ఇది మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేసిన సంస్కరణ. ప్రస్తుత సంస్కరణని లేదా అన్ని పాత సంస్కరణలని వీక్షించండి.

గోప్యతా విధానం

చివరిగా సవరించబడింది: 18 డిసెంబర్, 2017 (ఆర్కైవ్ చేసిన సంస్కరణలను వీక్షించండి)

మా సేవలను ఉపయోగించడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి – సమాచారాన్ని శోధించడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి, ఇతర వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి లేదా క్రొత్త కంటెంట్‌ను సృష్టించడానికి. మాతో మీరు సమాచారాన్ని భాగస్వామ్యం చేసినప్పుడు, ఉదాహరణకు Google ఖాతాను సృష్టించడం ద్వారా, మీకు మరింత సందర్భోచిత శోధన ఫలితాలు మరియు ప్రకటనలను చూపించడానికి, వ్యక్తులతో కనెక్ట్ కావడంలో మీకు సహాయం చేయడానికి లేదా ఇతరులతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని సులభం మరియు త్వరితం చేయడానికి – మేము ఆ సేవలను మరింత మెరుగుపరుస్తాము. మీరు మా సేవలను ఉపయోగిస్తున్నప్పుడు, మేము సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నామనే దాని గురించి మరియు మీరు మీ గోప్యతను రక్షించుకోవడానికి ఉన్న విధానాలను గురించి మీరు స్పష్టంగా ఉండాలని మేము కోరుతున్నాము.

మా గోప్యతా విధానం వీటిని వివరిస్తుంది:

  • ఏ సమాచారాన్ని మేము సేకరిస్తాము మరియు ఎందుకు మేము దీన్ని సేకరిస్తాము.
  • మేము ఆ సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము.
  • సమాచారాన్ని ఎలా ప్రాప్యత చేయాలి మరియు నవీకరించాలి అనే వాటితో సహా, మేము అందించే ఎంపికలు.

మేము దీన్ని వీలైనంత సులభంగా ఉంచడానికి ప్రయత్నించాము, కానీ కుక్కీలు, IP చిరునామాలు, పిక్సెల్ ట్యాగ్‌లు మరియు బ్రౌజర్‌లు వంటి పదాలు మీకు తెలియకపోతే, మొదట ఈ కీలక పదాల గురించి చదవండి. Googleకు మీ గోప్యత ముఖ్యం కాబట్టి మీరు Googleకు క్రొత్త అయినా లేదా చాలా కాలం నుండి ఉన్న వినియోగదారు అయినా, దయచేసి మా ఆచరణల గురించి తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించండి – మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి.

మేము సేకరించే సమాచారం

మీరు మాట్లాడే భాష వంటి ప్రాథమిక అంశాల నుండి మీరు ఉపయోగకరంగా భావించే ప్రకటనలు, మీరు ఆన్‌లైన్‌లో సన్నిహితంగా ఉండే వ్యక్తులు లేదా మీకు నచ్చే YouTube వీడియోల వంటి క్లిష్టమైన అంశాల వరకు గుర్తించడం ద్వారా మా మొత్తం వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి సమాచారాన్ని మేము సేకరిస్తాము.

మేము క్రింది విధానాల్లో సమాచారాన్ని సేకరిస్తాము:

  • మీరు మాకు అందించే సమాచారం. ఉదాహరణకు, మా అనేక సేవలకు మీరు ఒక Google ఖాతాకు సైన్ అప్ చేయడం అవసరం. మీరు సైన్ అప్ చేయాలని నిర్ణయించుకుంటే, మేము మీ ఖాతాతో నిల్వ చేయడానికి మిమ్మల్ని మీ పేరు, ఇమెయిల్ చిరునామా, టెలిఫోన్ నంబర్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి వ్యక్తిగత సమాచారం అడుగుతాము. మేము అందించే భాగస్వామ్య లక్షణాల యొక్క పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందాలనుకుంటే, మేము మీ పేరు మరియు ఫోటో ఉన్న అందరికి తెలిసిన విధంగా కనిపించే Google ప్రొఫైల్‌ను సృష్టించమని కూడా మిమ్మల్ని అడగవచ్చు.

