యుక్త వయస్కుల గోప్యతా గైడ్
Googleలో మీ గోప్యత
గోప్యత గురించి మాకు ఎదురయ్యే కొన్ని ప్రధాన ప్రశ్నలకు ఇక్కడ మీరు సమాధానాలను పొందవచ్చు, అంటే డేటా అంటేఏమిటి? వంటివి. దానితో పాటు, మీరు మరింత తెలుసుకోవాలని అనుకుంటే గోప్యతా పాలసీని ఒకసారి చూడండి.
మీ లొకేషన్
Googleకు నా లొకేషన్ తెలుస్తుందా?
మీరు ఇంటర్నెట్ను ఉపయోగించినప్పుడల్లా, యాప్‌లు, సైట్లు మీ లొకేషన్‌ను సుమారుగా అంచనా వేయగలుగుతాయి, ఇదే విషయం Googleకు కూడా వర్తిస్తుంది. మీ డివైజ్ సెట్టింగ్‌లను బట్టి, Google మీ ఖచ్చితమైన లొకేషన్‌ను కూడా అంచనా వేయవచ్చు. (నా లొకేషన్ ఎంతవరకు ఖచ్చితంగా ఉంది?ని చూడండి)
మీరు Googleలో, Search, Maps, లేదా Google Assistant వంటి వాటితో సెర్చ్ చేసినప్పుడు, మీకు మరింత సహాయకరమైన ఫలితాలను ఇవ్వడానికి మీ ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగించడం జరగవచ్చు. ఉదాహరణకు, మీరు రెస్టారెంట్ల కోసం సెర్చ్ చేసినట్లయితే, చాలా వరకు సహాయకరంగా ఉండే ఫలితాలు మీరు ఉన్న లొకేషన్‌కు సమీపంలో ఉన్న రెస్టారెంట్లవే అయ్యుంటాయి.
మీ లొకేషన్‌ను మీరు ఎలా మేనేజ్ చేయవచ్చో చూడండి
నేను లొకేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ ఎలా చేయాలి?
మీరు Googleలో సెర్చ్ చేసినప్పుడు, మీరు సెర్చ్ చేస్తున్న చోటులోని జనరల్ ఏరియాను Google ఎల్లప్పుడూ అంచనా వేస్తుంది. మీరు ఉపయోగించే, ఇంటర్నెట్కు కనెక్ట్ అయి పని చేసే ఏదైనా యాప్, లేదా వెబ్సైట్ లాగే, Google కూడా మీ డివైజ్ IP అడ్రస్ ఆధారంగా మీ లొకేషన్‌ను అంచనా వేస్తుంది. వివరంగా తెలుసుకోవడం కోసం, నేను ఎక్కడ ఉన్నానో Googleకు ఎలా తెలుస్తుంది? అనే అంశాన్ని చూడండి
మీరు Googleను ఉపయోగించేటప్పుడు, మీ ఖచ్చితమైన లొకేషన్‌ను పంపించాలా వద్దా అనే దాని ఎంచుకునేందుకు, మీరు ఏవైనా యాప్‌లు, సైట్ల కోసం, లేదా మీ డివైజ్ కోసం లొకేషన్ అనుమతులను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.
మీరు మీ ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌లను సెట్ చేసి ఉండి, మీరు ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉన్నారని Google అంచనా వేస్తే, మీ సెర్చ్ కోసం ఆ ఖచ్చితమైన అడ్రస్ ఉపయోగించబడుతుంది.
నా లొకేషన్ ఎంత మేరకు ఖచ్చితంగా ఉంది?
మీ జనరల్ ఏరియా
మీరు Googleలో సెర్చ్ చేసినప్పుడు, మీరు సెర్చ్ చేస్తున్న చోటులోని జనరల్ ఏరియాను Google ఎల్లప్పుడూ అంచనా వేస్తుంది. ఈ విధంగా Google మీకు సందర్భోచిత ఫలితాలను ఇవ్వగలదు, అలాగే ఒక కొత్త నగరం నుండి సైన్ ఇన్ చేయడం లాంటి అసాధారణ యాక్టివిటీని గుర్తించి మీ ఖాతాను సురక్షితంగా ఉంచగలదు.
జనరల్ ఏరియా అనేది 3 చద. కి.మీ. కన్నా పెద్దదిగా ఉంటుంది, కనీసం 1,000 యూజర్లను కలిగి ఉంటుంది. ఆ విధంగా మీ సెర్చ్ ద్వారా మిమ్మల్ని గుర్తించడం సాధ్యం కాదు, తద్వారా మీ గోప్యతను మీరు రక్షించుకోవడంలో సహాయం లభిస్తుంది.
