కుకీలను Google ఎలా ఉపయోగిస్తుంది

ఈ పేజీ, Google ఉపయోగించే వివిధ రకాల కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీల గురించి వివరిస్తుంది. Google అలాగే మా పార్టనర్‌లు ఏవిధంగా, అడ్వర్టయిజింగ్‌లో కుక్కీలను ఉపయోగిస్తారో కూడా ఇది వివరిస్తుంది.

కుక్కీలు అనేవి మీరు ఏ వెబ్‌సైట్‌కు అయితే వెళ్తారో, ఆ వెబ్‌సైట్ ద్వారా మీ బ్రౌజర్‌కు పంపబడే చిన్న టెక్స్ట్ భాగాలు. ఇవి మీ సందర్శనకు సంబంధించిన సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో వెబ్‌సైట్‌కు సహాయపడతాయి, తద్వారా మీరు మళ్లీ సైట్‌కు వెళ్లడం మరింత సులభతరం అవుతుంది, అలాగే సైట్ మీకు మరింత ఉపయోగకరంగా అవుతుంది. ఒక యాప్ లేదా పరికరాన్ని, పిక్సెల్ ట్యాగ్‌లను, అలాగే లోకల్ స్టోరేజ్‌ను గుర్తించడానికి ఉపయోగించే ప్రత్యేక ఐడెంటిఫయర్‌లతో సహా అదే విధమైన టెక్నాలజీలు, అదే పనిని అమలు చేయగలవు. ఈ పేజీ అంతటా వివరించబడిన కుక్కీలను, అలాగే అదే విధమైన టెక్నాలజీలను కింద వివరించబడిన ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

కుక్కీలను, అలాగే ఇతర సమాచారాన్ని ఉపయోగించడంలో, మీ గోప్యతను మేము ఏ విధంగా సురక్షితంగా ఉంచుతామో తెలుసుకోవడానికి గోప్యతా పాలసీని చూడండి.

Google ఉపయోగించే వివిధ రకాల కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు

కింద వివరించబడిన కుక్కీలలో లేదా అదే విధమైన టెక్నాలజీలలో కొన్ని లేదా అన్నీ మీ బ్రౌజర్, యాప్ లేదా పరికరంలో స్టోర్ చేయబడవచ్చు. నిర్దిష్ట కుక్కీల వినియోగాన్ని తిరస్కరించడంతో సహా కుక్కీలను ఎలా ఉపయోగించాలో మేనేజ్ చేయడానికి, మీరు g.co/privacytools లింక్‌ను సందర్శించవచ్చు. అలాగే, మీరు మీ బ్రౌజర్‌లో కుక్కీలను మేనేజ్ చేయవచ్చు (మొబైల్ పరికరాలలోని బ్రౌజర్‌లు ఈ విజిబిలిటీని అందించకపోవచ్చు). ఈ టెక్నాలజీలలో కొన్నింటిని మీ పరికర సెట్టింగ్‌లలో లేదా యాప్ సెట్టింగ్‌లలో మేనేజ్ చేయవచ్చు.

ఫంక్షనాలిటీ

కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు సర్వీస్‌కు ప్రాథమికంగా ఉండే ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫంక్షనాలిటీ కోసం ఉపయోగించబడతాయి. సర్వీస్‌కు ప్రాథమికంగా పరిగణించబడే అంశాలలో, మీరు ఎంచుకున్న భాష; మీ సెషన్‌కు సంబంధించిన సమాచారాన్ని స్టోర్ చేయడం, అంటే షాపింగ్ కార్ట్‌లోని కంటెంట్ లాంటివి; మీరు రిక్వెస్ట్ చేసిన ఫీచర్‌లను ఎనేబుల్ చేయడం లేదా టాస్క్‌లను అమలు చేయడం; అలాగే సర్వీస్‌ను నిర్వహించడంలోనూ, మెరుగుపరచడంలోనూ సహాయపడే ప్రోడక్ట్ ఆప్టిమైజేషన్‌ల వంటి ఎంపికలు ఇంకా ప్రాధాన్యతలను గుర్తుంచుకోవడం వంటివి ఉంటాయి.

