వ్యాపార ప్రకటన

Google మరియు అనేక వెబ్‌సైట్‌లను మరియు సేవలను మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఉపయోగించేలా వ్యాపార ప్రకటనలు చేస్తాయి. ప్రకటనలు సురక్షితంగా, సందర్భోచితంగా మరియు వీలైనంత సంబంధితంగా ఉండేలా హామీ ఇవ్వడానికి మేము చాలా శ్రమిస్తాము. ఉదాహరణకు, మీకు Googleలో పాప్-అప్ ప్రకటనలు కనిపించవు మరియు మేము ప్రతి సంవత్సరం మా విధానాలను ఉల్లంఘించే ప్రచురణకర్తలు మరియు ప్రకటనకర్తల యొక్క వేలకొద్దీ ఖాతాలను రద్దు చేస్తుంటాము, అలాగే మాల్వేర్‌ను కలిగి ఉన్న ప్రకటనలు, నకిలీ వస్తువుల కోసం చేసే ప్రకటనలు లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే ప్రకటనలను కూడా రద్దు చేస్తాము.

Chrome, ఇంకా Androidలో ప్రైవసీ శాండ్‌బాక్స్ ఇనీషియేటివ్ ద్వారా ఆన్‌లైన్‌లో వ్యక్తుల గోప్యతను మరింతగా మెరుగుపరిచే మార్గాలను అందించే ఉద్దేశంతో, డిజిటల్ అడ్వర్టయిజింగ్ డెలివరీకి, ఇంకా మెజర్‌మెంట్‌కు సపోర్ట్‌ను అందించడానికి Google అడ్వర్టయిజింగ్ సర్వీస్‌లు కొత్త మార్గాలతో ప్రయోగాలు చేస్తున్నాయి. Chrome లేదా Androidలో సంబంధిత ప్రైవసీ శాండ్‌బాక్స్ సెట్టింగ్‌లు ఎనేబుల్ చేసిన యూజర్‌లు తమ బ్రౌజర్ లేదా మొబైల్ పరికరంలో స్టోర్ చేయబడిన టాపిక్‌లు లేదా సంరక్షించబడిన ఆడియన్స్ డేటా ఆధారంగా Google అడ్వర్టయిజింగ్ సర్వీస్‌ల నుండి సంబంధిత యాడ్‌లను చూడవచ్చు. Google అడ్వర్టయిజింగ్ సర్వీస్‌లు వారి బ్రౌజర్ లేదా మొబైల్ పరికరంలో స్టోర్ చేయబడిన అట్రిబ్యూషన్ రిపోర్టింగ్ డేటాను ఉపయోగించి యాడ్ పనితీరును కూడా కొలవవచ్చు. ప్రైవసీ శాండ్‌బాక్స్‌కు సంబంధించిన మరింత సమాచారం.

వ్యాపార యాడ్‌లలో Google కుకీలను ఎలా ఉపయోగిస్తుంది

కుకీలు వ్యాపార ప్రకటనలను మరింత ప్రభావవంతం చేయడానికి సహాయపడతాయి. కుకీలు లేకుంటే, ప్రకటనదారుకు తమ ప్రేక్షకులను చేరుకోవడం లేదా ఎన్ని ప్రకటనలు చూపబడ్డాయో మరియు ఎన్ని క్లిక్‌లు వచ్చాయో తెలుసుకోవడం క్లిష్టమవుతుంది.

