ఇది మా సేవా నిబంధనల యొక్క ఆర్కైవ్ చేయబడిన సంస్కరణ. ప్రస్తుత సంస్కరణ లేదా గత సంస్కరణలన్నీ వీక్షించండి.

Google సేవా నిబంధనలు

చివరిగా సవరించబడింది: 14 ఎప్రిల్ 2014 (ఆర్కైవ్ చేసిన సంస్కరణలను వీక్షించండి)

Googleకు సుస్వాగతం!

మా ఉత్పత్తులను మరియు సేవలను (“సేవలు”) ఉపయోగించినందుకు ధన్యవాదాలు. 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States వద్ద ఉన్న Google Inc. (“Google”) ద్వారా సేవలు అందించబడ్డాయి.

మా సేవలను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నిబంధనలను అంగీకరిస్తున్నారు. దయచేసి వాటిని జాగ్రత్తగా చదవండి.

మా సేవలు చాలా భిన్నమైనవి, కాబట్టి కొన్నిసార్లు అదనపు నిబంధనలు లేదా ఉత్పత్తి అవసరాలు (వయస్సు అవసరాలతో సహా) వర్తించబడవచ్చు. అదనపు నిబంధనలు సందర్భోచిత సేవలతో అందుబాటులో ఉంటాయి మరియు మీరు అటువంటి సేవలను ఉపయోగిస్తే ఆ అదనపు నిబంధనలు మాతో మీ ఒప్పందంలో భాగంగా మారుతాయి.

మా సేవలను ఉపయోగించడం

మీకు అందుబాటులో ఉంచిన సేవల్లోని ఏ విధానాలను అయినా మీరు తప్పక పాటించాలి.

మా సేవలను దుర్వినియోగం చేయవద్దు. ఉదాహరణకు, మా సేవల్లో జోక్యం చేసుకోవద్దు లేదా మేము అందించే ఇంటర్‌ఫేస్ మరియు సూచనలు కాకుండా మరేదైనా పద్ధతిని ఉపయోగించి వాటిని ప్రాప్యత చేయడానికి ప్రయత్నించవద్దు. వర్తింపబడే ఎగుమతి మరియు మళ్లీ ఎగుమతి చేసే నియంత్రణ చట్టాలు (Export and Re-export Control Laws) మరియు నిబంధనలతో సహా, చట్టం ద్వారా అనుమతించిన విధంగా మాత్రమే మీరు మా సేవలను ఉపయోగించవచ్చు. మా నిబంధనలకు లేదా విధానాలకు మీరు లోబడి ఉండకపోయినా లేదా మేము అనుమానిత దుష్ప్రవర్తనను పరిశోధిస్తున్నా మా సేవలను అందించడాన్ని మేము తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా ఆపివేయవచ్చు.

మా సేవలను ఉపయోగించడం వలన మా సేవల్లో ఏవైనా మేథో సంపత్తి హక్కులకు లేదా మీరు ప్రాప్యత (access) చేసే కంటెంట్‌కు మీకు యాజమాన్యం ఇవ్వబడదు. మీరు మా సేవల నుండి కంటెంట్‌ను దాని యజమాని నుండి అనుమతిని పొందితే లేదా చట్టం ద్వారా అనుమతిస్తే తప్ప ఉపయోగించలేకపోవచ్చు. మా సేవల్లో ఉపయోగించిన ఏవైనా బ్రాండింగ్‌ను లేదా లోగోలను ఉపయోగించే హక్కును ఈ నిబంధనలు మీకు మంజూరు చేయవు. మా సేవల్లో లేదా వాటితో పాటుగా ప్రదర్శించిన ఏ చట్టబద్ధ నోటీసులను అయినా తీసివేయవద్దు, అస్పష్టం చేయవద్దు లేదా మార్చవద్దు.

మా సేవలు Googleకు చెందని కొంత కంటెంట్‌ను ప్రదర్శిస్తాయి. ఈ కంటెంట్ దీన్ని అందుబాటులో ఉంచిన వాస్తవికత (entity) యొక్క బాధ్యత. కంటెంట్ చట్టవిరుద్ధంగా ఉందా లేదా మా విధానాలను ఉల్లంఘిస్తోందా అని తెలుసుకోవడానికి మేము దీన్ని సమీక్షించవచ్చు మరియు మా విధానాలను లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మేము సహేతుకంగా విశ్వసించే కంటెంట్‌ను మేము తీసివేయవచ్చు లేదా ప్రదర్శించడానికి నిరాకరించవచ్చు. అయితే దీని అర్థం మేము కంటెంట్‌ను తప్పక సమీక్షిస్తామని కాదు, కాబట్టి దయచేసి మేము చేస్తామని భావించవద్దు.