మీ ఖచ్చితమైన లొకేషన్
మీరు అనుమతిస్తే, Google మీ ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించగలదు. ఉదాహరణకు, "నాకు దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ షాపులు" వంటి సెర్చ్‌లకు అత్యంత సందర్భోచితమైన ఫలితాలను అందించడానికి లేదా ఒక స్టోర్‌కు వెళ్లేందుకు కాలినడకన వెళ్లే సులువైన దిశలను చూపడానికి Googleకు మీ ఖచ్చితమైన లొకేషన్ అవసరమవుతుంది.
ఖచ్చితమైన లొకేషన్ అంటే మీరు సరిగ్గా ఎక్కడ ఉన్నారో తెలిపేది, ఉదాహరణకు ఒక నిర్దిష్టమైన అడ్రస్ వంటిది.
Googleకు నా స్థానం ఎలా తెలుస్తుంది?
మీ లొకేషన్ వివిధ రకాల సోర్స్‌ల నుండి వస్తుంది, మీరు ఎక్కడ ఉన్నారో అంచనా వేయడానికి వాటన్నిటినీ కలిపి ఉపయోగిస్తాము.
మీ డివైజ్ IP అడ్రస్
ఫోన్ నంబర్ల ఏరియా కోడ్లలాగే, IP అడ్రస్‌లు కూడా ఇంచుమించుగా భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉంటాయి. అంటే google.comతో సహా, మీరు ఉపయోగించే ఏదైనా యాప్ లేదా వెబ్సైట్, మీ IP అడ్రస్ కారణంగా మీరు ఉన్న జనరల్ ఏరియాను అంచనా వేయగలదు. మీ డివైజ్ IP అడ్రస్‌ను మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కేటాయిస్తారు, ఇంటర్నెట్ను ఉపయోగించడానికి ఇది తప్పనిసరి.
మీ డివైజ్ లొకేషన్
మీరు Google యాప్‌నకు గానీ, లేదా సైట్‌కు గానీ మీ డివైజ్ లొకేషన్‌ను ఉపయోగించడానికి అనుమతిని ఇస్తే, ఆ సమాచారం మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాదాపు డివైజ్లన్నిటికీ వాటి ఆపరేటింగ్ సిస్టమ్ నిర్మాణంలో భాగంగా లొకేషన్ సెట్టింగ్‌లు ఉంటాయి. వీటిని సాధారణంగా సెట్టింగ్‌లలో చూడవచ్చు.
Googleలో మీ యాక్టివిటీ
మీ మునుపటి Google సెర్చ్‌ల ఆధారంగా మీ జనరల్ ఏరియాను Google అంచనా వేయగలదు. ఉదాహరణకు, మీరు తరచుగా ముంబైలో పిజ్జా కోసం సెర్చ్ చేస్తూ ఉంటే, మీరు ముంబైకి సంబంధించిన ఫలితాలనే చూడాలనుకుంటున్నారని భావించే అవకాశం ఉంది.
మీ లేబుల్ చేయబడిన స్థలాలు
మీరు మీ ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌ను సెట్ చేస్తే, మీరు ఎక్కడ ఉన్నారో అంచనా వేయడానికి Google వాటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ ఇంటి అడ్రస్‌ను సెట్ చేసి ఉండి, మీ IP అడ్రస్, మునుపటి యాక్టివిటీని లేదా ఇతర సోర్స్‌లు మీరు ఇంటికి దగ్గరలో ఉండవచ్చని సూచిస్తే, అప్పుడు మేము మీ ఇంటి లొకేషన్‌ను, మీరు ఎక్కడ ఉన్నారో తెలిపే అంచనాగా ఉపయోగిస్తాము.
నా లొకేషన్‌ను ఎవరు చూడగలరు?
అది మీ ఇష్టాన్ని బట్టి జరుగుతుంది. మీరు Google లొకేషన్ షేరింగ్‌ను ఉపయోగిస్తే, మీ రియల్-టైమ్ లొకేషన్‌ను Google సర్వీస్లన్నిటా ఫ్రెండ్స్‌తోనూ, ఫ్యామిలీతోనూ షేర్ చేయవచ్చు.
మీరు మీ లొకేషన్‌ను షేర్ చేస్తున్నారేమో చెక్ చేసుకోండి
లొకేషన్ షేరింగ్ ఆటోమేటిక్‌గా ఆఫ్‌లో ఉంది. మీరు మీ రియల్ టైమ్ లొకేషన్‌ను షేర్ చేయాలనుకుంటే, ఎవరితో, ఎంత సమయం పాటు షేర్ చేయాలనుకుంటున్నారో ఎంచుకొని, నిర్ధారించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనాసరే మీ లొకేషన్‌ను షేర్ చేయడం ఆపివేయవచ్చు.