  • మా సేవల యొక్క మీ ఉపయోగం నుండి మేము పొందే సమాచారం. మీరు YouTubeలో వీడియోను చూడటం, మా ప్రకటన సేవలను ఉపయోగించే వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా మా ప్రకటనలు మరియు కంటెంట్‌ను వీక్షించడం మరియు ప్రతిస్పందించడం వంటివి చేసినప్పుడు మీరు ఉపయోగిస్తున్న సేవల గురించిన మరియు వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అనేదాని గురించిన సమాచారాన్ని సేకరిస్తాము. ఈ సమాచారంలో ఇవి ఉంటాయి:

    • పరికర సమాచారం

      మేము పరికర-నిర్దిష్ట సమాచారాన్ని సేకరిస్తాము (మీ హార్డ్‌వేర్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ సంస్కరణ, ప్రత్యేక పరికర నిర్దేశకాలు మరియు ఫోన్ నంబర్‌తో సహా మొబైల్ నెట్‌వర్క్ సమాచారం వంటివి). Google మీ పరికర నిర్దేశకాలను లేదా ఫోన్ నంబర్‌ను మీ Google ఖాతాతో అనుబంధించవచ్చు.

    • లాగ్ సమాచారం

      మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు లేదా Google అందించిన కంటెంట్‌ను వీక్షించినప్పుడు, మేము స్వయంచాలకంగా నిర్దిష్ట సమాచారాన్ని సేకరించి, సర్వర్ లాగ్‌లలో నిల్వ చేస్తాము. దీనిలో ఇవి ఉంటాయి:

      • మా సేవను మీరు ఏ విధంగా ఉపయోగించారు అనే దాని వివరాలు, మీ శోధన ప్రశ్నలు లాంటివి.
      • మీ ఫోన్ నంబర్, కాల్ చేసే వారి నంబర్, ఫార్వర్డ్ చేసే నంబర్‌లు, కాల్‌ల సమయం మరియు తేదీ, కాల్‌ల వ్యవధి, ఎస్ఏంఎస్ (SMS) రూటింగ్ సమాచారం మరియు కాల్‌ల రకాలు వంటి టెలిఫోనీ లాగ్ సమాచారం.
      • ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామా.
      • క్రాష్‌లు, సిస్టమ్ కార్యాచరణ, హార్డ్‌వేర్ సెట్టింగ్‌లు, బ్రౌజర్ రకం, బ్రౌజర్ భాష, మీ అభ్యర్థన యొక్క తేదీ మరియు సమయం మరియు సూచించిన యుఆర్ఎల్ (URL) వంటి పరికర ఈవెంట్ సమాచారం.
      • మీ బ్రౌజర్‌ను లేదా మీ Google ఖాతాను ప్రత్యేకంగా గుర్తించే కుకీలు (Cookies).
    • స్థానం సమాచారం

      మీరు Google సేవలను ఉపయోగించినప్పుడు, మేము మీ వాస్తవ స్థానం గురించి సమాచారాన్ని సేకరించవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు. మేము స్థానాన్ని కనుగొనడానికి సమీప పరికరాల్లో సమాచారాన్ని Googleకి అందించే IP చిరునామా, GPS, వై-ఫై(Wi-Fi) ప్రాప్యత పాయింట్‌లు మరియు సెల్ టవర్‌లు వంటి ఇతర సెన్సార్‌లతో సహా అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తాము.

    • ప్రత్యేక అనువర్తన సంఖ్యలు

      నిర్దిష్ట సేవలు ప్రత్యేక అనువర్తన సంఖ్యను కలిగి ఉంటాయి. ఈ సంఖ్య మరియు మీ ఇన్‌స్టాలేషన్ గురించి సమాచారం (ఉదాహరణకు, ఆపరేటింగ్ సిస్టమ్ రకం మరియు అనువర్తన సంస్కరణ సంఖ్య) మీరు సేవను ఇన్‌స్టాల్ లేదా అన్‌ఇన్‌స్టాల్ చేసినప్పుడు లేదా స్వయంచాలక నవీకరణలు వంటి వాటి కోసం సేవ నియమానుసారంగా మా సర్వర్‌లను సంప్రదించినప్పుడు Googleకు పంపబడవచ్చు.

