Chrome, ఇంకా Androidలో ప్రైవసీ శాండ్‌బాక్స్ ఇనీషియేటివ్ ద్వారా ఆన్‌లైన్‌లో వ్యక్తుల గోప్యతను మరింతగా మెరుగుపరిచే మార్గాలను అందించే ఉద్దేశంతో, డిజిటల్ అడ్వర్టయిజింగ్ డెలివరీకి, ఇంకా మెజర్‌మెంట్‌కు సపోర్ట్‌ను అందించడానికి Google అడ్వర్టయిజింగ్ సర్వీస్‌లు కొత్త మార్గాలతో ప్రయోగాలు చేస్తున్నాయి. Chrome లేదా Androidలో సంబంధిత ప్రైవసీ శాండ్‌బాక్స్ సెట్టింగ్‌లు ఎనేబుల్ చేసిన యూజర్‌లు తమ బ్రౌజర్ లేదా మొబైల్ పరికరంలో స్టోర్ చేయబడిన టాపిక్‌లు లేదా సంరక్షించబడిన ఆడియన్స్ డేటా ఆధారంగా Google అడ్వర్టయిజింగ్ సర్వీస్‌ల నుండి సంబంధిత యాడ్‌లను చూడవచ్చు. Google అడ్వర్టయిజింగ్ సర్వీస్‌లు వారి బ్రౌజర్ లేదా మొబైల్ పరికరంలో స్టోర్ చేయబడిన అట్రిబ్యూషన్ రిపోర్టింగ్ డేటాను ఉపయోగించి యాడ్ పనితీరును కూడా కొలవవచ్చు. ప్రైవసీ శాండ్‌బాక్స్‌కు సంబంధించిన మరింత సమాచారం.

Google, మా సేవలను ఉపయోగించే సైట్‌లు లేదా ‌‌యాప్‌ల నుండి సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది

చాలా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లు వాటి కంటెంట్‌ను మెరుగుపరచుకోవడానికి మరియు ఉచితంగా అందించడానికి Google సేవలను ఉపయోగిస్తాయి. వారు మా సేవలను ఏకీకరించినప్పుడు, ఈ సైట్‌లు మరియు యాప్‌లు, Googleతో సమాచారాన్ని షేర్ చేస్తాయి.

ఉదాహరణకు, AdSense వంటి వ్యాపార ప్రకటన సేవలను మరియు Google Analytics వంటి విశ్లేషణ సాధనాలను కూడా ఉపయోగించే లేదా YouTube నుండి వీడియో కంటెంట్‌ను పొందుపరిచే వెబ్‌సైట్‌ను మీరు సందర్శిస్తే, మీ వెబ్ బ్రౌజర్ నిర్దిష్ట సమాచారాన్ని Googleకి ఆటోమేటిక్‌గా పంపుతుంది. దీనిలో మీరు సందర్శిస్తున్న పేజీ యొక్క URL మరియు మీ IP చిరునామా ఉంటాయి. అలాగే, మేము మీ బ్రౌజర్‌లో కుక్కీలను సెట్ చేయవచ్చు లేదా ఇప్పటికే దానిలో ఉన్న కుక్కీలను చదవవచ్చు. Google వ్యాపార ప్రకటన సేవలను ఉపయోగించే యాప్‍‌లు కూడా Googleతో యాప్ పేరు మరియు వ్యాపార ప్రకటన కోసం విశిష్ఠ ఐడెంటిఫైయర్‌ వంటి సమాచారాన్ని షేర్ చేస్తాయి.

మా సేవలను అందించడం, వాటిని నిర్వహించి మెరుగుపరచడం, కొత్త సేవలను అభివృద్ధి చేయడం, ప్రకటన యొక్క ప్రభావాన్ని అంచనా వేయడం, మోసం మరియు దుర్వినియోగం నుండి రక్షణ కల్పించడం మరియు Google మరియు మా భాగస్వాముల యొక్క సైట్‌లలో మీకు కనిపించే కంటెంట్ మరియు ప్రకటనలను వ్యక్తిగతీకరించిడానికి, సైట్‌లు మరియు ‌‌యాప్‌ల ద్వారా షేర్ చేయబడిన సమాచారాన్ని Google ఉపయోగిస్తుంది. మేము ఈ ప్రతి ప్రయోజనాల కోసం డేటాను ఎలా ప్రాసెస్ చేస్తామనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి మా గోప్యతా విధానంను చూడండి మరియు Google ప్రకటనలు, వ్యాపార ప్రకటన సందర్భంలో మీ సమాచారం ఎలా ఉపయోగపడుతుంది మరియు ఎంతకాలం Google ఈ సమాచారాన్ని నిల్వ చేస్తుంది అనే దాని గురించి మా వ్యాపార ప్రకటన పేజీను చూడండి.