మీ రియల్ టైమ్ లొకేషన్‌ను ఇతరులతో షేర్ చేయడాన్ని గురించి చూడండి.
Googleలో షేర్ చేయడం
నేను Googleలో షేర్ చేసినప్పుడు ఇతర వ్యక్తులు వేటిని చూడగలుతారు?
Google సర్వీస్‌లలో ఇతర వ్యక్తులు మీ గురించి ఏమి చూడగలరు అనేది మీరు ఏమి, ఎలా షేర్ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది:
పబ్లిక్‌గా షేర్ చేయడం
మీరు Google Maps వంటి యాప్‌లకు కంట్రిబ్యూట్ చేస్తే, ఇతరులు మీ పేరును, ఫోటోను చూడగలుగుతారు. ఉదాహరణకు, మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ స్టోర్‌కు మీరు రేటింగ్ ఇస్తే, ఇతరులు Google Mapsలో ఆ స్టోర్ గురించి వెతికినప్పుడు మీ రేటింగ్‌ను, పేరును, ఫోటోను చూడగలరు.
ప్రైవేట్‌గా షేర్ చేయడం
మీరు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి వాటిని ఇతరులతో షేర్ చేస్తే, మీరు షేర్ చేసే వాటితో పాటు మీ పేరు, ఫోటో కూడా మీరు ఎవరికైతే పంపుతున్నారో ఆ వ్యక్తికి కనిపిస్తాయి.
ఇతరులతో షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి, అలాగే మీరు వారికి ఏ స్థాయి యాక్సెస్ ఇస్తున్నారో కూడా అర్థం చేసుకోండి. ఉదాహరణకు, Google Driveలోని ఫోల్డర్లు, లేదా Google Photosలోని ఆల్బమ్‌ల వంటి వాటికి యాక్సెస్‌ను షేర్ చేస్తున్నప్పుడు, మీరు జోడించే కొత్త కంటెంట్‌కు కూడా వారి యాక్సెస్ కొనసాగవచ్చు.
నేను షేర్ చేసే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి వాటిని ఎవరు చూడగలుగుతారు?
మీరు ఉపయోగించే Google సర్వీస్‌లలో నిర్దిష్ట కంటెంట్‌ను ఇతర వ్యక్తులతో షేర్ చేయడానికి మీరు ఎంచుకోవచ్చు.
మీరు షేర్ చేసినప్పుడు, యాప్‌లలోను, ఇంకా Googleకు వెలుపల ఉన్న సైట్లలో కూడా ఇతర వ్యక్తులు మళ్లీ షేర్ చేసే అవకాశం ఉందని మర్చిపోవద్దు.
మీరు మీ ఖాతా నుండి మీ స్వంత కంటెంట్‌ను ఎప్పుడైనా తొలగించవచ్చు, కానీ మీరు ఇప్పటికే షేర్ చేసిన కాపీలను ఇది తొలగించదు.
మీరు షేర్ చేసే వాటి గురించి కొంచెం ఆలోచించండి, మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే షేర్ చేయండి.
Google నా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడైనా ఇతరులతో షేర్ చేస్తుందా?
చాలా తక్కువ సందర్భాలలో, చట్టపరమైన అవసరాలు ఉంటే తప్ప, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని Google వెలుపలి కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో షేర్ చేయము.
మీ స్కూల్ ద్వారా మీకు Google ఖాతా (Google Workspace for Education ఖాతా) ఉంటే, మీ ఖాతాను మేనేజ్ చేసే స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌కు మీ సమాచారానికి యాక్సెస్ ఉంటుంది.
