పరిచయం
ప్రపంచ సమాచారాన్ని మేనేజ్ చేయడం, దాన్ని విశ్వవ్యాప్తంగా యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంచడం, అలాగే ఉపయోగకరంగా చేయడమే Google లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా లొకేషన్ సమాచారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డ్రైవింగ్ దిశలు మొదలుకుని, మీ సెర్చ్ ఫలితాలలో మీ సమీపంలోని ప్రదేశాల గురించిన ప్రస్తుత సమాచారం, అంటే రెస్టారెంట్లో జనాలు ఎక్కువగా ఉండటం లాంటి సంగతులు తెలియజేయడం దాకా అనేక విషయాలలో లొకేషన్ సమాచారం సహకారంతో Googleలో మీ అనుభవాలను మరింత సందర్భోచితంగా, అలాగే సహాయకరంగా మలుచుకోవచ్చు.
వెబ్సైట్ను సరైన భాషలో అందించడం లేదా Google సర్వీస్లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటం వంటి కొన్ని ప్రధాన ప్రోడక్ట్ ఫంక్షనాలిటీలలో కూడా లొకేషన్ సమాచారం సహాయపడుతుంది.
మీరు Google ప్రోడక్ట్లు, సర్వీస్లను ఉపయోగించినప్పుడు లొకేషన్ సమాచారంతో సహా Google డేటాను ఎలా ఉపయోగిస్తుంది అనేది Google గోప్యతా పాలసీ వివరిస్తుంది. ఈ పేజీ Google ఉపయోగించే లొకేషన్ సమాచారం, అలాగే దాన్ని ఉపయోగించే మార్గాలను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు అనే దాని గురించి అదనపు వివరాలను అందిస్తుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లకు కొన్ని డేటా ప్రాక్టీసులు భిన్నంగా ఉండవచ్చు. Googleకు చెందిన చిన్నారుల కోసం, Family Linkతో మేనేజ్ చేయబడే Google ఖాతాలు, ప్రొఫైల్స్ కోసం గోప్యతా ప్రకటన, అలాగే Googleకు చెందిన యుక్త వయస్కుల గోప్యతా గైడ్లో మరింత తెలుసుకోండి.
Google లొకేషన్ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది?
Google లొకేషన్ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది అనేది, ఉపయోగించబడుతున్న సర్వీస్ లేదా ఫీచర్, అలాగే వ్యక్తుల పరికరం, ఖాతా సెట్టింగ్ల ఆధారంగా మారుతూ ఉంటుంది. Google లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించగల కొన్ని కీలక మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
అనుభవాలను ఉపయోగకరంగా చేయడానికి
వ్యక్తులు Google ప్రోడక్ట్లలో స్థానికంగా సందర్భోచిత, అలాగే వేగవంతమైన సెర్చ్ ఫలితాలు, వ్యక్తుల రోజువారీ ప్రయాణాల కోసం ట్రాఫిక్ అంచనాలు, అలాగే వ్యక్తికి సంబంధించిన సందర్భాన్ని పరిగణనలోకి తీసుకునే సూచనలను అందించడం వంటి ఇంటరాక్షన్ చేసినప్పుడు ఉపయోగకరమైన సర్వీస్లను అందించడానికి Google లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు లేదా సేవ్ చేయవచ్చు. ఉదాహరణకు, సినిమా సమయాల కోసం సెర్చ్ చేస్తున్న ఎవరైనా సినిమాలను వేరే నగరంలో కాకుండా వారి పరిసరాలలోని థియేటర్లలో చూడాలనుకుంటున్నారు. Google Mapsలో, లొకేషన్ సమాచారం వ్యక్తులు మ్యాప్లో వారి స్థలాన్ని కనుగొనడంలో, అలాగే వారు సందర్శించాలనుకుంటున్న స్థలాలకు నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది.
వ్యక్తులు వారు వెళ్లిన స్థలాలను గుర్తుంచుకోవడంలో సహాయపడటానికి
వ్యక్తులు టైమ్లైన్ను ఉపయోగించి, గతంలో తాము సైన్ ఇన్ చేసిన డివైజ్లతో సహా ఎక్కడెక్కడికి వెళ్లారో, వెనక్కి తిరిగి చూసి తెలుసుకొనే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. టైమ్లైన్ అనేది Google ఖాతాలో అందుబాటులో ఉండే సెట్టింగ్; ఇది మీ డివైజ్లతో మీరు ప్రయాణించిన ప్రదేశాలతో రూట్ మ్యాప్ను క్రియేట్ చేస్తుంది. మీరు టైమ్లైన్ను ఉపయోగించే ఆప్షన్ను ఎంచుకుంటే, మీ డివైజ్ల ఖచ్చితమైన లొకేషన్లు క్రమం తప్పకుండా వ్యక్తిగత మ్యాప్లో, ఇంకా మీ డివైజ్లలో సేవ్ అవుతాయి, మీరు Google యాప్లను తెరిచి ఉంచనప్పుడు కూడా ఇది కొనసాగుతుంది. ఈ సమాచారాన్ని టైమ్లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడటానికి, తొలగించడానికి వీలవుతుంది.
వ్యక్తులు అంశాలను వేగంగా కనుగొనడంలో, అలాగే మరింత సహాయకరమైన ఫలితాలను పొందడంలో సహాయపడటానికి
ఉదాహరణకు, Search సర్వీస్ల హిస్టరీ అనేది Google ఖాతా సెట్టింగ్, ఇది సైన్ ఇన్ చేసిన యూజర్లను Search, Maps, Shopping వంటి సర్వీస్ల నుండి యాక్టివిటీని, అలాగే లొకేషన్ వంటి అనుబంధిత సమాచారాన్ని సేవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. Search సర్వీసులలో మీ వ్యక్తిగతీకరించబడిన సిఫార్సుల సెట్టింగ్ ఆన్లో ఉన్నప్పుడు, ఈ సర్వీసులు మీరు గతంలో సెర్చ్ చేసిన జనరల్ ఏరియాకు సంబంధించి మీకు మరింత ఉపయోగపడే ఫలితాలను, క్యురేట్ చేసిన ఫీడ్లను, అలాగే AI సమాధానాలను అందించగలవు.
మరింత సందర్భోచితమైన యాడ్లను చూపడానికి
మీ లొకేషన్ సమాచారం Google మీకు మరింత సందర్భోచిత యాడ్లను చూపడంలో సహాయపడుతుంది. మీరు "నాకు సమీపంలో ఉన్న షూ స్టోర్లు" వంటి వాటి కోసం సెర్చ్ చేసినప్పుడు, మీకు సమీపంలోని షూ స్టోర్ల నుండి మీకు యాడ్లను చూపడానికి లొకేషన్ సమాచారం ఉపయోగించబడవచ్చు. లేదా, మీరు పెంపుడు జంతువుల బీమా కోసం సెర్చ్ చేస్తున్నారని అనుకుందాం, అడ్వర్టయిజర్లు వివిధ ప్రాంతాలలో వివిధ ప్రయోజనాలను చూపవచ్చు. యాడ్లను చూపడానికి లొకేషన్ సమాచారం ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోండి.
అనుభవాలను మరింత సురక్షితంగా చేయడానికి
అసాధారణ యాక్టివిటీని గుర్తించడం, లేదా కొత్త నగరం నుండి సైన్-ఇన్ చేయడం వంటి వాటిని పసిగట్టడం ద్వారా మీ ఖాతాను సురక్షితంగా ఉంచడం కోసం కొన్ని ప్రాథమిక సర్వీస్లను అందించడానికి Google మీ లొకేషన్ను గురించిన సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
అంచనాలకు, అలాగే రీసెర్చ్ కోసం అజ్ఞాతీకరించిన కమ్యూనిటీ ట్రెండ్లను చూపడానికి
Google పరిశోధన కోసం, అలాగే కమ్యూనిటీ ట్రెండ్లను చూపడానికి సమగ్రపరచిన అజ్ఞాత లొకేషన్ సమాచారాన్ని కూడా ఉపయోగిస్తుంది.