సేవలను మీరు ఉపయోగించే విధానంపై ఆధారపడి, మేము మీకు సేవ ప్రకటనలను, నిర్వహణ సందేశాలను మరియు ఇతర సమాచారాన్ని పంపవచ్చు. మీరు ఆ కమ్యూనికేషన్‌లలో కొన్నింటిని నిలిపివేయవచ్చు.

మా సేవల్లో కొన్ని మొబైల్ పరికరాల్లో అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ లేదా భద్రతా చట్టాలను పాటించనీయకుండా మీ దృష్టిని మరల్చి, మిమ్మల్ని నిరోధించే పద్ధతిలో ఉన్న సేవలను ఉపయోగించవద్దు.

మీ Google ఖాతా

మా సేవల్లో కొన్నింటిని ఉపయోగించడానికి మీకు Google ఖాతా అవసరం కావచ్చు. మీరు మీ స్వంత Google ఖాతాను సృష్టించుకోవచ్చు లేదా మీ యజమాని లేదా విద్యా సంస్థ వంటి నిర్వాహకుడి ద్వారా మీకు మీ Google ఖాతా కేటాయించబడి ఉండవచ్చు. నిర్వాహకుడి ద్వారా మీకు కేటాయించబడిన Google ఖాతాను మీరు ఉపయోగిస్తుంటే, విభిన్న లేదా అదనపు నిబంధనలు వర్తించవచ్చు మరియు మీ నిర్వాహకుడు మీ ఖాతాను ప్రాప్యత (access) చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు.

మీ Google ఖాతాను సంరక్షించడానికి, మీ పాస్‌వర్డ్‌ను రహస్యంగా ఉంచండి. మీ Google ఖాతాలో జరిగే లేదా దాని ద్వారా సంభవించే కార్యాచరణకు మీరే బాధ్యత వహించాలి. మూడవ-పక్ష అనువర్తనాల్లో మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను పునర్వినియోగించే ప్రయత్నం చేయకండి. మీకు మీ పాస్‌వర్డ్ లేదా Google ఖాతా యొక్క ఏదైనా అనధికారిక వినియోగం గురించి తెలిస్తే, ఈ సూచనలను పాటించండి.

గోప్యత మరియు కాపీరైట్ రక్షణ

మీరు మా సేవలను ఉపయోగిస్తున్నప్పుడు మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా ఉపయోగిస్తామో మరియు మీ గోప్యతను ఎలా రక్షిస్తామో Google గోప్యతా విధానాలు వివరిస్తాయి. మా సేవలను ఉపయోగించడం ద్వారా, అటువంటి డేటాను మా గోప్యతా విధానాలకు లోబడి Google ఉపయాగించవచ్చని మీరు అంగీకరించారు.

ఆరోపిత కాపీరైట్ ఉల్లంఘన నోటీసులకు మేము ప్రతిస్పందిస్తాము మరియు ఉల్లంఘనలను పునరావృతం చేసే వారి ఖాతాలను యు.ఎస్. డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టంలో పేర్కొన్న ప్రాసెస్ ప్రకారం ముగిస్తాము.

ఆన్‌లైన్‌లో కాపీరైట్ హక్కుదారుల మేథో సంపత్తిని నిర్వహించడంలో సహాయం చేయడానికి మేము సమాచారాన్ని అందిస్తాము. మీ కాపీరైట్‌లను ఒకరు ఉల్లంఘిస్తున్నారని మీరు భావిస్తే మరియు మాకు తెలియజేయాలనుకుంటే, మీరు నోటీసులను సమర్పించడం గురించి మరియు నోటీసులకు ప్రతిస్పందించడానికి Google విధానం గురించి సమాచారాన్ని మా సహాయ కేంద్రంలో కనుగొనవచ్చు.