వార్తా సైట్‌లు మరియు బ్లాగ్‌లు వంటి పలు వెబ్‌సైట్‌లు తమ సందర్శకులకు ప్రకటనలను చూపడానికి Googleతో భాగస్వామ్యం చేసుకున్నాయి. మా భాగస్వాములతో పని చేస్తూ, మేము కుకీలను మీరు ఒకే ప్రకటనను మళ్లీ అనేకసార్లు చూడకుండా ఆపడం, క్లిక్ చేయడం వలన సంభవించే మోసాన్ని గుర్తించి, ఆపడం మరియు మరింత సంబంధిత ప్రకటనలను చూపడం (మీరు సందర్శించిన వెబ్‌సైట్‌ల ఆధారంగా ప్రకటనలను చూపడం వంటిది) వంటి పలు ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

మేము అందించే ప్రకటనల యొక్క నివేదికను మా లాగ్‌ల్లో నిల్వ చేస్తాము. ఈ సర్వర్ లాగ్‌ల్లో సాధారణంగా మీ వెబ్ అభ్యర్థన, IP చిరునామా, బ్రౌజర్ రకం, బ్రౌజర్ భాష, మీ అభ్యర్థన యొక్క తేదీ మరియు సమయం మరియు మీ బ్రౌజర్‌ని ప్రత్యేకంగా గుర్తించే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కుక్కీలు ఉంటాయి. మేము ఈ డేటాను పలు కారణాల రీత్యా నిల్వ చేస్తాము, మా సేవలను మెరుగుపరచడం మరియు మా సిస్టమ్‌ల యొక్క భద్రతను నిర్వహించడం అనేవి వాటిలో అత్యంత ముఖ్యమైనవి. మేము IP చిరునామాలో కొంత భాగాన్ని (9 నెలల తర్వాత) మరియు కుక్కీ సమాచారాన్ని (18 నెలల తర్వాత) తీసివేయడం ద్వారా ఈ లాగ్ డేటాను అనామకంగా చేస్తాము.

మా వ్యాపార ప్రకటన కుకీలు

మా భాగస్వాములకు తమ వ్యాపార ప్రకటనలను మరియు వెబ్‌సైట్‌లను నిర్వహించడంలో సహాయపడటానికి, మేము AdSense, AdWords, Google Analytics మరియు అనేక DoubleClick బ్రాండ్ గల సేవలతో సహా వివిధ ఉత్పత్తులను అందిస్తాము. మీరు Google సేవల్లో లేదా ఇతర సైట్‌ల్లో మరియు అనువర్తనాల్లో ఈ ఉత్పత్తుల్లో ఏదైనా ఉపయోగించే పేజీని సందర్శించినప్పుడు లేదా ప్రకటనను చూసినప్పుడు, మీ బ్రౌజర్‌కు వివిధ కుక్కీలు పంపబడవచ్చు.

ఇవి google.com, doubleclick.net, googlesyndication.com లేదా googleadservices.com లేదా మా భాగస్వామి సైట్‌ల యొక్క డొమైన్‌తో సహా కొన్ని విభిన్న డొమైన్‌ల నుండి సెట్ చేయబడవచ్చు. మా వ్యాపార ప్రకటన ఉత్పత్తుల్లో కొన్ని మాతో ఉమ్మడిగా ఇతర సేవలను (ప్రకటన గణన మరియు నివేదన సేవ వంటివి) ఉపయోగించడానికి మా భాగస్వాములను అనుమతిస్తాయి మరియు ఈ సేవలు తమ స్వంత కుక్కీలను మీ బ్రౌజర్‌కు పంపవచ్చు. ఈ కుక్కీలు వాటి డొమైన్‌ల నుండి సెట్ చేయబడతాయి.

Google మరియు మా భాగస్వాములు ఉపయోగించే కుక్కీల రకాలు మరియు మేము వీటిని ఎలా ఉపయోగిస్తాము అనేదాని గురించి మరిన్ని వివరాలు చూడండి.

మీరు వ్యాపార ప్రకటన కుకీలను ఎలా నియంత్రించవచ్చు

మీకు కనిపించే Google యాడ్‌లను మేనేజ్ చేయడానికి, అలాగే వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఆఫ్ చేయడానికి మీరు యాడ్ సెట్టింగ్‌లను ఉపయోగించవచ్చు. మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఆఫ్ చేసినా, మీ IP అడ్రస్ ద్వారా కనుగొన్న లొకేషన్, మీ బ్రౌజర్ రకం, అలాగే మీ సెర్చ్ క్వెరీల ఆధారంగా మీకు ఇప్పటికీ యాడ్‌లు కనిపించవచ్చు.