కొన్ని కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు మీ ప్రాధాన్యతలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, Google సర్వీస్‌లను ఉపయోగించే వ్యక్తులలో అత్యధిక శాతం మందికి, వారి కుక్కీ ఎంపికలను బట్టి, వారి బ్రౌజర్‌లలో ‘NID’ లేదా ‘_Secure-ENID’ అనే కుక్కీ ఉంటుంది. మీ ప్రాధాన్యతలతో పాటు మీ ప్రాధాన్య భాష, సెర్చ్ ఫలితాల పేజీలో ఎన్ని ఫలితాలు చూపించాలని కోరుకుంటున్నారు (ఉదాహరణకు, 10 లేదా 20), అలాగే Google SafeSearch ఫిల్టర్ ఆన్‌లో ఉండాలనుకుంటున్నారా లేదా అనేటటువంటి ఇతర సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి ఈ కుక్కీలు ఉపయోగించబడతాయి. యూజర్ చివరిసారి ఉపయోగించిన 6 నెలలకు ప్రతి 'NID' కుక్కీకి గడువు ముగుస్తుంది, అదే ‘_Secure-ENID’ కుక్కీ అయితే 13 నెలల పాటు ఉంటుంది. YouTubeకు సంబంధించి ఇదే ప్రయోజనాన్ని ‘VISITOR_INFO1_LIVE’, ఇంకా ‘__Secure-YEC’ అనే కుక్కీలు అందిస్తాయి, అలాగే ఇవి సర్వీస్‌తో ఉండే సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి కూడా ఉపయోగించబడతాయి. ‘VISITOR_INFO1_LIVE’ కుక్కీ 6 నెలల పాటు ఉంటుంది, ‘__Secure-YEC’ కుక్కీ 13 నెలల పాటు ఉంటుంది.

ఇతర కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు నిర్దిష్ట సెషన్‌లో మీ అనుభవాన్ని నిర్వహించి, మెరుగుపరచడానికి ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, మీ ప్రాధాన్య పేజీ కాన్ఫిగరేషన్ సమాచారంతో పాటు ప్రత్యేకమైన ఆటోప్లే ఎంపికలు, కంటెంట్‌ను షఫుల్ చేయడం, అలాగే ప్లేయర్ సైజ్ వంటి ప్లేబ్యాక్ ప్రాధాన్యతల సమాచారాన్ని స్టోర్ చేయడానికి YouTube, ‘PREF’ అనే కుక్కీని ఉపయోగిస్తుంది. YouTube Music విషయానికి వస్తే, ఈ ప్రాధాన్యతలలో వాల్యూమ్, రిపీట్ మోడ్, ఆటోప్లే ఉంటాయి. యూజర్ చివరిసారి ఉపయోగించిన 8 నెలలకు ఈ కుక్కీ గడువు ముగుస్తుంది. ‘pm_sess’ అనే కుక్కీ కూడా మీ బ్రౌజర్ సెషన్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది, ఇది 30 నిమిషాల పాటు ఉంటుంది.

Google సర్వీస్‌ల పనితీరును మెరుగుపరచడానికి కూడా కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు ఉపయోగించబడవచ్చు. ఉదాహరణకు, ‘CGIC’ కుక్కీ సెర్చ్ ఫలితాలను అందించడాన్ని, యూజర్ ప్రారంభ ఇన్‌పుట్ ఆధారంగా సెర్చ్ క్వెరీలను ఆటో-కంప్లీట్ చేయడం ద్వారా మెరుగుపరుస్తుంది. ఈ కుక్కీ 6 నెలల పాటు ఉంటుంది.

Google యూజర్‌ల కుక్కీల ఎంపికలకు సంబంధించి యూజర్ స్థితిని స్టోర్ చేయడానికి 13 నెలల పాటు ఉండే ‘SOCS’ కుక్కీని ఉపయోగిస్తుంది.

భద్రత

యూజర్‌లను ప్రామాణీకరించడానికి, మోసాన్ని నిరోధించడానికి, ఇంకా సర్వీస్‌తో మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మిమ్మల్ని సంరక్షించడానికి భద్రతా సహాయం కోసం కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు ఉపయోగించబడతాయి.

కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు యూజర్‌లను ప్రామాణీకరించడానికి ఉపయోగించబడతాయి, తద్వారా ఖాతాను దాని అసలు యజమాని మాత్రమే యాక్సెస్ చేయడానికి వీలు కలుగుతుంది. ఉదాహరణకు, ‘SID’ అలాగే ‘HSID’ అనే కుక్కీలలో, యూజర్ Google ఖాతా IDకి చెందిన, డిజిటల్‌గా సంతకం చేసిన, ఎన్‌క్రిప్ట్ చేసిన రికార్డ్‌లు, అలాగే అత్యంత ఇటీవలి సైన్ ఇన్ సమయం ఉంటాయి. ఈ కుక్కీల కలయిక, Google సర్వీస్‌లలో సమర్పించిన ఫారమ్‌లలోని కంటెంట్‌ను దొంగిలించడానికి చేసే ప్రయత్నాల వంటి అనేక రకాల దాడులను బ్లాక్ చేసేందుకు Googleకు వీలు కల్పిస్తుంది.

