Google సేవా నిబంధనలు
1. Googleతో మీ సంబంధం
1.1 మీరు ఉపయోగించే Google ఉత్పత్తులు, సాఫ్ట్వేర్, సేవలు మరియు వెబ్ సైట్లు (ఈ పత్రంలోని అన్నింటిని కలిపి "సేవలు"గా ప్రస్తావించబడినవి మరియు మీకు వ్రాత పూర్వక ఒప్పందం ఉన్న Google ద్వారా అందించబడిన వేరే సేవలు మినహాయించి) మీకు మరియు Googleకు మధ్య ఉన్న చట్టపరమైన ఒప్పందం యొక్క నిబంధనలు. “Google” అంటే Google ఇంక్., దాని ప్రధాన వ్యాపార ప్రాంతం 1600 యాంఫీథియేటర్ పార్క్‌వే, మౌంటెయిన్ వ్యూ, CA 94043, యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ఆ ఒప్పందం ఎలా రూపొందించబడింది మరియు దాని నిబంధనలు కొన్ని ఎలా అమర్చబడ్డాయో ఈ పత్రం వివరిస్తుంది.
1.2 మీరు Googleతో వ్రాతపూర్వకంగా అంగీకరించే వరకు, Googleతో ఉన్న మీ ఒప్పందం, ఈ పత్రంలోని నిబంధనలు మరియు షరతులు మీకు ఎల్లప్పుడూ వర్తిస్తాయి. వీటన్నింటిని కలిపి క్రింద "యూనివర్సల్ నిబంధనలు"గా ప్రస్తావించబడ్డాయి.
1.3 మీకు Googleతో ఉన్న ఒప్పందంలో యూనివర్సల్ నిబంధనలతో సహా, సేవలకు వర్తించే అన్ని చట్టపరమైన నోటీసుల నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఇవన్నీ క్రింద "అదనపు నిబంధనలు"గా ప్రస్తావించబడ్డాయి. మీకు ఇవి ఎక్కడ వర్తిస్తాయో అక్కడ చదవడానికి అవి మీకు అందుబాటులో ఉంటాయి.
1.4 యూనివర్సల్ నిబంధనలు మరియు అదనపు నిబంధనలు కలిపి మీకు Googleకు మధ్య చట్టపరమైన ఒప్పందాన్ని మీరు సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఏర్పరుస్తుంది. మీరు వాటిని చదివేందుకు సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం. సమిష్టిగా, ఈ చట్టపరమైన ఒప్పందం "నిబంధనలు"గా క్రింద ప్రస్తావించబడింది.
1.5 అదనపు నిబంధనల్లో మరియు యూనివర్సల్ నిబంధనల్లో ఏదైనా తేడా ఉంటే, ఆ సేవకు సంబంధించి అదనపు నిబంధనలు ప్రాధాన్యత వహిస్తాయి.
2. నిబంధనలను అంగీకరించడం
2.1 మీరు సేవలను ఉపయోగించే ముందు నిబంధనలను అంగీకరించాలి. మీరు నిబంధనలను అంగీకరించకపోతే, సేవలను ఉపయోగించలేరు.
2.2 మీరు వీటి ద్వారా నిబంధనలను అంగీకరించవచ్చు:
(ఎ) ఏ సేవ కోసం అయినా యూజర్ ఇంటర్ఫేస్లో Google ద్వారా మీకు అందుబాటులో ఉన్న”నిబంధనలు” క్లిక్ చేయడం ద్వారా మీరు ఆమోదించడానికి లేదా అంగీకరించడానికి వీలౌతుంది; లేదా
(బి) మీరు సేవలను ఉపయోగించడం ద్వారా కూడా నిబంధనలను ఆమోదించవచ్చును. అలాంటప్పుడు, మీరు ఉపయోగించే సేవల ఆధారంగా నిబంధనలను అంగీకరిస్తున్నట్లు Google పరిగణిస్తుందని మీరు అర్థం చేసుకున్నట్టు, అంగీకరించాలి.
(ఎ) Googleతో ఒప్పందం చేయడానికి మీకు చట్టబద్దంగా ఉండవలసిన వయస్సు లేకపోయినా లేదా (బి) మిమ్మల్ని యునైటెడ్ స్టేట్స్ లేదా మీరు నివసిస్తున్న దేశం లేదా ఇతర దేశాల చట్టాలు మీరు సేవలను ఉపయోగించుకోడానికి మీకు అనుమతి ఇవ్వకపోతే, మీరు సేవలను ఉపయోగించలేరు మరియు నిబంధనలను అంగీకరించలేరు.
2.4 మీరు కొనసాగించే ముందు, మీ రికార్టు కోసం యూనివర్సల్ నిబంధన కాపీ యొక్క ప్రింట్ తీసుకోండి లేదా ఒక లోకల్ కాపీని సేవ్ చేసుకోండి.
3. నిబంధనల యొక్క భాష
3.1 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్అనువాదాన్ని కూడా Google మీకు అదనంగా అందిస్తుంది. ఆ అనువాదం కేవలం మీ అనుకూలత కోసమే అందించబడుతుంది. నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్లు మాత్రమే మీకు Googleతో ఉన్న సంబంధానికి వర్తిస్తాయని మీరు అంగీకరిస్తున్నారు.
3.2 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్ మరియు అనువాదం మధ్య తేడాలు ఉన్నట్లయితే, ఇంగ్లీష్ భాషా వెర్షన్‌కే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
4. Google ద్వారా సిద్ధంగా ఉన్న సేవలు
4.1 ప్రపంచవ్యాప్తంగా Google (“సహయోగ సంస్థలు మరియు ఉప సంస్థలు”) సహయోగ మరియు చట్టపరమైన ఉప సంస్థలను కలిగి ఉంది. కొన్ని సందర్భాల్లో, Google తరపున ఈ సంస్థలే సేవలను అందిస్తాయి. మీకు సేవలను అందించడానికి సహయోగ సంస్థలు మరియు ఉప సంస్థలు హక్కు కలిగి ఉంటాయని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
4.2 Google దాని యూజర్లకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి తరచుగా క్రొత్త మార్పులు చేస్తోంది. Google అందిస్తున్న సేవల స్వరూపము మరియు స్వభావం మీకు తెలియజేయకుండా క్రొత్త మార్పులను చేయవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
4.3 నిరంతరంగా కొనసాగే ఈ క్రొత్త మార్పులను చేర్చే భాగంగా, మీకు లేదా యూజర్లకు సాధారణంగా తన స్వంత అభీష్టానుసారం అందించే సేవలను (లేదా సేవల్లోని ఏదైనా అంశాలను) Google మీకు ముందస్తుగా తెలియజేయకుండానే (శాశ్వతంగా లేదా తాత్కాలికంగా) ఆపివేయవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. మీరు ఈ సేవలను ఏ సమయంలో అయినా ఉపయోగించడం ఆపివేయవచ్చు. మీరు సేవలను ఉపయోగించడాన్ని ఆపుతున్నట్లు Googleకు మీరు ప్రత్యేకంగా తెలియచేయనవసరం లేదు.
4.4 ఒకవేళ మీ ఖాతాకు యాక్సెస్‌ను Google నిలిపివేసినట్లయితే, సేవలను యాక్సెస్ చెయ్యడం నుంచి మీరు నిరోధించబడితే, మీ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఫైళ్లు లేక మీ ఖాతాలో ఉన్న ఇతర విషయాలను యాక్సెస్ చెయ్యడం నుంచి నిరోధించబడతారని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
4.5 Google ప్రస్తుతం తమ సేవల ద్వారా ఉపయోగించబడిన నిల్వ స్థలం మరియు మీరు పంపిన లేక అందుకున్న ట్రాన్స్మిషన్ల సంఖ్య యొక్క నిర్దిష్ట గరిష్ఠ పరిమితిని ఇప్పటి వరకు పెట్టనప్పటికి, అటువంటి నిర్దిష్ట గరిష్ఠ పరిమితులను Google యొక్క అభీష్టానుసారం Google ఏ సమయంలోనైనా రూపొందించవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
5. మీరు ఉపయోగించే సేవలు
5.1 మీరు కొన్ని సేవలను యాక్సెస్ చెయ్యడానికి, సేవ కోసం చేసే నమోదు ప్రాసెస్‌లో భాగంగా లేదా మీరు సేవలను నిరంతరంగా ఉపయోగించే భాగంగా మీ గురించిన కొంత సమాచారాన్ని (గుర్తింపు లేదా సంప్రదింపు వివరాలు వంటివి) అందించాల్సి ఉంటుంది. మీరు Googleకు అందించే ఏ నమోదు సమాచారం అయినా ఎల్లప్పుడు, స్పష్టంగా, తప్పులేనిది మరియు తాజాగా ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు.