లొకేషన్ సమాచారం ఉపయోగించబడే మరిన్ని మార్గాలను చూడటానికి, Google గోప్యతా పాలసీను సందర్శించండి.
నా Android పరికరం, ఇంకా యాప్లలో లొకేషన్ ఎలా పని చేస్తుంది?
మీరు మీ పరికర లొకేషన్ నుండి లోకల్ సెర్చ్ ఫలితాలను, రోజువారీ ప్రయాణ సూచనలను పొందవచ్చు, అలాగే సమీపంలోని రెస్టారెంట్లను కనుగొనవచ్చు. మీ పరికరంలోని లొకేషన్ సర్వీస్లు లొకేషన్ను అంచనా వేయాలో లేదో, మీ పరికరంలోని నిర్దిష్ట యాప్లు, సర్వీస్లు ఆ లొకేషన్ను ఉపయోగించవచ్చో లేదో, ఒకవేళ ఉపయోగిస్తే ఎలా ఉపయోగించవచ్చు అనేది కంట్రోల్ చేయడానికి మీ మొబైల్ ఫోన్లు లేదా టాబ్లెట్లకు సంబంధించిన Android పరికర సెట్టింగ్లు మిమ్మల్ని అనుమతిస్తాయి.
పరికర లొకేషన్ను యాప్ ఎలా ఉపయోగిస్తుంది అనేది మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు
మీ Android పరికర సెట్టింగ్లలో పరికర లొకేషన్ను ఉపయోగించడానికి ఏ యాప్లకు అనుమతి ఉండాలి అనేది మీరు కంట్రోల్ చేయవచ్చు. సెట్టింగ్లలో, యాప్ ఖచ్చితమైన లేదా రమారమి లొకేషన్ను యాక్సెస్ చేయగలదో లేదో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించే కంట్రోల్స్ను మీరు కలిగి ఉంటారు. యాప్ పరికరాన్ని ఎప్పుడైనా యాక్సెస్ చేయగలగడం, యాప్ ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేయడం, యాప్ ప్రతిసారీ అడగవలసి రావడం లేదా ఎప్పుడూ అడగాల్సిన అవసరం లేకపోవడం అనేవి నిర్ణయించుకోవడానికి మిమ్మల్ని అనుమతించే కంట్రోల్స్ను మేము జోడించాము. ఈ సెట్టింగ్లు, అలాగే కంట్రోల్స్ లభ్యత మీ పరికరం ఏ Android వెర్షన్లో రన్ అవుతోంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరింత తెలుసుకోండి.
పరికరం లొకేషన్ ఎలా పని చేస్తుంది
మీ పరికర సెట్టింగ్ల ఆధారంగా, Android పరికరాలు GPS, సెన్సార్లు (యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, అలాగే బారోమీటర్ వంటివి), మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్, ఇంకా Wi-Fi సిగ్నల్స్తో సహా వివిధ ఇన్పుట్లను ఉపయోగించడం ద్వారా లొకేషన్ను అంచనా వేస్తాయి. అవసరమైన అనుమతులు ఉన్న పరికరంలోని యాప్లు, సర్వీస్లకు అందించబడే అత్యంత ఖచ్చితమైన లొకేషన్ను అంచనా వేయడానికి ఈ ఇన్పుట్లను ఉపయోగించవచ్చు. మీ Android పరికర లొకేషన్ సెట్టింగ్ల గురించి మరింత తెలుసుకోండి.
మొబైల్, ఇంకా Wi-Fi నెట్వర్క్ సిగ్నల్స్ ముఖ్యంగా GPS సిగ్నల్స్ అందుబాటులో లేదా ఖచ్ఛితంగా లేని పరిస్థితులలో, జనసాంద్రత గల పట్టణ ప్రాంతాలలో లేదా ఇంటి లోపల ఉన్నప్పుడు పరికర లొకేషన్ను అంచనా వేయడంలో Androidకు సహాయపడవచ్చు. Google లొకేషన్ ఖచ్చితత్వం (GLA, Google లొకేషన్ సర్వీస్లు అని కూడా పిలుస్తారు) అనేది పరికర లొకేషన్ అంచనాను మెరుగుపరచడానికి ఈ సిగ్నల్స్ను ఉపయోగించే ఒక Google సర్వీస్.
ఈ మరింత ఖచ్చితమైన లొకేషన్ను అందించడానికి, ఆన్ చేసినప్పుడు, GLA కాలానుగుణంగా ఎవరైనా ఒక నిర్దిష్ట వ్యక్తితో అనుబంధించబడని తాత్కాలిక భ్రమణ పరికర ఐడెంటిఫైయర్ను ఉపయోగించి—GPS, ఇంకా Wi-Fi యాక్సెస్ పాయింట్లు, మొబైల్ నెట్వర్క్లు, అలాగే పరికర సెన్సార్ల గురించిన సమాచారంతో సహా—మీ Android పరికరం నుండి లొకేషన్ సమాచారాన్ని సేకరిస్తుంది. GLA ఈ సమాచారాన్ని Wi-Fi యాక్సెస్ పాయింట్లు మొబైల్ నెట్వర్క్ టవర్లకు చెందిన క్రౌడ్సోర్స్ చేసిన మ్యాప్లను రూపొందించడంతో సహా లొకేషన్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచి, లొకేషన్ ఆధారిత సర్వీస్లను అందించడానికి ఉపయోగిస్తుంది.
మీరు మీ Android పరికరం లొకేషన్ సెట్టింగ్లలో ఎప్పుడైనా GLAను ఆఫ్ చేయవచ్చు. GLA ఆఫ్ చేయబడినప్పటికీ మీ Android పరికర లొకేషన్ పని చేస్తూనే ఉంటుంది, అలాగే పరికర లొకేషన్ను అంచనా వేయడానికి GPS, ఇంకా పరికర సెన్సార్లపై మాత్రమే ఆధారపడుతుంది.
Googleకు నా స్థానం ఎలా తెలుస్తుంది?
మీరు ఉపయోగిస్తున్న ప్రోడక్ట్లు, అలాగే మీరు ఎంచుకున్న సెట్టింగ్లను బట్టి, మీరు ఉపయోగించే కొన్ని సర్వీస్లు, ప్రోడక్ట్లను మరింత సహాయకరంగా చేయడంలో సహాయం చేయడానికి Google వివిధ రకాల లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
ఈ లొకేషన్ సమాచారం మీ IP అడ్రస్ లేదా మీ పరికరం వంటి రియల్ టైమ్ సిగ్నల్స్ నుండి, అలాగే Google Sites, అలాగే సర్వీస్లలో మీరు సేవ్ చేసిన యాక్టివిటీ నుండి కూడా రావచ్చు. Google మీ లొకేషన్ గురించి సమాచారాన్ని పొందగల ప్రధాన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
మీ IP అడ్రస్ నుండి
IP అడ్రస్, దీన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అని కూడా పిలుస్తారు, ఇది మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీ కంప్యూటర్ లేదా పరికరానికి కేటాయించబడిన నంబర్. IP అడ్రస్లు, మీరు ఉపయోగించే వెబ్సైట్లను, సర్వీస్లను మీ పరికరాలకు కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడతాయి.