    • స్థానిక నిల్వ

      మేము బ్రౌజర్ వెబ్ నిల్వ (HTML 5తో సహా) మరియు అనువర్తన డేటా కాష్‌లు వంటి యాంత్రిక విధానాలు ఉపయోగించి మీ పరికరంలో స్థానికంగా సమాచారాన్ని (వ్యక్తిగత సమాచారంతో సహా) సేకరించవచ్చు మరియు నిల్వ చేయవచ్చు.

    • కుక్కీలు మరియు సారూప్య సాంకేతికతలు

      మీరు Google సేవను సందర్శించినప్పుడు సమాచారాన్ని సేకరించడానికి మరియు నిల్వ చేయడానికి మేము మరియు మా భాగస్వాములు అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తాము మరియు దీనిలో భాగంగా మీ బ్రౌజర్‌ను లేదా పరికరాన్ని గుర్తించడానికి కుకీలు లేదా సారూప్య సాంకేతికతలు ఉపయోగించవచ్చు. మేము మా భాగస్వాములకు అందించే సేవలతో అనగా ఇతర సైట్‌ల్లో కనిపించే ప్రచార సేవలు లేదా Google లక్షణాలు వంటి వాటితో మీరు పరస్పర చర్య చేసినప్పుడు సమాచారాన్ని సేకరించడానికి మరియు నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికతలను ఉపయోగిస్తాము. మా Google Analytics ఉత్పత్తి వారి వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనాలకు ట్రాఫిక్‌ను విశ్లేషించడంలో వ్యాపార సంస్థలకు మరియు సైట్ యజమానులకు సహాయపడుతుంది. DoubleClick కుకీని వినియోగిస్తున్న వాటి వంటి మా వాణిజ్య ప్రకటన సేవలతో కలిపి ఉపయోగించినప్పుడు, Google Analytics సమాచారం Google Analytics కస్టమర్ ద్వారా లేదా Google ద్వారా Google సాంకేతికతను ఉపయోగించి బహుళ సైట్‌లకు చేసిన సందర్శనలకి సంబంధించిన సమాచారంతో లింక్ చేయబడుతుంది.

మీరు Googleకి సైన్ ఇన్ చేసినప్పుడు మేము సేకరించే సమాచారం, అలాగే మేము మీ గురించి భాగస్వాముల నుండి పొందే సమాచారం మీ Google ఖాతాకు అనుబంధించవచ్చు. సమాచారం మీ Google ఖాతాకు అనుబంధించినప్పుడు, మేము దాన్ని వ్యక్తిగత సమాచారం వలె పరిగణిస్తాము. మీ Google ఖాతాతో అనుబంధించబడిన సమాచారాన్ని మీరు ఎలా ప్రాప్యత చేయవచ్చు, నిర్వహించవచ్చు లేదా తొలగించవచ్చు అనేదాని గురించి మరింత సమాచారం కోసం, ఈ విధానంలోని పారదర్శకత మరియు ఎంపిక విభాగాన్ని చూడండి.

మేము సేకరించిన సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము

మేము మా అన్ని సేవల నుండి సేకరించే సమాచారాన్ని వాటిని అందించడానికి, నిర్వహించడానికి, రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి, కొత్త వాటిని అభివృద్ధి చేయడానికి మరియు Googleను మరియు మా వినియోగదారులను రక్షించడానికి ఉపయోగిస్తాము. మేము ఈ సమాచారాన్ని మరింత సందర్భోచిత ఫలితాలను మరియు ప్రకటనలను ఇవ్వడం వంటి వ్యక్తీకరించిన కంటెంట్‌ను మీకు అందించడానికి కూడా ఉపయోగిస్తాము.

మీ Google ప్రొఫైల్ కోసం మీరు అందించిన పేరును మేము అందించే Google ఖాతా అవసరమయ్యే అన్ని సేవల్లో ఉపయోగించవచ్చు. అదనంగా, మేము మీ Google ఖాతాతో అనుబంధితమైన గత పేర్లను భర్తీ చేయవచ్చు, అందువల్ల మీరు మా అన్ని సేవల్లో ఒకే విధంగా సూచించబడతారు. ఇతర వినియోగదారులు మీ ఇమెయిల్‌ను లేదా మిమ్మల్ని గుర్తించే ఇతర సమాచారాన్ని ఇప్పటికే కలిగి ఉంటే, మేము మీ పేరు మరియు ఫోటో వంటి, అందరికి తెలిసే విధంగా కనిపించే Google ప్రొఫైల్ సమాచారాన్ని వారికి చూపుతాము.