5.2 మీరు అనుమతించబడిన సేవలను కేవలం (ఎ) నిబంధనలు మరియు (బి) వర్తించే చట్టం, రెగ్యులేషన్ లేదా సాధారణంగా ఆమోదించబడే అభ్యాసాలు లేదా సంబంధిత చట్టాల్లోని మార్గదర్శకాలు (యునైటెడ్ స్టేట్స్ లేదా ఇతర సంబంధిత దేశాల నుంచి డేటా లేదా సాఫ్ట్వేర్ ఎగుమతికి సంబంధించిన ఏదైనా చట్టాలతో సహా) కోసం ఉపయోగిస్తారని మీరు అంగీకరిస్తున్నారు.
5.3 మీరు Google అందచేసిన ఇంటర్ఫేస్ ద్వారా కాకుండా మరే ఇతర సాధనాలతోనూ ఏ సేవలను యాక్సెస్ చేయరని (లేదా యాక్సెస్‌కు ప్రయత్నించరని) అంగీకరిస్తున్నారు. Googleతో విడి ఒప్పందంలో మీరు ప్రత్యేకంగా అనుమతించబడి ఉంటే తప్ప, అటువంటి యాక్సెస్ కోసం మీరు ప్రయత్నించరని అంగీకరిస్తున్నారు. మీరు ఆటోమేటిక్ సాధనాల ద్వారా (స్క్రిప్ట్స్ లేదా వెబ్ క్రాలర్స్తో సహా) ఏ సేవలను యాక్సెస్ చేయరని (లేదా యాక్సెస్చేయడానికి ప్రయత్నించరని) మీరు ప్రత్యేకించి అంగీకరిస్తున్నారు మరియు సేవలలో కనిపించిన robots.txt ఫైల్లో పొందుపర్చిన ఆదేశాలకు లోబడి ఉంటారని మీరు హామీ ఇస్తున్నారు.
5.4 మీరు సేవలలో (లేదా సేవలకు కనెక్ట్ చేయబడిన సర్వర్లు మరియు నెట్‌వర్క్‌లలో) జోక్యం చేసుకునే లేక అంతరాయం కలిగించే ఏ కార్యాచరణలోనూ పాలుపంచుకోరని అంగీకరిస్తున్నారు.
5.5 మీకు Google తో ప్రత్యేకించి విడిగా ఒప్పందం ఉంటే తప్ప, ఈ సేవలను మీరు ఏ ప్రయోజనం కోసమైనా సరే పునరుత్పత్తికి, నకలు, కాపీ, విక్రయించడం, వ్యాపారం లేదా పునఃవిక్రయం వంటివి చెయ్యడానికి పాల్పడరని మీరు అంగీకరిస్తున్నారు./p>
5.6 నిబంధనలలోని ఏ అనివార్య అంశాలనైనా మీరు ఉల్లంఘించిన పక్షంలో (Google మీకు లేక మూడవ పార్టీకి బాధ్యత వహించదని) మరియు అలాంటి ఉల్లంఘన కారణంగా ఎదురయ్యే ఫలితాలకు (Googleకు అసౌకర్యం కలిగించే విధంగా నష్టం, హానితో సహా) మీరే పూర్తి బాధ్యత వహిస్తున్నారని అంగీకరిస్తున్నారు.
6.మీ పాస్వర్డ్లు మరియు ఖాతా రక్షణ
6.1 మీరు సేవలను యాక్సెస్ చెయ్యడానికి ఉపయోగించే పాస్‌వర్డ్‌ల గోప్యతకు మీరే బాధ్యత వహిస్తున్నారని గమనించి, అంగీకరిస్తున్నారు.
6.2 అదే విధంగా, మీ ఖాతా ద్వారా చేసే అన్ని చర్యలకై Googleకు మీరు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అంగీకరిస్తున్నారు.
మీ పాస్వర్డ్ లేదా మీ ఖాతాను ఎవరైనా అనధికారంగా ఉపయోగిస్తున్నట్లు మీకు తెలిస్తే, తక్షణమే మీరు Googleకు http://www.google.com/support/accounts/bin/answer.py?answer=58585. కు తెలియజేస్తారని మీరు అంగీకరిస్తున్నారు.
7. గోప్యత మరియు మీ వ్యక్తిగత సమాచారం
7.1 Google యొక్క డేటా రక్షణ అభ్యాసాల గురించిన సమాచారానికి, Google యొక్క గోప్యత విధానాన్ని http://www.google.com/privacy.html. వద్ద చదవండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని Google ఎలా పరిగణిస్తుందని ఈ విధానం వివరిస్తుంది మరియు మీరు సేవలను ఉపయోగించేటప్పుడు మీ గోప్యతను రక్షిస్తుంది.
7.2 Google యొక్క గోప్యత విధానాలకు అనుగుణంగా మీరు మీ డేటాను ఉపయోగిస్తారని అంగీకరిస్తున్నారు.
8. సేవల్లో ఉన్న కంటెంట్
8.1 మీరు ఉపయోగిస్తున్న సేవల్లో మీరు యాక్సెస్ చేసే మొత్తం సమాచారానికి (డేటా ఫైళ్లు, వ్రాత టెక్ట్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, సంగీతం, ఆడియో ఫైళ్లు లేదా ఇతర ధ్వనులు, ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు లేదా ఇతర చిత్రాలు వంటివి) కంటెంట్‌ని తయారు చేసిన వ్యక్తిదే పూర్తి బాధ్యత అని మీకు అర్ధమైందని మీరు అంగీకరిస్తున్నారు. ఇటువంటి సమాచారం “కంటెంట్” పేరుతో క్రింద ప్రస్తావించబడింది.
8.2 సేవలలోని ప్రకటనలకు, సేవలలోని ప్రాయోజిత కంటెంట్‌కు పరిమితం కాకుండా సేవలలో భాగంగా మీకు సమర్పించిన విషయం Googleకు (లేదా ఇతర వ్యక్తులు లేదా వారి తరపు వ్యక్తుల ద్వారా) ఆ కంటెంట్‌ని అందించిన ప్రాయోజకులు లేక ప్రకటనకర్తలకు స్వంతమైన మేధోసంపత్తి హక్కులచే రక్షించబడి ఉండవచ్చని మీరు గుర్తుంచుకోవాలి. Google లేదా ఈ కంటెంట్ యజమానులు ఏదైనా విడి ఒప్పందంలో మీకు ప్రత్యేకించి చెప్పి ఉంటే తప్ప, ఈ కంటెంట్‌ని (మొత్తం లేదా భాగమైనా) ఆధారపడి వ్యుత్పన్నమైన పనులను మీరు సవరించడం, అద్దె, లీజ్, లోన్ ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం లేదా సృష్టించడం వంటివి చేయలేరుా.
8.3 ఏ సేవ నుంచి అయినా లేదా మొత్తం కంటెంట్‌ని ముందస్తుగా స్క్రీన్ చేయడం, సమీక్ష, ఫ్లాగ్, ఫిల్టర్, సవరించడం లేదా తొలగించడం వంటివి చెయ్యడానికి Google తన హక్కును నిలిపి వుంచుకుంటుంది (అయితే ఇది తప్పనిసరి నియమం కాదు). కొన్ని సేవలకు సంబంధించి, అభ్యంతరమైన లైంగిక విషయాన్ని ఫిల్టర్ చెయ్యడానికి Google ఉపకరణాలను అందించవచ్చు. సురక్షిత శోధనా ప్రాధాన్యత సెట్టింగులు కూడా ఈ ఉపకరణాలలో ఉండవచ్చు (http://www.google.com/help/customize.html#safe చూడండి). అదనంగా, మీరు అభ్యంతరమైనదిగా కనుగొన్న కంటెంట్‌ని యాక్సెస్ పరిమితం చేయడానికి బజారులో ఎన్నో సేవలు మరియు సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి.
9.యాజమాన్య హక్కులు
9.1 మీరు Google సేవలలో ఉన్న మేధోసంపత్తి హక్కులతో (ఆ హక్కులు నమోదు చేయబడి ఉన్నా లేకున్నా మరియు ప్రపంచంలో ఈ హక్కులు ఎక్కడ ఉనికిలో ఉన్నా) మరియు ఆ సేవలకు సంబంధించిన అన్ని చట్టపరమైన హక్కులను, టైటిల్ మరియు వడ్డీలతో సహా Google (లేదా Google లైసెన్సర్లు) యాజమాన్యం కలిగి ఉంటారని మీరు గుర్తించి అంగీకరిస్తున్నారు. మీరు ఇంకా Google ద్వారా విశ్వసనీయమైనదిగా గుర్తించబడిన సమాచారం ఈ సేవలలో ఉండవచ్చని మరియు Google యొక్క వ్రాత పూర్వక అనుమతి లేకుండా అలాంటి సమాచారాన్ని మీరు బహిరంగపరచరని కూడా మీరు అంగీకరిస్తున్నారు.