పలు ఇతర ఇంటర్నెట్ సర్వీస్ల మాదిరిగానే, Google కొన్ని ప్రాథమిక సర్వీస్లు—సందర్భోచిత ఫలితాలను అందించడానికి మీరు ఉన్న జనరల్ ఏరియా గురించిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు, అంటే ఎవరైనా సమయం ఎంత అయ్యింది అని సెర్చ్ చేసినప్పుడు, లేదా కొత్త నగరం నుండి సైన్-ఇన్ చెయాయడం వంటి అసాధారణ యాక్టివిటీను గుర్తించడం ద్వారా మీ ఖాతాను సురక్షితంగా ఉంచడం వంటివి.
గుర్తుంచుకోండి: ఇంటర్నెట్ ట్రాఫిక్ను పంపడానికి, స్వీకరించడానికి పరికరాలకు IP అడ్రస్ అవసరం. IP అడ్రస్లు అనేవి ఇంచుమించుగా మీ భౌగోళిక ప్రాంతం మీద ఆధారపడి ఉంటాయి. అంటే google.comతో సహా మీరు ఉపయోగించే ఏవైనా యాప్లు, సర్వీస్లు లేదా వెబ్సైట్లు మీ IP అడ్రస్ నుండి మీ జనరల్ ఏరియా గురించి కొంత సమాచారాన్ని అంచనా వేసి ఉపయోగించగలవు.
మీరు సేవ్ చేసిన యాక్టివిటీ నుండి
మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, Search సర్వీసుల హిస్టరీని లేదా వెబ్ & యాప్ యాక్టివిటీ వంటి నిర్దిష్ట హిస్టరీ కంట్రోల్స్ను ఆన్ చేసి ఉంటే, Google సైట్లు, యాప్లు, ఇంకా సర్వీసులలో మీ యాక్టివిటీ డేటా మీ Google ఖాతాలో హిస్టరీగా సేవ్ కావచ్చు. యాక్టివిటీలో కొంత మీరు Google సర్వీస్ను ఉపయోగిస్తున్నప్పుడు ఉన్న జనరల్ ఏరియా గురించిన సమాచారం ఉండవచ్చు. మీరు జనరల్ ఏరియాను ఉపయోగించి ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, మీ సెర్చ్ కనీసం 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఉపయోగిస్తుంది లేదా ఆ ఏరియా కనీసం 1,000 మంది వ్యక్తుల లొకేషన్లను సూచించే వరకు విస్తరిస్తుంది. ఇది మీ గోప్యతను రక్షించడంలో సహాయపడుతుంది.
కొన్ని సందర్భాలలో, మీ సెర్చ్ కోసం సందర్భోచిత లొకేషన్ను అంచనా వేయడానికి మీరు గతంలో సెర్చ్ చేసిన ప్రాంతాలు ఉపయోగించబడవచ్చు. ఉదాహరణకు, మీరు చెల్సియాలో ఉన్నప్పుడు కాఫీ షాప్ల కోసం సెర్చ్ చేస్తే, భవిష్యత్ సెర్చ్లలో చెల్సియా కోసం Google ఫలితాలను చూపవచ్చు.
మీ Google ఖాతాలో యాక్టివిటీ డేటా ఎలా సేవ్ అవుతుందో, మీరు నా యాక్టివిటీలో చూడవచ్చు, అలాగే కంట్రోల్ చేయవచ్చు.
మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండకపోతే, మీకు మరిన్ని సందర్భోచితమైన ఫలితాలు, సిఫార్సులు అందించడంలో సహాయపడటానికి మీరు వాడుతున్న పరికరం నుండి మునుపటి సెర్చ్లకు సంబంధించిన కొంత లొకేషన్ సమాచారాన్ని Google స్టోర్ చేయవచ్చు. మీరు Search అనుకూలీకరణను ఆఫ్ చేస్తే, మీ లొకేషన్ను అంచనా వేయడానికి Google మునుపటి సెర్చ్ యాక్టివిటీను ఉపయోగించదు. ప్రైవేట్గా సెర్చ్ చేయడం, బ్రౌజ్ చేయడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీరు సేవ్ చేసిన ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్ల నుండి
మీకు ముఖ్యమైన స్థలాలను, అంటే ఇల్లు, లేదా ఆఫీస్ వంటి వాటిని, మీ Google ఖాతాలో సేవ్ చేసే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. మీ ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్లను సెట్ చేస్తే, దిశలను పొందడం, లేదా మీ ఇల్లు లేదా ఆఫీస్కు దగ్గరగా ఉండే వాటిని ఫలితాలలో కనుగొనడం మరింత సులువు అవుతుంది; మెరుగైన యాడ్లను పొందే వీలుంటుంది.
మీరు మీ Google ఖాతాలో ఎప్పుడైనా మీ ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్లను ఎడిట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.
మీ పరికరం నుండి
Google యాప్లు మీ పరికరం నుండి లొకేషన్ను ఎలా ఉపయోగిస్తాయి
Search అలాగే Maps వంటి Google యాప్లతో సహా యాప్లకు మీ ఖచ్చితమైన లొకేషన్ అందుబాటులో ఉందో లేదో కంట్రోల్ చేయడానికి పరికరాలలో సెట్టింగ్లు లేదా అనుమతులు ఉన్నాయి. ఇలాంటి ఖచ్చితమైన లొకేషన్, Google Maps వంటి యాప్లలో దిశలు చూపడానికి లేదా సమీపంలోని ఉపయోగకరమైన సెర్చ్ ఫలితాలను మీరు పొందడంలో సహాయపడడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఖచ్చితమైన లొకేషన్ సెట్టింగ్లు లేదా అనుమతులు ఆన్లో ఉన్నప్పుడు మీరు లోకల్ స్థలాలు, వాతావరణ సమాచారం వంటి అంశాల కోసం మరింత సందర్భోచిత సెర్చ్ ఫలితాలను పొందుతారు.
iOS, Android రెండూ యాప్ లొకేషన్ అనుమతుల కోసం సెట్టింగ్లను కలిగి ఉన్నాయి, వీటిని మీరు ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. లొకేషన్ ఆధారిత ఫీచర్లు, సర్వీస్లను అందించేందుకు, మీ లొకేషన్ను ఉపయోగించడానికి మీరు యాప్లను అనుమతించవచ్చు. గుర్తుంచుకోండి, యాప్లు మీ ఖచ్చితమైన లొకేషన్ను తాత్కాలికంగా స్టోర్ చేయడం కొన్నిసార్లు అవసరం, తద్వారా అవి మీకు సహాయకరమైన ఫలితాలను త్వరగా అందించగలవు లేదా లొకేషన్ను అప్డేట్ చేయాల్సిన అవసరాన్ని నివారించడం ద్వారా బ్యాటరీని ఆదా చేయగలవు.
కొన్ని యాప్లకు లేదా మీరు లొకేషన్ షేరింగ్ వంటి నిర్దిష్ట ఫీచర్లను ఉపయోగించాలనుకుంటే, బ్యాక్గ్రౌండ్లో మీ పరికర లొకేషన్కు యాక్సెస్ అవసరం అవుతుంది, ఉదాహరణకు Find My Device.
మీ Android పరికరంలో లొకేషన్ ఎలా పని చేస్తుందనే దాని గురించి మరింత సమాచారం కోసం, ఇక్కడ చూడండి.
నా Google ఖాతాలో టైమ్లైన్, Search సర్వీసుల హిస్టరీ, ఇంకా వెబ్ & యాప్ యాక్టివిటీ ఎలా సేవ్ అవుతాయి?