కొన్ని కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు స్పామ్, మోసం, ఇంకా దుర్వినియోగాన్ని గుర్తించడానికి ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, ‘pm_sess’ అలాగే ‘YSC’ కుక్కీలు, బ్రౌజింగ్ సెషన్‌లోని రిక్వెస్ట్‌లు ఇతర సైట్‌ల ద్వారా కాకుండా యూజర్ ద్వారా వచ్చేలా చూసుకుంటాయి. యూజర్‌కు తెలియకుండా, వారి తరఫున వ్యవహరించాలని చూసే హానికరమైన సైట్‌లను ఈ కుక్కీలు నిరోధిస్తాయి. ‘pm_sess’ కుక్కీ 30 నిమిషాల పాటు ఉంటుంది, అయితే ‘YSC’ కుక్కీ యూజర్ బ్రౌజింగ్ సెషన్ వ్యవధి పాటు ఉంటుంది. ‘__Secure-YEC’ అలాగే ‘AEC’ కుక్కీలు స్పామ్, మోసం, ఇంకా దుర్వినియోగాన్ని గుర్తించడానికి ఉపయోగించబడతాయి, తద్వారా యాడ్‌ల విషయంలో మోసపూరిత, లేదంటే చెల్లని ఇంప్రెషన్‌లు లేదా ఇంటరాక్షన్‌లకు సంబంధించి అడ్వర్టయిజర్‌లకు తప్పుగా ఛార్జీ విధించబడకుండా, అలాగే YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లోని YouTube క్రియేటర్‌లకు న్యాయమైన విధంగా రెమ్యూనరేషన్ అందించబడేలా చూసుకోవడంలో సహాయపడతాయి. ‘AEC’ కుక్కీ 6 నెలల పాటు ఉంటుంది, అలాగే ‘__Secure-YEC’ కుక్కీ 13 నెలల పాటు ఉంటుంది.

ఎనలిటిక్స్

ఒక నిర్దిష్ట సర్వీస్‌తో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారో అర్థం చేసుకొనే వీలును సర్వీస్‌లకు కల్పించే డేటాను సేకరించడంలో, ఎనలిటిక్స్ కోసం ఉపయోగించబడే కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు సహాయపడతాయి. ఈ గణాంకాలు, కంటెంట్‌ను మెరుగుపరచడంతో పాటు మెరుగైన ఫీచర్‌లను రూపొందించే వెసులుబాటును సర్వీస్‌లకు కల్పించి, తద్వారా మీకు మెరుగైన అనుభవాన్ని అందించడంలో దోహదపడతాయి.

సైట్‌లు, అలాగే యాప్‌ల సర్వీస్‌లతో సందర్శకులు ఎలా ఎంగేజ్ అవుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో కొన్ని కుక్కీలు, ఇంకా అదే విధమైన టెక్నాలజీలు ఆ సైట్‌లకు అలాగే యాప్‌లకు సహాయపడతాయి. ఉదాహరణకు, Google Analytics ఒక్కొక్క సందర్శకులను వ్యక్తిగతంగా గుర్తించకుండా Google Analytics సర్వీస్‌ను ఉపయోగించే బిజినెస్‌ల తరఫున సమాచారాన్ని సేకరించడానికి, అలాగే సైట్ వినియోగ గణాంకాలను వారికి రిపోర్ట్ చేయడానికి కొన్ని కుక్కీలను ఉపయోగిస్తుంది. Google Analytics ఉపయోగించే ప్రధాన కుక్కీ అయిన ‘_ga’, ఒక సందర్శకునికి, మరొక సందర్శకునికి మధ్య తేడాను గుర్తించగలిగేలా సర్వీస్‌ను ఎనేబుల్ చేస్తుంది, ఇది 2 సంవత్సరాల పాటు ఉంటుంది. Google సర్వీస్‌లతో సహా, Google Analyticsను అమలు చేసే ఏ సైట్ అయినా ‘_ga’ కుక్కీని ఉపయోగిస్తుంది. ప్రతి ‘_ga’ కుక్కీ కూడా నిర్దిష్ట ప్రాపర్టీకి ప్రత్యేకంగా ఉంటుంది, కాబట్టి సంబంధం లేని వెబ్‌సైట్‌లలో నిర్దిష్ట యూజర్‌ను గానీ లేదా బ్రౌజర్‌ను గానీ ట్రాక్ చేయడానికి దీన్ని ఉపయోగించడం సాధ్యపడదు.