9.2 మీరు Googleకు వ్రాతపూర్వకంగా మీ అంగీకారం తెలిపి ఉంటే తప్ప, Google వ్యాపార పేర్లు, వ్యాపార గుర్తులు, సేవా గుర్తులు, లోగోలు, డొమైన్ పేర్లు మరియు ఇతర విలక్షణమైన బ్రాండ్ ఫీచర్లను ఉపయోగించేందుకు ఈ నిబంధనలు మీకు హక్కు ఇవ్వవు.
9.3 మీకు బ్రాండ్ ఫీచర్లలో వేటినైనా ఉపయోగించడానికైన ప్రత్యేక హక్కు Google ఒప్పందంలోని భాగంగా ఉన్నట్లయితే, అటువంటి ఫీచర్లను మీరు ఉపయోగించడానికి మీరు ఆ ఒప్పందానికి, నిబంధనల యొక్క వర్తించదగిన నియమాలకు కట్టుబడి ఉంటారని మీరు అంగీకరిస్తున్నారు. Google బ్రాండ్ ఫీచర్ల మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చెయ్యబడతాయి. అవి ఆన్లైన్లో లో (లేదా ఎప్పటికప్పుడు ఇందుకోసం Google అందించే మరొక URLలో) మీరు చూడవచ్చు.
9.4 Google సెక్షన్ 11లో పొందుపర్చిన పరిమిత లైసెన్స్ మాత్రమే కాకుండా ఇతర సందర్భాల్లో, ఈ క్రింది నిబంధనలను మరియు మీరు సమర్పించిన, పోస్ట్ చేసిన లేదా ప్రదర్శిస్తున్న కంటెంట్‌లో మరియు మేధోసంపత్తి హక్కులతో సహా సేవల ద్వారా (ఆ హక్కులు నమోదు చెయ్యబడి ఉన్నా లేకున్నా మరియు ప్రపంచంలో ఈ హక్కులు ఎక్కడ ఉనికిలో ఉన్నా) మీ నుండి (లేదా మీ లైసెన్సర్ల నుండి) ఏ హక్కును, టైటిల్‌ను లేక వడ్డీని పొందలేనని Google తెలియజేసి అంగీకరిస్తుంది. మీరు Googleకు వ్రాతపూర్వకంగా ఆమోదం తెలిపి ఉంటే తప్ప, ఆ హక్కులను రక్షించడంలో మరియు అమలు చేయడంలో మీదే బాధ్యత అని మరియు మీ తరపున Google బాధ్యత వహించబోదని మీరు అంగీకరిస్తున్నారు.
9.5 మీరు సేవల్లోని కంటెంట్‌ని లేదా చేర్చిన విషయాన్ని (కాపీరైట్ మరియు వ్యాపార గుర్తు ఉన్న నోటీసులతో సహా) ఏదైనా యాజమాన్య హక్కుల నోటీసులను సవరించడం, తొలగించడం లేదా మరగుపర్చడం చేయరని మీరు అంగీకరిస్తున్నారు.
9.6 అలా చెయ్యడానికి వ్రాతపూర్వకంగా Googleచే ప్రత్యేకంగా మీరు అధికారం పొంది ఉంటే తప్ప, సేవలను ఉపయోగించుకోవడంలో, అటువంటి గుర్తులు, పేర్లు లేదా లోగోల యజమాని లేదా అధీకృత వినియోగదారు గురించి గందరగోళం తలెత్తే రీతిలో మీరు ఏ వ్యాపార గుర్తులు, సేవా గుర్తు, వ్యాపార పేర్లు, ఏదైనా కంపెనీ లేదా సంస్థ యొక్క లోగోను ఉపయోగించబోనని మీరు అంగీకరిస్తున్నారు.
10. Google నుంచి లైసెన్స్
10.1 Google మీకు దాని సేవల్లోని భాగంగా వ్యక్తిగత, ప్రపంచవ్యాప్త, రాయల్టీ రహిత, కేటాయించలేని మరియు మినహాయింపు లేని లైసెన్స్‌ను (క్రింద ఉన్న "సాఫ్ట్వేర్" లాగ ప్రస్తావించబడిన) Google సాఫ్ట్‌వేర్‌ను మీరు ఉపయోగించడానికి మీకు అందిస్తుంది. నిబంధనల ద్వారా అనుమతించబడిన, Google ద్వారా అందించబడిన సేవలను మీరు ఉపయోగించుకోవడానికి మరియు వాటి ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఈ లైసెన్స్ ఉపయోగపడుతుంది.
10.2 మీకు చట్టం ద్వారా వ్రాతపూర్వక అనుమతి Google నుంచి ఉంటే తప్ప, మీరు ఏ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్‌ను లేదా దానిలోని ఏ భాగాన్ని అయినా సరే రివర్స్ ఇంజనీరింగ్ద్వారా డికంపైల్ చెయ్యలేరు, కాపీ చెయ్యలేరు, సవరించలేరు (మరియు ఇతరులకు అలాంటి అనుమతిని ఇవ్వలేరు).
10.3 దీనిని చెయ్యడానికి మీకు నిర్దిష్టమైన వ్రాత పూర్వక అనుమతిని Google అందింస్తే తప్ప, మీరు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి ఉన్నమీ హక్కులను (లేదా ఉప లైసెన్స్‌ను) మీరు ఎవ్వరికి కేటాయించలేరు మరియు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి మీ భద్రత లేదా హక్కులను మంజూరు చెయ్యలేరు మరియు మీ హక్కుల్లోని ఏ భాగాన్ని అయినా బదిలీ చెయ్యలేరు.
11. మీ నుంచి కంటెంట్ లైసెన్స్
11.1 మీరు సేవల ద్వారా దాఖలు చేసిన, పోస్ట్ చేసిన లేదా ప్రదర్శించిన కంటెంట్‌పై కాపీరైట్ మరియు ఇతర హక్కులను కలిగి ఉంటారు. కంటెంట్‌ని దాఖలు చెయ్యడం, పోస్ట్ చెయ్యడం లేదా ప్రదర్శించడం ద్వారా Googleకు సేవల ద్వారా మీరు దాఖలు చేసిన, పోస్ట్ చేసిన లేదా ప్రదర్శించిన ఏ కంటెంట్‌ని Google పునరుత్పత్తి చెయ్యడానికి, స్వీకరించడానికి, సవరించడానికి, అనువదించడానికి, ప్రచురించడానికి, బహిరంగంగా నిర్వహించడానికి, బహిరంగంగా ప్రదర్శించడానికి, పంపిణీ చెయ్యడానికి శాశ్వతమైన, రద్దు చెయ్యలేని, ప్రపంచవ్యాప్తమైన, రాయితీ-లేని మరియు మినహాయింపు లేని లైసెన్స్‌ను మీరు ఇస్తున్నారు. సేవలను ప్రదర్శించడానికి, పంపిణీ చెయ్యడానికి లేదా ప్రోత్సహించడానికి మరియు ఆ సేవల అదనపు నిబంధనలలో నిర్వచించిన కొన్ని సేవలను రద్దు చెయ్యడానికి Googleకు వీలు కల్పించడమే ఈ లైసెన్స్ యొక్క ఏకైక ఉద్దేశ్యము.
11.2 మీరు Googleకి దాఖలు చేసిన కంటెంట్‌ని Google తనతో సంబంధాలను కలిగివున్న ఇతర కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులకు ఇలాంటి కంటెంట్‌ని అందుబాటులో ఉంచడానికి మరియు ఆ సేవల నిబంధనతో ముడిపడివున్న అలాంటి కంటెంట్‌ని ఉపయోగించుకోవడానికి ఈ లైసెన్స్ హక్కుని ఇస్తుందని మీరు అంగీకరిస్తున్నారు.
11.3 మా యూజర్లకు సేవలను అందించేందుకై అవసరమైన సాంకేతిక చర్యలను నిర్పహించే క్రమంలో Google (ఎ) వివిధ పబ్లిక్ నెట్‌వర్క్‌లు మరియు వివిధ మీడియాలకు మీ కంటెంట్‌ని బదిలీ చేయవచ్చునని లేదా పంపిణీ చేయవచ్చని; మరియు (b) కనెక్ట్ చేస్తున్న నెట్‌వర్క్‌లు, పరికరాలు, సేవలు లేదా మీడియా యొక్క సాంకేతిక అవసరాలకు గాను మీ యొక్క కంటెంట్‌లో మార్పులు చేయడానికి హక్కు ఉందని మీరు అర్థం చేసుకున్నారు. ఈ చర్యలను చేపట్టేందుకై ఈ లైసెన్స్ Googleకు అనుమతిస్తుందని మీరు అంగీకరిస్తున్నారు.
