యూజర్ సమాచారం కోసం ప్రభుత్వ అభ్యర్థనలను Google ఎలా నిర్వహిస్తుంది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు యూజర్ సమాచారాన్ని బహిర్గతం చేయమని Googleను అడుగుతాయి. వర్తించే చట్టాలకు అది అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడం కోసం మేము ప్రతి అభ్యర్థనను జాగ్రత్తగా సమీక్షిస్తాము. ఒకవేళ ఏదైనా అభ్యర్థన చాలా సమాచారాన్ని కోరితే, మేము దానిని పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాము, ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాము మా పారదర్శకత నివేదికలో ప్రభుత్వం నుండి మాకు అందిన అభ్యర్థనల సంఖ్య మరియు రకాలను షేర్ చేస్తాము.

మేము అభ్యర్థనకు ప్రతిస్పందించే విధానం మీ Google సర్వీస్ ప్రొవైడర్‌పై ఆధారపడి ఉంటుంది - చాలా వరకు మా సేవలను ఈ రెండింటిలో ఏదో ఒకటి అందిస్తుంది - యుఎస్ చట్టం ప్రకారం పనిచేస్తున్న యుఎస్ కంపెనీ Google LLC, లేదా ఐరిష్ చట్టం ప్రకారం పనిచేస్తున్న ఐరిష్ కంపెనీ Google ఐర్లాండ్ లిమిటెడ్. మీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరో తెలుసుకోవడానికి, Google సేవా నిబంధనలను రివ్యూ చేయండి లేదా ఒకవేళ మీ Google ఖాతాను ఏదైనా సంస్థ నిర్వహిస్తుంటే మీ ఖాతా నిర్వాహకులను కనుక్కోండి.

మాకు ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి అభ్యర్థనను అందినప్పుడు, సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ముందు మేము ఆ యూజర్ ఖాతాకు ఇమెయిల్ పంపుతాము. ఒకవేళ ఆ ఖాతా ఏదైనా సంస్థ ద్వారా నిర్వహించబడితే, మేము ఖాతా నిర్వాహకులకు నోటీసు పంపుతాము.

అభ్యర్థన యొక్క నిబంధనలలో అది చట్టబద్ధంగా నిషేధించబడి ఉన్నప్పుడు మాత్రం మేము నోటీసును పంపము. చట్టబద్ధమైన లేదా న్యాయస్థాన ఆదేశిత 'నిశ్శబ్ద వ్యవధి' ముగియడం వంటి చట్టబద్ధమైన నిషేధం ఎత్తివెేత జరిగిన తర్వాత మేము నోటీసును అందిస్తాము.

ఒకవేళ ఆ ఖాతా డిజేబుల్ చేయబడినా లేదా హైజాక్ చేయబడినా మేము నోటీసు పంపకపోవచ్చు. పిల్లల భద్రతకు సంబంధించిన ప్రమాదాలు లేదా ఒకరి జీవితానికి ప్రమాదం వాటిల్లడం వంటి అత్యవసర పరిస్థితుల్లో మేము నోటీసు ఇవ్వకపోవచ్చు, ఈ సందర్భంలో అత్యవసర పరిస్థితి గడచిపోయిందని మాకు తెలిసాక నోటీసు అందిస్తాము.

సివిల్, అడ్మినిస్ట్రేటివ్ మరియు క్రిమినల్ కేసులలో యుఎస్ ప్రభుత్వ సంస్థల నుండి అందిన అభ్యర్థనలు

యూజర్ సమాచారాన్ని బహిర్గతం చేయమని ప్రొవైడర్‌ను నిర్బంధించే ప్రభుత్వ సామర్థ్యాన్ని యుఎస్ రాజ్యాంగంలోని నాల్గవ సవరణ మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ గోప్యతా చట్టం (ECPA) పరిమితం చేస్తుంది. యుఎస్ అధికారులు ఈ కింది వాటిని కనీసం చేయవలసి ఉంటుంది:

  • అన్ని సందర్భాల్లో: సభ్యుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం మరియు కొన్ని IP చిరునామాలను బహిర్గతం చేయమని నిర్బంధించడానికి సాక్షి సమను జారీ చేయవలసి ఉంటుంది
  • క్రిమినల్ కేసులలో
    • ఇమెయిల్‌లలో టూ, ఫ్రమ్, cc, bcc మరియు సమయ ముద్ర ఫీల్డ్‌ల వంటి కంటెంట్ కాని రికార్డులను బహిర్గతం చేయమని కోర్టు ఆదేశాన్ని పొందవలసి ఉంటుంది
    • ఇమెయిల్ సందేశాలు, డాక్యుమెంట్‌లు మరియు ఫోటోల వంటి కమ్యూనికేషన్‌లకు సంబంధించిన కంటెంట్‌ను బహిర్గతం చేయడానికి సెర్చ్ వారెంట్ పొందవలసి ఉంటుంది

జాతీయ భద్రతకు సంబంధించిన కేసులలో యుఎస్ ప్రభుత్వ సంస్థల నుండి అభ్యర్థనలు

జాతీయ భద్రతకు సంబంధించిన దర్యాప్తులో, యూజర్ సమాచారం అందించమని Googleను నిర్బంధించడానికి యుఎస్ ప్రభుత్వం జాతీయ భద్రతా లేఖ (NSL)ను గాని, లేదా విదేశీ ఇంటెలిజెన్స్ నిఘా చట్టం (FISA) కింద మంజూరు అయిన అధికారాలలో దేనినైనా ఒకదానిని గాని ఉపయోగించవచ్చు.

  • NSLకు న్యాయసంబంధమైన ప్రమాణీకరణ అవసరం ఉండదు, సభ్యుల సమాచారాన్ని పరిమితంగా అందించేలా మమ్మల్ని నిర్బంధించడానికి మాత్రమే అది ఉపయోగించబడుతుంది.
  • ఎలక్ట్రానిక్ నిఘా కోసం నిర్బంధించడానికి, 'Gmail, డ్రైవ్ మరియు ఫోటోలు' వంటి సేవలలోని కంటెంట్‌తో సహా నిల్వ చేసిన డేటాను బహిర్గతం చేయమని అడగడానికి FISA ఆర్డర్‌లను, ప్రమాణీకరణలను ఉపయోగిస్తారు.

యుఎస్‌కు వెలుపల ప్రభుత్వ అధికారుల నుండి అందే అభ్యర్థనలు

Google LLCకి కొన్నిసార్లు యుఎస్‌కు వెలుపల ప్రభుత్వ అధికారుల నుండి డేటా బహిర్గతం చేయమని అడిగే అభ్యర్థనలు అందుతాయి. ఏదైనా ఇలాంటి అభ్యర్థన మాకు అందినప్పుడు, అలా చేయడం కింది వాటికి అన్నింటికి అనుగుణంగా ఉంటే మేము యూజర్ సమాచారాన్ని అందించవచ్చు:

  • యుఎస్ చట్టం, అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ గోప్యతా చట్టం (ECPA) వంటి వర్తించే యుఎస్ చట్టం ప్రకారం యాక్సెస్ మరియు బహిర్గతం చేయడం అనేవి అనుమతించబడతాయి
  • అభ్యర్థించే దేశం యొక్క చట్టం, అంటే ఇటువంటి సేవను అందించే స్థానిక ప్రొవైడర్‌కు అభ్యర్థన పంపే అధికారులు అదే తగిన విధానాన్ని, వర్తించే చట్టపరమైన అవసరాలను అనుసరించాలని మేము కోరుకుంటాము
  • అంతర్జాతీయ నిబంధనలు అంటే గ్లోబల్ నెట్‌వర్క్ ఇనిషియేటివ్ యొక్క 'భావ ప్రకటన, గోప్యతా' స్వతంత్రానికి సంబంధించిన నియమాలు మరియు దాని అనుబంధ అమలు మార్గదర్శకాలను పాటించే అభ్యర్థనలకు మాత్రమే మేము ప్రతిస్పందించి డేటాను అందిస్తాము
  • Google యొక్క విధానాలు ఇందులో ఏదైనా వర్తించే సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానాలు, అలాగే భావ ప్రకటనా స్వతంత్ర పరిరక్షణకు సంబంధించిన విధానాలు ఉంటాయి

ఐరోపా ఆర్థిక మండలి మరియు స్విట్జర్లాండ్‌లో ఎక్కువ భాగం Google సేవలను Google ఐర్లాండ్ అందిస్తుంది కనుక, అది కూడా యూజర్ సమాచారం కోసం అభ్యర్థనలను అందుకుంటుంది.

