Google సేవా నిబంధనలు

అమల్లోనికి వచ్చే తేదీ 5 జనవరి, 2022 | ఆర్కైవ్ చేసిన వెర్షన్‌లు | PDFని డౌన్‌లోడ్ చేయండి

దేశం వెర్షన్: యునైటెడ్ స్టేట్స్

మీరు మా సర్వీస్‌లను ఉపయోగిస్తున్నప్పుడు — Google నుండి ఏమి ఆశించాలి — అలాగే మీ నుండి మేము ఏమి ఆశిస్తున్నాము అనేది మీరు అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి 22 మే, 2024 తేదీన మా సర్వీస్ నియమాలను మేము అప్‌డేట్ చేస్తున్నాము. అప్పటి దాకా, కింది నియమాలు వర్తించడం కొనసాగుతుంది.

కొత్త నియమాల ప్రివ్యూను చూడండి

ఈ నిబంధనలలో ఏమేమి కవర్ అయ్యాయి

ఈ సేవా నిబంధనలను దాటవేయాలని మీకు ఆత్రుతగా ఉందని మాకు తెలుసు, కానీ మీరు Google సేవలను ఉపయోగిస్తున్నప్పుడు మీరు మా నుండి ఏమి ఆశించవచ్చు మరియు మీ నుండి మేము ఏమి ఆశిస్తాము అనే వాటిపై పరస్పర అంగీకారం కుదుర్చుకోవడం అవసరం.

ఈ సేవా నిబంధనలు Google వ్యాపారం పనిచేసే విధానం మా కంపెనీకి వర్తించే చట్టాలు మరియు మేము ఎల్లప్పుడూ నిజమని నమ్ముతున్న విషయాలను ప్రతిబింబిస్తాయి. ఫలితంగా, మీరు మా సేవలతో ప్రతిస్పందించేటప్పుడు, మీతో Google యొక్క సంబంధాన్ని నిర్వచించడానికి ఈ సేవా నిబంధనలు సహాయపడతాయి. ఉదాహరణకు, కింద ఉన్న అంశ శీర్షికలు ఈ నిబంధనలలో భాగమై ఉన్నాయి:

ఈ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే, మా సేవలను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నిబంధనలను అంగీకరిస్తున్నారు.

ఈ నిబంధనలతో పాటు, మేము గోప్యతా పాలసీని కూడా ప్రచురిస్తాము. మీరు మీ సమాచారాన్ని ఎలా అప్‌డేట్ చేయగలరో, మేనేజ్, ఎగుమతి చేయగలరో లేదా తొలగించగలరో ఉత్తమంగా అర్థం చేసుకోవడానికి దీనిని చదవాలని మేము ప్రోత్సహిస్తున్నాము.

నిబంధనలు

సర్వీస్ ప్రొవైడర్

Google సేవలు వీటి ద్వారా అందించబడతాయి, మీరు వీటితో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు:

Google LLC
USAలోని డెలావేర్‌ స్టేట్ యొక్క చట్టాల ఆధారంగా ఏర్పాటు చేయబడింది మరియు USA యొక్క చట్టాల ప్రకారం పనిచేస్తుంది

1600 Amphitheatre Parkway
Mountain View, California 94043
USA

వయస్సు ఆవశ్యకతలు

మీరు మీ సొంత Google ఖాతాను నిర్వహించడానికి అవసరమైన వయస్సులో ఉన్నట్లయితే, మీకు Google ఖాతాను ఉపయోగించడానికి మీ తల్లిదండ్రుల లేదా చట్టపరమైన సంరక్షకుల అనుమతి ఉండాలి. దయచేసి మీ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఈ నిబంధనలను మీతో పాటు చదివేలా చేయండి.

మీరు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులుఅయ్యి, సేవలను, ఉపయోగించడానికి మీరు మీ పిల్లలను అనుమతించినట్లయితే, ఈ నిబంధనలు మీకు వర్తిస్తాయి అలాగే సేవలలో మీ పిల్లల కార్యకలాపానికి మీరు బాధ్యత వహిస్తారు.

కొన్ని Google సేవలకు వారి సేవా-నిర్దిష్ట అదనపు నిబంధనలు మరియు విధానాలలో వివరించిన విధంగా అదనపు వయస్సు ఆవశ్యకాలు ఉంటాయి

Googleతో మీ సంబంధం

మీకు మరియు Googleకు మధ్య సంబంధాన్ని నిర్వచించడంలో ఈ నిబంధనలు సహాయపడతాయి. విస్తారంగా చెప్పాలంటే, మా సేవలను ఉపయోగించడానికి మేము మీకు అనుమతి ఇస్తున్నాము, మీరు ఈ నిబంధనలను ఫాలో అవ్వడానికి అంగీకరిస్తే, ఇది Google యొక్క వ్యాపార పనులను, డబ్బును మేము ఎలా సంపాదిస్తామో ప్రతిబింబిస్తుంది. మేము “Google,” “మేము,” “మాకు” మరియు “మా” గురించి మాట్లాడేటప్పుడు Google LLC మరియు దాని అనుబంధ సంస్థలు అని అర్థం.

మీరు మా నుండి ఏం ఆశించవచ్చు

విస్తృతమైన ఉపయోగకర సేవలను అందించడం

ఈ నిబంధనలకు లోబడి మేము కింది వాటితో సహా విస్తృత శ్రేణిలో సర్వీస్‌లు అందిస్తాము:
 • యాప్‌లు, సైట్‌లు (Search, ఇంకా Maps వంటివి)
 • ప్లాట్‌ఫారాలు (Google Shopping వంటివి)
 • ఇంటిగ్రేటెడ్ సర్వీస్‌లు (ఇతర కంపెనీల యాప్‌లు లేదా సైట్‌ల్లో పొందుపరిచిన Maps వంటివి)
 • పరికరాలు (Google Nest వంటివి)

ఈ సర్వీస్‌లలో చాలా వరకు మీరు స్ట్రీమ్ చేయగల లేదా ఇంటరాక్ట్ అవ్వగల కంటెంట్ కూడా ఉంటుంది.

మా సర్వీస్‌లు కలిసి పనిచేయడానికి రూపొందించబడ్డాయి, దీనిలో మీరు ఒక యాక్టివిటీ నుండి మరొక యాక్టివిటీకి సులభంగా వెళ్లడానికి వీలుగా ఉంటుంది. ఉదాహరణకు, మీ Calendar ఈవెంట్‌లో అడ్రస్ చేర్చితే, మీరు ఆ అడ్రస్‌పై క్లిక్ చేయవచ్చు, అప్పుడు Maps అక్కడికి ఎలా వెళ్లాలో చూపగలుగుతుంది.

