మధ్య తేడాను గుర్తించగలిగేలా సర్వీస్‌ను ఎనేబుల్ చేస్తుంది, ఇది 2 సంవత్సరాల పాటు ఉంటుంది. Google సర్వీస్‌లతో సహా, Google Analyticsను అమలు చేసే ఏ సైట్ అయినా ‘_ga’ కుక్కీని ఉపయోగిస్తుంది. ప్రతి ‘_ga’ కుక్కీ కూడా నిర్దిష్ట ప్రాపర్టీకి ప్రత్యేకంగా ఉంటుంది, కాబట్టి సంబంధం లేని వెబ్‌సైట్‌లలో నిర్దిష్ట యూజర్‌ను గానీ లేదా బ్రౌజర్‌ను గానీ ట్రాక్ చేయడానికి దీన్ని ఉపయోగించడం సాధ్యపడదు.

ఎనలిటిక్స్ కోసం, Google సర్వీస్‌లు, Google Searchలో ‘NID’, ‘_Secure-ENID’ కుక్కీలను, అలాగే YouTubeలో ‘__Secure-YNID,’ ‘VISITOR_INFO1_LIVE’, ‘__Secure-YENID,’ ‘__Secure-YEC’ కుక్కీలను కూడా ఉపయోగిస్తాయి. ఎనలిటిక్స్ కోసం, Google మొబైల్ యాప్‌లు, ‘Google వినియోగ ID’ వంటి ప్రత్యేక ఐడెంటిఫయర్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఇతర ఇప్పటికే ఉన్న కుక్కీలు, ఐడెంటిఫయర్‌లను అదే ప్రయోజనం కోసం ఉపయోగించలేనప్పుడు కొత్త ఫీచర్‌లను ప్రారంభించడానికి, సంబంధిత ప్రభావాన్ని కొలవడానికి YouTube `__Secure-ROLLOUT_TOKEN` కుక్కీని ఉపయోగిస్తుంది. ‘__Secure-ROLLOUT_TOKEN’ కుక్కీ 6 నెలల పాటు ఉంటుంది. Google Play యాప్‌లో, మీ సెట్టింగ్‌లను బట్టి, మీరు డౌన్‌లోడ్ చేసిన యాప్‌ల వినియోగాన్ని ట్రాక్ చేయడానికి మీ పరికరంలో తాత్కాలిక లాగ్ ఫైల్ స్టోర్ చేయబడుతుంది. యాప్ వినియోగ సమాచారం Google సర్వర్‌కు అప్‌లోడ్ చేయబడి, మీ Google ఖాతాలో స్టోర్ చేయబడిన తర్వాత లాగ్ ఫైల్ తొలగించబడుతుంది.

వ్యాపార ప్రకటన

యాడ్‌లను అందించడం, రెండరింగ్ చేయడం, ఇంకా యాడ్‌లను వ్యక్తిగతీకరించడం (myadcenter.google.com, ఇంకా adssettings.google.com/partnerads లింక్‌లో మీ ఎంపికలు, సెట్టింగ్‌లను బట్టి) వంటి అడ్వర్టయిజింగ్ ప్రయోజనాల కోసం Google కుక్కీలను, అలాగే ఇలాంటి టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. ఈ కుక్కీలు, యూజర్‌కు యాడ్‌ను ఎన్నిసార్లు చూపబడాలో పరిమితం చేయడానికి, చూడటం ఆపివేయడానికి మీరు ఎంచుకున్న యాడ్‌లను మ్యూట్ చేయడానికి, అలాగే యాడ్‌ల ప్రభావాన్ని డెలివరీ చేయడానికి, అలాగే కొలవడానికి కూడా ఉపయోగించబడతాయి.

సైన్ అవుట్ చేసిన యూజర్‌ల కోసం Google సర్వీస్‌లలో యాడ్‌లను చూపడానికి ‘NID’ కుక్కీని ఉపయోగించవచ్చు. Google Cloud (cloud.google.com) వంటి యాడ్‌లు లేని కొన్ని Google వెబ్‌సైట్‌లు ఈ ప్రయోజనం కోసం NID కుక్కీని ఉపయోగించవు. Google యేతర సైట్‌లలో Google యాడ్‌లను చూపడానికి ‘IDE’, అలాగే ‘id’ కుక్కీలు ఉపయోగించబడతాయి. Android అడ్వర్టయిజింగ్ ID (AdID) వంటి మొబైల్ అడ్వర్టయిజింగ్ IDలు, మీ పరికర సెట్టింగ్‌లను బట్టి, మొబైల్ యాప్‌లలో అదే విధమైన ప్రయోజనం కోసం ఉపయోగించబడతాయి. మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఎనేబుల్ చేసినట్లయితే, మీకు కనిపించే యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి ‘IDE’ కుక్కీ ఉపయోగించబడుతుంది. మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఆఫ్ చేసినట్లయితే, ఈ ప్రాధాన్యతను గుర్తుంచుకోవడానికి ‘id’ కుక్కీ ఉపయోగించబడుతుంది, కాబట్టి మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లు కనిపించవు. 'NID' కుక్కీ గడువు చివరిసారిగా ఉపయోగించినప్పటి నుండి 6 నెలల తర్వాత ముగుస్తుంది. ‘IDE,’ ఇంకా ‘id’ కుక్కీలు ఐరోపా ఆర్థిక మండలి (EEA), స్విట్జర్లాండ్, ఇంకా యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో 13 నెలల పాటు, అలాగే మిగతా అన్ని చోట్లా 24 నెలల పాటు ఉంటాయి.