ఐరిష్ ప్రభుత్వ సంస్థల నుండి అందే అభ్యర్థనలు

ఐరిష్ ఏజెన్సీ ద్వారా యూజర్ సమాచారం కోసం అందిన అభ్యర్థనలను అంచనా వేసేటప్పుడు ఐరిష్ చట్టాన్ని Google ఐర్లాండ్ పరిగణిస్తుంది. ఐరిష్ చట్టం ప్రకారం యూజర్ సమాచారాన్ని అందించమని Google ఐర్లాండ్‌ను నిర్బంధించడానికి ఐరిష్ చట్ట అమలు చర్య అధికారులు న్యాయ సంబంధిత అధికారం మంజూరు అయిన ఆర్డర్‌ను పొందవలసి ఉంది.

ఐర్లాండ్‌కు వెలుపల ప్రభుత్వ అధికారుల నుండి అందే అభ్యర్థనలు

Google ఐర్లాండ్ ఐరోపా ఆర్థిక మండలి మరియు స్విట్జర్లాండ్ అంతటా ఉన్న యూజర్‌లకు సేవలను అందిస్తుంది, మాకు కొన్నిసార్లు ఐర్లాండ్‌కు వెలుపల ప్రభుత్వ అధికారుల నుండి డేటా బహిర్గతం చేయమనే అభ్యర్థనలు అందుతాయి. ఈ సందర్భంలో, అలా చేయడం కింది వాటికి అనుగుణంగా ఉంటే మేము యూజర్ డేటాను అందించవచ్చు:

  • ఐరిష్ చట్టం, అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ గోప్యతా చట్టం (ECPA) వంటి వర్తించే యుఎస్ చట్టం ప్రకారం 'యాక్సెస్ మరియు బహిర్గతం చేయడం' అనేది అనుమతించబడతుంది
  • ఐర్లాండ్‌లో వర్తించే యూరోపియన్ యూనియన్ (EU) చట్టం, అంటే జనరల్ డేటా రక్షణ నియంత్రణ చట్టం (GDPR)తో సహా ఐర్లాండ్‌లో వర్తించే ఏవైనా EU చట్టాలు
  • అభ్యర్థించే దేశం యొక్క చట్టం, అంటే ఇటువంటి సేవను అందించే స్థానిక ప్రొవైడర్‌కు అభ్యర్థన పంపే అధికారులు అదే తగిన విధానాన్ని, వర్తించే చట్టపరమైన అవసరాలను అనుసరించాలని మేము కోరుకుంటాము
  • అంతర్జాతీయ నిబంధనలు అంటే గ్లోబల్ నెట్‌వర్క్ ఇనిషియేటివ్ యొక్క 'భావ ప్రకటన, గోప్యతా' స్వతంత్రానికి సంబంధించిన నియమాలు మరియు దాని అనుబంధ అమలు మార్గదర్శకాలను పాటించే అభ్యర్థనలకు మాత్రమే మేము ప్రతిస్పందించి డేటాను అందిస్తాము
  • Google యొక్క విధానాలు ఇందులో ఏదైనా వర్తించే సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానాలు, అలాగే భావ ప్రకటనా స్వతంత్ర పరిరక్షణకు సంబంధించిన విధానాలు ఉంటాయి

ఎవరినైనా మరణించకుండా లేదా తీవ్రమైన శారీరక హాని నుండి బాధపడకుండా నిరోధించగలమని మాకు సమంజసమైన విశ్వాసం ఏర్పడితే, మేము ఒక ప్రభుత్వ సంస్థకు సమాచారాన్ని అందించవచ్చు - ఉదాహరణకు, బాంబు బెదిరింపులు, పాఠశాల కాల్పులు, కిడ్నాప్‌లు, ఆత్మహత్యల నివారణ మరియు తప్పిపోయిన వ్యక్తుల కేసులు. అయినప్పటికీ మేము వర్తించే చట్టాలు, ఇంకా మా విధానాలకు అన్వయించి ఈ అభ్యర్థనలను పరిశీలిస్తాము.

Google యాప్‌లు
ప్రధాన మెనూ