స్కూల్ అడ్మిన్ల ద్వారా యాక్సెస్
మీ స్కూల్ అడ్మిన్ మీ Google Workspace for Education ఖాతాలోని కింది సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగే అవకాశం ఉంది:
- మీ ఖాతాలో నిల్వ చేసిన సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు మరియు తిరిగి పొందవచ్చు, మీ ఇమెయిల్ వంటివి
- మీ ఖాతాకు సంబంధించిన గణాంకాలను వీక్షించవచ్చు, మీరు ఇన్స్టాల్ చేసిన యాప్‌ల సంఖ్య వంటివి
- మీ ఖాతా పాస్‌వర్డ్‌ని మార్చవచ్చు
- మీ ఖాతా యాక్సెస్‌ని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయవచ్చు
- వర్తించదగిన చట్టం, నిబంధన, చట్టపరమైన ప్రక్రియ లేదా అమలు చేయదగిన ప్రభుత్వపరమైన అభ్యర్థనను పూర్తి చేయడానికి మీ ఖాతా సమాచారాన్ని స్వీకరించవచ్చు
- మీ సమాచారాన్ని లేదా మీ గోప్యతా సెట్టింగ్‌లను తొలగించగల లేదా సవరించగల మీ సామర్థ్యాన్ని నియంత్రించవచ్చు
Google మీ సమాచారాన్ని ఎందుకు షేర్ చేయవచ్చు
మీరు మాకు అనుమతిని ఇచ్చినప్పుడు
ఉదాహరణకు, పిజ్జాను ఆర్డర్ చేయడానికి మీరు Google Assistantను ఉపయోగిస్తే, రెస్టారెంట్‌తో మీ పేరును లేదా ఫోన్ నంబర్‌ను షేర్ చేసేముందు మేము మీ అనుమతిని తీసుకుంటాము. థర్డ్ పార్టీ యాప్‌లు & సర్వీస్‌లతో డేటాను సురక్షితంగా షేర్ చేయడంలో Google ఎలా సహాయపడుతుందో చూడండి
పైన పేర్కొన్న విధంగా, డొమైన్ అడ్మినిస్ట్రేటర్లతో.
వెలుపలి ప్రాసెసింగ్ కోసం, మేము ఇచ్చే సూచనల మేరకు డేటాను ప్రాసెస్ చేయడానికి, మాతో కలిసి పనిచేసే కంపెనీలకు మేము వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తాము. ఉదాహరణకు, కస్టమర్ సపోర్ట్ విషయంలో మాకు సహాయం చేయడానికి మేము బయటి కంపెనీలను ఉపయోగించుకుంటాము. అటువంటప్పుడు యూజర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, ఆ కంపెనీతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవలసి ఉంటుంది.
చట్టబద్ధ కారణాల కోసం
కింది వాటి కోసం వ్యక్తిగత సమాచారాన్ని అందించడం అవసరమని మేము భావిస్తే, దానిని Google వెలుపల షేర్ చేస్తాము:
- వర్తించే ఏదైనా చట్టం, నియంత్రణ చట్టం, చట్టపరమైన ప్రక్రియ, లేదా అమలు చేయదగిన ప్రభుత్వ రిక్వెస్ట్‌కు అనుగుణంగా ఉండటానికి.
- సంభావ్య ఉల్లంఘనల విచారణతో సహా వర్తించదగిన సేవా నిబంధనలను అమలు చేయడం.
- మోసం, భద్రత లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడం, నివారించడం లేదా పరిష్కరించడం.
- చట్టం నిర్దేశించిన మేరకు లేదా చట్టం అనుమతించిన మేరకు Googleకు, మా యూజర్లకు లేదా పబ్లిక్కు సంబంధించిన హక్కులకు, ప్రాపర్టీకి లేదా భద్రతకు హాని కలగకుండా రక్షించడానికి.
డేటా & వ్యక్తిగతీకరణ
నా గురించి Google ఏ డేటాను సేకరిస్తుంది?
మీరు Google సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు, మీకు వాటిని అందించడానికి, అవి మీకు మరింత ఉపయోగపడేలా తయారు చేయడానికి, Google డేటాను ఎందుకు సేకరిస్తుంది?లో వివరించిన మరిన్ని కారణాల కోసం కూడా మేము అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము.
మీ సెట్టింగ్‌లతో, మేము సేకరించే డేటాతో పాటు, ఆ డేటా ఎలా ఉపయోగించబడుతుందో అనే దానిని మీరు పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మీ Google ఖాతాకు మీ YouTube హిస్టరీని సేవ్ చేయకూడదని భావిస్తే, మీరు YouTube హిస్టరీని ఆఫ్ చేయవచ్చు. Google వేటిని సేవ్ చేస్తుందో నేను ఎలా నిర్ణయించగలుగుతాను?
డేటా అంటే ఏమిటి?
మీ వ్యక్తిగత సమాచారంలో, మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా గుర్తించగలిగే అంశాలను మీరు మాకు అందిస్తారు, అంటే మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ వంటివి. వీటిలో భాగంగా Google మీకు సంబంధించినదిగా లింక్ చేయగల డేటా కూడా ఉంటుంది, అంటే మీ Google ఖాతాలో మేము మీతో అనుబంధితం చేసే సమాచారం వంటిది.
మీ వ్యక్తిగత సమాచారంలో రెండు రకాల అంశాలు ఉంటాయి:
మీరు అందించేవి లేదా క్రియేట్ చేసేవి
మీరు Google ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, మీ పేరు, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని మాకు అందిస్తారు.