మా సేవల్లో మీ కంటెంట్

కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి, సమర్పించడానికి, నిల్వ చేయడానికి, పంపడానికి లేదా స్వీకరించడానికి మా సేవల్లో కొన్ని మిమ్మల్ని అనుమతిస్తాయి. ఆ కంటెంట్‌లో మీరు కలిగి ఉన్న ఏవైనా మేథో సంపత్తి హక్కుల యాజమాన్యాన్ని మీరే కలిగి ఉంటారు. సంక్షిప్తంగా, మీకు చెందినవి మీవిగానే ఉంటాయి.

మా సేవలకు లేదా మా సేవల ద్వారా మీరు కంటెంట్‌ని అప్‌లోడ్ చేసినప్పుడు, సమర్పించినప్పుడు, నిల్వ చేసినప్పుడు, పంపినప్పుడు లేదా స్వీకరించినప్పుడు, మీరు Google ఉపయోగించడానికి, హోస్ట్ చేయడానికి, నిల్వ చేయడానికి, మళ్లీ ఉత్పాదించడానికి, సవరించడానికి, రచనలను సృష్టించడానికి (మేము చేసే అనువాదాలు, సర్దుబాటులు లేదా ఇతర మార్పుల ఫలితంగా, మా సేవలతో మీ కంటెంట్ ఉత్తమంగా పని చేస్తుంది), కమ్యూనికేట్ చేయడానికి, ప్రచురించడానికి, పబ్లిక్‌‌గా అమలు చేయడానికి, పబ్లిక్‌గా ప్రదర్శించడానికి మరియు అటువంటి కంటెంట్‌ను పంపిణీ చేయడానికి ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను ఇస్తారు. ఈ లైసెన్స్‌లో మీరు అందించే హక్కులు మా సేవల ఆపరేటింగ్, ప్రచారం మరియు మెరుగు చేయడం మరియు క్రొత్త వాటిని అభివృద్ధి చేయడానికి వంటి పరిమిత ప్రయోజనం కోసం ఉద్దేశించిబడినవి. మీరు మా సేవలను ఉపయోగించడాన్ని ఆపివేసినప్పటికీ ఈ లైసెన్స్ కొనసాగుతుంది (ఉదాహరణకు, మీరు Google మ్యాప్స్‌కు జోడించిన వ్యాపార జాబితా కోసం). కొన్ని సేవలు ఆ సేవకు అందించిన కంటెంట్‌ను ప్రాప్యత చేయడానికి మరియు తీసివేయడానికి మీకు మార్గాలను అందించవచ్చు. ఇంకా, మా సేవల్లో కొన్నింటిలో, ఆ సేవల్లో సమర్పించిన కంటెంట్ యొక్క మా వినియోగ పరిధిని పరిమితం చేసే నిబంధనలు మరియు సెట్టింగ్‌లు ఉన్నాయి. మీరు మా సేవలకు సమర్పించే ఏ కంటెంట్ కోసం అయినా ఈ లైసెన్స్‌ను మాకు అందించడానికి అవసరమైన హక్కులు మీకు ఉన్నాయని నిర్ధారించండి.

అనుకూలీకరించిన శోధన ఫలితాలు, వ్యక్తీకరించిన వ్యాపార ప్రకటనలు మరియు స్పామ్ మరియు మాల్వేర్ గుర్తింపు వంటి సంబంధిత ఉత్పత్తి లక్షణాలను మీకు వ్యక్తిగతంగా అందించడానికి మా స్వయంచాలక సిస్టమ్‌లు మీ కంటెంట్‌ను (ఇమెయిల్‌లతో సహా) విశ్లేషిస్తాయి. కంటెంట్ పంపబడినప్పుడు, స్వీకరించబడినప్పుడు మరియు అది నిల్వ చేయబడినప్పుడు ఈ విశ్లేషణ జరుగుతుంది.