అలాగే చాలా దేశాల్లో స్వీయ నియంత్రిత కార్యక్రమాల క్రింద రూపొందించే US ఆధారితమైన aboutads.info ఎంపికలు పేజీ లేదా EU ఆధారితమైన మీ ఆన్‌లైన్ ఎంపికలు వంటి వినియోగదారు ఎంపిక సాధనాల ద్వారా మీరు ఆన్‌లైన్ వ్యాపార ప్రకటనల కోసం ఉపయోగించే అనేక కంపెనీల కుక్కీలను కూడా నిర్వహించవచ్చు.

చివరిగా, మీరు మీ వెబ్ బ్రౌజర్‌లో కుకీలను నిర్వహించవచ్చు.

వ్యాపార యాడ్‌లలో ఉపయోగించే ఇతర సాంకేతికతలు

Google వ్యాపార ప్రకటన సిస్టమ్‌లు పారస్పరిక ప్రకటన ఆకృతుల ప్రదర్శన వంటి కార్యాచరణల కోసం Flash మరియు HTML5తో సహా ఇతర సాంకేతికతలను ఉపయోగించవచ్చు. మేము IP చిరునామాను ఉపయోగించవచ్చు, ఉదాహరణకు, మీ సాధారణ స్థానాన్ని గుర్తించడం కోసం. మేము మీ పరికర రకం, బ్రౌజర్ రకం లేదా యాక్సలెరోమీటర్ వంటి మీ పరికరంలో సెన్సార్‌లు వంటి మీ కంప్యూటర్ లేదా పరికరం గురించి సమాచారం ఆధారంగా కూడా వ్యాపార ప్రకటనను ఎంచుకోవచ్చు.

స్థానం

Google ప్రకటన ఉత్పత్తులు పలు రకాల మూలాల నుండి మీ స్థానం గురించి సమాచారాన్ని స్వీకరించవచ్చు లేదా ఊహించవచ్చు. ఉదాహరణకు, మేము మీ సాధారణ స్థానాన్ని గుర్తించడానికి IP చిరునామాను ఉపయోగించవచ్చు; మేము మీ మొబైల్ పరికరం నుండి ఖచ్చితమైన స్థానాన్ని స్వీకరించవచ్చు; మేము మీ శోధన ప్రశ్నల ఆధారంగా మీ స్థానాన్ని ఊహించవచ్చు; మరియు మీరు ఉపయోగించే వెబ్‌సైట్‌లు లేదా అనువర్తనాలు మీ స్థానం గురించి సమాచారాన్ని మాకు పంపవచ్చు. Google జనసంఖ్యా సంబంధిత సమాచారాన్ని అంచనా వేయడానికి, మీకు చూపే ప్రకటనలను మరింత సందర్భోచితంగా ఉండేలా మెరుగుపరచడానికి, ప్రకటన ప్రభావాన్ని అంచనా వేయడానికి మరియు ప్రకటనకర్తలకు సమగ్ర గణాంకాలను నివేదించడానికి మా వ్యాపార ప్రకటనల ఉత్పత్తుల్లో స్థాన సమాచారాన్ని ఉపయోగిస్తుంది.