అంతే కాకుండా మీరు కంటెంట్‌ను సేవ్ చేయడం, అప్లోడ్ చేయడం లేదా ఇతరుల నుండి అందుకోవడం, చేయవచ్చు, అంటే ఈమెయిల్, మెసేజ్‌లు, ఫోటోల వంటివి.
Googleను ఉపయోగించి మీరు చేసేవి
మా సర్వీస్‌లలో మీకు మెరుగైన అనుభవాన్ని అందించడం కోసం మీ యాక్టివిటీకి సంబంధించిన సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఇందులో మీరు సెర్చ్ చేసే అంశాలు, మీరు చూసే వీడియోలు, మీరు ఎవరితోనైతే కమ్యూనికేట్ చేస్తారో లేదా కంటెంట్‌ను షేర్ చేస్తారో ఆ వ్యక్తులు, మరియు మీ Chrome బ్రౌజింగ్ హిస్టరీ వంటివి ఉండవచ్చు.
Google సర్వీస్‌లను యాక్సెస్ చేయడం కోసం మీరు ఉపయోగించే యాప్‌లు, బ్రౌజర్లు, డివైజ్‌ల గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. మీ బ్యాటరీ శాతం తక్కువగా ఉన్నప్పుడు స్క్రీన్‌లో కాంతి తగ్గించడం వంటి ఫీచర్లను అందించడంలో ఇది మాకు సహాయపడుతుంది.
ఉదాహరణకు, మీరు సులువైన దిశల వంటి ఫీచర్లను ఉపయోగిస్తున్నప్పుడు, మేము మీ లొకేషన్‌ను ప్రాసెస్ చేస్తాము. మరిన్ని వివరాల కోసం లొకేషన్ విభాగాన్ని చూడండి.
Google డేటాను ఎందుకు సేకరిస్తుంది?
మా సర్వీస్‌లను మీకు అందించడానికి, అవి మీకు మరింత బాగా ఉపయోగపడేలా వాటిని తయారుచేయడానికి, మేము మాకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. 'మేము డేటాను ఉపయోగించే పద్ధతులు'లో వివరించిన విధంగా, ఇతర కారణాల కోసం కూడా డేటాను ఉపయోగిస్తాము.
ఉదాహరణకు, మీరు వెళ్లే చోటుకి ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ వెళ్లడంలో Google Maps మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇది మీరు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని (మీ డేటా) పబ్లిక్ డేటాతో (మ్యాప్‌లు, పబ్లిక్ ప్రదేశాల సమాచారం) అనుసంధానం చేస్తుంది.
మేము డేటాను ఉపయోగించే విధానాలు
మా సేవలను అందించడం
ఫలితాలను అందించడం కోసం మీరు సెర్చ్ చేసే పదాలను ప్రాసెస్ చేయడం వంటి మా సర్వీస్‌లను మీకు అందించడానికి మేము డేటాను ఉపయోగిస్తాము.
మా సేవలను నిర్వహించడం & మెరుగుపరచడం
డేటా అనేది మా సర్వీస్‌లను నిర్వహించడానికి, మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మేము అవుటేజ్‌లను ట్రాక్ చేయగలుగుతాం. అంతే కాకుండా, ఏ సెర్చ్ క్వెరీకి ఎక్కువగా అక్షరదోషాలు ఉన్నాయో అర్థం చేసుకోవడం మా సర్వీస్‌లలో ఉపయోగించే స్పెల్ చెక్ ఫీచర్లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొత్త సేవలను అభివృద్ధి చేయడం
డేటా మాకు కొత్త సర్వీస్‌లను డెవలప్ చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, మా మొదటి ఫోటోల యాప్ అయిన Picasaలో వ్యక్తులు తమ ఫోటోలను ఎలా ఆర్గనైజ్ చేశారో మేము అర్థం చేసుకోగలిగాము, ఆ డేటాను Google Photosను డిజైన్ చేయడంలో, లాంచ్ చేయడంలో సహాయపడటానికి ఉపయోగించాము. ఈ సర్వీస్‌లను డెవలప్ చేయడానికి, మెరుగుపరచడానికి, మా జెనరేటివ్ AI ప్రోడక్ట్‌లతో సహా మా సర్వీస్‌లతో మీ ఇంటరాక్షన్లను మేము ఉపయోగించవచ్చు.