మా గోప్యతా పాలసీ, మీ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి Google ఆధారపడే చట్టపరమైన ప్రాతిపదికను వివరిస్తుంది — ఉదాహరణకు, మేము మీ సమాచారాన్ని మీ సమ్మతితో ప్రాసెస్ చేయవచ్చు లేదా మా యూజర్‌ల అవసరాలను తీర్చడానికి, మా సర్వీస్‌లను అందించడం, నిర్వహించడం అలాగే వాటిని మెరుగుపరచడం వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల సాధన కోసం మేము ప్రాసెస్ చేయవచ్చు.

కొన్నిసార్లు, సైట్‌లు, యాప్‌లు మాతో షేర్ చేసిన సమాచారాన్ని మేము ప్రాసెస్ చేసేటప్పుడు, మీ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి Googleను అనుమతించే ముందు, ఆ సైట్‌లు, యాప్‌లు మీ సమ్మతి కోసం అడుగుతాయి. ఉదాహరణకు, ఒక సైట్ సేకరించే సమాచారాన్ని Google ప్రాసెస్ చేయడానికి మీ సమ్మతి కోరుతూ, ఆ సైట్‌లో ఒక బ్యానర్ కనిపించవచ్చు. అలా జరిగినప్పుడు, Google గోప్యతా పాలసీలో వివరించబడిన చట్టపరమైన ప్రాతిపదికకు బదులుగా, ఆ సైట్‌కు లేదా యాప్‌నకు మీరు ఇచ్చిన సమ్మతిలో వివరించబడిన ప్రయోజనాలకు మేము విలువ ఇస్తాము. మీరు మీ సమ్మతిని మార్చాలనుకున్నా లేదా దాన్ని ఉపసంహరించుకోవాలనుకున్నా, అలా చేయాలంటే మీరు సదరు సైట్‌ను లేదా యాప్‌ను సందర్శించాలి.

ప్రకటన వ్యక్తిగతీకరణ

ప్రకటన వ్యక్తిగతీకరణ ఆన్ చేయబడినట్లయితే, మీ ప్రకటనలను మీకు మరింత ఉపయోగకరంగా చేసేందుకు Google మీ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, పర్వతారోహణ బైక్‌లను విక్రయించే వెబ్‌సైట్ Google ప్రకటన సేవలను ఉపయోగించవచ్చు. మీరు ఆ సైట్‌ను సందర్శించిన తర్వాత, Google ద్వారా ప్రకటనలు అందించబడుతున్న వేరొక సైట్‌లో మీరు పర్వతారోహణ బైక్‌లను చూడవచ్చు.

ప్రకటన వ్యక్తిగతీకరణ ఆఫ్ చేయబడినట్లయితే, ప్రకటన ప్రొఫైల్‌ని సృష్టించడానికి లేదా Google మీకు చూపించే ప్రకటనలను వ్యక్తిగతీకరించడానికి Google మీ సమాచారాన్ని సేకరించదు లేదా ఉపయోగించదు. మీరు ఇప్పటికీ ప్రకటనలను చూస్తారు, కాని అవి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ప్రకటనలు ఇప్పటికీ మీరు చూస్తున్న వెబ్‌సైట్ లేదా యాప్ యొక్క అంశం, మీ ప్రస్తుత శోధన పదాలు లేదా మీ సాధారణ స్థానం ఆధారంగా ఉండవచ్చు, కానీ మీ ఆసక్తులు, శోధన చరిత్ర లేదా బ్రౌజింగ్ చరిత్రపై ఆధారంగా ఉండకపోవచ్చు. మీ సమాచారం ఇప్పటికీ పైన పేర్కొన్న వ్యాపార ప్రకటన ప్రభావాన్ని అంచనా వేయడం మరియు మోసం మరియు దుర్వినియోగం నుండి రక్షణ కల్పించడం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడవచ్చు.

Google సేవలను ఉపయోగించే వెబ్‌సైట్ లేదా యాప్‌తో పరస్పర చర్య చేస్తున్నప్పుడు, Googleతో సహా ప్రకటన ప్రదాతల నుండి వ్యక్తిగతీకరించబడిన ప్రకటనలను మీరు చూడాలనుకుంటున్నారో లేదో ఎంచుకోమని మిమ్మల్ని అభ్యర్థించవచ్చు. మీ ఎంపిక ఏదైనా సరే, మీ వ్యక్తిగతీకరణ సెట్టింగ్ ఆఫ్ చేయబడితే లేదా మీ ఖాతా వ్యక్తిగతీకరించిన ప్రకటనలకు అర్హత కలిగి లేకపోతే Google, మీరు చూసే ప్రకటనలను వ్యక్తిగతీకరించదు.