11.4 పై లైసెన్స్‌ను Googleకు మంజూరు చెయ్యడానికి అవసరమైన అన్ని హక్కులు, శక్తి మరియు అధికారం మీకు ఉన్నాయని మీరు Googleకు నిర్థారించి మరియు పూచీ ఇస్తున్నారు.
12. సాఫ్ట్వేర్ అప్డేట్లు
12.1 మీరు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ Google నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లను ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ చెయ్యవచ్చు మరియు ఇన్స్టాల్ చెయ్యవచ్చు. ఈ అప్డేట్లు సేవలను మెరుగుపర్చడానికి, ఎన్హేన్స్ చెయ్యడానికి మరియు మరింతగా అభివృద్ధి పర్చడానికి రూపొందించబడినవి మరియు ఇవి బగ్ పరిష్కరణలు, ఎన్‌హేన్స్‌డ్ చర్యలు, క్రొత్త సాఫ్ట్వేర్ మాడ్యూళ్లు మరియు పూర్తిగా క్రొత్త వెర్షన్ల రూపం తీసుకోవచ్చు. సేవలను ఉపయోగించుకోవడంలో భాగంగా అటువంటి అప్డేట్లను అందుకోవడానికి (మరియు వాటిని Google మీకు అందచేయడానికి) అనుమతిస్తున్నట్లు మీరు అంగీకరిస్తున్నారు.
13. Googleతో మీ సంబంధాన్ని ముగించడం
13.1 క్రింద సృష్టించిన నిబంధనలు మీకు లేదా Google మధ్య గల సంబంధాన్ని ఆపు చేసే వరకు వర్తిస్తాయి.
13.2 Googleతో ఉన్న మీ చట్టపరమైన ఒప్పందాన్ని ముగించాలని భావిస్తే, (ఎ) ఏ సమయంలో అయినా Googleకు తెలియపర్చడం, (బి) ఈ ఎంపికను Google మీకు అందుబాటులో ఉంచిన చోట, మీరు ఉపయోగిస్తున్న అన్ని సేవలకు ఖాతాలను మూసివేయడం ద్వారా మీరు ముగించవచ్చు. ఈ నిబంధనల ప్రారంభంలో ఉంచిన Google చిరునామాకు మీ గమనికను వ్రాతపూర్వకంగా పంపించాలి.
13.3 Google మీతో కుదుర్చుకున్న చట్టపరమైన ఒప్పందాన్ని, ఈ క్రింది పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా ముగించవచ్చు:
(ఎ) మీరు నిబంధనలలో ఏ నియమాన్ని అయినా ఉల్లంఘించిన పక్షంలో (లేదా నిబంధనలకు అనుగుణంగా మీరు వ్యవహరించలేకపోయినప్పుడు లేదా మీరు నిబంధనలను పాటించలేకపోయిన పక్షంలో); లేదా
(బి) చట్టప్రకారం Google అలా చర్యలు చేపట్టాల్సిన సందర్భంలో (ఉదాహరణకు, మీ సేవల నియమం చట్టవ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదా మారినప్పుడు); లేదా
(సి) మీకు సేవలను అందించేందుకు Google కుదుర్చుకున్న భాగస్వామి Googleతో తన సంబంధాన్ని రద్దుచేసినప్పుడు లేదా మీకు సేవలను అందించే ప్రతిపాదనను నిలిపివేసినప్పుడు; లేదా
(డి) మీరు నివసిస్తున్న లేదా సేవలను ఉపయోగించుకుంటున్న దేశంలోని యూజర్లకు సేవలను ఇకపై అందించకూడదని Google తన వైఖరిని మార్చుకుంటున్నప్పుడు; లేదా
(ఇ) Google యొక్క అభిప్రాయం ప్రకారం మీకు Google ద్వారా అందుతున్న సేవల నియమం వాణిజ్యపరంగా లాభదాయకం కానప్పుడు.
13.4 నిబంధనలలోని 4వ సెక్షన్‌లోని సేవల నియమానికి సంబంధించిన Google హక్కులను ఈ సెక్షన్ ఏ మాత్రం ప్రభావితం చేయదు.
13.5 ఈ నిబంధనలు ముగిసిపోయినప్పుడు, మీరు మరియు Google పొందుతున్న చట్టపరమైన హక్కులు, విధులు, బాధ్యతలు (లేదా నిబంధనలు అమల్లో ఉన్న కాలంలో దఖలుపడినవి) లేదా నిరవధికంగా కొనసాగించబడేవి, ఈ ముగింపు ప్రభావానికి గురికావు మరియు 20.7 పేరాలోని నియమాలు అలాంటి హక్కులు, విధులు మరియు బాధ్యతలకు నిరవధికంగా వర్తిస్తాయి.
14. వారంటీల మినహాయింపు
14.1 సెక్షన్ 14 మరియు 15తో సహా ఈ నిబంధనలలో ఏవీ Google యొక్క వారంటీని, బాధ్యతను వర్తింపదగిన చట్టం ద్వారా చట్టపర మినహాయింపు లేదా పరిమితిని పొందని నష్టాలకు మినహాయించలేవు. అటువంటి వారంటీలను లేదా షరతుల యొక్క మినహాయింపును లేక నిర్లక్ష్యం, ప్రవర్తనా ఉల్లంఘన ద్వారా నష్టం లేదా పరోక్ష నిబంధనల ఉల్లంఘన లేక ప్రధాన, అప్రధాన నష్టాలకు బాధ్యతా పరిమితి లేదా మినహాయింపును కొన్ని చట్టాలు అనుమతించవు. దీనికి అనుగుణంగా, మీ న్యాయపరిధిలో న్యాయసమ్మతమైన పరిమితులు మాత్రమే మీకు వర్తిస్తాయి మరియు మా బాధ్యత చట్టం అనుమతించిన గరిష్ట పరిధికే పరిమితమవుతుంది.
14.2 మీ పూర్తి బాధ్యతతోనే ఈ సేవలను మీరు ఉపయోగించుకోవడం జరుగుతుందని మరియు సేవలు “యధాతథం”గాను మరియు “లభ్యతను బట్టే” అందించబడతాయని మీరు స్పష్టంగా అర్ధం చేసుకుని అంగీకరిస్తున్నారు.
14.3 ప్రత్యేకంగా, GOOGLE, దాని అనుబంధ సంస్థలు మరియు సహసంస్థలు, దాని లైసెన్సర్లు ఈ క్రింది అంశాలకు మీకు పూచీ ఇవ్వవు:
(ఎ) మీరు ఉపయోగించే ఈ సేవలు మీ అవసరాలనన్నింటినీ తీరుస్తాయని,
(బి) మీరు ఉపయోగించే ఈ సేవలు మీకు నిరంతరాయంగా, సకాలంలో, సురక్షితంగా లేదా లోపరహితంగా ఉపయోగపడతాయని,
(సి) మీరు ఉపయోగించే ఈ సేవల ద్వారా మీరు పొందిన సమాచారం నిర్దిష్టంగా మరియు నమ్మదగిందిగా ఉంటుందని
(డి) మీరు ఉపయోగించే ఈ సేవలలో భాగంగా మీకు అందించిన ఏదైనా సాఫ్ట్వేర్ యొక్క ఆపరేషన్ లేదా చర్యలోని లోపాలు సరిదిద్దబడవని.
14.4 మీరు సేవల ఉపయోగం ద్వారా డౌన్లోడ్ చేసిన లేదా ఇతరత్రా సంగ్రహించిన ఏ సామగ్రి అయినా మీ సొంత విచక్షణ మరియు బాధ్యత ఆధారంగానే జరుగుతుందని మరియు అటువంటి సామగ్రిని డౌన్లోడ్ చేసిన ఫలితంగా మీ కంప్యూటర్‌కి లేదా మరొక పరికరానికి జరిగిన నష్టం మరియు డేటా నష్టానికి మీరే పూర్తి బాధ్యత వహిస్తున్నారు.
14.5 GOOGLE నుంచి లేదా సేవ ద్వారా పొందిన మౌఖిక లేక వ్రాతపూర్వక సందేశం లేదా సమాచారం, నిబంధనలలో బహిరంగంగా ప్రకటించని ఎలాంటి వారంటీని సృష్టించదు.