టైమ్లైన్, వెబ్ & యాప్ యాక్టివిటీ
టైమ్లైన్, వెబ్ & యాప్ యాక్టివిటీ, అలాగే Search సర్వీసుల హిస్టరీ అనేవి Google ఖాతా సెట్టింగ్లు; ఇవి యూజర్లు తమ యాక్టివిటీని, అలాగే లొకేషన్ వంటి అనుబంధిత సమాచారాన్ని సేవ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఒకొక్క దానికి సంబంధించిన ఓవర్వ్యూ ఇక్కడ ఉంది. ఇతర ఫీచర్లు లేదా ప్రోడక్ట్లు కూడా లొకేషన్ సమాచారాన్ని కలెక్ట్ చేసే లేదా స్టోర్ చేసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.
టైమ్లైన్
మీరు టైమ్లైన్ను ఆన్ చేస్తే, మీరు వెళ్లిన ప్రదేశాలను, వాటి రూట్లను, మీ ట్రిప్ల వివరాలను గుర్తుంచుకోవడంలో సహాయపడే వ్యక్తిగత మ్యాప్ను మీరు సైన్ ఇన్ చేసిన ప్రతి డివైజ్లోనూ, ఇది క్రియేట్ చేస్తుంది.
టైమ్లైన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మీరు టైమ్లైన్ను ఆన్ చేస్తే, మీరు సైన్ ఇన్ చేసిన ప్రతి అర్హత గల మొబైల్ డివైజ్కు సంబంధించి, మీ ఖచ్చితమైన డివైజ్ లొకేషన్ క్రమం తప్పకుండా సేవ్ అవుతుంది. Google యాప్లను ఉపయోగించనప్పటికీ, మీ టైమ్లైన్ను బిల్డ్ చేయడానికి ఈ డివైజ్ లొకేషన్లను ఉపయోగించడం జరుగుతుంది.
Google ఎక్స్పీరియన్స్లను అందరికీ మరింత ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి, టైమ్లైన్ డేటాను వీటి కోసం ఉపయోగించే అవకాశం ఉంది
- అగ్రిగేట్ చేసిన లొకేషన్ డేటా ఆధారంగా, రద్దీగా ఉండే సమయాలు, బిజీ ట్రాఫిక్ వంటి కమ్యూనిటీ ట్రెండ్లను చూపించడానికి
- మోసం, దుర్వినియోగాన్ని గుర్తించి, నివారించడంలో సహాయపడటానికి
- యాడ్స్ ప్రోడక్ట్లతో సహా Google సర్వీస్లను మెరుగుపరచడానికి, డెవలప్ చేయడానికి
మీ సెట్టింగ్లను బట్టి, యాడ్ ఇంటరాక్షన్లతో పాటు, మీ ఖాతాలో హిస్టరీగా సేవ్ అయ్యే యాక్టివిటీ కూడా టైమ్లైన్ డేటాతో కనెక్ట్ చేయబడవచ్చు. సమీపంలోని బిజినెస్లు తమ స్టోర్లను ఎంతమంది సందర్శించే అవకాశం ఉందో అంచనా వేయడానికి, ఇది సహాయపడుతుంది. బిజినెస్లతో వ్యక్తిగత సమాచారం ఏదీ షేర్ అవ్వదు.
టైమ్లైన్ మీ Google ఎక్స్పీరియన్స్లను వ్యక్తిగతీకరించడంలో కూడా సహాయపడుతుంది, ఉదాహరణకు Google Mapsలో మీ రోజువారీ ప్రయాణం గురించి నోటిఫికేషన్లను పంపడం వంటివి.
టైమ్లైన్లో సేవ్ చేసిన వాటిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రివ్యూ చేయడానికి, ఎడిట్ చేయడానికి, అలాగే తొలగించడానికి వీలుంటుంది. మీరు టైమ్లైన్ను ఆన్ చేశారో లేదో చూడటానికి, మీకు చెందిన నా యాక్టివిటీ డ్యాష్బోర్డ్కు వెళ్లండి. మీ టైమ్లైన్ సెట్టింగ్లను మీరు అక్కడ కంట్రోల్ చేయగలుగుతారు.
టైమ్లైన్ సెట్టింగ్లో భాగంగా మీ ఖచ్చితమైన లొకేషన్ను కలెక్ట్ చేయడం ఎంత తరచుగా జరుగుతుంది అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు Google Mapsలో నావిగేషన్ను ఉపయోగిస్తుంటే, దానిని నిమిషానికి అనేక సార్లు సేకరించే అవకాశం ఉంటుంది. కానీ మీ ఫోన్ను మీరు యాక్టివ్గా ఉపయోగించకపోయినట్లయితే, అది కొన్ని గంటలకు ఒకసారి మాత్రమే జరగవచ్చు.
టైమ్లైన్ డేటా ఎంతకాలం సేవ్ అవ్వాలనేది మీ సెట్టింగ్లపై ఆధారపడి ఉంటుంది—మీరు ఈ డేటాను 3, 18 లేదా 36 నెలల తర్వాత ఆటోమేటిక్గా తొలగించేలా సెట్ చేసుకోవచ్చు లేదా మీరు స్వయంగా తొలగించే వరకు అలాగే ఉంచుకోవచ్చు. మీరు దీన్ని ఎప్పుడైనా నా యాక్టివిటీ డ్యాష్బోర్డ్లో మార్చవచ్చు.
వీటిని గుర్తుంచుకోండి
మీరు టైమ్లైన్ను ఆఫ్ చేస్తే
- మీరు తొలగించే వరకు Google మీరు సేవ్ చేసిన ఏదైనా గత టైమ్లైన్ డేటాను స్టోర్ చేయడం కొనసాగిస్తుంది లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్లలో భాగంగా మీరు ఎంచుకున్న సమయం తర్వాత అది తొలగిపోతుంది.
- టైమ్లైన్ను ఆఫ్ చేయడం వల్ల, Search సర్వీసుల హిస్టరీ, ఇంకా వెబ్ & యాప్ యాక్టివిటీ వంటి ఇతర యాక్టివిటీ కంట్రోల్స్ ద్వారా లేదా ఇతర Google ప్రోడక్ట్ల ద్వారా (ఉదాహరణకు మీ IP అడ్రస్ ఆధారంగా) లొకేషన్ సమాచారం ఎలా సేవ్ అవుతుంది లేదా ఉపయోగించబడుతుంది అనే దానిపై ఎటువంటి ప్రభావం ఉండదు. మీ వద్ద ఇప్పటికీ లొకేషన్ సమాచారాన్ని సేవ్ చేసే ఇతర సెట్టింగ్లు ఉండవచ్చు.
మీరు టైమ్లైన్ను ఆన్ చేశారో లేదో చూడటానికి, మీకు చెందిన నా యాక్టివిటీ డ్యాష్బోర్డ్కు వెళ్లండి. మరింత తెలుసుకోండి.
Search సర్వీసుల హిస్టరీ
మీరు సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు, Search సర్వీసుల హిస్టరీ అనేది Search, Maps, Shopping, Hotels, Flights, Translate, ఇంకా News వంటి సర్వీసులలో మీ యాక్టివిటీని మీ Google ఖాతాలో సేవ్ చేస్తుంది. హిస్టరీలో మీరు చేసే సెర్చ్లు, Google Mapsలో మీరు చూసే ప్రదేశాలు, Flights, Hotels ద్వారా మీరు బుక్ చేసుకునే ప్రయాణాలు, మీరు సెర్చ్ చేసే వస్తువులు లేదా ప్రోడక్ట్లు, మీరు క్లిక్ చేసే యాడ్లు, అలాగే Search సర్వీసులను ఉపయోగించి మీరు సందర్శించే వెబ్సైట్ల నుండి కలెక్ట్ చేసిన సమాచారం వంటి అంశాలు ఉంటాయి. ఇందులో మీ ఇంటరాక్షన్లకు సంబంధించిన మీడియా (ఇమేజ్లు, ఫైల్స్ ఇంకా ఆడియో వంటి సమాచారం) కూడా ఉంటుంది.