మీరు Google ఖాతాను కలిగి ఉంటే, మేము Googleలో లేదా మా సేవల్లో మీ Google ఖాతాకు కనెక్ట్ చేయబడిన మూడవ-పక్ష అనువర్తనాల్లో మీ ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ ఫోటో మరియు మీరు తీసుకునే చర్యలను (+1లు, మీరు వ్రాసే సమీక్షలు మరియు మీరు పోస్ట్ చేసే వ్యాఖ్యల వంటివి) ప్రదర్శించవచ్చు, దీనితో పాటు ప్రకటనల్లో మరియు ఇతర వాణిజ్య సందర్భాల్లో ప్రదర్శించవచ్చు. మీ Google ఖాతాలో భాగస్వామ్య లేదా దృశ్యమాన సెట్టింగ్‌లకు పరిమితి విధించడం కోసం మీరు ఎంచుకునే ఎంపికలకు మేము విలువ ఇస్తాము. ఉదాహరణకు, మీరు ప్రకటనలో మీ పేరు మరియు ఫోటో కనిపించని విధంగా మీ సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు.

ప్రత్యేకమైన సేవల కోసం గోప్యతా విధానంలోని మరియు అదనపు నిబంధనల్లోని కంటెంట్‌ను Google ఎలా ఉపయోగిస్తుంది మరియు నిల్వ చేస్తుంది గురించి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకొనవచ్చు. మా సేవల గురించి మీరు అభిప్రాయాన్ని లేదా సూచనలను సమర్పిస్తే, మేము మీకు బాధ్యతలేకుండా మీ అభిప్రాయాన్ని లేదా సూచనలను ఉపయోగిస్తాము.

మా సేవల్లోని సాఫ్ట్‌వేర్ గురించి

సేవకు అవసరమైనప్పుడు లేదా డౌన్‌లోడ్ చేయగలిగే సాఫ్ట్ వేర్ ను చేర్చినప్పుడు, క్రొత్త సంస్కరణలు లేదా లక్షణాలు అందుబాటులో ఉన్నప్పుడు మీ పరికరంలో స్వయంచాలకంగా ఈ సాఫ్ట్‌వేర్ నవీకరించబడుతుంది. కొన్ని సేవలు మీ స్వయంచాలక నవీకరణ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

సేవలో భాగంగా Google ద్వారా మీకు అందించబడిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి, Google మీకు వ్యక్తిగత, ప్రపంచవ్యాప్త, యాజమాన్యహక్కు-రహిత, మంజూరు చేయలేని మరియు ప్రత్యేకంకాని లైసెన్స్‌ను ఇస్తుంది. ఈ నిబంధనల ద్వారా అనుమతించబడిన విధానంలో, Google ద్వారా అందించబడినట్లుగా సేవల యొక్క ప్రయోజనాన్ని మీరు ఉపయోగించడానికి మరియు ఆస్వాదించడానికి అనుమతించే ఏకైక ప్రయోజనం కోసం ఈ లైసెన్స్ ఉద్దేశించబడింది. చట్టాలు అటువంటి నియంత్రణలను నిషేధించేవరకు లేదా మీకు వ్రాతపూర్వక అనుమతి ఉండేవరకు మీరు మా సేవల యొక్క ఏ భాగాన్ని లేదా చేర్చిన సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేయలేరు, సవరించలేరు, పంపిణీ చేయలరు, అమ్మలేరు లేదా విడుదల చేయలేరు లేదా మీరు ఇంజనీర్ మార్చలేరు (reverse engineer) లేదా సాఫ్ట్‌వేర్ యొక్క మూలం కోడ్‌ను పొందడానికి ప్రయత్నించలేరు.

ఓపెన్ మూలం సాఫ్ట్‌వేర్ మాకు ముఖ్యమైనది. ఓపెన్ మూలం లైసెన్స్‌లోని మా సేవల్లో ఉపయోగించిన కొంత సాఫ్ట్‌వేర్‌ను మేము మీకు అందుబాటులో ఉండేటట్లుగా అందించవచ్చు. ఈ కొన్ని నిబంధనలను ఉద్దేశ్యపూర్వరకంగా భర్తీ చేసే ఓపెన్ మూలం లైసెన్స్‌లో కేటాయింపులు ఉండవచ్చు.

మా సేవలను సవరించడం మరియు ముగించడం

మేము మా సేవలను నిరంతరంగా మారుస్తున్నాము మరియు మెరుగుపరుస్తున్నాము. మేము ఫంక్షనాలిటీలు లేదా లక్షణాలను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు మరియు మేము మొత్తంగా సేవను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా ఆపివేయవచ్చు.