14.6 Google ఏవైనా ప్రత్యక్ష లేక పరోక్ష వారంటీలు సహా, నిర్దిష్ట ప్రయోజనానికి తగిన విధంగా ఉన్న మరియు మార్కెట్లోకి తేవడానికి వీలైన పరోక్ష వారంటీలను షరతులను GOOGLE బహిరంగంగా భాధ్యత నిరాకరిస్తోంది.
15. చట్టపరమైన బాధ్యతల పరిమితి
15.1 పై 14.1 పేరాలోని నియమం మొత్తానికి సంబంధించి, GOOGLE, దాని అనుబంధ సంస్థలు మరియు దాని లైసెన్సర్లు మీకు ఈ క్రింది అంశాలలో బాధ్యత వహించరు:
(ఎ) ఎటువంటి చట్టపరమైన బాధ్యతా సిద్ధాంతం కారణంగా అయినా సరే మీవల్ల జరిగిన ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష, అప్రధాన, ప్రత్యేక సాధారణ లేక అసాధారణ నష్టాలు. ఏదైనా రాబడి నష్టానికి పరిమితం కాకుండా (ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పొందినది) వ్యాపార ప్రతిష్టకు, గుడ్‌విల్‌కి జరిగిన నష్టం, డేటా నష్టం, ప్రత్యామ్నాయ సరుకులు లేదా సేవల సేకరణ ఖర్చులు లేదా తెలియని ఇతర నష్టాలు;
(బి) ఈ క్రింద పేర్కొన్న వాటి ఫలితంగా జరిగిన నష్టానికి పరిమితం కాకుండా, మీ ద్వారా జరిగిన నష్టం:
(I) ఈ సేవలలో ప్రకటనలు కనిపించే ప్రకటనల యొక్క సంపూర్తత, నిర్దిష్టత లేదా ఉనికికి సంబంధించి మిమ్మల్ని నమ్మిన ప్రకటనదారునికి లేదా ప్రాయోజకుడికి మీకు మధ్య ఏదైనా సంబంధం లేక వ్యవహారం ఫలితంగా జరిగిన నష్టం;
(II) సేవల విషయంలో GOOGLE తీసుకువచ్చే ఏదైనా మార్పులు లేదా సేవల యొక్క నియమాలలో ఏవైనా శాశ్వత లేక తాత్కాలిక రద్దు (లేదా సేవలలోని అంశాలు);
(III) మీ సేవల ఉపయోగం ద్వారా లేదా నిర్వహించబడే లేక ప్రసారమయ్యే ఎలాంటి కంటెంట్ మరియు ఇతర కమ్యూనికేషన్ యొక్క తొలగింపు, పాడుచేయడం లేదా నిల్వ చేయడం;
(III) నిర్దిష్టమైన ఖాతా సమాచారాన్ని GOOGLEకు అందించడంలో మీ వైఫల్యం;
(IV) మీ పాస్వర్డ్ లేదా ఖాతా వివరాలను సురక్షితంగా, గోప్యంగా ఉంచడంలో మీ వైఫల్యం;;
15.2 ఇటువంటి నష్టాలు ఏవైనా ఎదురవుతాయని GOOGLEకు సలహా ఉన్నా లేకపోయినా లేదా అప్రమత్తంగా లేకపోయినా 15.1 పేరాలో మీపై GOOGLE బాధ్యతలకు సంబంధించిన పరిమితులు వర్తిస్తాయి.
16. కాపీరైట్ మరియు వ్యాపార గుర్తు విధానాలు
16.1 అంతర్జాతీయ మేధో సంపత్తి చట్టానికి (అమెరికాలో, డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టంతో సహా) వర్తించే కాపీరైట్ ఉల్లంఘనలపై వచ్చిన ఆరోపణలకు స్పందించడం మరియు పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే వారి ఖాతాలను రద్దుచేయడం అనేది Google యొక్క విధానం. Google విధానం వివరాలు http://www.google.com/dmca.html లో ఉంటాయి.
16.2 http://www.google.com/tm_complaint.html లో తమ ప్రకటనల వ్యాపారం, వివరాలకు సంబంధించి Google నిర్వహించే ట్రేడ్ మార్క్ ఆరోపణల విధానాన్ని మీరు చదవవచ్చును.
17. ప్రకటనలు
17.1 కొన్ని సేవలు ప్రకటనల యొక్క రాబడులపై ఆధారపడి ఉంటాయి మరియు ప్రకటనలను, ప్రమోషన్లను ప్రదర్శిస్తాయి. ఈ ప్రకటనలు సేవల్లో నిల్వ చేయబడి ఉన్న సమాచార విషయాన్ని, సేవలు ఇతర సమాచారం ద్వారా అడిగిన ప్రశ్నలను లక్ష్యంగా చేసుకుంటాయి.
17.2 సేవల్లో Google ద్వారా ప్రకటించబడిన శైలి, రీతి, పరిధి అనేవి మీకు తెలియపర్చకుండానే మార్చడం జరుగుతుంది.
17.3 Google మీకు సేవల ఉపయోగం కోసం యాక్సెస్‌ను మంజూరు చేయడంలో, అటువంటి ప్రకటనలను Google తమ సేవలలో ఉంచుతుందని మీరు అంగీకరిస్తున్నారు.
18. ఇతర కంటెంట్
18.1 ఈ సేవలు ఇతర వెబ్సైట్లు, కంటెంట్ లేదా వనరులకు హైపర్లింకులను పొందుపర్చి ఉండవచ్చు. Google కాకుండా కంపెనీలు లేదా వ్యక్తులు అందించిన ఎలాంటి వెబ్సైట్లు లేక వనరులపై Googleకు నియంత్రణ ఉండకపోవచ్చు.
18.2 అటువంటి బాహ్య సైట్లు లేదా వనరుల లభ్యత పట్ల Googleకు బాధ్యత లేదని మరియు అలాంటి వెబ్సైట్లు లేక వనరుల నుండి ఎలాంటి ప్రకటనలు, ఉత్పత్తులు లేక ఇతర సామగ్రిని అది ఆమోదించదని మీరు గ్రహించి, అంగీకరిస్తున్నారు.
18.3 అటువంటి బాహ్య సైట్లు లేదా వనరుల లభ్యత ఫలితంగా లేక అటువంటి సైట్లు లేదా వనరుల నుంచి లభ్యమయ్యే ఏదైనా ప్రకటన, ఉత్పత్తులు లేక ఇతర సామగ్రి యొక్క సంపూర్తి, నిర్దిష్టత లేదా ఉనికికి సంబంధించి మీ విశ్వసనీయత ఫలితంగా జరిగే ఎలాంటి నష్టాలకు Google బాధ్యత వహించదని మీరు గ్రహించి, అంగీకరిస్తున్నారు.
19. నిబంధనలలో మార్పులు
19.1 ఎప్పటికప్పుడు యూనివర్సల్ నిబంధనలు లేదా అదనపు షరతులలో Google మార్పులు చేయవచ్చు. ఈ మార్పులు చేసినప్పుడు, http://www.google.com/accounts/TOS?hl=te వద్ద లభించే క్రొత్త యూనివర్సల్ నిబంధనల కాపీని Google సృష్టిస్తుంది మరియు ప్రభావిత సేవల్లో లేదా సేవల ద్వారా క్రొత్త అదనపు నిబంధనలు మీకు లభిస్తాయి.
19.2 యూనివర్సల్ నిబంధనలు మరియు అదనపు నిబంధనలు మారిన తేదీ తర్వాత మీరు సేవలను ఉపయోగిస్తే, అప్డేట్ చెయ్యబడిన యూనివర్సల్ నిబంధనలు లేదా అదనపు నిబంధనలను మీరు ఆమోదిస్తున్నట్లుగా Google భావిస్తుందని గ్రహించి, అంగీకరిస్తున్నారు.
20. సాధారణ చట్టపరమైన నిబంధనలు
20.1 కొన్నిసార్లు మీరు సేవలను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు (మీ సేవల ఉపయోగం ద్వారా లేదా దాని ఫలితంగా) ఇతర కంపెనీ లేదా వ్యక్తి అందించిన సేవను మీరు ఉపయోగించవచ్చు లేక సాఫ్ట్వేర్ యొక్క భాగాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈ సేవలు, సాఫ్ట్వేర్ లేదా వస్తువులను మీరు ఉపయోగించడం మీకు మరియు సంబంధిత కంపెనీ లేక వ్యక్తికి మధ్య ప్రత్యేక నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇలా అయితే, ఈ ఇతర కంపెనీలు లేదా వ్యక్తులతో మీ చట్టపర సంబంధాన్ని నిబంధనలు వ్యతిరేకి0చవు.