మీ హిస్టరీలో మీ డివైజ్ తాలూకు జనరల్ ఏరియా, అలాగే IP అడ్రస్ ఆధారంగా మీ లొకేషన్ గురించిన సమాచారం కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు వాతావరణ సమాచారం కోసం సెర్చ్ చేసినప్పుడు మీ డివైజ్ నుండి పంపబడిన లొకేషన్ ఆధారంగా ఫలితాలను పొందితే, ఆ సెర్చ్ చేసిన సమయంలో మీ డివైజ్ ఉన్న జనరల్ ఏరియాతో సహా, ఈ యాక్టివిటీ అంతా మీ Search సర్వీసుల హిస్టరీలో సేవ్ అవుతుంది. మీ డివైజ్ పంపిన ఖచ్చితమైన లొకేషన్ సేవ్ అవ్వదు, కేవలం ఆ లొకేషన్కు సంబంధించిన జనరల్ ఏరియా మాత్రమే స్టోర్ అవుతుంది. భవిష్యత్తులో మీరు చేసే సెర్చ్లకు సంబంధించి మరింత సందర్భోచితమైన లొకేషన్ను గుర్తించడంలో Googleకు సహాయపడటానికి, సేవ్ అయిన లొకేషన్ ఉపయోగపడుతుంది, ఇది మీ IP అడ్రస్ లేదా మీ డివైజ్ నుండి కలెక్ట్ చేయవచ్చు. ఈ సేవ్ అయిన లొకేషన్ మెటాడేటా 30 రోజుల తర్వాత మీ Search సర్వీసుల హిస్టరీ నుండి ఆటోమేటిక్గా తొలగించబడుతుంది.
Google సర్వీస్లలో మీ ఎక్స్పీరియన్స్లను అనుకూలంగా మార్చడానికి Search సర్వీసుల హిస్టరీ ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, మీ హిస్టరీని సేవ్ చేయడం వల్ల మీరు గతంలో చేసిన సెర్చ్లను మళ్లీ చూడవచ్చు, AI మోడ్ లేదా 'Mapsను అడగండి' ఫీచర్తో మునుపటి సంభాషణను ఎక్కడ ఆపారో అక్కడి నుండే కొనసాగించవచ్చు, లేదా గత సెర్చ్ల ఆధారంగా ఆటో-కంప్లీట్ సూచనలను పొందవచ్చు. మీ వ్యక్తిగతీకరణ సెట్టింగ్లను బట్టి, Search సర్వీసులలో లేదా ఇతర Google సర్వీసులలో మీకు వ్యక్తిగతీకరించబడిన సిఫార్సులను, ఇంకా ఎక్స్పీరియన్స్లను అందించడానికి Search సర్వీసుల హిస్టరీ డేటా ఉపయోగించబడవచ్చు. ఉదాహరణకు, మీ వ్యక్తిగతీకరించబడిన సిఫార్సుల సెట్టింగ్ ఆన్లో ఉంటే, మీ Search సర్వీసుల హిస్టరీ, ఇంకా లొకేషన్ వంటి అనుబంధ సమాచారంతో సహా మీ Google ఖాతాలోని సమాచారం ఆధారంగా Search సర్వీసులు మీకు వ్యక్తిగతీకరించిన ఫలితాలను, క్యురేటెడ్ ఫీడ్లను, ఇంకా AI సమాధానాలను అందించగలవు. అంటే మీరు గతంలో సెర్చ్ చేసిన జనరల్ ఏరియాకు సంబంధించిన ఫలితాలు మీకు కనిపించవచ్చు. మీ యాడ్స్ సెట్టింగ్ల ఆధారంగా మీకు మరింత సందర్భోచిత యాడ్స్ను చూపడానికి కూడా Search సర్వీసుల హిస్టరీని ఉపయోగించవచ్చు. మీరు మీ ఖాతాతో సైన్ ఇన్ చేసిన మీ డివైజ్లన్నింటిలోనూ Search సర్వీసుల హిస్టరీ పని చేస్తుంది.
మీరు నా యాక్టివిటీకి వెళ్లడం ద్వారా, మీ Search సర్వీసుల హిస్టరీలో సేవ్ అయి ఉన్న లొకేషన్ను, ఇంకా ఇతర సమాచారాన్ని రివ్యూ చేసి, తొలగించవచ్చు లేదా ఈ సెట్టింగ్ను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. ఈ సెట్టింగ్ ఆఫ్లో ఉంటే, Search సర్వీసుల నుండి వచ్చే కొత్త యాక్టివిటీ ఏదీ, మీ Google ఖాతాలోని Search సర్వీసుల హిస్టరీలో సేవ్ కాదు.
వీటిని గుర్తుంచుకోండి
మీరు Search సర్వీసుల హిస్టరీని ఆఫ్ చేసినప్పుడు
- మీరు ఇప్పటికీ సేవ్ చేసిన యాక్టివిటీను కలిగి ఉండవచ్చు, మీరు దాన్ని తొలగించే వరకు అది ఉపయోగించబడుతుంది. మీరు దీన్ని ఎప్పుడైనా తొలగించవచ్చు. మీరు సేవ్ చేసిన లొకేషన్ సమాచారం ఇప్పటికీ 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా తొలగించబడుతుంది.
- Search సర్వీసుల హిస్టరీని ఆఫ్ చేయడం వలన టైమ్లైన్ వంటి ఇతర సెట్టింగ్ల ద్వారా లొకేషన్ సమాచారం ఎలా సేవ్ అవుతుంది లేదా దానిని ఎలా ఉపయోగిస్తారు అనే దానిపై ప్రభావం ఉండదు. ఇతర సెట్టింగ్లలో భాగంగా, IP అడ్రస్తో సహా ఇతర రకాల లొకేషన్ సమాచారం కూడా మీకు ఇంకా సేవ్ అయి ఉండవచ్చు.
మీ Search సర్వీసుల హిస్టరీ ఆన్లో ఉందో లేదో చూడటానికి, నా యాక్టివిటీకి వెళ్లండి.
వెబ్ & యాప్ కార్యకలాపం
Google Assistant, Google Store, ఇంకా Google TV వంటి కొన్ని Google సర్వీస్లలో మీకు మరింత వ్యక్తిగతీకరించబడిన ఎక్స్పీరియన్స్ను అందించడానికి వెబ్ & యాప్ యాక్టివిటీ డేటా ఉపయోగపడుతుంది. మీ యాడ్స్ సెట్టింగ్ల ఆధారంగా మీకు మరింత సందర్భోచిత యాడ్స్ను చూపడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. మీరు మీ ఖాతాతో సైన్ ఇన్ చేసి ఉన్న అన్ని డివైజ్లలోనూ వెబ్ & యాప్ యాక్టివిటీ పని చేస్తుంది.
వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్లో ఉన్నప్పుడు, Google సర్వీస్లలో మీరు చేసే పనులకు సంబంధించిన డేటాను Google మీ ఖాతాలోని వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ చేస్తుంది. దీనిలో మీరు Google సర్వీస్ను ఉపయోగించిన జనరల్ ఏరియా వంటి అనుబంధిత సమాచారం ఉంటుంది.