మీ ప్రకటన సెట్టింగ్‌లును సందర్శించడం ద్వారా మీకు ప్రకటనలను చూపించడానికి మేము ఉపయోగించే సమాచారాన్ని మీరు చూడవచ్చు మరియు నియంత్రించవచ్చు.

ఈ సైట్‌లు మరియు యాప్‌లలో Google సేకరించే సమాచారాన్ని మీరు ఎలా నియంత్రించవచ్చు

మీరు Google సేవలను ఉపయోగించే సైట్‌లు మరియు యాప్‌లను సందర్శించినప్పుడు లేదా వాటితో పరస్పర చర్య చేసినప్పుడు మీ పరికరం ద్వారా షేర్ చేయబడే సమాచారాన్ని నియంత్రించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు అందించబడ్డాయి:

  • ప్రకటన సెట్టింగ్‌లు, మీరు Google సేవలలో (Google శోధన లేదా YouTube వంటివి) లేదా Google ప్రకటన సేవలను ఉపయోగించే Google యేతర వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లలో చూసే ప్రకటనలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రకటనలను వ్యక్తిగతీకరించడం, ప్రకటనల వ్యక్తిగతీకరణను నిలిపివేయడం మరియు నిర్దిష్ట ప్రకటనకర్తలను బ్లాక్ చేయడం వంటివి ఎలా చేయాలి అని కూడా మీరు తెలుసుకోవచ్చు.
  • మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి మరియు మీ ఖాతా సెట్టింగ్‌లు ఆధారంగా, మీరు సందర్శించిన సైట్‌లు మరియు యాప్‌ల నుండి మేము సేకరించిన సమాచారంతో పాటు మీరు Google సేవలను ఉపయోగించినప్పుడు సృష్టించబడే డేటాను సమీక్షించడానికి మరియు నియంత్రించడానికి నా కార్యకలాపం మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు తేదీ, అంశం వారీగా బ్రౌజ్ చేయవచ్చు మరియు మీ కార్యకలాపం అంతటినీ లేదా కొంత భాగాన్ని తొలగించవచ్చు.
  • సందర్శకులు వారి సైట్‌లు లేదా యాప్‌లతో ఎలా పరస్పర చర్చ చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి అనేక వెబ్‌సైట్‌లు మరియు యాప్‌‌లు Google Analyticsని ఉపయోగిస్తాయి. మీరు మీ బ్రౌజర్‌లో Analytics ఉపయోగించకూడదని భావిస్తే, మీరు Google Analytics బ్రౌజర్ యాడ్-ఆన్‌ని ఇన్‌స్టాల్ చేయవచ్చు. Google Analytics మరియు గోప్యత గురించి మరింత తెలుసుకోండి.
  • మీ బ్రౌజర్ లేదా ఖాతా చరిత్రలో వెబ్‌పేజీలు మరియు ఫైల్‌లు రికార్డ్ చేయబడకుండా వెబ్‌ని బ్రౌజ్ చేయడానికి (మీరు సైన్ ఇన్ చేయడానికి ఎంచుకుంటే మినహా) Chromeలో అజ్ఞాత మోడ్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మీ అన్ని అజ్ఞాత విండోలు మరియు ట్యాబ్‌లను మూసివేసిన తర్వాత కుక్కీలు తొలగించబడతాయి మరియు మీ బుక్‌మార్క్‌లు మరియు సెట్టింగ్‌లు మీరు తొలగించే వరకు నిల్వ చేయబడతాయి. కుక్కీలు గురించి మరింత తెలుసుకోండి. Chromeలోని అజ్ఞాత మోడ్‌ను లేదా ఇతర ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లను ఉపయోగించడం వల్ల మీరు Google సర్వీస్‌లను ఉపయోగించే వెబ్‌సైట్‌లను సందర్శించినప్పుడు డేటా సేకరణ నిరోధించబడదు, ఇంకా మీరు ఈ బ్రౌజర్‌లను ఉపయోగించి వెబ్‌సైట్‌లను సందర్శించినప్పుడు Google ఇప్పటికీ డేటాను సేకరించవచ్చు.
  • Chromeతో సహా అనేక బ్రౌజర్‌లు మిమ్మల్ని మూడవ పక్షం కుక్కీలను బ్లాక్ చేసేందుకు అనుమతిస్తాయి. మీరు మీ బ్రౌజర్‌లో ఇప్పటికే ఉన్న ఎటువంటి కుక్కీలునైనా తీసివేయవచ్చు. Chromeలో కుక్కీలను నిర్వహించడం గురించి మరింత తెలుసుకోండి.
Google యాప్‌లు
ప్రధాన మెనూ