మీ యాడ్ సెట్టింగ్‌లను బట్టి, YouTube వంటి ఇతర Google సర్వీస్‌లు కూడా వీటిని, అలాగే ఇతర కుక్కీలు, టెక్నాలజీలను ఉపయోగిస్తాయి, ఉదాహరణకు అడ్వర్టయిజింగ్ కోసం ‘__Secure-YNID’, ‘VISITOR_INFO1_LIVE’ కుక్కీలు.

అడ్వర్టయిజింగ్ కోసం ఉపయోగించే కొన్ని కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు Google సర్వీస్‌లను ఉపయోగించడానికి సైన్ ఇన్ చేసే యూజర్‌ల కోసం ఉద్దేశించబడినవి. ఉదాహరణకు, Google యేతర సైట్‌లలో సైన్-ఇన్ చేసిన యూజర్‌ను గుర్తించడానికి ‘DSID’ కుక్కీ ఉపయోగించబడుతుంది, తద్వారా యూజర్ యాడ్‌ల వ్యక్తిగతీకరణ సెట్టింగ్ తదనుగుణంగా పరిగణించబడుతుంది. ‘DSID’ కుక్కీ 2 వారాల పాటు ఉంటుంది.

Google అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా, బిజినెస్‌లు Google సర్వీస్‌లతో పాటు Google కాని సైట్‌లలో కూడా అడ్వర్టయిజ్ చేయవచ్చు. కొన్ని కుక్కీలు థర్డ్-పార్టీ సైట్‌లలో Google యాడ్‌లను చూపించడాన్ని సపోర్ట్ చేస్తాయి, అలాగే మీరు సందర్శించే వెబ్‌సైట్ డొమైన్‌లో సెట్ చేయబడతాయి. ఉదాహరణకు, Google యాడ్‌లను చూపడానికి ‘_gads’ కుక్కీ సైట్‌లను ఎనేబుల్ చేస్తుంది. ‘_gac_’తో ప్రారంభమయ్యే కుక్కీలు Google Analytics నుండి వస్తాయి, అలాగే అవి యూజర్ యాక్టివిటీని, ఇంకా వారి యాడ్ క్యాంపెయిన్‌ల పనితీరును అంచనా వేయడం కోసం అడ్వర్టయిజర్‌ల ద్వారా ఉపయోగించబడతాయి. ‘_gads’ కుక్కీలు 13 నెలలు ఉంటాయి, అలాగే ‘_gac_’ కుక్కీలు 90 రోజులు ఉంటాయి.

Some cookies and similar technologies are used to measure ad and campaign performance and conversion rates for Google ads on a site you visit. For example, cookies that start with ‘_gcl_’ are primarily used to help advertisers determine how many times users who click on their ads end up taking an action on their site, such as making a purchase. Depending on your choices and settings, information collected by these cookies and similar technologies may also be used to personalize ads. ‘_gcl_’ cookies last for 90 days. Similar technologies such as the Advertising ID on Android devices can also be used to measure ad and campaign performance. You can manage your Ad ID settings on your Android device.

అడ్వర్టయిజింగ్ కోసం ఉపయోగించిన కుక్కీల గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ చూడండి.

వ్యక్తిగతీకరణ

వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను చూపడం కోసం కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు ఉపయోగించబడతాయి. ఈ కుక్కీలు g.co/privacytools లింక్‌లో మీ సెట్టింగ్‌లు లేదా మీ యాప్, ఇంకా పరికర సెట్టింగ్‌లను బట్టి వ్యక్తిగతీకరించిన కంటెంట్, ఇంకా ఫీచర్‌లను అందించడం ద్వారా మీ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

వ్యక్తిగతీకరించిన కంటెంట్ అలాగే ఫీచర్‌లలో, మరింత సందర్భోచితమైన ఫలితాలు, సిఫార్సులు, అనుకూలంగా మార్చబడిన YouTube హోమ్ పేజీ, ఇంకా మీ ఆసక్తులకు తగ్గట్టుగా ప్రత్యేకంగా మీ కోసం అందించబడిన యాడ్‌ల వంటివి ఉంటాయి. ఉదాహరణకు ‘VISITOR_INFO1_LIVE’ కుక్కీ YouTubeలో గత వీక్షణలు అలాగే సెర్చ్‌ల ఆధారంగా వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఎనేబుల్ చేయవచ్చు. అలాగే మీరు సెర్చ్ క్వెరీలను టైప్ చేస్తున్నప్పుడు Searchలో వ్యక్తిగతీకరించిన ఆటో-కంప్లీట్ ఫీచర్‌లను ‘NID’ కుక్కీ ఎనేబుల్ చేస్తుంది. ఈ కుక్కీల గడువు చివరిసారిగా ఉపయోగించినప్పటి నుండి 6 నెలల తర్వాత ముగుస్తుంది.