ఉదాహరణకు, మీరు వాతావరణ సమాచారం కోసం Google Assistantను అడిగి, మీ డివైజ్ నుండి పంపిన లొకేషన్ ఆధారంగా ఫలితాలను పొందితే, ఆ సమాచారాన్ని మీరు రిక్వెస్ట్ చేసిన సమయంలో మీ డివైజ్ ఉన్న జనరల్ ఏరియాతో సహా, ఈ యాక్టివిటీ అంతా మీ 'వెబ్ & యాప్ యాక్టివిటీ'లో సేవ్ అవుతుంది. మీ డివైజ్ పంపిన ఖచ్చితమైన లొకేషన్ సేవ్ అవ్వదు, కేవలం ఆ లొకేషన్కు సంబంధించిన జనరల్ ఏరియా మాత్రమే స్టోర్ అవుతుంది. భవిష్యత్తులో మీరు జరిపే సంభాషణల్లో మరింత సందర్భోచితమైన లొకేషన్ను గుర్తించడంలో Googleకు సహాయపడటానికి, సేవ్ చేసిన ఈ లొకేషన్ ఉపయోగపడుతుంది; ఇది మీ IP అడ్రస్ లేదా మీ డివైజ్ నుండి కలెక్ట్ చేయవచ్చు. ఈ సేవ్ అయిన లొకేషన్ 30 రోజుల తర్వాత మీ వెబ్ & యాప్ యాక్టివిటీ నుండి ఆటోమేటిక్గా తొలగించబడుతుంది.
వెబ్ & యాప్ యాక్టివిటీ డేటా మీకు సంబంధించిన జనరల్ ఏరియాలను అర్థం చేసుకోవడంలో Googleకు సహాయపడుతుంది, అలాగే మీరు Google Assistantతో ఇంటరాక్ట్ అవ్వడం వంటి పనులు చేసినప్పుడు, ఆ ఏరియాలకు అనుగుణంగా రూపొందించిన ఫలితాలను Google మీకు చూపిస్తుంది.
మీరు నా యాక్టివిటీకి వెళ్లడం ద్వారా, మీ వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ అయిన లొకేషన్ను, ఇంకా ఇతర సమాచారాన్ని రివ్యూ చేసి, తొలగించవచ్చు లేదా ఈ సెట్టింగ్ను ఆఫ్ చేయవచ్చు. ఈ సెట్టింగ్ ఆఫ్లో ఉన్నప్పుడు, కొత్త యాక్టివిటీ మీ Google ఖాతాలోని మీ వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ అవ్వదు.
వీటిని గుర్తుంచుకోండి
మీరు వెబ్ & యాప్ యాక్టివిటీను ఆఫ్ చేసినప్పుడు
- మీరు ఇప్పటికీ సేవ్ చేసిన యాక్టివిటీను కలిగి ఉండవచ్చు, మీరు దాన్ని తొలగించే వరకు అది ఉపయోగించబడుతుంది. మీరు దీన్ని ఎప్పుడైనా తొలగించవచ్చు. మీరు సేవ్ చేసిన లొకేషన్ సమాచారం ఇప్పటికీ 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా తొలగించబడుతుంది.
- వెబ్ & యాప్ యాక్టివిటీని ఆఫ్ చేయడం వలన టైమ్లైన్ వంటి ఇతర సెట్టింగ్ల ద్వారా లొకేషన్ సమాచారం ఎలా సేవ్ అవుతుంది లేదా దానిని ఎలా ఉపయోగిస్తారు అనే దానిపై ప్రభావం ఉండదు. మీరు ఇప్పటికీ IP అడ్రస్తో సహా ఇతర సెట్టింగ్లలో భాగంగా ఇతర రకాల లొకేషన్ సమాచారాన్ని సేవ్ చేసి ఉండవచ్చు.
మీ వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్లో ఉందో లేదో తెలుసుకోవడానికి, నా యాక్టివిటీకి వెళ్లండి.
సాధారణీకరించిన లేదా అజ్ఞాత లొకేషన్ సమాచారాన్ని Google ఎలా ఉపయోగిస్తుంది?
వ్యక్తుల గోప్యతను మెరుగుపరచడంలో సహాయపడటానికి Google అజ్ఞాతీకరించిన, అలాగే సాధారణీకరించిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. అజ్ఞాతీకరించిన సమాచారం సాధారణంగా ఏ వ్యక్తితోనూ అనుబంధించబడదు. ఒక వ్యక్తికి చెందిన ఖాతా, పేరు లేదా ఈమెయిల్ అడ్రస్ వంటి వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం కాకుండా, సాధారణీకరించిన సమాచారం, సంఖ్యల స్ట్రింగ్ వంటి ప్రత్యేక ఐడెంటిఫైయర్తో ముడిపడి ఉండవచ్చు. అడ్వర్టయిజింగ్ లేదా ట్రెండ్ల వంటి ప్రయోజనాల కోసం Google తన ప్రోడక్ట్లు, సర్వీస్లలో అజ్ఞాతీకరించిన, అలాగే సాధారణీకరించిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
లొకేషన్ సమాచారానికి లింక్ చేయబడిన నిర్దిష్ట యూజర్ను గుర్తించని ఐడెంటిఫయర్లను యూజర్లు రీసెట్ చేయగలరు. ఉదాహరణకు, వ్యక్తులు వారి Android పరికరాలలో అడ్వర్టయిజింగ్ IDలను రీసెట్ చేయడం ద్వారా నిర్దిష్ట యూజర్ను గుర్తించని ఐడెంటిఫయర్లను రీసెట్ చేయవచ్చు. అదనంగా, Google ఆటోమేటిక్గా యూజర్ గోప్యతను మెరుగుపరచడానికి యూజర్లు వారి పరికరాలలో లొకేషన్ ఆధారిత సర్వీస్, అలాగే ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి కంట్రోల్ చేయగల పరికర సెట్టింగ్ అయిన GLAతో సహా నిర్దిష్ట యూజర్ను గుర్తించని ఐడెంటిఫయర్లను రీసెట్ చేస్తుంది.
ప్రత్యేకంగా, Google అజ్ఞాతీకరించిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వ్యక్తులు Google Mapsలోని స్థలాలను ట్యాప్ చేయవచ్చు, ఉదా., రెస్టారెంట్ లేదా పార్క్పై ట్యాప్ చేసి, ఆ ప్రాంతంలోని స్థలాలకు చెందిన ట్రెండ్లను చూడవచ్చు. రద్దీగా ఉండే సమయాలు వంటి ట్రెండ్లను రూపొందించడానికి ఉపయోగించే లొకేషన్ సమాచారాన్ని ప్రత్యేకంగా ఎవరైనా ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగించడం సాధ్యం కాదు. ఖచ్చితమైన, అలాగే అజ్ఞాతీకరించిన రద్దీ సమాచారాన్ని అందించడానికి Google వద్ద తగినంత సమాచారం లేకపోతే, అది Googleలో కనిపించదు.
Google సైన్ అవుట్ చేసిన వ్యక్తులకు Search అనుకూలీకరణ సెట్టింగ్, YouTube సెట్టింగ్లు, అలాగే యాడ్స్ సెట్టింగ్లతో సహా వారి బ్రౌజర్ లేదా పరికరంతో అనుబంధించబడిన సమాచారాన్ని మేనేజ్ చేయడానికి ఇతర మార్గాలను కూడా అందిస్తుంది. మరింత తెలుసుకోండి
Google గోప్యతా పాలసీలో లొకేషన్ సమాచారాన్ని Google ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి. సేకరించిన డేటా నిల్వను Google ఎలా కొనసాగిస్తుంది, అలాగే Google డేటాను ఎలా అజ్ఞాతీకరిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
లొకేషన్ సమాచారానికి సంబంధించి Google ఎంతకాలం నిల్వను కొనసాగిస్తుంది?