కంటెంట్ మరియు ప్రకటనలతో వ్యక్తిగతీకరించబడిన సేవలను అందించడం
మీకు నచ్చే అవకాశం ఉన్న వీడియోలను సిఫార్సు చేయడం వంటి వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను అందించడానికి మేము డేటాను ఉపయోగిస్తాము. మీ సెట్టింగ్‌లను బట్టి, మీ వయస్సును బట్టి, మీ ఆసక్తులను అనుసరించి మేము మీకు వ్యక్తిగతీకరించిన యాడ్లను చూపించవచ్చు.
పనితీరుని అంచనా వేయడం
మేము మా సర్వీస్‌ల పనితీరును అంచనా వేయడానికి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకోవడానికి కూడా డేటాను ఉపయోగిస్తాము
మీతో కమ్యూనికేట్ చేయడం
ఒకవేళ మేము అనుమానాస్పదంగా ఉన్న యాక్టివిటీని గుర్తిస్తే, మీకు నోటిఫికేషన్ పంపడానికి మీ ఇమెయిల్ అడ్రస్‌ను మేము ఉపయోగించవచ్చు.
Google, మా వినియోగదారులు మరియు పబ్లిక్ని రక్షించడం
ఆన్లైన్లో వ్యక్తులను మరింత సురక్షితంగా ఉంచడానికి మేము డేటాను ఉపయోగిస్తాము, అంటే మోసాన్ని గుర్తించడం, దానిని నివారించడం వంటివి.
వివిధ అంశాలను వ్యక్తిగతీకరించడానికి Google డేటాను ఏ విధంగా ఉపయోగిస్తుంది?
మేము కలెక్ట్ చేసే సమాచారాన్ని మా యాప్‌లను, సైట్లను మీకు తగినట్లు అనుకూలంగా మార్చడం కోసం ఉపయోగిస్తాము, ఉదాహరణకు:
- మీకు నచ్చే అవకాశం ఉన్న వీడియోల సిఫార్సులు చేయడం
- మీరు Google సర్వీస్‌లను ఎలా ఉపయోగిస్తారనే దానికి అనుగుణంగా తగిన సెక్యూరిటీ చిట్కాలను రూపొందించడం (సెక్యూరిటీ చెకప్‌ను చూడండి)
మేము డేటాను, యాడ్లను వ్యక్తిగతీకరించడానికి కూడా ఉపయోగిస్తాము. సెట్టింగ్‌లు ఆఫ్‌లో ఉండడం, నిర్దిష్ట వయస్సు వంటి అంశాలలో ఇందుకు మినహాయింపు ఉంటుంది.
నేను చూసే యాడ్లను Google వ్యక్తిగతీకరిస్తుందా?
మేము చూపించే యాడ్లు సాధ్యమైనంత వరకూ ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి మేము ట్రై చేస్తాము. కానీ నిర్దిష్ట వయస్సు ఉన్న వారికి, యాడ్ వ్యక్తిగతీకరణను ఆఫ్ చేసిన వారికీ మేము యాడ్లను వ్యక్తిగతీకరించము.
వ్యక్తిగతీకరించక పోయినా కూడా అప్పటికీ మేము యాడ్లను ఉపయోగకరంగా ఉండేలా చూడగలము. ఉదాహరణకు, మీరు "కొత్త షూస్" అనే పేజీ ఫలితాల కోసం చూస్తున్నట్లయితే, మీరు స్నీకర్ కంపెనీ నుండి యాడ్‌ను చూడవచ్చు. యాడ్లను అవి రోజులోని సమయం, మీ సాధారణ లొకేషన్, మీరు చూస్తున్న పేజీ తాలూకు కంటెంట్ వంటి సాధారణ అంశాల ఆధారంగా అందించడం జరగవచ్చు.
కంట్రోల్ మీ చేతుల్లో ఉంది
Google నా ఖాతాకు వేటిని సేవ్ చేయాలో నేను ఎలా నిర్ణయించగలుగుతాను?
మీరు Photos వంటి Google సర్వీస్‌ను ఉపయోగిస్తున్నప్పడు, మీరు మీ ఫోటోలను బ్యాకప్ చేసి సింక్ చేయాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని నిర్ణయించడానికి వీలు కల్పించే సెట్టింగ్‌లు ఉన్నాయి.
Google సర్వీస్‌లలో మీ యాక్టివిటీకి సంబంధించిన సమాచారం మీ Google ఖాతాలో హిస్టరీగా సేవ్ కావాలా వద్దా, అలాగే మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడానికి మీ ఖాతాలోని సమాచారాన్ని Google సర్వీస్‌లు ఉపయోగించవచ్చా లేదా అనేది నిర్ణయించుకోవడానికి కొన్ని సెట్టింగ్‌లు కూడా ఉన్నాయి.
