Google భాగస్వాములు ఎవరు?

Google, వివిధ రకాలుగా వ్యాపారాలు మరియు సంస్థలతో పనిచేస్తుంది. మేము ఈ వ్యాపారాలు మరియు సంస్థలను "భాగస్వాములు"గా సూచిస్తాము. ఉదాహరణకు, 20 లక్షలకు పైగా Google యేతర వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లు ప్రకటనలను చూపించడానికి Googleతో భాగస్వామ్యం చేస్తున్నాయి. లక్షలాది డెవలపర్ భాగస్వాములు వారి యాప్‌లను Google Playలో ప్రచురిస్తున్నారు. ఇతర భాగస్వాములు మా సేవలను సురక్షితం చేయడంలో Googleకి సహాయం చేస్తారు; మీ ఖాతా అసురక్షితంగా ఉందని మేము భావిస్తే (మీ ఖాతాను రక్షించేందుకు చర్యలు తీసుకోవడానికి మేము సహాయం చేయగలిగే సమయంలో) మీకు తెలియజేయడానికి భద్రతా బెదిరింపుల సమాచారం మాకు సహాయపడుతుంది.

మేము విశ్వసనీయ వ్యాపార సంస్థలతో భాగస్వాములగా కన్నా డేటా ప్రాసెసర్‌లుగా పనిచేస్తామని కూడా గమనించండి, అంటే వాళ్లు మా సూచనల ఆధారంగా మరియు మా గోప్యతా విధానానికి, ఇతర సముచిత గోప్యతకు మరియు భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా మా సేవలకు మద్దతు ఇవ్వడానికి మా తరపున సమాచారాన్ని ప్రాసెస్ చేస్తారు. మేము డేటా ప్రాసెసర్‌లను ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి Google గోప్యతా విధానం వద్ద మరింత సమాచారం ఉంది.

మీరు మమ్మల్ని అడిగే వరకు, మీ పేరు లేదా ఇమెయిల్ వంటి మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని మేము వ్యాపార ప్రకటనల భాగస్వాములకు అందించము. ఉదాహరణకు, మీరు సమీపంలోని పూల దుకాణానికి సంబంధించిన ప్రకటనను చూసి, “కాల్ చేయడం కోసం నొక్కండి” బటన్‌ని ఎంచుకున్నట్లయితే, మేము మీ కాల్‌ని కనెక్ట్ చేస్తాము మరియు మీ ఫోన్ నంబర్‌ని పూల దుకాణం వారికి అందించవచ్చు.

మీరు, Google సేకరించే సమాచారాన్ని, భాగస్వాములు నుండి సేకరించే దాని గురించి కూడా గోప్యతా విధానంలో మరింత చదవవచ్చు.

Google యాప్‌లు
ప్రధాన మెనూ