మీరు Google ఖాతా కలిగి ఉంటే, మేము Googleలో లేదా మా సేవల్లో మీ Google ఖాతాకు కనెక్ట్ చేయబడిన మూడవ-పక్ష అనువర్తనాల్లో మీ ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ ఫోటో మరియు మీరు తీసుకునే చర్యలను (+1లు, మీరు వ్రాసే సమీక్షలు మరియు మీరు పోస్ట్ చేసే వ్యాఖ్యల వంటివి) ప్రదర్శించవచ్చు, దీనితో పాటు ప్రకటనల్లో మరియు ఇతర వాణిజ్య సందర్భాల్లో ప్రదర్శించవచ్చు. మీ Google ఖాతాలో భాగస్వామ్య లేదా దృశ్యమాన సెట్టింగ్‌లను పరిమితం చేయడం కోసం మీరు ఎంచుకునే ఎంపికలకు మేము విలువ ఇస్తాము.

మీరు Googleను సంప్రదించినప్పుడు, మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయడానికి మేము మీ కమ్యూనికేషన్ యొక్క రికార్డ్‌ను ఉంచుతాము. మేము మీ ఇమెయిల్ చిరునామాను మా సేవల రాబోయే మార్పులు లేదా అభివృద్ధుల గురించి మీకు తెలియజేయడానికి ఉపయోగిస్తాము.

మీ వినియోగదారు అనుభవాన్ని మరియు మా సేవల యొక్క మొత్తం నాణ్యతను మెరుగుపరచడానికి కుకీలు మరియు పిక్సెల్ ట్యాగ్‌లు వంటి ఇతర సాంకేతికతల నుండి సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. మా స్వంత సేవల్లో దీన్ని చేయడానికి మేము ఉపయోగించే ఉత్పత్తుల్లో Google Analytics ఒకటి. ఉదాహరణకు, మీ భాషా ప్రాధాన్యతలను సేవ్ చేయడం ద్వారా, మీరు ఎంచుకున్న భాషలో మా సేవలు కనిపించేలా మేము చేయగలుగుతాము. మీకు వ్యక్తీకరించిన ప్రకటనలను చూపిస్తున్నప్పుడు, మేము జాతి, మతం, లైంగిక నేపథ్యం లేదా ఆరోగ్యంపై ఆధారపడినటువంటి సున్నితమైన వర్గాలతో కుకీలు లేదా సారూప్య సాంకేతికతల్లోని నిర్దేశకాన్ని అనుబంధించము.

అనుకూలీకరించిన శోధన ఫలితాలు, వ్యక్తీకరించిన వ్యాపార ప్రకటనలు మరియు స్పామ్ మరియు మాల్వేర్ గుర్తింపు వంటి సంబంధిత ఉత్పత్తి లక్షణాలను మీకు వ్యక్తిగతంగా అందించడానికి మా స్వయంచాలక సిస్టమ్‌లు మీ కంటెంట్‌ను (ఇమెయిల్‌లతో సహా) విశ్లేషిస్తాయి.

మేము ఒక సేవలోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతర Google సేవల్లోని సమాచారంతో, అలాగే అందులోని వ్యక్తిగత సమాచారంతో కూడా కలపవచ్చు – ఉదాహరణకు, మీకు తెలిసిన వ్యక్తులతో విషయాలను భాగస్వామ్యం చేయడాన్ని సులభం చేయడానికి ఇలా చేస్తాము. Google సేవలను మరియు Google అందించే ప్రకటనలను మెరుగుపరచడానికి మీ ఖాతా సెట్టింగ్‌ల ఆధారంగా, ఇతర సైట్‌లు మరియు అనువర్తనాల్లోని మీ కార్యాచరణను మీ వ్యక్తిగత సమాచారంతో అనుబంధించవచ్చు.

మేము ఈ గోప్యతా విధానంలో పేర్కొన్నవి మినహా మరో ప్రయోజనం కోసం సమాచారాన్ని ఉపయోగించడానికి ముందు మీ సమ్మతి కోసం అడుగుతాము.