Google సర్వీస్‌లను డెవలప్ చేయండి, మెరుగుపరచండి, అలాగే అప్‌డేట్ చేయండి

మా సర్వీస్‌లను మెరుగుపరచడానికి మేము నిరంతరం కొత్త టెక్నాలజీలు, ఫీచర్‌లను అభివృద్ధి చేస్తున్నాము. ఉదాహరణకు, మీకు ఏకకాలంలో అనువాదాలను అందించడానికి, స్పామ్, ఇంకా మాల్‌వేర్‌ను మరింత మెరుగ్గా గుర్తించి, బ్లాక్ చేయడానికి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తాము. ఈ నిరంతర అభివృద్ధిలో భాగంగా, మేము కొన్నిసార్లు ఫీచర్‌లను, ఫంక్షనాలిటీలను జోడిస్తాము లేదా తీసివేస్తాము, మా సర్వీస్‌లకు పరిమితులను పెంచుతాము లేదా తగ్గిస్తాం, అలాగే కొత్త సర్వీస్‌లను అందిస్తాం లేదా పాత వాటిని నిలిపివేస్తాము. సర్వీస్‌కు డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్ అవసరం అయినప్పుడు లేదా ఆ సాఫ్ట్‌వేర్ ఉన్నప్పుడు, కొత్త వెర్షన్ లేదా ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సాఫ్ట్‌వేర్ కొన్నిసార్లు మీ పరికరంలో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేస్తుంది. కొన్ని సర్వీస్‌లు మీ ఆటోమేటిక్ అప్‌డేట్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

దుర్వినియోగాన్ని నిరోధించడం, చట్టపరమైన అవసరాలకు ప్రతిస్పందించడం లేదా సెక్యూరిటీ, అలాగే కార్యాచరణ సమస్యలను పరిష్కరించడం వంటి అత్యవసర పరిస్థితులలో తప్ప, మేము మా సర్వీస్‌ల వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే మార్పులను చేస్తే లేదా ఒక సర్వీస్‌ను అందించడం నిలిపివేస్తున్నట్లయితే, మీకు సమంజసమైన అడ్వాన్స్ నోటీస్‌ను అందిస్తాము. వర్తించే చట్టాలు, పాలసీలకు అనుగుణంగా, Google టేక్అవుట్‌ను ఉపయోగించి మీ Google ఖాతా నుండి మీ కంటెంట్‌ను ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా మేము మీకు అందిస్తాము.

మేము మీ నుండి ఏమి ఆశిస్తాం.

ఈ నిబంధనలు మరియు సేవా నిర్దిష్ట అదనపు నిబంధనలను అనుసరించడం

మా సర్వీస్‌లను ఉపయోగించడానికి మేము మీకు ఇచ్చే అనుమతి మీరు ఈ నియమాలు పాటించినంత కాలం కొనసాగుతుంది:

మీరు మా గోప్యతా పాలసీ అనేేది మా సర్వీస్‌ల మీ వినియోగానికి కూడా వర్తిస్తుందని కూడా అంగీకరిస్తున్నారు. అదనంగా, మేము సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు మా సర్వీస్‌ల వినియోగం గురించి కొన్ని అంచనాలను సెట్ చేయడానికి కాపీరైట్ సహాయ కేంద్రం, భద్రతా కేంద్రం మరియు మా పాలసీల సైట్ నుండి వివరణలు వంటి రిసోర్స్‌లను అందిస్తాము.

మా సేవలను ఉపయోగించడానికి మేము మీకు అనుమతి ఇచ్చినప్పటికీ, మేము సేవలలో ఉన్న ఏదైనా మేధో సంపత్తి హక్కులును కలిగి ఉంటాము.

ఇతరులను గౌరవించండి

ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన వాతావరణాన్ని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము, అంటే మీరు ఈ ప్రాథమిక ప్రవర్తనా నియమాలను పాటించాలి:
 • ఎగుమతి కంట్రోల్, ఆంక్షలు, మానవ అక్రమ రవాణా చట్టాలతో సహా వర్తించే చట్టాలకు అనుగుణంగా ఉండండి
 • గోప్యతతో సహా ఇతరుల హక్కులు, అలాగే మేధో సంపత్తి హక్కులను గౌరవించడం
 • ఇతరులకు లేదా మీకు మీరే హాని తలపెట్టడం (లేదా బెదిరించడం లేదా అలాంటి దుర్వినియోగం లేదా హానిని ప్రోత్సహించడం) చేయవద్దు — ఉదాహరణకు, తప్పుదారి పట్టించడం, మోసం చేయడం, పరువు తీయడం, చట్ట వ్యతిరేకంగా మరొక వ్యక్తిలా నటించడం, బెదిరించడం, వేధించడం లేదా ఇతరులను వెంటాడటం
 • సర్వీస్‌లను దుర్వినియోగం చేయడం, హాని కలిగించడం, సర్వీస్‌లలో జోక్యం చేసుకోవడం, లేదా వాటికి అంతరాయం కలిగించడం చేయరాదు — ఉదాహరణకు, వాటిని మోసపూరితమైన లేదా మోసపూరిత మార్గాల్లో యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం, మాల్‌వేర్‌ను పంపడం స్పామ్ చేయడం, హ్యాకింగ్ చేయడం లేదా మా సిస్టమ్‌లు లేదా రక్షణ చర్యలను బైపాస్ చేయడం వంటివి. మీకు సెర్చ్ ఫలితాలను అందించడానికి మేము వెబ్‌ను ఇండెక్స్ చేసినప్పుడు, వెబ్‌సైట్ ఓనర్‌లు వారి వెబ్‌సైట్‌కు సంబంధించిన కోడ్‌లో పేర్కొన్న ప్రామాణిక వినియోగ పరిమితులను మేము గౌరవిస్తాము, కాబట్టి ఇతరులు మా సర్వీస్‌లను ఉపయోగించేటప్పుడు కూడా మేం అదే కోరుకుంటాము

మా సర్వీస్-నిర్దిష్ట అదనపు నిబంధనలు పాలసీలు తగిన ప్రవర్తన గురించి అదనపు వివరాలను అందిస్తాయి, అలాగే ఆ సర్వీస్‌లను ఉపయోగించే ప్రతి ఒక్కరూ విధిగా దానిని పాటించాలి. ఇతరులు ఈ నియమాలను పాటించడం లేదని మీరు కనుగొంటే, దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయడానికి మా సర్వీస్‌లలో చాలా వరకు మిమ్మల్ని అనుమతిస్తాయి. మేము దుర్వినియోగ రిపోర్ట్‌పై స్పందించినట్లయితే, సమస్యలు ఎదురైనప్పుడు చర్య తీసుకోవడం విభాగంలో వివరించిన విధంగా మేము చర్యను కూడా తీసుకుంటాము.