మరొక కుక్కీ అయిన ‘UULE’, Google సర్వర్‌లకు మీ బ్రౌజర్ నుండి ఖచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని పంపుతుంది, తద్వారా Google మీ లొకేషన్‌కు సందర్భోచితంగా ఉండే ఫలితాలను మీకు చూపగలుగుతుంది. ఈ కుక్కీ వినియోగం మీ బ్రౌజర్ సెట్టింగ్‌లపై అలాగే మీ బ్రౌజర్‌కు సంబంధించి లొకేషన్‌ను ఆన్ చేయాలని మీరు ఎంచుకున్నారా, లేదా అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ‘UULE’ కుక్కీ 6 గంటల వరకు ఉంటుంది.

వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించబడే కుక్కీలను, అలాగే అదే విధమైన టెక్నాలజీలను మీరు తిరస్కరించినప్పటికీ, మీకు కనిపించే వ్యక్తిగతీకరించబడని కంటెంట్ ఇంకా ఫీచర్‌లు ఇప్పటికీ మీ లొకేషన్, భాష, పరికర రకం, లేదా మీరు ప్రస్తుతం చూస్తున్న కంటెంట్ వంటి సందర్భోచిత అంశాల ద్వారా ప్రభావితం కావచ్చు.

మీ బ్రౌజర్‌లో కుకీలను నిర్వహించడం

Most browsers allow you to manage how cookies are set and used as you’re browsing, and to clear cookies and browsing data. Also, your browser may have settings letting you manage cookies on a site-by-site basis. For example, Google Chrome’s settings at chrome://settings/cookies allow you to delete existing cookies, allow or block all cookies, and set cookie preferences for websites. Google Chrome also offers Incognito mode, which deletes cookies, site data, and your browsing history from your device when you exit your Incognito session.

మీ యాప్‌లు, పరికరాలలో అదే విధమైన టెక్నాలజీలను మేనేజ్ చేయడం

యాప్ లేదా పరికరాన్ని గుర్తించడానికి ఉపయోగించబడే ప్రత్యేక ఐడెంటిఫయర్‌ల వంటి అదే విధమైన టెక్నాలజీలను ఎలా సెట్ చేసి, ఉపయోగించాలో మేనేజ్ చేసే వీలును, అత్యధిక శాతం మొబైల్ పరికరాలు, ఇంకా అప్లికేషన్‌లు మీకు కల్పిస్తాయి. ఉదాహరణకు, Android పరికరాలలోని అడ్వర్టయిజింగ్ IDని లేదా Appleకు చెందిన అడ్వర్టయిజింగ్ ఐడెంటిఫయర్‌ను మీ పరికర సెట్టింగ్‌లలో మేనేజ్ చేయవచ్చు, అదే యాప్-నిర్దిష్ట ఐడెంటిఫయర్‌ల విషయానికి వస్తే, వాటిని సాధారణంగా ఆ యాప్ సెట్టింగ్‌లలో మేనేజ్ చేయవచ్చు.

కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది(ఫుట్‌నోట్‌లో తెరుచుకుంటుంది)
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Bahasa Melayu
  • Català
  • Čeština
  • Dansk
  • Deutsch
  • Eesti
  • English
  • English (India)
  • English (United Kingdom)
  • Español
  • Español (Latinoamérica)
  • Euskara
  • Filipino
  • Français
  • Français (Canada)
  • Gaeilge
  • Galego
  • Hrvatski
  • Isizulu
  • Íslenska
  • Italiano
  • Kiswahili
  • Latviešu
  • Lietuvių
  • Magyar
  • Malti
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • Română
  • Slovenčina
  • Slovenščina
  • Srpski
  • Suomi
  • Svenska
  • Tiếng Việt
  • Türkçe
  • অসমীয়া
  • Ελληνικά
  • Български
  • ଓଡିଆ
  • Русский
  • Српски
  • Українська
  • ‫עברית‬
  • ‫اردو‬
  • ‫العربية‬
  • ‫فارسی‬
  • አማርኛ
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ગુજરાતી
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • ไทย
  • 한국어
  • 中文 (香港)
  • 中文(简体中文)
  • 中文(繁體中文)
  • 日本語
Google యాప్‌లు
ప్రధాన మెనూ