ఎనలిటిక్స్ కోసం, Google సర్వీస్‌లు, Google Searchలో ‘NID’, ‘_Secure-ENID’ కుక్కీలను, అలాగే YouTubeలో ‘VISITOR_INFO1_LIVE’, ‘__Secure-YEC’ కుక్కీలను కూడా ఉపయోగిస్తాయి. ఎనలిటిక్స్ కోసం, Google మొబైల్ యాప్‌లు, ‘Google వినియోగ ID’ వంటి ప్రత్యేక ఐడెంటిఫయర్‌లను కూడా ఉపయోగించవచ్చు.

వ్యాపార ప్రకటన

యాడ్‌లను అందించడం అలాగే వాటి రెండరింగ్, యాడ్‌లను వ్యక్తిగతీకరించడం (myadcenter.google.com, అలాగే adssettings.google.com/partnerads లోని మీ సెట్టింగ్‌లను బట్టి), ఒక యూజర్‌కు ఒక యాడ్ ఎన్నిసార్లు చూపబడుతుందనే దాన్ని పరిమితం చేయడం, మీరు చూడకుండా ఉండాలనుకుంటున్న యాడ్‌లను మ్యూట్ చేయడం, ఇంకా యాడ్‌ల పనితీరును లెక్కించడంతో సహా, అడ్వర్టయిజింగ్ కోసం Google కుక్కీలను ఉపయోగిస్తుంది.

‘NID’ కుక్కీ సైన్ అవుట్ చేసిన యూజర్‌ల కోసం Google సర్వీస్‌లలో Google యాడ్‌లను చూపడానికి ఉపయోగించబడుతుంది, ఇక ‘ANID’, ‘IDE’ ఇంకా ‘id’ కుక్కీలు Google యేతర సైట్‌లలో Google యాడ్‌లను చూపడానికి ఉపయోగించబడతాయి. Android’s అడ్వర్టయిజింగ్ ID (AdID) వంటి మొబైల్ అడ్వర్టయిజింగ్ IDలు, మీ పరికర సెట్టింగ్‌లను బట్టి, మొబైల్ యాప్‌లలో అదే విధమైన ప్రయోజనం కోసం ఉపయోగించబడతాయి. మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఎనేబుల్ చేసినట్లయితే, మీరు చూసే యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి ‘ANID’ అలాగే ‘IDE’ కుక్కీలు ఉపయోగించబడతాయి. మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఆఫ్ చేసినట్లయితే, ఈ ప్రాధాన్యతను గుర్తుంచుకోవడానికి ‘ANID’ అలాగే ‘id’ కుక్కీలు ఉపయోగించబడతాయి, కాబట్టి మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లు కనిపించవు. 'NID' కుక్కీ గడువు చివరిసారిగా ఉపయోగించినప్పటి నుండి 6 నెలల తర్వాత ముగుస్తుంది. ‘ANID,’ ‘IDE,’ ఇంకా ‘id’ కుక్కీలు ఐరోపా ఆర్థిక మండలి (EEA), స్విట్జర్లాండ్, ఇంకా యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో 13 నెలల పాటు, అలాగే మిగతా అన్ని చోట్లా 24 నెలల పాటు ఉంటాయి.

మీ యాడ్ సెట్టింగ్స్ ఆధారంగా, YouTube వంటి ఇతర Google సర్వీస్‌లు కూడా వీటిని, అలాగే ఇతర కుక్కీలు, టెక్నాలజీలను ఉపయోగిస్తాయి, ఉదాహరణకు అడ్వర్టయిజింగ్ కోసం ‘VISITOR_INFO1_LIVE’ కుక్కీ.

అడ్వర్టయిజింగ్ కోసం ఉపయోగించే కొన్ని కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు Google సర్వీస్‌లను ఉపయోగించడానికి సైన్ ఇన్ చేసే యూజర్‌ల కోసం ఉద్దేశించబడినవి. ఉదాహరణకు, Google యేతర సైట్‌లలో సైన్-ఇన్ చేసిన యూజర్‌ను గుర్తించడానికి ‘DSID’ కుక్కీ ఉపయోగించబడుతుంది, తద్వారా యూజర్ యాడ్‌ల వ్యక్తిగతీకరణ సెట్టింగ్ తదనుగుణంగా పరిగణించబడుతుంది. ‘DSID’ కుక్కీ 2 వారాల పాటు ఉంటుంది.