మొబైల్ యాప్‌ల కోసం వ్యాపార ప్రకటనల ఐడెంటిఫైయర్‌లు

మేము కుక్కీ సాంకేతికత అందుబాటులో లేని సేవల్లో (ఉదాహరణకు, మొబైల్ అనువర్తనాల్లో) ప్రకటనలను అందించడానికి కుక్కీలకు సారూప్యంగా ఉండే అవే రకమైన కార్యాచరణలను అమలు చేసే సాంకేతికతలను ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు వ్యాపార ప్రకటనలను మీ మొబైల్ అనువర్తనాలు మరియు మొబైల్ బ్రౌజర్ మధ్య సమన్వయం చేయడానికి Google మొబైల్ అనువర్తనాల్లో వ్యాపార ప్రకటనల కోసం ఉపయోగించే ఐడెంటిఫైయర్‌ను అదే పరికరంలోని వ్యాపార ప్రకటన కుక్కీకి లింక్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు మీ మొబైల్ బ్రౌజర్‌లో వెబ్ పేజీని ప్రారంభించే ప్రకటనను అనువర్తనంలో చూసినప్పుడు ఇలా జరగవచ్చు. ఇది మేము మా ప్రకటనకర్తలకు వారి ప్రచారాల ప్రభావం గురించి నివేదికలను అందించడంలో కూడా మాకు సహాయపడుతుంది.

మీ పరికరంలో మీకు కనిపించే యాడ్‌లు దాని అడ్వర్టయిజింగ్ ID ఆధారంగా వ్యక్తిగతీకరించబడవచ్చు. Android పరికరాలలో, మీరు వీటిని చేయవచ్చు:

 • మీ పరికర అడ్వర్టయిజింగ్ IDను రీసెట్ చేయడం, ఇది ప్రస్తుతం ఉన్న IDని కొత్త దానితో రీప్లేస్ చేస్తుంది. యాప్‌లు ఇప్పటికీ మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపగలవు, కానీ కొంతకాలం పాటు అవి మీకు సందర్భోచితంగా లేదా ఆసక్తికరంగా ఉండకపోవచ్చు.
 • మీ పరికర అడ్వర్టయిజింగ్ IDని తొలగించడం, ఇది అడ్వర్టయిజింగ్ IDని తొలగించి, కొత్త దాన్ని కేటాయించదు. యాప్‌లు ఇప్పటికీ మీకు యాడ్‌లను చూపగలవు, కానీ అవి మీకు సందర్భోచితంగా లేదా ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. మీకు ఈ అడ్వర్టయిజింగ్ ID ఆధారంగా యాడ్‌లు కనిపించవు, కానీ ఇప్పటికీ యాప్‌లతో షేర్ చేసిన సమాచారం వంటి ఇతర అంశాల ఆధారంగా యాడ్‌లు కనిపించవచ్చు.

మీ Android పరికరంలో అడ్వర్టయిజింగ్ IDకి మార్పులు చేయడానికి, ఈ కింది సూచనలను అనుసరించండి.

Android

మీ పరికర అడ్వర్టయిజింగ్ IDని రీసెట్ చేయండి

పరికర అడ్వర్టయిజింగ్ IDని రీసెట్ చేయడానికి:

 1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
 2. గోప్యత > యాడ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
 3. అడ్వర్టయిజింగ్ IDని రీసెట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, మీరు చేసిన మార్పులను నిర్ధారించండి.
మీ పరికర అడ్వర్టయిజింగ్ IDని తొలగించండి

మీ పరికర అడ్వర్టయిజింగ్ IDని తొలగించడానికి:

 1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
 2. గోప్యత > యాడ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
 3. అడ్వర్టయిజింగ్ IDని తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, మీరు చేసిన మార్పులను నిర్ధారించండి.

మీ అడ్వర్టయిజింగ్ ID రీసెట్ చేయబడుతుంది లేదా తొలగించబడుతుంది, కానీ ఇతర రకాల ఐడెంటిఫయర్‌‌లను ఉపయోగించి యాప్‌లు వాటి స్వంత సెట్టింగ్‌లను కలిగి ఉండవచ్చు, ఇవి కూడా మీకు కనిపించే యాడ్‌లను ప్రభావితం చేయగలవు.