మీ కంటెంట్‌ని ఉపయోగించడానికి అనుమతి

మా సేవలలో కొన్ని మీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి, సమర్పించడానికి, నిల్వ చేయడానికి, పంపడానికి, స్వీకరించడానికి లేదా షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మా సేవలకు ఏదైనా కంటెంట్‌ను అందించే బాధ్యత మీకు లేదు, అలాగే మీరు అందించాలనుకుంటున్న కంటెంట్‌ను ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంది. మీరు కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి లేదా షేర్ చేయడానికి ఎంచుకుంటే, దయచేసి మీకు అవసరమైన హక్కులు ఉన్నాయని మరియు కంటెంట్ చట్టబద్ధమైనదని నిర్ధారించుకోండి.

లైసెన్స్

మీ కంటెంట్ మీదిగానే ఉంటుంది, అంటే మీ కంటెంట్‌లో మీకు ఉన్న మేధో సంపత్తి హక్కులను మీరే కలిగి ఉంటారు అని అర్థం. ఉదాహరణకు, మీరు రాసే సమీక్షలు వంటి సృజనాత్మక కంటెంట్‌లో మీకు మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి. లేదా వారు మీకు అనుమతిని ఇస్తే, మరొకరి క్రియేటివ్ కంటెంట్‌నుషేర్ చేసుకునే హక్కు మీకు ఉండవచ్చు.

మీ మేధో సంపత్తి హక్కులు మీ కంటెంట్ వినియోగాన్ని పరిమితం చేస్తే మాకు మీ అనుమతి అవసరం. మీరు ఈ లైసెన్స్ ద్వారా Googleకి ఆ అనుమతి ఇస్తారు.

ఏమి కవర్ అయ్యాయి

ఆ కంటెంట్ మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షించబడితే, ఈ లైసెన్స్ మీ కంటెంట్ను కవర్ చేస్తుంది.

ఏది పరిగణనలోకి తీసుకోబడలేదు

 • ఈ లైసెన్స్ మీ గోప్యతా హక్కులను ప్రభావితం చేయదు — ఇది మీ మేధో సంపత్తి హక్కుల గురించి మాత్రమే
 • ఈ రకమైన కంటెంట్‌ను ఈ లైసెన్స్ కవర్ చేయదు:
  • మీరు అందించే సమాచారాలలో స్థానిక వ్యాపారం యొక్క చిరునామాకు దిద్దుబాట్లు అన్నవి బహిరంగంగా-లభించే వాస్తవిక సమాచారం. ప్రతి ఒక్కరూ ఉచితంగా ఉపయోగించవచ్చు అనేది సాధారణ జ్ఞానం కాబట్టి ఆ సమాచారానికి లైసెన్స్ అవసరం లేదు.
  • మా సేవలను మెరుగుపరచడానికి, సూచనలు వంటి వాటిని మీరు ఫీడ్‌బ్యాక్‌గా అందిస్తున్నారు. సేవ-సంబంధిత కమ్యూనికేషన్‌ల విభాగంలో ఫీడ్‌బ్యాక్‌అనేది కవర్ అయింది.

పరిధి

ఈ లైసెన్స్ అనేది:
 • ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇది ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది
 • ప్రత్యేకం కానిది, అంటే మీరు మీ కంటెంట్‌ను ఇతరులకు లైసెన్స్ ఇవ్వొచ్చు
 • రాయల్టీ-రహిత, అంటే ఈ లైసెన్స్‌కు ఫీజులు ఉండవు

హక్కులు

ఈ లైసెన్స్ Googleని ఈ కింది వాటికి అనుమతిస్తుంది:

 • మీ కంటెంట్‌ను హోస్ట్, పునరుత్పత్తి, పంపిణీ, కమ్యూనికేట్ మరియు ఉపయోగించడం - ఉదాహరణకు, మీ కంటెంట్‌ను మా సిస్టమ్‌లలో సేవ్ చేసి, మీరు ఎక్కడి నుండైనా దాన్ని యాక్సెస్ చేయండి
 • మీరు మీ కంటెంట్‌ను ఇతరులకు కనిపించేలా చేసినట్లయితే దాన్ని ప్రచురించడం, పబ్లిక్‌గా అమలు చయండి లేదా పబ్లిక్‌గా ప్రదర్శించడం
 • మీ కంటెంట్ ఆధారంగా రీఫార్మాట్ చేయడం లేదా అనువదించడం వంటి ఉత్పన్న రచనలను సవరించడం మరియు సృష్టించడం
 • ఈ హక్కులను ఉప లైసెన్స్ చేయండి:
  • మీరు ఎంచుకున్న వ్యక్తులతో ఫోటోలను షేర్ చేయడానికి మిమ్మల్ని ఎనేబుల్ చేయడం వంటి సేవలను రూపొందించిన విధంగా పని చేయడానికి ఇతర వినియోగదారులు అనుమతిస్తారు
  • ఈ నిబంధనలకు అనుగుణంగా మాతో ఒప్పందాలు కుదుర్చుకున్న మా కాంట్రాక్టర్లు, దిగువ ఉద్దేశ్యము విభాగంలో వివరించిన పరిమిత ప్రయోజనాల కోసం మాత్రమే

ప్రయోజనం

ఈ లైసెన్స్ పరిమిత ప్రయోజనం కోసం:

 • సేవలను నిర్వహించడం మరియు మెరుగుపరచడం, అనగా సేవలను రూపకల్పన చేసినట్లుగా పని చేయడానికి అనుమతించడం, కొత్త ఫీచర్‌లు మరియు ఫంక్షన్‌లను సృష్టించడం. మీ కంటెంట్‌ను విశ్లేషించడానికి ఆటోమేటిక్ వ్యవస్థలు మరియు అల్గారిథమ్‌లను ఉపయోగించడం ఇందులో ఉంది:
  • స్పామ్, మాల్‌వేర్ మరియు చట్టవిరుద్ధ కంటెంట్ కోసం
  • సంబంధిత ఫోటోలను కలిపి ఉంచడానికి Google Photosలో కొత్త ఆల్బమ్‌ను ఎప్పుడు సూచించాలో నిర్ణయించడం వంటి డేటాలోని నమూనాలను గుర్తించడం
  • సిఫార్సులు మరియు వ్యక్తిగతీకరించిన శోధన ఫలితాలు, కంటెంట్ మరియు ప్రకటనలను అందించడం వంటి మా సేవలను మీ కోసం అనుకూలీకరించడానికి (వీటిని మీరు యాడ్ సెట్టింగ్‌లులో మార్చవచ్చు లేదా ఆపివేయవచ్చు)
  కంటెంట్ పంపబడినప్పుడు, స్వీకరించబడినప్పుడు మరియు అది నిల్వ చేయబడినప్పుడు ఈ విశ్లేషణ జరుగుతుంది.
 • సేవలను ప్రోత్సహించడానికి మీరు బహిరంగంగా షేర్ చేసిన కంటెంట్‌ను ఉపయోగించడం. ఉదాహరణకు, Google యాప్‌ని ప్రోత్సహించడానికి, మీరు రాసిన సమీక్షను మేము కోట్ చేయవచ్చు. లేదా Google Playని ప్రచారం చేయడానికి, మీరు Play Storeలో అందించే యాప్ యొక్క స్క్రీన్ షాట్‌ను మేము చూపించవచ్చు.
 • ఈ నిబంధనలకు అనుగుణంగా Google కోసం కొత్త సాంకేతికతలు మరియు సేవలను అభివృద్ధి చేయడం

వ్యవధి

మీ కంటెంట్ మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షించబడినంత కాలం ఈ లైసెన్స్ ఉంటుంది.

ఈ లైసెన్స్ కవర్ చేసే ఏదైనా కంటెంట్‌ను మీరు మా సేవల నుండి తీసివేస్తే, ఆ కంటెంట్‌ను సమంజసమైన సమయంలో పబ్లిక్‌గా అందుబాటులో ఉంచడాన్ని అప్పుడు మా సిస్టమ్‌లు ఆపివేస్తాయి. రెండు మినహాయింపులు ఉన్నాయి:

 • మీ కంటెంట్‌ను తొలగించే ముందు మీరు ఇప్పటికే ఇతరులతో షేర్ చేసినట్లయితే. ఉదాహరణకు, మీరు ఒక ఫోటోను ఒక స్నేహితుడితో షేర్ చేసినట్లయితే, దాని కాపీని తయారు చేసినా, లేదా మళ్ళీ షేర్ చేసినా, ఆ ఫోటో మీ Google ఖాతా నుండి తీసివేసిన తర్వాత కూడా మీ స్నేహితుడి Google ఖాతాలో కనిపిస్తుంది.
 • మీరు మీ కంటెంట్‌ను ఇతర కంపెనీల సేవల ద్వారా అందుబాటులోకి తెస్తే, Google Searchతో సహా శోధన ఇంజిన్‌లు మీ శోధన ఫలితాల్లో భాగంగా మీ కంటెంట్‌ను కనుగొని ప్రదర్శించడం కొనసాగించవచ్చు.

Google సేవలను ఉపయోగించి

మీ Google ఖాతా

మీరు ఈ వయస్సు ఆవశ్యకాలను చేరుకున్నట్లయితే మీ సౌకర్యం కోసం మీరు Google ఖాతాను సృష్టించవచ్చు. కొన్ని సేవలు పని చేసేందుకు మీకు Google ఖాతా ఉండాలి — ఉదాహరణకు, Gmailను ఉపయోగించడానికి, మీకు Google ఖాతా అవసరం, తద్వారా మీ ఇమెయిల్ పంపడానికి మరియు స్వీకరించడానికి మీకు స్థలం ఉంటుంది.

మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచడానికి సమంజసమైన చర్యలు తీసుకోవడం, సెక్యూరిటీ చెకప్‌నిక్రమం తప్పకుండా ఉపయోగించమని మేము మిమ్మల్ని ప్రోత్సహించడంతో సహా మీ Google ఖాతాతో మీరు చేసే పనులకు మీరే బాధ్యత వహిస్తారు.

సంస్థ లేదా వ్యాపారం తరపున Google సేవలను ఉపయోగించడం

వ్యాపారాలు, లాభాపేక్షలేనివి మరియు పాఠశాలలు వంటి అనేక సంస్థలు మా సేవలను సద్వినియోగం చేసుకుంటాయి. సంస్థ తరపున మా సేవలను ఉపయోగించడానికి:
 • ఆ సంస్థ యొక్క అధీకృత ప్రతినిధి ఈ నిబంధనలను అంగీకరించాలి
 • మీ సంస్థ యొక్క నిర్వాహకుడు మీకు Google ఖాతాను కేటాయించవచ్చు. ఆ నిర్వాహకుడు కోసం మీరు అదనపు నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది మరియు మీ Google ఖాతాను యాక్సెస్ చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు.

సేవకు సంబంధించిన కమ్యూనికేషన్‌లు

మా సేవలను మీకు అందించడానికి, మేము కొన్నిసార్లు మీకు సేవా ప్రకటనలు మరియు ఇతర సమాచారాన్ని పంపుతాము. మేము మీకు సమాచారాన్ని ఎలా చేరవేస్తున్నాము అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, Google గోప్యతా పాలసీని చూడండి.

మా సేవలను మెరుగుపరచడానికి సూచనలు వంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి మీరు ఎంచుకుంటే, మేము మిమ్మల్ని బాధ్యులు చేయకుండా మీ ఫీడ్‌బ్యాక్‌పై చర్య తీసుకోవచ్చు.

Google సేవలలో కంటెంట్

మీ కంటెంట్

మా సేవల్లో కొన్ని- మీ కంటెంట్‌ను పబ్లిక్‌గా అందుబాటులో ఉంచడానికి మీకు అవకాశం ఇస్తాయి — ఉదాహరణకి, మీరు రాసిన ఉత్పత్తి లేదా రెస్టారెంట్ సమీక్షను మీరు పోస్ట్ చేయవచ్చు లేదా మీరు సృష్టించిన బ్లాగ్ పోస్ట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు.