ప్రపంచం అంతటా అనేక దేశాల్లోని మా సర్వర్‌లలో వ్యక్తిగత సమాచారాన్ని Google ప్రాసెస్ చేస్తుంది. మేము మీరు నివసిస్తున్న దేశం వెలుపల ఉన్న సర్వర్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయవచ్చు.

పారదర్శకత మరియు ఎంపిక

వ్యక్తులకు వివిధ గోప్యతా సమస్యలు ఉన్నాయి. మేము ఏ రకమైన సమాచారాన్ని సేకరిస్తామో దాని గురించి స్పష్టంగా ఉండటం మా లక్ష్యం, అందువల్ల మీరు ఇది ఏ విధంగా ఉపయోగించబడుతుంది అనేదాని గురించి అర్థవంతమైన ఎంపికలను చేయవచ్చు. ఉదాహరణకు, మీరు వీటిని చేయవచ్చు:

  • మీరు Google సేవలు ఉపయోగించినప్పుడు YouTubeలో చూసిన వీడియోలు లేదా గత శోధనలు వంటి వాటిలో ఏ రకమైన డేటాను మీ ఖాతాతో సేవ్ చేయాలని కోరుకుంటున్నారో నిర్ణయించడానికి మీ Google కార్యాచరణ నియంత్రణలను సమీక్షించండి మరియు నవీకరించండి. అలాగే మీరు మీ ఖాతా నుండి సైన్ అవుట్ చేసిన ఉన్న సమయంలో మా సేవలను ఉపయోగించినప్పుడు నిర్దిష్ట కార్యాచరణ మీ పరికరంలోని కుక్కీ లేదా సారూప్య సాంకేతికతలో నిల్వ చేయబడాలో లేదో నిర్వహించడానికి ఈ నియంత్రణలను సందర్శించవచ్చు.
  • Google డాష్‌బోర్డ్ ఉపయోగించి మీ Google ఖాతాకు అనుసంధానించిన నిర్దిష్ట రకాల సమాచారాన్ని సమీక్షించవచ్చు మరియు నియంత్రించవచ్చు.
  • ప్రకటన సెట్టింగ్‌లను ఉపయోగించి, Google మరియు వెబ్‌లో మీకు చూపబడే Google ప్రకటనలకి సంబంధించి మీకు ఆసక్తి కలిగించే వర్గాల వంటి మీ ప్రాధాన్యతలను వీక్షించండి మరియు సవరించండి. అలాగే, మీరు నిర్దిష్ట Google ప్రకటన సేవలను నిలిపివేయడం కోసం కూడా ఆ పేజీని సందర్శించవచ్చు.
  • మీ Google ఖాతాతో అనుబంధించబడిన ప్రొఫైల్ ఇతరులకు కనిపించే విధానాన్ని సర్దుబాటు చేయవచ్చు.
  • మీరు మీ Google ఖాతా ద్వారా సమాచారాన్ని భాగస్వామ్యం చేసేవారిని నియంత్రించవచ్చు.
  • మా సేవల్లోని అనేక వాటి నుండి మీ Google ఖాతాతో అనుబంధించబడిన సమాచారాన్ని సంగ్రహించవచ్చు.
  • ప్రకటనల్లో కనిపించే స్నేహితుల సిఫార్సుల్లో మీ ప్రొఫైల్ పేరు మరియు ప్రొఫైల్ ఫోటో కనిపించాలో లేదో ఎంచుకోండి.

మా సేవలతో అనుబంధించిన కుకీలతో సహా అన్ని కుకీలను బ్లాక్ చేయడానికి లేదా మా ద్వారా కుకీ సెట్ చేయబడుతున్నప్పుడు సూచించడానికి కూడా మీరు మీ బ్రౌజర్‌ను సెట్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ, మీ కుక్కీలు నిలిపివేయబడితే మా అనేక సేవలు సరిగ్గా పని చేయవని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఉదాహరణకు, మేము మీ భాషా ప్రాధాన్యతలను గుర్తుంచుకోలేము.