Google అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా, బిజినెస్‌లు Google సర్వీస్‌లతో పాటు Google కాని సైట్‌లలో కూడా అడ్వర్టయిజ్ చేయవచ్చు. కొన్ని కుక్కీలు థర్డ్-పార్టీ సైట్‌లలో Google యాడ్‌లను చూపించడాన్ని సపోర్ట్ చేస్తాయి, అలాగే మీరు సందర్శించే వెబ్‌సైట్ డొమైన్‌లో సెట్ చేయబడతాయి. ఉదాహరణకు, Google యాడ్‌లను చూపడానికి ‘_gads’ కుక్కీ సైట్‌లను ఎనేబుల్ చేస్తుంది. ‘_gac_’తో ప్రారంభమయ్యే కుక్కీలు Google Analytics నుండి వస్తాయి, అలాగే అవి యూజర్ యాక్టివిటీని, ఇంకా వారి యాడ్ క్యాంపెయిన్‌ల పనితీరును అంచనా వేయడం కోసం అడ్వర్టయిజర్‌ల ద్వారా ఉపయోగించబడతాయి. ‘_gads’ కుక్కీలు 13 నెలలు ఉంటాయి, అలాగే ‘_gac_’ కుక్కీలు 90 రోజులు ఉంటాయి.

మీరు సందర్శించే సైట్‌లో Google యాడ్‌ల కోసం యాడ్, క్యాంపెయిన్ పనితీరు అలాగే మార్పిడి రేట్‌లను అంచనా వేయడానికి కొన్ని కుక్కీలు, ఇంకా అదే విధమైన టెక్నాలజీలు ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, ‘_gcl_’ తో ప్రారంభమయ్యే కుక్కీలు ప్రధానంగా అవి అడ్వర్టయిజర్‌లకు వారి యాడ్‌లపై క్లిక్ చేసే యూజర్‌లు తమ సైట్‌లో కొనుగోలు చేయడం వంటి చర్యలను ఎన్నిసార్లు పూర్తి చేశారు అనేది నిర్ధారించుకోవడంలో సహాయపడతాయి. సానుకూల స్పందన రేట్‌లను అంచనా వేయడానికి ఉపయోగించే కుక్కీలు యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి ఉపయోగించబడవు. ‘_gcl_’ కుక్కీలు 90 రోజుల పాటు ఉంటాయి. Android పరికరాలలో అడ్వర్టయిజింగ్ ID వంటి అదే విధమైన టెక్నాలజీలు యాడ్ అలాగే క్యాంపెయిన్ పనితీరును అంచనా వేయడానికి కూడా ఉపయోగించబడవచ్చు. మీరు మీ Android పరికరంలో మీ యాడ్ ID సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు.

అడ్వర్టయిజింగ్ కోసం ఉపయోగించిన కుక్కీల గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ చూడండి.

వ్యక్తిగతీకరణ

వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించబడే కుక్కీలు, అలాగే అదే విధమైన టెక్నాలజీలు g.co/privacytools లింక్‌లో లేదా మీ యాప్‌లో సెట్టింగ్‌లు అలాగే పరికర సెట్టింగ్‌లను బట్టి వ్యక్తిగతీకరించిన కంటెంట్, ఫీచర్‌లను అందించడం ద్వారా మీ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.

వ్యక్తిగతీకరించిన కంటెంట్ అలాగే ఫీచర్‌లలో, మరింత సందర్భోచితమైన ఫలితాలు, సిఫార్సులు, అనుకూలంగా మార్చబడిన YouTube హోమ్ పేజీ, ఇంకా మీ ఆసక్తులకు తగ్గట్టుగా ప్రత్యేకంగా మీ కోసం అందించబడిన యాడ్‌ల వంటివి ఉంటాయి. ఉదాహరణకు ‘VISITOR_INFO1_LIVE’ కుక్కీ YouTubeలో గత వీక్షణలు అలాగే సెర్చ్‌ల ఆధారంగా వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఎనేబుల్ చేయవచ్చు. అలాగే మీరు సెర్చ్ క్వెరీలను టైప్ చేస్తున్నప్పుడు Searchలో వ్యక్తిగతీకరించిన ఆటో-కంప్లీట్ ఫీచర్‌లను ‘NID’ కుక్కీ ఎనేబుల్ చేస్తుంది. ఈ కుక్కీల గడువు చివరిసారిగా ఉపయోగించినప్పటి నుండి 6 నెలల తర్వాత ముగుస్తుంది.