మీ మేధో సంపత్తి హక్కులును ఎవరైనా ఉల్లంఘిస్తున్నారని మీరు అనుకుంటే, మీరు ఉల్లంఘన గురించి మాకు నోటీసు పంపవచ్చు మరియు మేము తగిన చర్య తీసుకుంటాము. ఉదాహరణకు, మా కాపీరైట్ సహాయ కేంద్రంలో వివరించిన విధంగా పునరావృత కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడేవారి Google ఖాతాలను మేము తాత్కాలికంగా నిలిపివేస్తాము లేదా మూసివేస్తాము.

Google కంటెంట్

మా సేవలలో కొన్ని Googleకు చెందిన కంటెంట్‌ను కలిగి ఉన్నాయి — ఉదాహరణకు, Google Mapsలో మీరు చూసే చాలా దృశ్య దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఈ నిబంధనలు మరియు ఏదైనా సేవా-నిర్దిష్ట అదనపు నిబంధనలు,ద్వారా మీరు Google కంటెంట్‌ను ఉపయోగించవచ్చు, కాని మా కంటెంట్‌లో మాకు ఉన్న మేధో సంపత్తి హక్కులను మేము నిలుపుకుంటాము. మా బ్రాండింగ్, లోగోలు లేదా చట్టబద్ధమైన గమనికలను తీసివేయద్దు, అస్పష్టం చేయవద్దు లేదా మార్చవద్దు. మీరు మా బ్రాండింగ్ లేదా లోగోలను ఉపయోగించాలనుకుంటే, దయచేసి Google బ్రాండ్ అనుమతులు పేజీని చూడండి.

ఇతర కంటెంట్

చివరగా, మా సేవలలో కొన్ని ఇతర వ్యక్తులకు లేదా సంస్థలకు చెందిన కంటెంట్‌కి యాక్సెస్ ఇస్తాయి - ఉదాహరణకు, స్టోర్ యజమాని వారి స్వంత వ్యాపారం గురించి వర్ణన లేదా Google Newsలో ప్రదర్శించబడే వార్తాపత్రిక కథనం. ఆ వ్యక్తి లేదా సంస్థ అనుమతి లేకుండా లేదా చట్టం ద్వారా అనుమతించబడకుండా మీరు ఈ కంటెంట్‌ను ఉపయోగించలేరు. ఇతర వ్యక్తులు లేదా సంస్థల కంటెంట్‌లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు వారి స్వంతం, మరియు Google అభిప్రాయాలను ప్రతిబింబించవు.

Google సేవలలో సాఫ్ట్‌వేర్

మా సేవలలో కొన్ని డౌన్‌లోడ్ చేయగల సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నాయి. సేవలలో భాగంగా ఆ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి మేము మీకు అనుమతి ఇస్తాము.

మేము మీకు ఇచ్చే లైసెన్స్:
 • ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇది ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది
 • ప్రత్యేకమైనది కాదు, అంటే మేము సాఫ్ట్‌వేర్‌ను ఇతరులు ఎవరికైనా లైసెన్స్ ఇవ్వొచ్చు
 • రాయల్టీ-రహితమైనది, ఈ లైసెన్స్‌కు ఎలాంటి మానిటరీ ఫీజులు ఉండవు
 • వ్యక్తిగతమైనది, ఇది మరెవరికి కూడా విస్తరించబడదు
 • అసైన్ చేయలేనిది, అంటే, ఈ లైసెన్స్‌ను మీరు మరెవరికి కేటాయించకూడదు

మేము మీకు అందుబాటులో ఉంచే ఓపెన్ సోర్స్ లైసెన్స్ నిబంధనల కింద అందించబడే సాఫ్ట్‌వేర్‌ను మా సేవలలో కొన్ని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లో ఈ నిబంధనల యొక్క భాగాలను స్పష్టంగా భర్తీ చేసే నిబంధనలు ఉన్నాయి, కాబట్టి దయచేసి ఆ లైసెన్స్‌లను తప్పకుండా చదవండి.

మా సర్వీస్‌లు లేదా సాఫ్ట్‌వేర్‌లలో వేటినీ మీరు కాపీ చేయరాదు, ఎడిట్ చేయరాదు, పంపిణీ చేయరాదు, విక్రయించకూడదు లేదా లీజుకు ఇవ్వడం లాంటివి చేయరాదు.

సమస్యలు లేదా భిన్నాభిప్రాయాల విషయంలో

వారంటీ అస్వీకారం

Google Search, అలాగే Maps వంటి ఉపయోగకరమైన, విశ్వసనీయ సర్వీస్‌లను అందించడంలో మేము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాము, అలాగే మీ అవసరాలకు అనుగుణంగా మా సర్వీస్‌లను నిరంతరం మెరుగుపరుస్తున్నాము. అయితే, చట్టపరమైన ప్రయోజనాల కోసం, మా సర్వీస్-నిర్దిష్ట అదనపు నియమాలలో స్పష్టంగా పేర్కొంటే తప్ప, మా సర్వీస్‌లను వారెంటీలు లేకుండానే అందిస్తాము. ఈ చట్టం ప్రకారం నిర్దిష్టమైన చట్టపరమైన భాషను ఉపయోగించి మేం దీన్ని వివరించాలి, మీరు చూస్తారని నిర్ధారించుకోవడంలో సహాయపడేందుకు ఇక్కడ పేర్కొన్న విధంగా పెద్ద అక్షరాలను ఉపయోగించాలి:

వర్తించే చట్టానికి లోబడి, మేము మా సర్వీస్‌లను "యథావిధిగా" ఎలాంటి ఎక్స్‌ప్రెస్ లేదా చట్టం ద్వారా అమలులోనున్న అధికార పత్రాలు లేకుండా అందిస్తాము, వీటిలో వ్యాపారానికి సంబంధించిన చట్టం ద్వారా అమలులోనున్న అధికార పత్రాలు, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఫిట్‌నెస్ వారంటీలు, అలాగే ఏ చట్టాన్ని అతిక్రమించని వారంటీలు కూడా ఉండవు. ఉదాహరణకు, మేము కంటెంట్ లేదా ఖచ్చితత్వం, విశ్వసనీయత, లభ్యత, లేదా మీ అవసరాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యంతో పాటు సర్వీస్‌లకు సంబంధించిన ఫీచర్‌ల గురించి మేము ఎటువంటి హామీలను ఇవ్వము.