మీరు ఏ సమయంలో అయినా మా సేవలను ఉపయోగించడాన్ని ఆపివేయవచ్చు, ఏదేమైనప్పటికీ మేము మిమ్మల్ని మళ్లీ చూడలేనందుకు చింతిస్తాము. Google మీకు సేవలను అందించడాన్ని ఆపివేయవచ్చు లేదా ఏ సమయంలో అయినా మా సేవలకు క్రొత్త పరిమితులను జోడించవచ్చు లేదా సృష్టించవచ్చు.

మీ డేటా మీ స్వంతమైనదిగా మేము విశ్వసిస్తున్నాము మరియు అటువంటి డేటాకు మీ ప్రాప్యతను రక్షించడం ముఖ్యం. మేము ఒక సేవను నిలిపివేయాలనుకుంటే, సాధ్యమైనంతవరకు, మేము మీకు ముందస్తు నోటీసును పంపుతాము మరియు సేవ నుండి సమాచారాన్ని పొందడానికి అవకాశం ఇస్తాము.

మా హామీలు మరియు డిస్‌క్లయిమెర్‌లు

మేము నైపుణ్యం మరియు సంరక్షణ యొక్క వాణిజ్యపరమైన సహేతుకమైన స్థాయిని ఉపయోగించి మా సేవలను అందిస్తాము మరియు మీరు వాటిని ఉపయోగించి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. కానీ మేము మా సేవల గురించి హామీ ఇవ్వలేని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి.

ఈ నిబంధనలు లేదా అదనపు నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్నవి మినహా, సేవల గురించి GOOGLE లేదా దీని సరఫరాదారులు లేదా పంపిణీదారులు ఏ ప్రత్యేక హామీని ఇవ్వడం లేదు. ఉదాహరణకు,మేము సేవల్లోని కంటెంట్, సేవలు యొక్క నిర్దిష్ట ఫంక్షన్ లేదా మీ అవసరాలకు వాటి మన్నిక, లభ్యత లేదా సామర్థ్యం గురించి ఎలాంటి హామీలను ఇవ్వడం లేదు. మేము “ఉన్నవి ఉన్నట్లుగా” సేవలను అందిస్తాము.

క్రయ విక్రయాలకు సూచించిన హామీ, ప్రత్యేకమైన ప్రయోజనం కోసం అర్హత లేదా ఉల్లంఘించనిది వంటి, ప్రత్యేక హామీల కోసం కొన్ని అధికార పరిధులు అందించబడ్డాయి. చట్టం అనుమతించిన మేరకు, మేము అన్ని హామీలను మినహాయిస్తాము.

మా సేవల కోసం బాధ్యత

చట్టం అనుమతించబడినప్పుడు, GOOGLE మరియు GOOGLE సరఫరాదారుల మరియు పంపిణీదారులు లాభాలు, రాబడులు లేదా డేటా నష్టానికి, ఆర్థిక నష్టాలు లేదా పరోక్ష, ప్రత్యేక, పర్యవసాన, ఆదర్శప్రాయ లేదా శిక్షాత్మక నష్టపరిహారాల కోసం బాధ్యత వహించరు.

చట్టం అనుమతించిన మేరకు, దాన్ని GOOGLE యొక్క మొత్తం బాధ్యత మరియు దీని సరఫరాదారులు మరియు పంపిణీదారులు, వ్యాప్తి చేయడానికి మరియు ఏవైనా సూచించిన హామీలతో సహాఈ నిబంధనల్లోని ఏవైనా దావాల కోసం సేవలను ఉపయోగించడానికి మాకు మీరు చెల్లించిన మొత్తంనకు పరిమితం చేయబడింది (లేదా మేము ఎంచుకుంటే, మీకు సేవలను మళ్లీ సరఫరా చేయవచ్చు).

అన్ని సందర్భాల్లో, సహేతుకంగా బలవంతంకాని ఏదైనా నష్టం లేదా ప్రమాదం కోసం GOOGLE, దాని సరఫరాదారులు మరియు పంపిణీదారులు బాధ్యత వహించరు.