మరొక కుక్కీ అయిన ‘UULE’, Google సర్వర్‌లకు మీ బ్రౌజర్ నుండి ఖచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని పంపుతుంది, తద్వారా Google మీ లొకేషన్‌కు సందర్భోచితంగా ఉండే ఫలితాలను మీకు చూపగలుగుతుంది. ఈ కుక్కీ వినియోగం మీ బ్రౌజర్ సెట్టింగ్‌లపై అలాగే మీ బ్రౌజర్‌కు సంబంధించి లొకేషన్‌ను ఆన్ చేయాలని మీరు ఎంచుకున్నారా, లేదా అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ‘UULE’ కుక్కీ 6 గంటల వరకు ఉంటుంది.

వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించబడే కుక్కీలను, అలాగే అదే విధమైన టెక్నాలజీలను మీరు తిరస్కరించినప్పటికీ, మీకు కనిపించే వ్యక్తిగతీకరించబడని కంటెంట్ ఇంకా ఫీచర్‌లు ఇప్పటికీ మీ లొకేషన్, భాష, పరికర రకం, లేదా మీరు ప్రస్తుతం చూస్తున్న కంటెంట్ వంటి సందర్భోచిత అంశాల ద్వారా ప్రభావితం కావచ్చు.

మీ బ్రౌజర్‌లో కుకీలను నిర్వహించడం

అత్యధిక శాతం బ్రౌజర్‌లు, మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు కుక్కీలను ఎలా సెట్ చేసి, ఉపయోగించాలో మేనేజ్ చేసే వీలును, అలాగే కుక్కీలను, ఇంకా బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేసే వీలును మీకు కల్పిస్తాయి. అలాగే, కుక్కీలను ఒక్కో సైట్‌లో ఒక్కోలా మేనేజ్ చేసే వీలును మీకు కల్పించే సెట్టింగ్‌లు కూడా మీ బ్రౌజర్‌లో ఉండవచ్చు. ఉదాహరణకు, chrome://settings/cookies వద్ద ఉండే Google Chrome సెట్టింగ్‌లు, ఇప్పటికే ఉన్న కుక్కీలను తొలగించడానికి, కుక్కీలన్నింటినీ అనుమతించడానికి లేదా బ్లాక్ చేయడానికి, అలాగే వెబ్‌సైట్‌ల కోసం కుక్కీ ప్రాధాన్యతలను సెట్ చేయడానికి మీకు వీలు కల్పిస్తాయి. Google Chrome అజ్ఞాత మోడ్‌ను కూడా అందిస్తోంది, ఇది మీరు మీ అజ్ఞాత విండోలన్నింటినీ మూసివేసిన తర్వాత మీ బ్రౌజింగ్ హిస్టరీని తొలగించి, మీ పరికరంలోని అజ్ఞాత విండోల నుండి కుక్కీలను క్లియర్ చేస్తుంది.

మీ యాప్‌లు, పరికరాలలో అదే విధమైన టెక్నాలజీలను మేనేజ్ చేయడం

యాప్ లేదా పరికరాన్ని గుర్తించడానికి ఉపయోగించబడే ప్రత్యేక ఐడెంటిఫయర్‌ల వంటి అదే విధమైన టెక్నాలజీలను ఎలా సెట్ చేసి, ఉపయోగించాలో మేనేజ్ చేసే వీలును, అత్యధిక శాతం మొబైల్ పరికరాలు, ఇంకా అప్లికేషన్‌లు మీకు కల్పిస్తాయి. ఉదాహరణకు, Android పరికరాలలోని అడ్వర్టయిజింగ్ IDని లేదా Appleకు చెందిన అడ్వర్టయిజింగ్ ఐడెంటిఫయర్‌ను మీ పరికర సెట్టింగ్‌లలో మేనేజ్ చేయవచ్చు, అదే యాప్-నిర్దిష్ట ఐడెంటిఫయర్‌ల విషయానికి వస్తే, వాటిని సాధారణంగా ఆ యాప్ సెట్టింగ్‌లలో మేనేజ్ చేయవచ్చు.

Google యాప్‌లు
ప్రధాన మెనూ