20.2 నిబంధనలు మీకు మరియు Googleకి మధ్య పూర్తి చట్టపర ఒప్పందాన్ని నెలకొల్పుతాయి మరియు మీ సేవల వినియోగాన్ని నిర్ణయిస్తాయి (అయితే ప్రత్యేక లిఖిత ఒప్పందంలో భాగంగా మీకు Google అందించిన ఏవైనా సేవలను మినహాయిస్తాయి) మరియు సేవలకు సంబంధించి మీకు Googleకు మధ్య ఉన్న ముందస్తు ఒప్పందాలను పూర్తిగా భర్తీ చేస్తాయి.
20.3 Google మీకు గమనికలను, నిబంధనలలో మార్పులతో సహా ఇమెయిల్ ద్వారా, రోజువారీ మెయిల్ ద్వారా లేదా సేవలపై పోస్టింగ్‌ల ద్వారా పంపవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.
20.4 ఈ నిబంధనలలో పొందుపర్చి ఉన్న ఏదైనా చట్టపరమైన హక్కు లేదా నివారణను Google అమలు చేయకపోయినా లేదా అమల్లోకి తీసుకురాకపోయినా (వర్తించదగిన ఏదైనా చట్టం క్రింద Google ప్రయోజనం పొందినా), మునుపటి Google హక్కులను వదులుకున్నట్లు కాదని మరియు అటువంటి హక్కులు లేదా నివారణలు Googleకు ఇప్పటికీ అందుబాటులో ఉంటాయని మీరు అంగీకరిస్తున్నారు.
20.5 ఈ విషయంపై అధికార పరిధి కలిగిన ఏ న్యాయస్థానమైనా ఈ నిబంధనలలో ఏదైనా నియమం చెల్లదని తీర్పు చెప్పినట్లయితే, ఇతర నిబంధనలు ప్రభావితం కాకుండా నిబంధనల నుంచి ఆ నియమం తొలగించబడుతుంది. నిబంధనలలోని మిగిలి ఉన్న నియమాలు దీని తర్వాత చెల్లుబాటు అవుతాయి మరియు అమలు చేయబడతాయి.
20.6 Google పేరెంట్‌గా ఉన్న కంపెనీల సముదాయంలోని ప్రతి సభ్య కంపెనీ నిబంధనలకు మూడవ పార్టీ అనుభోక్తలుగా ఉంటాయని, అటువంటి ఇతర కంపెనీలు వాటికి ప్రయోజనకరంగా ఉన్న నిబంధనల యొక్క ఏ నియమాన్ని అయినా (లేదా అనుకూలంగా ఉన్న హక్కులను) ప్రత్యక్షంగా అమలు చేసే అధికారం కలిగి ఉంటాయని మరియు వాటిపై ఆధారపడతాయని మీరు నిర్థారించి, అంగీకరిస్తున్నారు. ఇది తప్ప, ఏ ఇతర వ్యక్తి లేదా కంపెనీ ఈ నిబంధనలకు మూడవ పార్టీ అనుభోక్తలుగా ఉండరు.
20.7 ఈ నిబంధనలు, మరియు ఈ నిబంధనల క్రింద Googleతో మీ సంబంధం, రెండు చట్ట నియమాలకు సంబంధించిన ఘర్షణలతో నిమిత్తం లేకుండా కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాలతో నిర్ణయించబడతాయి. ఈ నిబంధనల నుంచి తలెత్తే ఏ చట్టపర సమస్యనయినా పరిష్కరించుకోవడానికి సంబంధించి కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంతా క్లారా జిల్లాలో ఉన్న న్యాయస్థానాల విస్తృత అధికార పరిధిలో సమర్పించేందుకు మీరు మరియు Google అంగీకరిస్తున్నారు. ఇంతే కాకుండా, Google ఏ అధికార పరిధిలో అయినా సరే నిషేధ ఉత్తర్వు పరిష్కారాలకు (లేదా దానికి సమానమైన తక్షణ చట్ట ఉపశమనానికి) దరఖాస్తు పెట్టుకొనడానికి అనుమతించబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు.
ఏప్రిల్ 16, 2007
చివరిగా సవరించబడింది: 1 మార్చి 2012
Googleకు సుస్వాగతం!
మా ఉత్పత్తులను మరియు సేవలను (“సేవలు”) ఉపయోగించినందుకు ధన్యవాదాలు. 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States వద్ద ఉన్న Google Inc. (“Google”) ద్వారా సేవలు అందించబడ్డాయి.
మా సేవలను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నిబంధనలను అంగీకరిస్తున్నారు. దయచేసి వాటిని జాగ్రత్తగా చదవండి.
మా సేవలు చాలా భిన్నమైనవి, కాబట్టి కొన్నిసార్లు అదనపు నిబంధనలు లేదా ఉత్పత్తి అవసరాలు (వయస్సు అవసరాలతో సహా) వర్తించబడవచ్చు. అదనపు నిబంధనలు సందర్భోచిత సేవలతో అందుబాటులో ఉంటాయి మరియు మీరు అటువంటి సేవలను ఉపయోగిస్తే ఆ అదనపు నిబంధనలు మాతో మీ ఒప్పందంలో భాగంగా మారుతాయి.
మా సేవలను ఉపయోగించడం
మీకు అందుబాటులో ఉంచిన సేవల్లోని ఏ విధానాలను అయినా మీరు తప్పక పాటించాలి.
మా సేవలను దుర్వినియోగం చేయవద్దు. ఉదాహరణకు, మా సేవల్లో జోక్యం చేసుకోవద్దు లేదా మేము అందించే ఇంటర్ఫేస్ మరియు సూచనలు కాకుండా మరేదైనా పద్ధతిని ఉపయోగించి వాటిని ప్రాప్యత చేయడానికి ప్రయత్నించవద్దు. వర్తింపబడే ఎగుమతి మరియు మళ్లీ ఎగుమతి చేసే నియంత్రణ చట్టాలు (Export and Re-export Control Laws) మరియు నిబంధనలతో సహా, చట్టం ద్వారా అనుమతించిన విధంగా మాత్రమే మీరు మా సేవలను ఉపయోగించవచ్చు. మా నిబంధనలకు లేదా విధానాలకు మీరు లోబడి ఉండకపోయినా లేదా మేము అనుమానిత దుష్ప్రవర్తనను పరిశోధిస్తున్నా మా సేవలను అందించడాన్ని మేము తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా ఆపివేయవచ్చు.
మా సేవలను ఉపయోగించడం వలన మా సేవల్లో ఏవైనా మేథో సంపత్తి హక్కులకు లేదా మీరు ప్రాప్యత (access) చేసే కంటెంట్‌కు మీకు యాజమాన్యం ఇవ్వబడదు. మీరు మా సేవల నుండి కంటెంట్‌ను దాని యజమాని నుండి అనుమతిని పొందితే లేదా చట్టం ద్వారా అనుమతిస్తే తప్ప ఉపయోగించలేకపోవచ్చు. మా సేవల్లో ఉపయోగించిన ఏవైనా బ్రాండింగ్‌ను లేదా లోగోలను ఉపయోగించే హక్కును ఈ నిబంధనలు మీకు మంజూరు చేయవు. మా సేవల్లో లేదా వాటితో పాటుగా ప్రదర్శించిన ఏ చట్టబద్ధ నోటీసులను అయినా తీసివేయవద్దు, అస్పష్టం చేయవద్దు లేదా మార్చవద్దు.
మా సేవలు Googleకు చెందని కొంత కంటెంట్‌ను ప్రదర్శిస్తాయి. ఈ కంటెంట్ దీన్ని అందుబాటులో ఉంచిన వాస్తవికత (entity) యొక్క బాధ్యత. కంటెంట్ చట్టవిరుద్ధంగా ఉందా లేదా మా విధానాలను ఉల్లంఘిస్తోందా అని తెలుసుకోవడానికి మేము దీన్ని సమీక్షించవచ్చు మరియు మా విధానాలను లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మేము సహేతుకంగా విశ్వసించే కంటెంట్‌ను మేము తీసివేయవచ్చు లేదా ప్రదర్శించడానికి నిరాకరించవచ్చు. అయితే దీని అర్థం మేము కంటెంట్‌ను తప్పక సమీక్షిస్తామని కాదు, కాబట్టి దయచేసి మేము చేస్తామని భావించవద్దు.
సేవలను మీరు ఉపయోగించే విధానంపై ఆధారపడి, మేము మీకు సేవ ప్రకటనలను, నిర్వహణ సందేశాలను మరియు ఇతర సమాచారాన్ని పంపవచ్చు. మీరు ఆ కమ్యూనికేషన్లలో కొన్నింటిని నిలిపివేయవచ్చు.