బాధ్యతలు

వినియోగదారులందరి కోసం

సమస్యలు ఎదురైనప్పుడు మీరు లేదా Google, మరొకరి నుండి దేని గురించి దావా వేయగలరు అనేది చట్టం, అలాగే ఈ నియమాలు కలిసి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి. అందుకోసమే, ఈ నియమాల కింద — మిగతావి కాకుండా — నిర్దిష్ట బాధ్యతలను పరిమితం చేయడానికి చట్టం మమ్మల్ని అనుమతిస్తుంది.

ఈ నియమాలు వర్తించే చట్టం ద్వారా అనుమతించబడిన మా బాధ్యతలను మాత్రమే పరిమితం చేస్తాయి. ఈ నియమాలు పూర్తి అశ్రద్ధ లేదా ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన కోసం బాధ్యతను పరిమితం చేయవు.

వర్తించే చట్టం ద్వారా అనుమతించబడిన మేరకు:
 • Google ఈ నియమాలు లేదా వర్తించే సర్వీస్-నిర్దిష్ట అదనపు నియమాల ఉల్లంఘనలకు మాత్రమే బాధ్యత వహిస్తుంది
 • Google వీటికి బాధ్యత వహించదు:
  • లాభాలు, ఆదాయాలు, బిజినెస్ అవకాశాలు, గుడ్‌విల్, లేదా ఊహించిన పొదుపులను కోల్పోవడం
  • పరోక్ష లేదా పరిణామంగా ఏర్పడే నష్టాలు
  • శిక్షగా విధించే జరిమానా
 • ఈ నియమాల నుండి సంభవించే లేదా దానికి సంబంధించిన Google మొత్తం బాధ్యత (1) $౨౦౦ లేదా (2) వివాదానికి ముందు 12 నెలల్లో సంబంధిత సర్వీస్‌లను ఉపయోగించడానికి చెల్లించిన ఫీజులకు పరిమితం చేయబడింది

వ్యాపార వినియోగదారులు మరియు సంస్థల కోసం మాత్రమే

మీరు బిజినెస్ యూజర్ లేదా మీది ఒక సంస్థ అయితే:

 • వర్తించే చట్టం ద్వారా అనుమతించబడిన మేరకు, మీ సర్వీస్‌లను చట్టవిరుద్ధంగా ఉపయోగించడం లేదా ఈ నియమాలు లేదా సర్వీస్-నిర్దిష్ట అదనపు నియమాల ఉల్లంఘనలకు సంబంధించి లేదా వాటి వలన ఏదైనా థర్డ్-పార్టీ చట్టపరమైన చర్యలకు Google, అలాగే దాని డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్‌లకు (ప్రభుత్వ అధికారుల చర్యలతో సహా) నష్టపరిహారం చెల్లిస్తారు. ఈ నష్టపరిహారంలో దావాలు, నష్టాలు, ప్రమాదాలు, తీర్పులు, జరిమానాలు, దావా ఖర్చులు, అలాగే చట్టపరమైన రుసుముల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా బాధ్యత లేదా వ్యయం ఉంటుంది.
 • నష్టపరిహారంతో సహా కొన్ని బాధ్యతల నుండి చట్టబద్ధంగా మీరు మినహాయించబడితే, ఈ నిబంధనల ప్రకారం ఆ బాధ్యతలు మీకు వర్తించవు. ఉదాహరణకు, ఐక్యరాజ్యసమితి అనేది చట్టపరమైన బాధ్యత నుండి మినహాయింపులను పొందుతుంది, ఈ నిబంధనలు ఆ మినహాయింపులను అధిగమించవు.

సమస్యల విషయంలో చర్యలు తీసుకోవడం

చర్య తీసుకొనే ముందు కింద వివరించిన విధంగా, సాధ్యమైనప్పుడు మేము మీకు ముందస్తుగా నోటీస్‌ను అందిస్తాము, మా చర్యకు గల కారణాన్ని వివరిస్తాము, అలాగే సమస్యను పరిష్కరించడానికి మీకు అవకాశాన్ని కల్పిస్తాము, అలా చేయకపోతే ఈ కింద పేర్కొన్నవి జరగవచ్చు అని మేము భావిస్తే తప్ప:

 • యూజర్, మూడవ పక్షం లేదా Google కి హాని లేదా బాధ్యత కలిగించవచ్చు
 • చట్టం లేదా చట్టాన్ని అమలు చేసే అధికారిక యంత్రాంగ ఆదేశ ఉల్లంఘన
 • విచారణ విషయంలో రాజీ పడడం
 • మా సేవలయొక్క ఆపరేషన్, సమగ్రత లేదా భద్రతతో రాజీపడండి

మీ కంటెంట్‌ను తీసివేయడం

మీ కంటెంట్‌లో ఏదైనా (1) ఈ నియమాలను, సర్వీస్-నిర్దిష్ట అదనపు నియమాలు లేదా పాలసీలనుఉల్లంఘిస్తుంటే (2) వర్తించే చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే లేదా (3) మా యూజర్‌లకు, థర్డ్ పార్టీలకు లేదా Googleకు హాని చేయవచ్చని మేము భావిస్తే, వర్తించే చట్టానికి అనుగుణంగా ఆ కంటెంట్‌లో కొంత లేదా అంతటినీ తీసివేసే హక్కు మాకు ఉంది. పిల్లల అశ్లీల చిత్రాలు, మానవ అక్రమ రవాణా లేదా వేధింపులను సులభతరం చేసే కంటెంట్, అలాగే మరొకరి మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే కంటెంట్ అనేవి కొన్ని ఉదాహరణలు.

Google సేవలకు మీ యాక్సెస్‌ని తాత్కాలికంగా నిలిపివేయడం లేదా ఉప సంహరించడం

వీటిలో ఏదైనా జరిగితే మీ సేవలకు మీ యాక్సెస్ నిలిపివేయడానికి లేదా ముగించడానికి లేదా మీ Google ఖాతాను తొలగించే హక్కు Googleకి ఉంది:

 • మీరు, సేవ-నిర్దిష్ట అదనపు నిబంధనలు గణనీయంగా లేదా పదేపదే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు
 • చట్టపరమైన అవసరం లేదా కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మేము అలా చేయాల్సి ఉంటుంది
 • మీ ప్రవర్తన యూజర్, తృతీయపక్ష లేదా Googleకు హాని కలిగిస్తుంది లేదా బాధ్యత వహించేలా చేస్తుంది - ఉదాహరణకు, హ్యాకింగ్, ఫిషింగ్, వేధింపు, స్పామ్ చేయడం, ఇతరులను తప్పుదారి పట్టించడం లేదా మీకు చెందని కంటెంట్‌ను స్క్రాప్ చేయడం

మేము ఖాతాలను ఎందుకు డిసేబుల్ చేస్తాము, అలాగే మేము అలా చేసినప్పుడు ఏమి జరుగుతుంది అనే దాని గురించి మరింత సమాచారం కోసం ఈ సహాయ కేంద్రం పేజీని చూడండి. మీ Google ఖాతా నిలిపివేయబడిందని లేదా పొరపాటుగా రద్దు చేయబడిందని మీరు విశ్వసిస్తే మీరు అప్పీల్ చేయవచ్చు.