మీరు భాగస్వామ్యం చేసే సమాచారం

మా అనేక సేవలు మీరు ఇతరులతో సమాచారాన్ని భాగస్వామ్యం చేసుకునేందుకు అనుమతిస్తాయి. మీరు అందరికి తెలిసే విధంగా సమాచారాన్ని భాగస్వామ్యం చేసినప్పుడు, Googleతో సహా, శోధన ఇంజిన్‌ల ద్వారా ఇది సూచించబడుతుందని గుర్తుంచుకోండి. మా సేవలు మీ కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడంలో మరియు తీసివేయడంలో వివిధ ఎంపికలను మీకు అందిస్తాయి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాప్యత చేయడం మరియు నవీకరించడం

మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యతను మీకు అందించడం మా ఉద్దేశం. ఆ సమాచారం సరైనది కాకపోతే , మేము దాన్ని శీఘ్రంగా నవీకరించడానికి లేదా తొలగించడానికి మీకు మార్గాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తాము – చట్టబద్ధమైన వ్యాపారం లేదా చట్టబద్ధ ప్రయోజనాల కోసం సమాచారాన్ని మేము ఉంచే అవసరం లేకపోతే.

ప్రమాదాలు లేదా ఇతరులకు హాని కలిగించే విధ్వంసం నుండి సమాచారాన్ని రక్షించే విధానంలో మా సేవలను నిర్వహించడం మా ఉద్దేశం. దీని కారణంగా, మీరు మా సేవల నుండి సమాచారాన్ని తొలగించిన తర్వాత, మేము మా సక్రియాత్మక సర్వర్‌ల నుండి మిగిలిన కాపీలను వెంటనే తొలగించము మరియు మా బ్యాకప్ సిస్టమ్‌ల నుండి సమాచారాన్ని తీసివేయము.

మేము భాగస్వామ్యం చేసే సమాచారం

క్రింద సందర్భాల్లోని ఒక సందర్భం కాకపోతే, మేము Google వెలుపల ఉన్న కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేయము:

  • మీ సమ్మతితో

    మాకు భాగస్వామ్యం చేయడానికి మీ సమ్మతి ఉన్నప్పుడు మేము Google వెలుపల ఉన్న కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తాము. ఏదైనా సున్నితమైన వ్యక్తిగత సమాచారం యొక్క భాగస్వామ్యం కోసం మాకు అనుమతించే సమ్మతి (opt-in consent) అవసరం.

  • డొమైన్ నిర్వాహకులతో

    మీ కోసం మీ Google ఖాతా డొమైన్ నిర్వాహకుడు ద్వారా నిర్వహించబడితే (ఉదాహరణకు, G Suite వినియోగదారుల కోసం), అప్పుడు మీ సంస్థకు వినియోగదారు మద్దతుని అందించే మీ డొమైన్ నిర్వాహకుడు మరియు పునఃవిక్రేత మీ Google ఖాతా సమాచారానికి (మీ ఇమెయిల్ మరియు ఇతర డేటాతో సహా) ప్రాప్యతను కలిగి ఉంటారు. మీ డొమైన్ నిర్వాహకుడు వీటిని చేయగలరు:

    • మీరు ఇన్‌స్టాల్ చేసిన అనువర్తనాలకు సంబంధించిన గణాంకాలు, మీ ఖాతాకు సంబంధించిన గణాంకాలను వీక్షించడం.
    • మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం.
    • మీ ఖాతా ప్రాప్యతను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రద్దు చేయడం.
    • మీ ఖాతాలో భాగంగా నిల్వ చేసిన సమాచారాన్ని ప్రాప్యత చేయడం లేదా ఉంచడం.
    • వర్తించబడే చట్టం, నియంత్రణ, చట్టబద్ధ విధానం లేదా ఆచరణీయ ప్రభుత్వ అభ్యర్థనను సంతృప్తి పర్చడానికి మీ ఖాతా సమాచారాన్ని స్వీకరించడం.
    • సమాచారాన్ని లేదా గోప్యతా సెట్టింగ్‌లను తొలగించడానికి లేదా సవరించడానికి మీ సామర్థ్యాన్ని పరిమితం చేయడం.

    దయచేసి మరింత సమాచారం కోసం మీ డొమైన్ నిర్వాహకుడి యొక్క గోప్యతా విధానాన్ని చూడండి.

  • బాహ్య ప్రాసెసింగ్ కోసం

    మా సూచనలు ఆధారంగా మరియు మా గోప్యతా విధానం మరియు ఏదైనా ఇతర సముచిత గోప్యనీయత మరియు భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా, మా తరపున ప్రాసెస్ చేయడానికి మా అనుబంధాలు లేదా ఇతర విశ్వసనీయ వ్యాపారాలు లేదా వ్యక్తులకు మేము వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తాము.