Androidకు చెందిన కొన్ని పాత వెర్షన్‌లలో

మీ Android పరికరానికి చెందిన వెర్షన్ 4.4 లేదా అంతకంటే పాతది అయితే:

 1. సెట్టింగ్‌లను తెరవండి
 2. గోప్యత > అధునాతనం > యాడ్‌లు అనే ఆప్షన్‌లపై ట్యాప్ చేయండి
 3. యాడ్‌ల వ్యక్తిగతీకరణ నుండి సమ్మతిని నిలిపివేయండి అనే ఆప్షన్‌ను ఆన్ చేసి, మీరు చేసిన మార్పులను నిర్ధారించండి.

iOS

iOS గల పరికరాలు Apple వ్యాపార ప్రకటన ఐడెంటిఫైయర్‌ని ఉపయోగిస్తాయి. ఈ ఐడెంటిఫైయర్‌ను ఉపయోగించడం కోసం మీకు గల ఎంపికల గురించి మరింత తెలుసుకోవడానికి, మీ పరికరంలో సెట్టింగ్‌లు అనువర్తనాన్ని సందర్శించండి.

కనెక్ట్ అయిన టీవీ/ఓవర్-ది-టాప్

కనెక్ట్ చేసిన టీవీ కోసం అడ్వర్టయిజింగ్ ఐడెంటిఫయర్‌‌లు

కనెక్ట్ చేసిన టీవీలు అన్నవి మరొక ప్లాట్‌ఫామ్‌కు సంబంధించినవి, అక్కడ కుక్కీ టెక్నాలజీ అందుబాటులో ఉండదు, బదులుగా, యాడ్‌లను ప్రదర్శించడానికి అడ్వర్టయిజింగ్‌లో ఉపయోగించడానికి రూపొందించిన పరికర ఐడెంటిఫయర్‌‌లపై Google ఆధారపడుతుంది. అనేక కనెక్ట్ చేసిన టీవీ పరికరాలు అడ్వర్టయిజింగ్ కోసం మొబైల్ పరికర ఐడెంటిఫయర్‌‌ల ఫంక్షనాలిటీ మాదిరిగానే ఉండే ఐడెంటిఫయర్‌ను సపోర్ట్ చేస్తాయి. యూజర్‌లకు రీసెట్ చేసే లేదా వ్యక్తిగతీకరించిన యాడ్‌లను పూర్తిగా నిలిపివేసే ఆప్షన్‌ను అందించడానికి ఈ ఐడెంటిఫయర్‌లు రూపొందించబడ్డాయి.

ఈ కింది “యాడ్‌ల” సెట్టింగ్‌లు ఈ కింది స్థిర భాషలో టీవీల్లో అందుబాటులో ఉంటాయి:

 • అడ్వర్టయిజింగ్ IDని రీసెట్ చేయండి
 • అడ్వర్టయిజింగ్ IDని తొలగించండి
 • యాడ్‌ల వ్యక్తిగతీకరణను నిలిపివేయండి (ఆన్ లేదా ఆఫ్)
 • Google ద్వారా యాడ్‌లు (Google యాడ్ వ్యక్తిగతీకరణ గురించి ఉన్న లింక్‌లు)
 • మీ అడ్వర్టయిజింగ్ ID (పొడవైన స్ట్రింగ్)

ఈ యాడ్ సెట్టింగ్‌లు వరుసగా Google TV, అలాగే Android TVలో ఈ కింది పాత్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Google TV

యాడ్‌లకు స్థిరమైన పాత్:

 1. సెట్టింగ్‌లు
 2. గోప్యత
 3. ప్రకటనలు

Android TV

Android TVకి సంబంధించి టీవీ తయారీదారు/మోడల్ ఆధారంగా యాడ్ సెట్టింగ్‌లు సాధారణంగా ఉండే రెండు పాత్‌ల నుండి ఒకదానిలో కనిపిస్తాయి. Android TVలో సెట్టింగ్‌ల పాత్‌ను స్వీకరించే స్వతంత్రం పార్ట్‌నర్‌లకు ఉంది. అనుకూల టీవీ అనుభవానికి తగిన పాత్‌లలో దేన్ని ఉపయోగించాలి అన్న విషయంలో పార్ట్‌నర్‌లు స్వంతంగా నిర్ణయం తీసుకోవచ్చు, అయితే యాడ్ సెట్టింగ్‌లకు సాధారణంగా ఉండే పాత్‌లను ఈ కింద పేర్కొన్నాము.