వాస్తవానికి, మీరు ఎప్పుడైనా మా సేవలను ఉపయోగించడం మానేయవచ్చు. మీరు సేవను ఉపయోగించడం ఆపివేసినప్పుడు, దానికి కారణాన్ని తెలియజేసినట్లయితే మేము అభినందిస్తున్నాము, తద్వారా మేము మా సేవలను మెరుగుపరచడం కొనసాగించగలము.

వివాదాలను పరిష్కరించడం, పరిపాలించే చట్టం, మరియు కోర్టులు

Googleను ఏ విధంగా సంప్రదించాలి గురించి సమాచారం కోసం, దయచేసి మా సంప్రదింపు పేజీని సందర్శించండి.

చట్ట నిబంధనల సంఘర్షణతో సంబంధం లేకుండా, కాలిఫోర్నియా చట్టం ఈ నిబంధనలు, సేవా-నిర్దిష్ట అదనపు నిబంధనలు,లేదా ఏదైనా సంబంధిత సేవలకు, సంబంధించిన లేదా వాటికి సంబంధించిన అన్ని వివాదాలను నియంత్రిస్తుంది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీ యొక్క ఫెడరల్ లేదా స్టేట్ కోర్టులు మరియు మీరు మరియు Google ఆ కోర్టులలో వ్యక్తిగత అధికార పరిధికి అంగీకరిస్తున్నారు.

ఈ నిబంధనల గురించి

చట్టం ప్రకారం, ఈ సేవా నిబంధనల వంటి ఒప్పందం ద్వారా పరిమితం చేయలేని కొన్ని హక్కులు మీకు ఉన్నాయి. ఈ నిబంధనలు ఆ హక్కులను పరిమితం చేయడానికి ఉద్దేశించినవి కావు.

ఈ నిబంధనలు మీకు మరియు Google మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం మాతో అనుబంధం నుండి ఇతరులు ప్రయోజనం పొందినప్పటికీ, ఈ నిబంధనలు ఇతర వ్యక్తులు లేదా సంస్థలుకు ఎటువంటి చట్టపరమైన హక్కులను సృష్టించవు.

మేము ఈ నిబంధనలు సులభంగా అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నాము, కాబట్టి మేము మా సేవలు నుండి ఉదాహరణలను ఉపయోగించాము. కానీ పేర్కొన్న అన్ని సేవలు మీ దేశంలో అందుబాటులో ఉండకపోవచ్చు.

ఈ నిబంధనలు సేవా-నిర్దిష్ట అదనపు నిబంధనలుకు విరుద్ధంగా ఉంటే, అదనపు నిబంధనలు ఆ సేవ కోసం అమల్లోకి వస్తాయి.

ఒక నిర్దిష్ట నిబంధన చెల్లుబాటు కాదు లేదా అమలు చర్య కాదని తేలితే, ఇది ఇతర నిబంధనలను ప్రభావితం చేయదు.

మీరు ఈ నిబంధనలను లేదా సేవా-నిర్దిష్ట అదనపు నిబంధనలును పాటించకపోతే, మరియు మేము వెంటనే చర్య తీసుకోకపోతే, చర్య తీసుకోవడం వంటి ఏవైనా హక్కులను మేము వదులుకుంటున్నామని దీని అర్థం కాదు. ఆ చర్యలను మేము భవిష్యత్తులో తీసుకోవచ్చు.

మేము ఈ నిబంధనలు మరియు సేవా-నిర్దిష్ట అదనపు నిబంధనలను వీటి కోసం అప్‌డేట్ చేయవచ్చు: (1) మా సేవలలో లేదా మేము వ్యాపారం చేసే తీరులో మార్పులు ప్రతిబింబించడానికి - ఉదాహరణకు, మేము కొత్త సేవలు, ఫీచర్‌లు, సాంకేతికతలు, ధర లేదా ప్రయోజనాలను జోడించినప్పుడు (లేదా పాత వాటిని తీసివేసినప్పుడు), (2) చట్టపరమైన, నియంత్రణ లేదా భద్రతా కారణాల కోసం లేదా (3) దుర్వినియోగం లేదా హానిని నివారించడానికి.

ఒకవేళ మేము ఈ నిబంధనలు లేదా సేవా-నిర్దిష్ట అదనపు నిబంధనలను గణనీయంగా మార్చినట్లయితే, (1) మేము కొత్త సర్వీస్ లేదా ఫీచర్ ప్రారంభించినప్పుడు లేదా (2) అత్యవసర పరిస్థితుల్లో, ఉదాహరణకు ప్రస్తుతం కొనసాగుతోన్న దుర్వినియోగాన్ని నిరోధించడం లేదా చట్టపరమైన అవసరాలకు ప్రతిస్పందించడం వంటి సందర్భాల్లో తప్పించి మేము మీకు సముచితమైన ముందస్తు నోటీసు ఇస్తాము మరియు మార్పుల్ని సమీక్షించే అవకాశాన్ని కల్పిస్తాము. మీరు కొత్త నిబంధనల్ని అంగీకరించకపోతే, మీరు మీ కంటెంట్ను తొలగించాలి మరియు సేవల్ని ఉపయోగించడం ఆపివేయాలి. మీ Google ఖాతా మూసివేయడం ద్వారా మాతో మీ సంబంధాన్ని ఏ సమయంలోనైనా ముగించవచ్చు.