Google సేకరించే లొకేషన్ సమాచారంతో సహా యూజర్ డేటా కోసం మా నిల్వ కొనసాగింపు ప్రాక్టీస్లను Google గోప్యతా పాలసీ వివరిస్తుంది. లొకేషన్ సమాచారం, ఒక అంశం గురించి అది ఏమిటి, అది ఎలా ఉపయోగించబడుతుంది, అలాగే వ్యక్తులు వాటి సెట్టింగ్లను ఎలా కాన్ఫిగర్ చేస్తారు అనే దానిపై ఆధారపడి వివిధ కాలాలకు చెందిన సమాచారాన్ని సేకరించబడుతుంది.
మీరు తొలగించే వరకు కొంత లొకేషన్ సమాచారం మీ Google ఖాతాలో సేవ్ చేయబడుతుంది
- నిల్వ కొనసాగింపు, అలాగే తొలగింపునకు సంబంధించిన ఆప్షన్లను కంట్రోల్ చేయడం: Search సర్వీసుల హిస్టరీ, టైమ్లైన్, ఇంకా వెబ్ & యాప్ యాక్టివిటీతో పాటు — Google యాక్టివిటీ కంట్రోల్స్లో — ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్లు ఉన్నాయి, ఇవి 3, 18, లేదా 36 నెలల వంటి నిర్ణీత వ్యవధి తర్వాత డేటాను ఆటోమేటిక్గా తొలగించడానికి మీకు వీలు కల్పిస్తాయి. మీరు నా యాక్టివిటీకి వెళ్లడం ద్వారా కూడా ఈ డేటాను చూడవచ్చు, అలాగే మీ ఇష్టానుసారం నిర్దిష్ట యాక్టివిటీని లేదా డేటాను మొత్తంగా తొలగించవచ్చు. ఈ సెట్టింగ్లను లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్ను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాడిఫై చేయవచ్చు.
- లొకేషన్ సమాచారాన్ని సేవ్ చేయడం: Google ప్రోడక్ట్ లేదా సర్వీస్పై ఆధారపడి, లొకేషన్ సమాచారం మీ Google ఖాతాలో సేవ్ చేయబడవచ్చు. ఉదాహరణకు, మీరు ఫోటోలలో లొకేషన్లను ట్యాగ్ చేయవచ్చు లేదా Mapsలో ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్ను జోడించవచ్చు. మీరు ఈ లొకేషన్ సమాచారాన్ని తొలగించవచ్చు.
మీరు డేటాను తొలగించినప్పుడు, మీ ఖాతా నుండి సురక్షితంగా, పూర్తిగా తీసివేయడానికి Google ఒక పాలసీను ఫాలో అవుతోంది, తద్వారా డేటా రికవరీ అనేది ఇకపై సాధ్యం కాదు. ముందుగా, మీరు తొలగించే యాక్టివిటీ వీక్షణ నుండి తీసివేయబడుతుంది, అలాగే మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఇకపై ఉపయోగించబడదు. ఆపై, Google స్టోరేజ్ సిస్టమ్ల నుండి డేటాను సురక్షితంగా, పూర్తిగా తొలగించడానికి రూపొందించబడిన ప్రాసెస్ను Google ప్రారంభిస్తుంది. సేకరించిన డేటాను నిల్వను Google ఎలా కొనసాగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
నిర్ణీత వ్యవధి తర్వాత గడువు ముగుస్తుందనే సమాచారం
ఇతర లొకేషన్ సమాచారం కోసం, Google డేటా నిల్వను ఎలా కొనసాగిస్తుంది అనే దానిలో వివరించిన విధంగా, మాన్యువల్గా తొలగించబడే బదులు—Google డేటాను తొలగించే ముందు సెట్ చేసిన సమయం వరకు స్టోర్ చేస్తుంది. దాన్ని సురక్షితంగా, పూర్తిగా తొలగించడానికి పట్టే సమయం డేటా రకంపై ఆధారపడి ఉంటుంది, ఉదాహరణకు:
- Google 9 నెలల తర్వాత IP అడ్రస్లో కొంత భాగాన్ని, అలాగే 18 నెలల తర్వాత కుక్కీ సమాచారాన్ని తీసివేయడం ద్వారా సర్వర్ లాగ్లలోని అడ్వర్టయిజింగ్ డేటాను అజ్ఞాతీకరిస్తుంది.
- మీ Search సర్వీసుల హిస్టరీ, వెబ్ & యాప్ యాక్టివిటీ నుండి IP-ఆధారిత లొకేషన్ను, అలాగే డివైజ్ లొకేషన్ను 30 రోజుల తర్వాత Google ఆటోమేటిక్గా తొలగిస్తుంది.
పరిమిత ప్రయోజనాల కోసం పొడిగించిన సమయ వ్యవధుల వరకు సమాచారం నిలిచి ఉంది
Google గోప్యతా పాలసీలో వివరించినట్లుగా, "సెక్యూరిటీ, మోసం, అలాగే దుర్వినియోగ నివారణ లేదా ఆర్థికపరమైన రికార్డ్లను దాచి ఉంచడం వంటి చట్టబద్ధమైన బిజినెస్ లేదా చట్టపరమైన ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు మేము కొంత డేటాను ఎక్కువ కాలం పాటు ఉంచుతాము." మా నిల్వ కొనసాగింపు ప్రాక్టీస్ల గురించి మరింత తెలుసుకోండి
యాడ్ల కోసం లొకేషన్ సమాచారం ఎలా ఉపయోగించబడుతుంది?
మీకు మరింత సందర్భోచిత యాడ్లను చూపడంలో సహాయపడటానికి
మీకు కనిపించే యాడ్లు మీ లొకేషన్ సమాచారం ఆధారంగా ఉండవచ్చు. సాధారణంగా, Googleలోని యాడ్లు అవి కనిపించే ప్రోడక్ట్ల మాదిరిగానే ఒకే రకమైన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, మీ సెట్టింగ్లపై ఆధారపడి, Searchలో, ఇతర Google ప్లాట్ఫామ్లలో మీరు చూసే యాడ్లు మీ పరికరంలోని లొకేషన్, మీ IP అడ్రస్, మునుపటి యాక్టివిటీ లేదా మీ Google ఖాతాలోని మీ ఇల్లు, అలాగే ఆఫీస్ అడ్రస్ల ఆధారంగా ఉండవచ్చు. అదనంగా, మీ దేశం లేదా మీకు ఆసక్తి ఉన్న జనరల్ ఏరియాను అంచనా వేయడానికి మెటాడేటా (ఉదా., బ్రౌజర్ టైమ్జోన్, డొమైన్, పేజీ కంటెంట్, బ్రౌజర్ రకం, పేజీ భాష) ఉపయోగించబడవచ్చు. మీ IP అడ్రస్, VPN, ప్రాక్సీ సర్వీస్, లేదా ఇతర నెట్వర్క్ సమాచారం నుండి మేము అందుకునే లొకేషన్ సిగ్నల్స్తో పాటు ఈ మెటాడేటాను ఉపయోగించవచ్చు.
లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించడం వలన మీకు కనిపించే యాడ్స్ మీరు ఉన్న ప్రాంతానికి లేదా మీకు సంబంధించిన ఏరియాలకు మరింత సందర్భోచితంగా ఉంటుంది. ఉదాహరణకు, మీ పరికరం లొకేషన్ సెట్టింగ్ ఆన్ చేయబడి, మీకు సమీపంలో ఉన్న రెస్టారెంట్ల కోసం మీరు Googleలో సెర్చ్ చేసినట్లయితే, మీకు సమీపంలో ఉన్న రెస్టారెంట్లకు సంబంధించిన యాడ్స్ను మీకు చూపడానికి మీ ప్రస్తుత పరికర లొకేషన్ ఉపయోగించబడవచ్చు. Googleలోని యాడ్స్లో భాగంగా సమీపంలోని బిజినెస్లకు గల దూరాలను చూపడానికి కూడా మీ లొకేషన్ ఉపయోగించబడవచ్చు.