పాత్ A:

 1. సెట్టింగ్‌లు
 2. పరిచయం
 3. న్యాయ సమాచారం
 4. ప్రకటనలు

పాత్ B:

 1. సెట్టింగ్‌లు
 2. పరికరాల ప్రాధాన్యతలు
 3. పరిచయం
 4. న్యాయ సమాచారం
 5. ప్రకటనలు
Google యేతర పరికరాలు

అనేక కనెక్ట్ చేసిన పరికరాలు అడ్వర్టయిజింగ్ కోసం ఐడెంటిఫయర్‌‌లను సపోర్ట్ చేస్తాయి, అలాగే వ్యక్తిగతీకరించిన అడ్వర్టయిజింగ్‌ను నిలిపివేయడానికి యూజర్‌లకు మార్గాలను అందిస్తాయి. ఆ పరికరాల పూర్తి జాబితా, అలాగే నిలిపివేయడానికి యూజర్‌లకు ఉన్న మార్గాలు ఇక్కడ ఉన్న నెట్‌వర్క్ అడ్వర్టయిజింగ్ ప్రోగ్రామ్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసి ఉంచాము: https://thenai.org/opt-out/connected-tv-choices/.

Google అందించే యాడ్‌లలో నాకు వేటిని చూపాలో నిశ్చయించడానికి ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకోబడతాయి?

మీకు ఏ ప్రకటన చూపాలి అనేది నిశ్చయించడానికి అనేక నిర్ణయాలు తీసుకోబడతాయి.

కొన్నిసార్లు మీకు కనిపించే ప్రకటన మీ ప్రస్తుత లేదా గత స్థానం ఆధారితంగా చూపబడుతుంటుంది. మీ IP చిరునామా అనేది సాధారణంగా మీ సుమారు స్థానానికి మంచి సూచికగా పరిగణించబడుతుంది. దీని వలన, మీకు YouTube.com హోమ్‌పేజీలో మీ దేశంలో త్వరలో విడుదల కానున్న కొత్త చలనచిత్రం గురించి ప్రచారం చేసే వ్యాపార ప్రకటన కనిపించవచ్చు లేదా ‘pizza’ కోసం శోధిస్తే మీ పట్టణంలోని పిజ్జా దొరికే ప్రదేశాల ఫలితాలు అందించవచ్చు.

కొన్నిసార్లు మీకు పేజీ సందర్భం ఆధారంగా ప్రకటన చూపబడుతుంది. మీరు తోటపని చిట్కాలకు సంబంధించిన పేజీని చూస్తుంటే, మీకు తోటపని సామగ్రికి సంబంధించిన ప్రకటనలు కనిపించవచ్చు.

అలాగే మీకు కొన్నిసార్లు మీ అనువర్తన కార్యాచరణ లేదా Google సేవల్లోని కార్యాచరణ ఆధారంగా వెబ్‌లో ప్రకటన కనిపించవచ్చు; మీ వెబ్ కార్యాచరణ ఆధారంగా అనువర్తనంలో ప్రకటన కనిపించవచ్చు; లేదా మరొక పరికరంలో మీ కార్యాచరణ ఆధారంగా ప్రకటన కనిపించవచ్చు.

కొన్నిసార్లు పేజీలో మీకు కనిపించే ప్రకటనను Google అందిస్తుంది కానీ అది మరొక కంపెనీ ద్వారా ఎంపిక చేయబడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు వార్తాపత్రిక వెబ్‌సైట్‌తో నమోదు చేసుకుని ఉండవచ్చు. మీరు వార్తాపత్రికకు అందించిన సమాచారం ఆధారంగా అది మీకు ఏ ప్రకటనలను చూపాలనే దాని గురించి నిర్ణయం తీసుకోవచ్చు మరియు ఆ ప్రకటనలను సమర్పించడానికి Google ప్రకటన సమర్పణ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.