మీ Google ఖాతా
మా సేవల్లో కొన్నింటిని ఉపయోగించడానికి మీకు Google ఖాతా అవసరం కావచ్చు. మీరు మీ స్వంత Google ఖాతాను సృష్టించుకోవచ్చు లేదా మీ యజమాని లేదా విద్యా సంస్థ వంటి నిర్వాహకుడి ద్వారా మీకు మీ Google ఖాతా కేటాయించబడి ఉండవచ్చు. నిర్వాహకుడి ద్వారా మీకు కేటాయించబడిన Google ఖాతాను మీరు ఉపయోగిస్తుంటే, విభిన్న లేదా అదనపు నిబంధనలు వర్తించవచ్చు మరియు మీ నిర్వాహకుడు మీ ఖాతాను ప్రాప్యత (access) చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు.
మీ పాస్వర్డ్ లేదా ఖాతా యొక్క ఏదైనా అనధికార ఉపయోగం గురించి మీరు తెలుసుకుంటే, ఈ సూచనలను అనుసరించండి.
గోప్యత మరియు కాపీరైట్ రక్షణ
మీరు మా సేవలను ఉపయోగిస్తున్నప్పుడు మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా ఉపయోగిస్తామో మరియు మీ గోప్యతను ఎలా రక్షిస్తామో Google గోప్యతా విధానాలు వివరిస్తాయి. మా సేవలను ఉపయోగించడం ద్వారా, అటువంటి డేటాను మా గోప్యతా విధానాలకు లోబడి Google ఉపయాగించవచ్చని మీరు అంగీకరించారు.
ఆరోపిత కాపీరైట్ ఉల్లంఘన నోటీసులకు మేము ప్రతిస్పందిస్తాము మరియు ఉల్లంఘనలను పునరావృతం చేసే వారి ఖాతాలను యు.ఎస్. డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టంలో పేర్కొన్న ప్రాసెస్ ప్రకారం ముగిస్తాము.
ఆన్లైన్లో కాపీరైట్ హక్కుదారుల మేథో సంపత్తిని నిర్వహించడంలో సహాయం చేయడానికి మేము సమాచారాన్ని అందిస్తాము. మీ కాపీరైట్లను ఒకరు ఉల్లంఘిస్తున్నారని మీరు భావిస్తే మరియు మాకు తెలియజేయాలనుకుంటే, మీరు నోటీసులను సమర్పించడం గురించి మరియు నోటీసులకు ప్రతిస్పందించడానికి Google విధానం గురించి సమాచారాన్ని మా సహాయ కేంద్రంలో కనుగొనవచ్చు.
మా సేవల్లో మీ కంటెంట్
కంటెంట్‌ను సమర్పించడానికి మా సేవల్లో కొన్ని మిమ్మల్ని అనుమతిస్తాయి. ఆ కంటెంట్‌లో మీరు కలిగి ఉన్న ఏవైనా మేథో సంపత్తి హక్కుల యాజమాన్యాన్ని మీరే కలిగి ఉంటారు. సంక్షిప్తంగా, మీకు చెందినవి మీవిగానే ఉంటాయి.
మా సేవలకు మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేసినప్పుడు లేదా సమర్పించినప్పుడు, మీరు Google ఉపయోగించడానికి, హోస్ట్, నిల్వ చేయడానికి, మళ్లీ ఉత్పాదించడానికి, సవరించడానికి, ఉత్పన్న పనులను సృష్టించడానికి (మేము చేసే అనువాదాలు, సర్దుబాటులు లేదా ఇతర మార్పుల ఫలితంగా, మా సేవలతో మీ కంటెంట్ ఉత్తమంగా పని చేస్తుంది), కమ్యూనికేట్ చేయడానికి, ప్రచురించడానికి, పబ్లిక్ చేయడానికి, పబ్లిక్‌గా ప్రదర్శించడానికి మరియు అటువంటి కంటెంట్‌ను పంపిణీ చేయడానికి ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను ఇస్తారు. ఈ లైసెన్స్‌లో మీరు అందించే హక్కులు మా సేవల ఆపరేటింగ్, ప్రమోటింగ్ మరియు మెరుగు చేయడం మరియు క్రొత్త వాటిని అభివృద్ధి చేయడానికి వంటి పరిమతి ప్రయోజనం కోసం ఉద్దేశించిబడినవి (ఉదాహరణకు, మీరు Google Mapsకు జోడించిన వ్యాపార జాబితా కోసం). మీరు మా సేవలను ఉపయోగించడాన్ని ఆపివేసినప్పటికీ ఈ లైసెన్స్ కొనసాగుతుంది. కొన్ని సేవలు సేవకు అందించిన కంటెంట్‌ను ప్రాప్యత చేయడానికి మరియు తీసివేయడానికి మీకు మార్గాలను అందించవచ్చు. ఇంకా, మా కొన్ని సేవల్లో, ఆ సేవల్లో సమర్పించిన కంటెంట్ యొక్క మా ఉపయోగం పరిధిని నిబంధనలు మరియు సెట్టింగ్‌లు పరిమితం చేస్తాయి. మీరు మా సేవకు సమర్పించిన ఏ కంటెంట్ కోసం అయినా ఈ లైసెన్స్‌ను మాకు అందించడానికి అవసరమైన హక్కులు మీకు ఉన్నాయని నిర్ధారించండి.
ప్రత్యేకమైన సేవల కోసం గోప్యతా విధానంలోని మరియు అదనపు నిబంధనల్లోని కంటెంట్‌ను Google ఎలా ఉపయోగిస్తుంది మరియు నిల్వ చేస్తుంది గురించి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకొనవచ్చు. మా సేవల గురించి మీరు అభిప్రాయాన్ని లేదా సూచనలను సమర్పిస్తే, మేము మీకు బాధ్యతలేకుండా మీ అభిప్రాయాన్ని లేదా సూచనలను ఉపయోగిస్తాము.
మా సేవల్లోని సాఫ్ట్వేర్ గురించి
సేవకు అవసరమైనప్పుడు లేదా డౌన్లోడ్ చేయగలిగే సాఫ్ట్ వేర్ ను చేర్చినప్పుడు, క్రొత్త సంస్కరణలు లేదా లక్షణాలు అందుబాటులో ఉన్నప్పుడు మీ పరికరంలో స్వయంచాలకంగా ఈ సాఫ్ట్వేర్ నవీకరించబడుతుంది. కొన్ని సేవలు మీ స్వయంచాలక నవీకరణ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
సేవలో భాగంగా Google ద్వారా మీకు అందించబడిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి, Google మీకు వ్యక్తిగత, ప్రపంచవ్యాప్త, యాజమాన్యహక్కు-రహిత, మంజూరు చేయలేని మరియు ప్రత్యేకంకాని లైసెన్స్‌ను ఇస్తుంది. ఈ నిబంధనల ద్వారా అనుమతించబడిన విధానంలో, Google ద్వారా అందించబడినట్లుగా సేవల యొక్క ప్రయోజనాన్ని మీరు ఉపయోగించడానికి మరియు ఆస్వాదించడానికి అనుమతించే ఏకైక ప్రయోజనం కోసం ఈ లైసెన్స్ ఉద్దేశించబడింది. చట్టాలు అటువంటి నియంత్రణలను నిషేధించేవరకు లేదా మీకు వ్రాతపూర్వక అనుమతి ఉండేవరకు మీరు మా సేవల యొక్క ఏ భాగాన్ని లేదా చేర్చిన సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేయలేరు, సవరించలేరు, పంపిణీ చేయలరు, అమ్మలేరు లేదా విడుదల చేయలేరు లేదా మీరు ఇంజనీర్ మార్చలేరు (reverse engineer) లేదా సాఫ్ట్వేర్ యొక్క మూలం కోడ్‌ను పొందడానికి ప్రయత్నించలేరు.
ఓపెన్ మూలం సాఫ్ట్వేర్ మాకు ముఖ్యమైనది. ఓపెన్ మూలం లైసెన్స్‌లోని మా సేవల్లో ఉపయోగించిన కొంత సాఫ్ట్‌వేర్‌ను మేము మీకు అందుబాటులో ఉండేటట్లుగా అందించవచ్చు. ఈ కొన్ని నిబంధనలను ఉద్దేశ్యపూర్వరకంగా భర్తీ చేసే ఓపెన్ మూలం లైసెన్స్‌లో కేటాయింపులు ఉండవచ్చు.