మా సేవల యొక్క వ్యాపార ఉపయోగాలు

మీరు వ్యాపారం తరపున మా సేవలను ఉపయోగిస్తుంటే, ఆ వ్యాపారం ఈ నిబంధనలను ఆమోదిస్తుంది. ఈ సేవలు యొక్క వినియోగం లేదా నిబంధనల ఉల్లంఘన నుండి దానికి సంబంధించిన ఏదైనా దావా, వాజ్యం, లేదా చర్య నుండి గూగల్ మరియు దీని అనుబంధాలు, ఆఫీసర్‌లు, ఏజెంట్‌లు మరియు ఉద్యోగులు ప్రమాదరహితులు, దావాలు, నష్టాలు, ప్రమాదాలు, వ్యాజ్యాలు, తీర్పులు, దావా ఖర్చులు మరియు న్యాయవాది యొక్క ఫీజులతో సహా వీరు ఏ విధమైన నష్టపరిహరమునకు భాధ్యులు కారు.

ఈ నిబంధనల గురించి

మేము సేవకు వర్తించే ఈ నిబంధనలు లేదా ఏదైనా అదనపు నిబంధనలను సవరించవచ్చు ఉదాహరణకు, చట్టంలో మార్పులను లేదా మా సేవలలో మార్పులను ప్రతిబింబించడం లాంటివి. మీరు తరచూ నిబంధనలను గమనించాలి. మేము ఈ పేజీలో ఈ నిబంధనలకు సవరణల యొక్క నోటీసును పోస్ట్ చేస్తాము. మేము వర్తింపబడే సేవలో సవరించిన అదనపు నిబంధనల యొక్క నోటీసును పోస్ట్ చేస్తాము. మార్పులు గడచిన సమయానికి వర్తించవు మరియు అవి పోస్ట్ చేయబడిన తర్వాత పద్నాలుగు రోజుల్లోపు ప్రభావితమవుతాయి. అయితే, సేవ కోసం క్రొత్త ఫంక్షన్‌లను సూచించే మార్పులు లేదా చట్టబద్ధ కారణాల కోసం చేసిన మార్పులు వెంటనే ప్రభావితమవుతాయి. మీరు సేవ కోసం సవరించిన నిబంధనలకు అంగీకరించకుంటే, మీరు ఆ సేవ యొక్క మీ వినియోగాన్ని ఆపివేయాలి.

ఈ నిబంధనలు మరియు అదనపు నిబంధనల మధ్య వైరుధ్యం ఉంటే, వైరుధ్యం కోసం అదనపు నిబంధనలు నియంత్రించబడతాయి.

ఈ నిబంధనలు Googleకు మరియు మీకు మధ్య సంబంధాన్ని నియంత్రిస్తాయి. ఇవి ఏ మూడవ పక్షం లబ్ధిదారు హక్కులను సృష్టించవు.

మీరు ఈ నిబంధనలకు అనుకూలంగా లేకుంటే మరియు మేము తక్షణమే చర్యను తీసుకోలేకపోయిన, అంటే మేము కలిగి ఉన్న (భవిష్యత్తులో చర్యను తీసుకోవడం వంటివి) ఏవైనా హక్కులను మేము కోల్పోతామని దీని అర్థం కాదు.

నిర్దిష్ట నిబంధనను అమలు చేయలేకపోతే, ఇది ఇతర నిబంధనల అమలును ప్రభావితం చేయదు.

మీరు నిబంధనలకు లేదా సేవల నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన ఏవైనా వైరుధ్యాలకు వర్తించబడే కాలిఫోర్నియా యొక్క వివాద చట్టాల నియమాల మినహా, కాలిఫోర్నియా, యు.ఎస్.ఏ యొక్క చట్టాలు వర్తించబడతాయి. శాంటా క్లారా కౌంటీ, కాలిఫోర్నియా, యుఎస్ఏ ఫెడరల్ లేదా రాష్ట న్యాయస్థానంలోని మరియు అటువంటి న్యాయ స్థానాల్లోని వ్యక్తిగత అధికార పరిధికి మీ మరియు Google సమ్మతిలోని నిబంధనలకు లేదా సేవల నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన అన్ని దావాలు ప్రత్యేకంగా న్యాయస్థానంలో దావా వేయబడతాయి.

Googleను ఏ విధంగా సంప్రదించాలి గురించి సమాచారం కోసం, దయచేసి మా సంప్రదింపు పేజీని సందర్శించండి.

Google యాప్‌లు
ప్రధాన మెనూ