మీకు మరింత ఉపయోగకరమైన యాడ్లను చూపడానికి, మీ గత బ్రౌజింగ్ లేదా యాప్ యాక్టివిటీని (అంటే మీరు చేసిన సెర్చ్లు, సందర్శించిన వెబ్సైట్లు, లేదా YouTubeలో మీరు చూసిన వీడియోలు వంటివి), అలాగే Search సర్వీసుల హిస్టరీ, వెబ్ & యాప్ యాక్టివిటీ వంటి నిర్దిష్ట యాక్టివిటీ సెట్టింగ్లలో మీ హిస్టరీలో భాగంగా సేవ్ అయిన జనరల్ ఏరియాలను కూడా Google ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు పాలు ఎక్కడ కొనవచ్చో Googleలో సెర్చ్ చేస్తే, మీరు బస్సు లేదా రైలు కోసం వేచి చూస్తూ తరచుగా Google Searchను బ్రౌజ్ చేసే జనరల్ ఏరియాలోని కిరాణా స్టోర్లకు సంబంధించిన యాడ్లు మీకు కనిపించవచ్చు.
అడ్వర్టయిజర్లు వారి బిజినెస్ చుట్టూ ఉన్న దేశాలు, నగరాలు లేదా ప్రాంతాలు వంటి జనరల్ ఏరియాలకు మాత్రమే యాడ్స్ను లక్ష్యంగా చేసుకోగలరు.
మా Display Networkలో అదనపు సమాచారం కోసం, సహాయ కేంద్రాన్ని సందర్శించండి.
పనితీరును కోవడంలో అడ్వర్టయిజర్లకు సహాయం చేయడానికి
Google సర్వీస్లను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ఎనలిటిక్స్, కొలమానాలకు సంబంధించిన Google లొకేషన్ సమాచారాన్ని కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఉదాహరణకు: మీ సెట్టింగ్లను బట్టి, యాడ్ల ప్రభావంతో యూజర్లు ఎంత తరచుగా తమ స్టోర్లను సందర్శిస్తున్నారో అంచనా వేయడంలో అడ్వర్టయిజర్లకు సహాయపడటానికి, Google మీ టైమ్లైన్ నుండి లొకేషన్ డేటాను ఉపయోగించవచ్చు. దీని కోసం, మీరు మీ ఖాతాలో హిస్టరీగా సేవ్ చేసుకునే యాక్టివిటీని (ఉదాహరణకు యాడ్ ఇంటరాక్షన్లు), అడ్వర్టయిజర్ల స్టోర్లకు సంబంధించిన టైమ్లైన్ డేటాతో Google అనుసంధానిస్తుంది. అడ్వర్టయిజర్లతో వ్యక్తిగత సమాచారం ఏదీ షేర్ అవ్వదు.
Google ప్రోడక్ట్లు, సర్వీస్లను మెరుగుపరచడానికి
Google తన యాడ్స్ ప్రోడక్ట్లను మెరుగుపరచడానికి లొకేషన్ సమాచారాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, మీ ఖాతాలో సేవ్ చేయబడిన సందర్భోచిత యాక్టివిటీ కోసం జనరల్ ఏరియాతో సహా మీరు ఇంటరాక్ట్ అయ్యే యాడ్స్ గురించిన డేటా సమగ్రపరచబడి, స్మార్ట్ బిడ్డింగ్ టూల్స్ను మెరుగుపరిచే మెషిన్ లెర్నింగ్ మోడల్లలో ఉపయోగించబడుతుంది. మీ ఖాతా డేటా అడ్వర్టయిజర్లకు షేర్ చేయబడదు.
యాడ్లను చూపడానికి నా లొకేషన్ సమాచారం ఎలా ఉపయోగించబడుతుంది అనేది నేను ఎలా కంట్రోల్ చేయగలను?
మీరు My Ad Centerలో Google ఉపయోగించిన ఏరియాల కంట్రోల్ను యాక్సెస్ చేయడం ద్వారా మీరు చూసే యాడ్లను ప్రభావితం చేయడానికి మీరు గతంలో Google Sites, అలాగే యాప్లను ఉపయోగించిన మీ సాధారణ ఏరియాలను ఎలా ఉపయోగించవచ్చు అనేది మీరు కంట్రోల్ చేయవచ్చు.
మీరు Googleను ఉపయోగించిన ప్రాంతాలను ఆన్ చేసినప్పుడు
యాడ్స్ వ్యక్తిగతీకరణ, అలాగే మీరు Googleను ఉపయోగించిన ఏరియాలు అనే సెట్టింగ్లు ఆన్లో ఉన్నప్పుడు, Google మీ యాడ్స్ను వ్యక్తిగతీకరిస్తుంది, దీని కోసం, మీరు Google సైట్లు, యాప్లను ఉపయోగించిన జనరల్ ఏరియాలకు సంబంధించిన డేటాను ఉపయోగిస్తుంది, ఈ డేటా సమాచారం Search సర్వీసుల హిస్టరీ, వెబ్ & యాప్ యాక్టివిటీ వంటి సెట్టింగ్లలోని సేవ్ అయిన మీ హిస్టరీ నుండి కలెక్ట్ చేయబడుతుంది.
మీరు Googleను ఉపయోగించిన ప్రాంతాలను ఆఫ్ చేసినప్పుడు
యాడ్స్ వ్యక్తిగతీకరణ లేదా మీరు Googleను ఉపయోగించిన ఏరియాలు అనే సెట్టింగ్లు ఆఫ్లో ఉన్నప్పుడు, మీరు Google సైట్లు, యాప్లను ఉపయోగించిన జనరల్ ఏరియాలకు సంబంధించిన డేటా ఆధారంగా Google మీకు వ్యక్తిగతీకరించిన యాడ్స్ను చూపదు, సాధారణంగా ఈ డేటా సమాచారం అనేది Search సర్వీసుల హిస్టరీ, వెబ్ & యాప్ యాక్టివిటీ వంటి సెట్టింగ్లలోని సేవ్ అయిన మీ హిస్టరీ నుండి కలెక్ట్ చేయబడుతుంది. మీరు Googleను ఉపయోగించిన ఏరియాలు అనే సెట్టింగ్ను ఆఫ్ చేసినప్పటికీ, మీ ప్రస్తుత లొకేషన్, ఇంకా మీ Google ఖాతాలో మీరు ఇల్లు లేదా ఆఫీస్గా సెట్ చేసుకున్న ప్రదేశాల ఆధారంగా మీకు యాడ్లు కనిపించే అవకాశం ఉంది.
అదనంగా, మీరు సైన్ అవుట్ చేసినట్లయితే, మీ పరికరం, అలాగే యాప్ సెట్టింగ్ల ఆధారంగా మీకు యాడ్లను చూపడానికి Google ఇప్పటికీ మీ IP అడ్రస్ లేదా మీ పరికరం నుండి మీ ప్రస్తుత లొకేషన్ను ఉపయోగించవచ్చు.
మీరు సైన్ అవుట్ చేసినప్పుడు వ్యక్తిగతీకరించిన యాడ్లను ఎలా ఆన్, ఆఫ్ చేయాలనే దాని గురించి అదనపు సమాచారం కోసం, ఇక్కడ చూడండి.