  • చట్టబద్ధ కారణాల కోసం

    సమాచారం యొక్క ప్రాప్యత, ఉపయోగం, ప్రదర్శన లేదా వెల్లడి వీరికి అవసరమైన సహేతుకమైనదని మాకు ఉత్తమమైన నమ్మకం ఉంటే, మేము Google వెలుపల ఉన్న కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తాము:

    • ఏదైనా వర్తించే చట్టానికి, నియమానికి, చట్టపరమైన విధానం లేదా ఆచరణీయ ప్రభుత్వ అభ్యర్థనకు లోబడి ఉండటానికి.
    • సమర్థవంతమైన ఉల్లంఘనల పరిశీలనతో సహా, వర్తించబడే సేవా నిబంధనలను అమలు చేయడానికి.
    • చిరునామా మోసం, భద్రతా లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడానికి, నివారించడానికి లేదా మరొక దాని కోసం.
    • చట్టానికి అవసరమైనట్లుగా లేదా ఆమోదించినట్లుగా Google, వినియోగదారులు లేదా పబ్లిక్‌ యొక్క హక్కులకు, ఆస్తికి లేదా భద్రతకు హాని కలిగించే వాటికి వ్యతిరేకంగా రక్షించడానికి.

మేము వ్యక్తిగతంగా గుర్తించబడని సమాచారాన్ని బహిరంగంగా మరియు ప్రచురణకర్తలు, ప్రకటనకర్తలు లేదా అనుసంధానిత సైట్‌లు వంటి మా భాగస్వాములతో పంచుకోవచ్చు. ఉదాహరణకు, మేము మా సేవల యొక్క సాధారణ వినియోగం తీరు చూపడానికి సమాచారాన్ని అందరికి తెలిసే విధంగా పంచుకోవచ్చు.

విలీనం, సేకరణ లేదా ఆస్తి అమ్మకం వంటి వాటిలో Google పాల్గొంటే, మేము ఏదైనా వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యనీయత నిర్ధారణను కొనసాగిస్తాము మరియు వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయడానికి లేదా వేరొక గోప్యతా విధానానికి సంబంధించినదిగా చేయడానికి ముందు ప్రభావితమైన వినియోగదారులకు సమాచారం ఇస్తాము.

సమాచార భద్రత

మేము మా వద్ద ఉన్న సమాచారానికి అనధికార ప్రాప్యతను లేదా అనధికార మార్పు, వెల్లడి లేదా విధ్వంసం నుండి Google మరియు మా వినియోగదారులను రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా:

  • మేము మా అనేక సేవలను ఎస్ఎస్ఎల్ (SSL)ను ఉపయోగించి గుప్తీకరిస్తాము.
  • మీరు మీ Google ఖాతాను ప్రాప్యత చేసినప్పుడు, మీకు రెండు దశల ధృవీకరణను మరియు Google Chromeలో సురక్షిత బ్రౌజింగ్ లక్షణాన్ని అందిస్తాము.
  • మేము సిస్టమ్‌లను అనధికార ప్రాప్యత నుండి రక్షించడానికి, శారీరక భద్రత ప్రమాణాలతోసహా, మా సమాచార సేకరణ, నిల్వ మరియు ప్రాసెసింగ్ ఆచరణలను సమీక్షిస్తాము.
  • మేము మా కోసం దీన్ని ప్రాసెస్ చేయడానికి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్న లేదా ఖచ్చితమైన ఒప్పంద గోప్యనీయత బాధ్యతలకు సంబంధించిన Google ఉద్యోగులు, ఒప్పందం చేసుకొనినవారు (Contractors) మరియు ఏజెంట్‌లకు వ్యక్తిగత సమాచారాన్ని ప్రాప్యత చేయడాన్ని పరిమితం చేస్తాము మరియు ఈ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమైతే క్రమశిక్షణగా ఉంచబడతారు లేదా తొలగించబడతారు.