Search సర్వీసులలో వ్యక్తిగతీకరించబడిన సిఫార్సులు
మీ ప్రొఫైల్ సమాచారం, సేవ్ చేసిన హిస్టరీ వంటి మీ Google ఖాతాలోని సమాచారం ఆధారంగా Search, Maps, Shopping, హోటళ్లు, Flights, Translate, News వంటి Search సర్వీసులు మీకు వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అందించవచ్చా లేదా అనేది ఎంచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, మీ ఆసక్తులకు అనుగుణంగా AI సమాధానాలను అందించడానికి Search సర్వీసులు ఆ సమాచారాన్ని ఉపయోగించగవచ్చు.
Search సర్వీసుల హిస్టరీ
Search సర్వీసులలో మీ యాక్టివిటీని సేవ్ చేస్తుంది. ఉదాహరణకు, మీ సెర్చ్‌లు, మీ జనరల్ ఏరియా వంటి అనుబంధిత సమాచారం. Search సర్వీసులలో మీ ఎక్స్పీరియన్స్లను అనుకూలంగా మార్చడానికి మీ యాక్టివిటీని ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు టైప్ చేయడం ప్రారంభించినప్పుడు, గత సెర్చ్‌లు మీకు సూచనలుగా కనిపిస్తాయి. AI మోడల్స్‌తో సహా Google సర్వీస్‌లను, టెక్నాలజీలను మెరుగుపరచడంలో సహాయపడటానికి, Googleకు, దాని యూజర్లకు, పబ్లిక్కు రక్షణ కల్పించడానికి కూడా మీ Search సర్వీసుల హిస్టరీ డేటాను Google ఉపయోగిస్తుంది.
Google Play వ్యక్తిగతీకరణ
Play Store నుండి మీరు కొనుగోలు చేసే, డౌన్లోడ్ చేసే ఐటెమ్‌ల వంటి మీ Google ఖాతాలోని సమాచారాన్ని Google Play ఉపయోగించవచ్చా లేదా అనేది ఎంచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది, తద్వారా మీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత వ్యక్తిగతీకరించవచ్చు. ఉదాహరణకు, మీరు ఉపయోగించే యాప్‌ల ఆధారంగా Google Play మీకు యాప్‌లను మరింత బాగా సిఫార్సు చేయగలదు.
Play హిస్టరీ
మీ డివైజ్‌లో మీరు తెరిచే యాప్‌ల వంటి మీ Play యాక్టివిటీని మీ Google ఖాతాలో సేవ్ చేస్తుంది. Google సర్వీస్‌లలో మీ ఎక్స్‌పీరియన్స్‌ను అనుకూలంగా మార్చడానికి ఈ యాక్టివిటీని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు వెతుకుతున్న యాప్‌లను వేగంగా కనుగొనడంలో మీకు సహాయపడటం.
వెబ్ & యాప్ కార్యకలాపం
Google TV వంటి కొన్ని Google సైట్లు, యాప్‌ల నుండి పొందిన మీ యాక్టివిటీని సేవ్ చేస్తుంది, ఇందులో లొకేషన్ లాంటి అనుబంధిత సమాచారం కూడా ఉంటుంది. Google సర్వీస్‌లను ఉపయోగించే సైట్లు, యాప్‌లు, డివైజ్‌ల నుండి సింక్ చేసిన Chrome హిస్టరీని, యాక్టివిటీని కూడా ఇది సేవ్ చేస్తుంది. Google సర్వీస్‌లలో మీకు మెరుగైన సిఫార్సులను, మరింత వ్యక్తిగతీకరించిన ఎక్స్పీరియన్స్లను అందించడానికి మీ యాక్టివిటీని ఉపయోగించడం జరుగుతుంది.
YouTube హిస్టరీ
YouTubeను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు చూసే వీడియోలను, మీరు సెర్చ్ చేసే అంశాలను సేవ్ చేస్తుంది. మీకు మెరుగైన సిఫార్సులను అందించడం, మీరు ఎక్కడ ఆపారో అక్కడి నుండి కొనసాగించడంలో మీకు సహాయపడటం వంటి పనులను చేయడానికి మీ YouTube హిస్టరీని ఉపయోగించడం జరుగుతుంది.
Gemini యాప్స్ యాక్టివిటీ
AI మోడల్స్‌తో సహా Google సర్వీస్‌లను మెరుగుపరచడంలో సహాయపడటానికి, మీ చాట్లు, మీరు Geminiతో షేర్ చేసే ఐటెమ్‌ల (ఫైల్స్, ఫోటోల వంటివి) వంటి వాటి కోసం మీ Gemini యాక్టివిటీని Google ఉపయోగించవచ్చా లేదా అనేది ఎంచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీ Gemini యాప్స్ యాక్టివిటీని, మీరు చాట్లను ఎక్కడ ఆపారో అక్కడి నుండి ఏ సమయంలోనైనా కొనసాగించడానికి వీలు కల్పించడం వంటి పనులను చేయడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది.