నిర్వచనాలు

'దేశం వెర్షన్'

మీకు Google ఖాతా ఉన్నట్లయితే, మేము ఈ కింది విషయాలను నిర్ణయించడానికి, మీ ఖాతాను దేశంతో (లేదా ప్రాంతంతో) అనుబంధిస్తాము:

 • మీకు సర్వీస్‌లను అందించి, మీరు సర్వీస్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీ సమాచారాన్ని ప్రాసెస్ చేసే Google అనుబంధ సంస్థ
 • మా సంబంధాన్ని నియంత్రించే నిబంధనల వెర్షన్

మీరు సైన్ అవుట్ అయినప్పుడు, మీరు Google సర్వీస్‌లను ఉపయోగిస్తున్న లొకేషన్ ద్వారా మీ 'దేశం వెర్షన్' నిర్ణయించబడుతుంది. మీకు ఖాతా ఉన్నట్లయితే, మీరు సైన్ ఇన్ చేయవచ్చు, దానితో అనుబంధించి ఉన్న దేశాన్ని చూడటానికి ఈ నిబంధనలను చూడవచ్చు.

అనుబంధ సంస్థ

EUలో వినియోగదారు సర్వీస్‌లను అందించే కింది సంస్థలతో సహా Google సంస్థల గ్రూప్‌నకు చెందిన సంస్థ అంటే Google LLC, దాని అనుబంధ సంస్థలు: Google Ireland Limited, Google Commerce Limited, అలాగే Google Dialer Inc.

ఒరిజినల్ వర్క్ క్రియేటర్‌ను అనుమతించే చట్టపరమైన హక్కు, (బ్లాగ్ పోస్ట్, ఫోటో లేదా వీడియో వంటివి) ఆ ఒరిజినల్ వర్క్‌ను ("న్యాయమైన వినియోగం" అలాగే "న్యాయమైన వ్యవహారం" వంటి) నిర్దిష్ట పరిమితులు, మినహాయింపులు అనుగుణంగా ఇతరులు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తుంది.

డిస్‌క్లెయిమర్'

ఒకరి చట్టపరమైన బాధ్యతలను పరిమితం చేసే ప్రకటన.

నష్టపరిహారం చెల్లించడం లేదా నష్టపరిహారం

వ్యాజ్యాల వంటి చట్టపరమైన చర్యల నుండి మరొక వ్యక్తి లేదా సంస్థ చవిచూసిన నష్టాలను భర్తీ చేయడానికి ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క ఒప్పంద బాధ్యత.

బాధ్యత

దావా అనేది ఒక ఒప్పందం, వికర్మ (అశ్రద్ధతో సహా) లేదా ఇతర కారణాల ఆధారంగా, ఆ నష్టాలు సమంజసంగా ముందుగా గ్రహించబడినా లేదా ఊహించబడినా లేదా లేకపోయినా నష్టం అనేది ఏ రకమైన చట్టపరమైన దావా నుండి అయినా అవుతుంది.

మీ కంటెంట్

మీరు మా సర్వీస్‌లను ఉపయోగించి క్రియేట్ చేసే, అప్‌లోడ్ చేసే, సమర్పించే, స్టోర్ చేసే, పంపే, స్వీకరించే లేదా షేర్ చేసే అంశాలు, ఇటువంటివి:

 • మీరు సృష్టించే Docs, Sheets మరియు Slides
 • మీరు Blogger ద్వారా అప్‌లోడ్ చేసిన బ్లాగ్ పోస్ట్‌లు
 • Maps ద్వారా మీరు సమర్పించే సమీక్షలు
 • మీరు Driveలో నిల్వ చేసే వీడియోలు
 • మీరు Gmail ద్వారా పంపే మరియు స్వీకరించే ఇమెయిల్‌లు
 • Photos ద్వారా మీరు స్నేహితులకు షేర్ చేసే ఫోటోలు
 • మీరు Googleతో షేర్ చేసే ప్రయాణ వివరాలు

మేధో సంపత్తి హక్కులు (IP హక్కులు)

ఆవిష్కరణలు (పేటెంట్ హక్కులు) వంటి వ్యక్తి మనస్సు యొక్క సృష్టిపై హక్కులు; సాహిత్య మరియు కళాత్మక రచనలు (కాపీరైట్); నమూనాలు (డిజైన్ హక్కులు); మరియు వాణిజ్యంలో ఉపయోగించే చిహ్నాలు, పేర్లు మరియు చిత్రాలు (ట్రేడ్‌మార్క్‌లు). IP హక్కులు మీకు, మరొక వ్యక్తికి లేదా సంస్థకు చెందినవి కావచ్చు.

వారెంటీ

ఒక ఉత్పత్తి లేదా సేవ అనేవి ఒక నిర్దిష్ట ప్రమాణానికి పని చేస్తుందని ఒక హామీ.

వినియోగదారుడు

వారి వ్యాపారం, ట్రేడ్, చేతిపనులు లేదా వృత్తికి భిన్నమైన వ్యక్తిగత, వాణిజ్యేతర ప్రయోజనాల కోసం Google సేవలను ఉపయోగించే వ్యక్తి. (వ్యాపార వినియోగదారుని చూడండి)

వ్యాపార వినియోగదారు

వినియోగదారుడు కాని వ్యక్తి లేదా సంస్థ (వినియోగదారుని చూడండి).

వ్యాపారచిహ్నం

వాణిజ్యంలో ఇద్దరు వ్యక్తులు ఉపయోగించే చిహ్నాలు, పేర్లు మరియు చిత్రాలు ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క వస్తువులు లేదా సేవలు మధ్య తేడాను కనుగొనే సామర్థ్యం కలిగినవి.

సంస్థ

చట్టపరమైన పక్షం (కార్పొరేషన్, లాభాపేక్షలేని లేదా పాఠశాల వంటివి) మరియు ఒక వ్యక్తి కాదు.

సేవలు

ఈ నిబంధనలకు లోబడి ఉన్న Google సర్వీస్‌లు అనేవి, కింది వాటితో సహా https://policies.google.com/terms/service-specificలో జాబితా చేయబడిన ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు అని అర్థం:

 • Google యాప్‌లు, సైట్‌లు (Search, Maps వంటివి)
 • ప్లాట్‌ఫారాలు (Google Shopping వంటివి)
 • ఏకీకృత సేవలు (ఇతర కంపెనీల యాప్‌లు లేదా సైట్‌లలో పొందుపరిచిన Maps వంటివి)
 • పరికరాలు, ఇతర వస్తువులు (Google Nest వంటివి)

ఈ సర్వీస్‌లలో చాలా వరకు మీరు స్ట్రీమ్ చేయగల లేదా ఇంటరాక్ట్ అవ్వగల కంటెంట్ కూడా ఉంటుంది.

Google యాప్‌లు
ప్రధాన మెనూ