ఈ గోప్యతా విధానం ఎప్పుడు వర్తిస్తుంది

మా గోప్యతా విధానం Google LLC మరియు దీని అనుబంధిత సంస్థలు అందిస్తున్న అన్ని సేవలకు, వీటితో పాటుగా YouTubeకు, Android పరికరాల్లో మరియు ఇతర సైట్‌ల్లో (మా వ్యాపార ప్రకటన సేవలు వంటివి) Google అందిస్తున్న సేవలకు వర్తిస్తుంది, కానీ ఈ గోప్యతా విధానం అనుబంధించకుండా వాటికంటూ ప్రత్యేక గోప్యత విధానాలను కలిగి ఉండే సేవలు మినహాయించబడతాయి.

శోధన ఫలితాల్లో మీకు కనిపించే ఉత్పత్తులు లేదా సేవలు, Google సేవల్లో ఉండే సైట్‌లు లేదా మా సేవల నుండి లింక్ చేయబడిన ఇతర సైట్‌లతో సహా, ఇతర కంపెనీలు లేదా వ్యక్తుల ద్వారా అందించిన సేవలకు మా గోప్యతా విధానం వర్తించదు. మా సేవలను ప్రచారం చేసే మరియు సందర్భోచిత ప్రకటనలను అందించడానికి కుకీలు, పిక్సెల్ ట్యాగ్‌లు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించే ఇతర కంపెనీలు మరియు సంస్థల సమాచార ఆచరణలకు మా గోప్యతా విధానం వర్తించదు.

నియంత్రిత నిబంధనలకు అనుకూలత మరియు సహకారం

మేము మా గోప్యతా విధానంతో మా అనుకూలతను నిరంతరం సమీక్షిస్తాము. అలాగే, మేము EU-US మరియు Swiss-US Privacy Shield Frameworksతో సహా పలు స్వీయ నియంత్రణాత్మక నియమావళులకు కూడా కట్టుబడి ఉంటాము. మేము లాంఛనప్రాయ వ్రాతపూర్వక ఫిర్యాదులను స్వీకరించినప్పుడు, విచారణ నిమిత్తం ఫిర్యాదు చేసిన వ్యక్తిని సంప్రదిస్తాము. మేము మా వినియోగదారులతో నేరుగా పరిష్కరించుకోలేని ఏవైనా వ్యక్తిగత డేటా బదిలీ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడానికి స్థానిక డేటా పరిరక్షణ అధీకృత సంస్థలతో సహా సముచిత నియంత్రణ అధీకృత సంస్థలతో కలిసి పని చేస్తాము.

మార్పులు

మా గోప్యతా విధానం సమయానుసారంగా మారవచ్చు. మేము మీ స్పష్టమైన సమ్మతిలేకుండా ఈ గోప్యతా విధానంలో మీ హక్కులను తగ్గించము. మేము ఏవైనా గోప్యతా విధాన మార్పులను ఈ పేజీలో పోస్ట్ చేస్తాము మరియు మార్పులు ముఖ్యమైనవి అయితే, మేము అత్యంత ముఖ్యమైన నోటీసును అందిస్తాము (నిర్దిష్ట సేవలు కోసం, గోప్యతా విధాన మార్పుల యొక్క ఇమెయిల్ నోటిఫికేషన్‌తో సహా). మేము మీ సమీక్ష కోసం ఆర్కైవ్‌లో ఈ గోప్యతా విధానం యొక్క మునుపటి సంస్కరణలను కూడా ఉంచుతాము.

నిర్దిష్ట ఉత్పత్తి ఆచరణలు

మీరు ఉపయోగిస్తున్న నిర్దిష్ట Google ఉత్పత్తులకు మరియు సేవలకు సంబంధించిన నిర్దిష్ట గోప్యతా ఆచరణలను క్రింద ఉన్న నోటీసులు వివరిస్తాయి:

మా అత్యంత జనాదరణ పొందిన సేవల్లో కొన్నింటి గురించి మరింత సమాచారం పొందడానికి, మీరు Google ఉత్పత్తి గోప్యత గైడ్ను చూడండి.

తదుపరి ఉపయోగకర గోప్యత మరియు భద్రతా సంబంధిత విషయాలను Google యొక్క విధానాలు మరియు నియమాలు పేజీల ద్వారా తెలుసుకోవచ్చు, వీటిని కూడా తెలుసుకోవచ్చు:

Google యాప్‌లు
ప్రధాన మెనూ