నా డేటాను ఎలా తొలగించాలి?
మీరు మీ Google ఖాతాలో సేవ్ చేసిన డేటాను తొలగించవచ్చు. మీరు శాశ్వతంగా తొలగించాలనుకునే డేటా మా సిస్టమ్‌ల నుండి తీసివేయబడుతుంది. మేము ఈ డేటాను మా సర్వర్ల నుండి పూర్తిగా తీసివేయబడేలా చూడడానికి తగిన జాగ్రత్తలతో కూడిన ప్రాసెస్‌ను అనుసరిస్తాము లేదా మీతో ఏ విధంగానూ అనుబంధితం కాని రూపంలో మాత్రమే దాన్ని ఉంచేలా జాగ్రత్త తీసుకుంటాము.
మీ Google ఖాతాలో సేవ్ చేసిన యాక్టివిటీని రివ్యూ చేయడానికి నా యాక్టివిటీకి వెళ్లండి, ఉదాహరణకు మీరు ఎంటర్ చేసిన ప్రాంప్ట్‌లు, మీరు సెర్చ్ చేసిన, చదివిన, చూసిన అంశాలు. మీరు నిర్దిష్టంగా ఒక యాక్టివిటీని గాని, లేదా నిర్దిష్ట సమయ పరిధిలోని మీ యాక్టివిటీ అంతటినీ గాని తొలగించవచ్చు.
మీ యాక్టివిటీ ఆటోమేటిక్‌గా తొలగించబడేలా కూడా మీరు ఎంచుకోవచ్చు.
నా కంటెంట్‌ను నేను ఎలా డౌన్లోడ్ చేయాలి?
మీ కంటెంట్‌లో ఇమెయిల్‌లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ షీట్లు, కామెంట్లు, కాంటాక్ట్‌లు, క్యాలెండర్ ఈవెంట్ల వంటి అంశాలు ఉంటాయి.
మీ కంటెంట్ ఆర్కైవ్‌ను క్రియేట్ చేయడానికి మీ డేటాను డౌన్లోడ్ చేయండికి వెళ్లండి — తద్వారా మీరు దానిని బ్యాకప్ చేయడం లేదా భిన్నమైన సర్వీస్‌ను ట్రై చేయాలనుకుంటే, దానిని మరొక కంపెనీకి తీసుకువెళ్లడం చేయవచ్చు.
నేను సైన్ అవుట్ చేశాక కూడా ఎటువంటి కంట్రోల్స్‌ను కలిగి ఉంటాను?
మీరు సైన్ అవుట్ అయ్యి ఉన్నప్పుడు కూడా, Googleను ఎలా ఉపయోగించాలో ఎంచుకొనే వీలు కల్పించే కంట్రోల్స్ మీకు ఉన్నాయి. మీరు సైన్ అవుట్ అయ్యి ఉన్నప్పుడు ఈ సెట్టింగ్‌లను మార్చడానికి, g.co/privacytoolsకు వెళ్లండి:
Search అనుకూలీకరణ
ఈ బ్రౌజర్ నుండి Google మీ సెర్చ్‌లను మరింత సందర్భోచితమైన ఫలితాలు, సిఫార్సుల కోసం ఉపయోగిస్తుంది.
YouTube సెర్చ్, వీక్షణ హిస్టరీ
YouTubeను మీ కోసం వ్యక్తిగతీకరించడానికి, వీడియోలు, మీరు సెర్చ్ చేసే అంశాల వంటి మీ YouTube యాక్టివిటీని ఉపయోగిస్తుంది.
మీరు మీ బ్రౌజర్లో కొన్ని, లేదా అన్ని కుక్కీలనూ బ్లాక్ చేయవచ్చు. కానీ దీని వలన వెబ్ అంతటా కొన్ని ఫీచర్లు పనిచేయడం ఆగిపోవచ్చు. ఉదాహరణకు, మీరు సైన్ ఇన్ చేయాలనుకున్నప్పుడు, అనేక వెబ్సైట్లకు కుక్కీలు ఆన్‌లో ఉండాలి.
సైన్ అవుట్ చేసిన యూజర్లు కూడా వారు వ్యక్తిగతీకరించిన యాడ్లను చూడాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని ఎంచుకోవచ్చు, అయితే మేము నిర్దిష్ట వయస్సు ఉన్న వారి విషయంలో వ్యక్తిగతీకరించడం అనేది చేయము.
