Google వాయిస్ ఎలా పని చేస్తుంది

Google వాయిస్ మీకు సేవను అందించడం కోసం మీ కాల్ చరిత్ర (కాల్ చేసిన పక్షం యొక్క ఫోన్ నంబర్, కాల్‌ను స్వీకరించిన పక్షం యొక్క ఫోన్ నంబర్, తేదీ, సమయం మరియు కాల్ వ్యవధితో సహా), వాయిస్‌మెయిల్ గ్రీటింగ్(లు), వాయిస్‌మెయిల్ సందేశాలు, క్లుప్త సందేశ సేవ (SMS) సందేశాలు, రికార్డ్ చేయబడిన సంభాషణలు మరియు మీ ఖాతాకు సంబంధించిన ఇతర డేటాను నిల్వ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది మరియు నిర్వహిస్తుంది.

బిల్ విధించగల కాల్‌లకు సంబంధించిన మీ కాల్ చరిత్ర మీ ఖాతాలో కనిపిస్తూ ఉన్నప్పటికీ మీరు మీ Google Voice ఖాతాలో మీ కాల్ చరిత్ర, వాయిస్‌మెయిల్ గ్రీటింగ్(లు), వాయిస్‌మెయిల్ సందేశాలు (ఆడియో మరియు/లేదా లిప్యంతరీకరణ రెండింటినీ), క్లుప్త సందేశ సేవ (SMS) సందేశాలు మరియు రికార్డ్ చేయబడిన సంభాషణలను తొలగించవచ్చు. బిల్లింగ్ లేదా ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం మా సక్రియ సర్వర్‌లలో కొంత సమాచారం తాత్కాలికంగా ఉండవచ్చు మరియు మిగిలిన కాపీలు మా బ్యాకప్ సిస్టమ్‌లలో అలాగే ఉండవచ్చు. వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారం లేని అనామక కాల్ రికార్డ్ సమాచార కాపీలు మా నివేదన మరియు ఆడిటింగ్ అవసరాల కోసం మా సిస్టమ్‌లలో ఉంటాయి.

Google యాప్‌లు
ప్రధాన మెనూ