అలాగే మీరు మీ ప్రకటనకర్తలకు అందించిన, వారు ఆపై Googleకి భాగస్వామ్యం చేసిన మీ ఇమెయిల్ చిరునామా వంటి సమాచారం ఆధారంగా కూడా శోధన, Gmail మరియు YouTubeతో సహా Google ఉత్పత్తులు మరియు సేవల్లో ప్రకటనలు కనిపించవచ్చు.

నేను వీక్షించిన ఉత్పత్తుల కోసం నాకు Google ప్రకటనలను ఎందుకు చూపుతుంది?

మీరు మునుపు వీక్షించిన ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు మీకు కనిపించవచ్చు. ఉదాహరణకు మీరు గోల్ఫ్ క్లబ్‌లను విక్రయించే వెబ్‌సైట్ ఒకటి సందర్శించారనుకోండి, కానీ మీ మొదటి సందర్శనలో ఆ క్లబ్‌లు ఏవీ కొనుగోలు చేయలేదనుకోండి. అప్పుడు వెబ్‌సైట్ యజమాని మీరు వెబ్‌సైట్‌కు తిరిగి వచ్చి మీ కొనుగోలు పూర్తి చేసేలా ప్రోత్సహించాలనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వెబ్‌సైట్ నిర్వాహకులు వారి ప్రకటనలను వారి పేజీలను సందర్శించిన వ్యక్తులకు లక్ష్యం చేసి చూపడంలో సహాయపడేందుకు Google సేవలను అందిస్తుంది.

ఇది పని చేసేలా చేయడం కోసం, Google మీ బ్రౌజర్‌లో ఇప్పటికే ఉన్న కుక్కీని చదువుతుంది లేదంటే మీరు గోల్ఫింగ్ సైట్‌ను సందర్శించినప్పుడు మీ బ్రౌజర్‌లో కుక్కీని భద్రపరుస్తుంది (మీ బ్రౌజర్ ఇందుకు అనుమతిస్తుందని భావిస్తూ).

మీరు Googleతో పని చేసే మరో సైట్‌ను సందర్శించినప్పుడు, ఆ సైట్‌కు గోల్ఫింగ్‌తో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ మీకు ఆ గోల్ఫ్ క్లబ్‌ల యొక్క ప్రకటన కనిపించవచ్చు. ఇందుకు కారణం మీ బ్రౌజర్ Googleకి అదే కుక్కీని పంపడమే. అందుకు ప్రతిస్పందనగా, మేము ఆ కుక్కీని ఉపయోగించి మిమ్మల్ని ఆ గోల్ఫ్ క్లబ్‌లను కొనుగోలు చేయాల్సిందిగా ప్రోత్సహించే ప్రకటనను మీకు చూపవచ్చు.

Google మీ గోల్ఫింగ్ సైట్ సందర్శనను మీరు గోల్ఫ్ క్లబ్‌ల కోసం Googleలో తర్వాత ఎప్పుడైనా శోధించేటప్పుడు మీకు వ్యక్తిగతీకరించిన ప్రకటనలను చూపడానికి కూడా ఉపయోగించవచ్చు.

మాకు ఈ రకమైన యాడ్‌పై పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు, ఆరోగ్య సమాచారం లేదా మతపరమైన విశ్వాసాల వంటి సున్నితమైన సమాచారం ఆధారంగా ప్రేక్షకులను ఎంచుకోనీయకుండా మేము ప్రకటనకర్తలను అడ్డుకుంటాము.

Google ప్రకటనల గురించి మరింత తెలుసుకోండి.

Google యాప్‌లు
ప్రధాన మెనూ