మా సేవలను సవరించడం మరియు ముగించడం
మేము మా సేవలను నిరంతరంగా మారుస్తున్నాము మరియు మెరుగుపరుస్తున్నాము. మేము ఫంక్షనాలిటీలు లేదా లక్షణాలను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు మరియు మేము మొత్తంగా సేవను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా ఆపివేయవచ్చు.
మీరు ఏ సమయంలో అయినా మా సేవలను ఉపయోగించడాన్ని ఆపివేయవచ్చు, ఏదేమైనప్పటికీ మేము మిమ్మల్ని మళ్లీ చూడలేనందుకు చింతిస్తాము. Google మీకు సేవలను అందించడాన్ని ఆపివేయవచ్చు లేదా ఏ సమయంలో అయినా మా సేవలకు క్రొత్త పరిమితులను జోడించవచ్చు లేదా సృష్టించవచ్చు.
మీ డేటా మీ స్వంతమైనదిగా మేము విశ్వసిస్తున్నాము మరియు అటువంటి డేటాకు మీ ప్రాప్యతను రక్షించడం ముఖ్యం. మేము ఒక సేవను నిలిపివేయాలనుకుంటే, సాధ్యమైనంతవరకు, మేము మీకు ముందస్తు నోటీసును పంపుతాము మరియు సేవ నుండి సమాచారాన్ని పొందడానికి అవకాశం ఇస్తాము.
మా హామీలు మరియు డిస్క్లయిమెర్లు
మేము నైపుణ్యం మరియు సంరక్షణ యొక్క వాణిజ్యపరమైన సహేతుకమైన స్థాయిని ఉపయోగించి మా సేవలను అందిస్తాము మరియు మీరు వాటిని ఉపయోగించి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. కానీ మేము మా సేవల గురించి హామీ ఇవ్వలేని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి.
ఈ నిబంధనలు లేదా అదనపు నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్నవి మినహా, సేవల గురించి GOOGLE లేదా దీని సరఫరాదారులు లేదా పంపిణీదారులు ఏ ప్రత్యేక హామీని ఇవ్వడం లేదు. ఉదాహరణకు,మేము సేవల్లోని కంటెంట్, సేవలు యొక్క నిర్దిష్ట ఫంక్షన్ లేదా మీ అవసరాలకు వాటి మన్నిక, లభ్యత లేదా సామర్థ్యం గురించి ఎలాంటి హామీలను ఇవ్వడం లేదు. మేము “ఉన్నవి ఉన్నట్లుగా” సేవలను అందిస్తాము.
క్రయ విక్రయాలకు సూచించిన హామీ, ప్రత్యేకమైన ప్రయోజనం కోసం అర్హత లేదా ఉల్లంఘించనిది వంటి, ప్రత్యేక హామీల కోసం కొన్ని అధికార పరిధులు అందించబడ్డాయి. చట్టం అనుమతించిన మేరకు, మేము అన్ని హామీలను మినహాయిస్తాము.
మా సేవల కోసం బాధ్యత
చట్టం అనుమతించబడినప్పుడు, GOOGLE మరియు GOOGLE సరఫరాదారుల మరియు పంపిణీదారులు లాభాలు, రాబడులు లేదా డేటా నష్టానికి, ఆర్థిక నష్టాలు లేదా పరోక్ష, ప్రత్యేక, పర్యవసాన, ఆదర్శప్రాయ లేదా శిక్షాత్మక నష్టపరిహారాల కోసం బాధ్యత వహించరు.
చట్టం అనుమతించిన మేరకు, దాన్ని GOOGLE యొక్క మొత్తం బాధ్యత మరియు దీని సరఫరాదారులు మరియు పంపిణీదారులు, వ్యాప్తి చేయడానికి మరియు ఏవైనా సూచించిన హామీలతో సహాఈ నిబంధనల్లోని ఏవైనా దావాల కోసం సేవలను ఉపయోగించడానికి మాకు మీరు చెల్లించిన మొత్తంనకు పరిమితం చేయబడింది (లేదా మేము ఎంచుకుంటే, మీకు సేవలను మళ్లీ సరఫరా చేయవచ్చు).
అన్ని సందర్భాల్లో, సహేతుకంగా బలవంతంకాని ఏదైనా నష్టం లేదా ప్రమాదం కోసం GOOGLE, దాని సరఫరాదారులు మరియు పంపిణీదారులు బాధ్యత వహించరు.
మా సేవల యొక్క వ్యాపార ఉపయోగాలు
మీరు వ్యాపారం తరపున మా సేవలను ఉపయోగిస్తుంటే, ఆ వ్యాపారం ఈ నిబంధనలను ఆమోదిస్తుంది. ఈ సేవలు యొక్క వినియోగం లేదా నిబంధనల ఉల్లంఘన నుండి దానికి సంబంధించిన ఏదైనా దావా, వాజ్యం, లేదా చర్య నుండి గూగల్ మరియు దీని అనుబంధాలు, ఆఫీసర్లు, ఏజెంట్లు మరియు ఉద్యోగులు ప్రమాదరహితులు, దావాలు, నష్టాలు, ప్రమాదాలు, వ్యాజ్యాలు, తీర్పులు, దావా ఖర్చులు మరియు న్యాయవాది యొక్క ఫీజులతో సహా వీరు ఏ విధమైన నష్టపరిహరమునకు భాధ్యులు కారు.
ఈ నిబంధనల గురించి
మేము సేవకు వర్తించే ఈ నిబంధనలు లేదా ఏదైనా అదనపు నిబంధనలను సవరించవచ్చు ఉదాహరణకు, చట్టంలో మార్పులను లేదా మా సేవలలో మార్పులను ప్రతిబింబించడం లాంటివి. మీరు తరచూ నిబంధనలను గమనించాలి. మేము ఈ పేజీలో ఈ నిబంధనలకు సవరణల యొక్క నోటీసును పోస్ట్ చేస్తాము. మేము వర్తింపబడే సేవలో సవరించిన అదనపు నిబంధనల యొక్క నోటీసును పోస్ట్ చేస్తాము. మార్పులు గడచిన సమయానికి వర్తించవు మరియు అవి పోస్ట్ చేయబడిన తర్వాత పద్నాలుగు రోజుల్లోపు ప్రభావితమవుతాయి. అయితే, సేవ కోసం క్రొత్త ఫంక్షన్లను సూచించే మార్పులు లేదా చట్టబద్ధ కారణాల కోసం చేసిన మార్పులు వెంటనే ప్రభావితమవుతాయి. మీరు సేవ కోసం సవరించిన నిబంధనలకు అంగీకరించకుంటే, మీరు ఆ సేవ యొక్క మీ వినియోగాన్ని ఆపివేయాలి.
ఈ నిబంధనలు మరియు అదనపు నిబంధనల మధ్య వైరుధ్యం ఉంటే, వైరుధ్యం కోసం అదనపు నిబంధనలు నియంత్రించబడతాయి.
ఈ నిబంధనలు Googleకు మరియు మీకు మధ్య సంబంధాన్ని నియంత్రిస్తాయి. ఇవి ఏ మూడవ పక్షం లబ్ధిదారు హక్కులను సృష్టించవు.
మీరు ఈ నిబంధనలకు అనుకూలంగా లేకుంటే మరియు మేము తక్షణమే చర్యను తీసుకోలేకపోయిన, అంటే మేము కలిగి ఉన్న (భవిష్యత్తులో చర్యను తీసుకోవడం వంటివి) ఏవైనా హక్కులను మేము కోల్పోతామని దీని అర్థం కాదు.
నిర్దిష్ట నిబంధనను అమలు చేయలేకపోతే, ఇది ఇతర నిబంధనల అమలును ప్రభావితం చేయదు.
మీరు నిబంధనలకు లేదా సేవల నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన ఏవైనా వైరుధ్యాలకు వర్తించబడే కాలిఫోర్నియా యొక్క వివాద చట్టాల నియమాల మినహా, కాలిఫోర్నియా, యు.ఎస్.ఏ యొక్క చట్టాలు వర్తించబడతాయి. శాంటా క్లారా కౌంటీ, కాలిఫోర్నియా, యుఎస్ఏ ఫెడరల్ లేదా రాష్ట న్యాయస్థానంలోని మరియు అటువంటి న్యాయ స్థానాల్లోని వ్యక్తిగత అధికార పరిధికి మీ మరియు Google సమ్మతిలోని నిబంధనలకు లేదా సేవల నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన అన్ని దావాలు ప్రత్యేకంగా న్యాయస్థానంలో దావా వేయబడతాయి.
Googleను ఏ విధంగా సంప్రదించాలి గురించి సమాచారం కోసం, దయచేసి మా సంప్రదింపు పేజీని సందర్శించండి.
